మానవులకు నాగరికత నేర్పిన వృత్తి మాది
ప్రపంచంలో మనదేశ ఖ్యాతి పెంచిన వృత్తి మాది
అద్భుత సృజన, అపార నైపుణ్యం కలిగిన వృత్తి మాది
మేము నేతన్నలం – చేనేత వృత్తి మాది.
చేత్తో నేసినా, యంత్రంతో నేసినా ఆలుమగలం ఇద్దరం పనిచేసే వృత్తి మాది.
ఇద్దరం పనిచేసినా మూడుపూటలా కడుపు నిండని వృత్తి మాది.
పిల్లల పెళ్ళిళ్ళకు, చదువులకు అప్పు చేస్తేనే గానీ గడవని వృత్తి మాది
అయినా చక్కటి సృజనతో, అద్భుతమైన డిజైన్లను తయారుచేసే వృత్తి మాది
ఈ ఆకలి కేకలు, అప్పుల బాధలు మా సృజనాత్మక శక్తిని ఆపలేవు
జీవం ఉన్నంత వరకు మా నైపుణ్యాన్ని ప్రపంచానికి అందిస్తూనే ఉంటాం.
మా అదృష్టం ఏంటంటే,
చీకటిని చీల్చుకు వచ్చే వెలుగురేఖల్లా మా పిల్లలు
చదువనే ఆయుధంతో ప్రపంచమంతటికి దూసుకేళ్తున్నారు
మా వృత్తిలోని నైపుణ్యాన్ని ఇతర వృత్తులతో సమ్మిళితం చేసి
విజయం సాధిస్తున్నారు.
కానీ దురదృష్టం ఏంటంటే,
మా పిల్లలు మా వృత్తిని ఎంచుకోకపోవడం
కారణం, ఈ వృత్తిలో నేతకార్మికులు, కార్మికులుగానే మిగిలిపోవడం.