జిలుగు వెలుగుల వెండితెర వెనుక మహిళా ఆర్టిస్టుల బీభత్స జీవితాలు – కొండవీటి సత్యవతి

వివిధ పనిస్థలాల్లో పనిచేసే మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులు రకరకాలుగా ఉంటాయి. ఒక పని స్థలం, ఒక యజమాని ఉండే ఆఫీసుల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులకి, ఒక పనిస్థలం లేకుండా పనిచేసే అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలు ప్రతిరోజూ ఎదుర్కొనే వేధింపులకి కొంత తేడా ఉంటుంది. ముఖ్యంగా భవన నిర్మాణంలో కూలీలుగా పనిచేసే స్త్రీలు మేస్త్రీల నుండి చాలా వేధింపులను ఎదుర్కొంటారు. ఇళ్ళలో పనిచేసే గృహ కార్మికులు యజమానుల నుండి ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.

అయితే అందరికీ గొప్ప వినోదాన్ని, ఆనందాన్ని అందించే సినీ పరిశ్రమలోని మహిళలు ఎలాంటి లైంగిక వేధింపులను భరిస్తుంటారో తెలియదు. దానికి సంబంధించిన వివరాలు ఎప్పుడూ వెల్లడి కాలేదు.
2018 ఏప్రిల్‌లో శ్రీరెడ్డి అనే సినీనటి సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపులను నిరసిస్తూ ఫిలిమ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ముందు, మీడియా కెమెరాలు తనకేసి ఫోకస్‌ చేసి ఉన్నప్పుడు అర్థనగ్న ప్రదర్శనకు పాల్పడిరది. తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు లేకపోవడం, కొత్తగా పరిశ్రమలోకి వచ్చే అమ్మాయిల మీద విపరీతమైన లైంగిక దోపిడీ, లైంగిక సంబంధం పెట్టుకుంటే తప్ప అవకాశాలు ఇవ్వని పరిస్థితులు, కమిట్‌మెంట్‌ కాంట్రాక్టులు, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకోవాలంటే ఎదురయ్యే అడ్డంకులు, వీటన్నింటినీ బట్టబయలు చేసింది శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శన.
రంగురంగుల సినిమా పరిశ్రమలోని చీకటి కోణాలను నగ్నంగా ప్రజలకు చూపించిన శ్రీరెడ్డి అర్థనగ్న నిరసనలోని వాస్తవాలకు స్పందించకుండా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆమె మీద నిషేధాన్ని విధించింది. శ్రీరెడ్డి ఒంటరిగానే తన పోరాటాన్ని మొదలుపెట్టినా ఆ తర్వాత ప్రముఖ కేరక్టర్‌ ఆర్టిస్ట్‌లతో పాటు అనేక మంది డైలాగ్‌ ఆర్టిస్టులు ఆమెకు మద్దతుగా బయటకొచ్చారు. ఎలాంటి గుర్తింపునకు నోచుకోని అనేకమంది డైలాగ్‌ ఆర్టిస్ట్‌లు, జూనియర్‌ ఆర్టిస్ట్‌లు మీడియా ముందుకు వచ్చి తమ అనుభవాలను వివరించడం మొదలుపెట్టారు. క్రమంగా అదొక సంఘటిత పోరాటంగా రూపొందింది. శ్రీరెడ్డి పోరాటాన్ని స్వంతం చేసుకుని, ఆమెను తమ మనిషిగా భావించడంతో పాటు, సినీ పరిశ్రమలో గౌరవంగా బ్రతకడానికి తాము చేస్తున్న సంఘర్షణలకి శ్రీరెడ్డిని ప్రతీకగా తీసుకున్నారు. తమందరి కోసం పోరాటానికి దిగిన శ్రీరెడ్డికి మద్దతుగా నిలిచి ఆమె ఒంటరి పోరుకు ఒక సంఘటిత రూపమిచ్చారు.
కొద్దో, గొప్పో ఆదాయంతో బతుకులు వెళ్ళదీస్తున్న ఈ ఆర్టిస్టులు తమ జీవనాధారాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడి, సినీ పరిశ్రమలో వెర్రితలలు వేసిన దోపిడీ సంస్కృతి, రాజకీయాలు, నైతిక దోపిడీల గురించి గొంతెత్తారు. నెలకి కనీసం పది రోజులు పని కావాలని, షూటింగ్‌ స్థలాల్లో టాయ్‌లెట్స్‌, బట్టలు మార్చుకోవడానికి గదులు, బ్రోకర్లు/కోఆర్డినేటర్‌ వ్యవస్థల నియంత్రణ, లైంగిక దోపిడీల అంతం వీటన్నింటి గురించి వారు గళమెత్తి, స్పష్టంగా, బలంగా వాదించారు. ఈ పోరాటం ఫలితంగా చాలా మంది డైలాగ్‌, జూనియర్‌ ఆర్టిస్టులు తమ పనిని, జీవనాధారాన్ని, కెరీర్‌ను కోల్పోయారు.
ఈ దశలో మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తమ హక్కుల కోసం పోరాటానికి దిగిన ఆర్టిస్టుల పక్షాన సంఫీుభావం ప్రకటించి, వారి పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచింది. స్త్రీలు, పిల్లల అంశాలమీద పనిచేస్తున్న అనేక మహిళా సంఘాలు ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఎన్నో అంశాల మీద ఐక్యంగా ఉద్యమిస్తున్నాయి. శ్రీరెడ్డి నిరసనతో బలమైన పోరాటంగా రూపుదిద్దుకున్న ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని ఐక్య కార్యాచరణ కమిటీ భావించింది. పెద్ద ఎత్తున మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆర్టిస్టులందరూ తమ తమ గొంతు వినిపించేలా కార్యక్రమాన్ని రూపొందించాలని భావించింది. అనుకున్నట్టుగానే కిక్కిరిసిన మీడియా ముందు సినీ పరిశ్రమలోని లైంగిక దోపిడీ స్వరూపాన్ని, తమ అనుభవాలతో మిళితం చేసి సినీ ఆర్టిస్టులు మొదటిసారి పెద్ద ఎత్తున వెల్లడిరచారు. తమ దుఃఖ జీవితాలను, భయంకరమైన అనుభవాలను పంచుకున్నారు. ఆనాటి ఆ పత్రికా సమావేశం, నిజానికి ఒక చారిత్రక సన్నివేశం. ఏడెనిమిది దశాబ్దాల చరిత్ర కలిగిన సినీ పరిశ్రమలో పనిచేస్తున్న మహిళల దుఃఖ సాగరం పొంగి పొరలిన రోజు. వారి దుఃఖాలను, వారి ఆవేదనలను వింటున్న వారందరి కళ్ళు చెమ్మగిల్లిన సందర్భం.
చల్లగా ఎ.సి. థియేటర్లలో కూర్చుని రంగురంగుల సీతాకోక చిలుకల్లాంటి ఆహ్లాద దృశ్యాల్లో మునిగితేలే ప్రేక్షకులకు ఆ రంగుల వెనుక ఎంతటి బీభత్సం, ఎన్ని కన్నీళ్ళు, ఎంత లైంగిక దోపిడీ ఉందో అర్థమయ్యే అవకాశమే లేని స్థితిలో ఆనాటి సినీ ఆర్టిస్టుల వేదనామయ అనుభవాలు అందరికంటా నీళ్ళు తెప్పించాయి.
ఆ తర్వాత మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సినీ కళాకారుల సమస్యల మీద సమగ్రమైన కార్యక్రమాన్ని రూపొందించింది. వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని భావించింది. వివిధ సినీ పరిశ్రమల సంస్థలను కలిసింది. మహిళా కమీషన్‌ను కూడా కలిసి వారి సమస్యల మీద ప్రభుత్వంతో మాట్లాడమని డిమాండ్‌ చేసింది. సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి రిప్రజెంటేషన్స్‌ ఇచ్చింది. ఇన్ని జరిగినా సంవత్సర కాలంలో ప్రభుత్వం స్పందించకపోవడంతో హైకోర్టులో పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్‌ కింద కేసును కూడా వేసింది. తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలోనే తెలుగు సినిమా, టెలివిజన్‌ పరిశ్రమల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గాను ఒక ఉన్నత స్థాయి కమిటీని (హై లెవల్‌ కమిటీ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సినీ పరిశ్రమలో ప్రబలిపోయిన లైంగిక, ఆర్థిక దోపిడీలను ఎదుర్కొంటున్న స్త్రీలు, ట్రాన్స్‌జెండర్ల పోరాటంలో దీన్ని ఒక చారిత్రక విజయంగా పేర్కొనవచ్చు. అందరి ఐక్య పోరాటాల ఫలితమిది.
సినీ పరిశ్రమకి చెందిన 24 క్రాఫ్ట్స్‌ వ్యవస్థలతో కన్సల్టేషన్స్‌ జరపడానికి ఒక సబ్‌ కమిటీ ఏర్పడిరది. ఈ సబ్‌ కమిటీలో నేను సభ్యురాలుగా ఉన్నాను. 24 క్రాఫ్ట్స్‌ వ్యవస్థలతో మాట్లాడే క్రమంలో ఎన్నో విషయాలు అర్ధం చేసుకున్నాను. కోవిడ్‌ అడ్డం వచ్చినా మూడు సంవత్సరాలపాటు ఫిలిం డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయి. సబ్‌ కమిటీ సమగ్రమైన రిపోర్టును, అవసరమైన సిఫార్సులతో సహా హై లెవెల్‌ కమిటీ సమక్షంలో అప్పటి ముఖ్య కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కు ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ రిపోర్టును ఆమోదించి, ప్రభుత్వ వెబ్సెట్‌లలో పోస్ట్‌ చేస్తామని, రిపోర్టును ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఆనాటి సమావేశంలో చీఫ్‌ సెక్రటరీ హామీ ఇచ్చారు. అప్పటి నుండి ఎన్నోసార్లు ఆ రిపోర్ట్‌ విడుదల చేయమని అడుగుతూనే ఉన్నాం. రెండు మూడు సార్లు మీటింగ్‌ ఉందని చెప్పి కాన్సిల్‌ చేసారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి రిపోర్ట్‌ విడుదల చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇటీవల ఒక జూనియర్‌ కొరియోగ్రాఫర్‌ తన సీనియర్‌ తనను లైంగికంగా వేధించడమే కాక తాను మైనర్‌గా ఉన్నప్పుడు లైంగిక దాడి చేసాడని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019 నుంచి తాను అతని వల్ల విపరీతమైన లైంగిక, శారీరక హింసను అనుభవిస్తున్నానని, తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నది. తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆమెకు మద్దతుగా నిలిచింది. భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ బాధితురాలికి పూర్తి మద్దతుగా నిలబడిరది. సీనియర్‌ కొరియోగ్రాఫర్‌ ని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకి పంపారు. ఇలా ఎంతమంది బాధిత మహిళలు ఉన్నారో తెలియదు. సినీ పరిశ్రమ ఒక మాయాజాలం. కోటి ఆశలతో తమ భవిష్యత్తును వెతుక్కుంటూ ఎంతో మంది యువత ఈ రంగుల పరిశ్రమ వైపు ఆకర్షితులౌతుంటారు. కానీ అక్కడ ఎలాంటి భద్రమైన పని పరిస్థితులు లేవన్నది జగమెరిగిన సత్యం. వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తున్న సినీ పరిశ్రమ తమ కుటుంబంలో పనిచేస్తున్న వారి రక్షణ బాధ్యతను తప్పకుండా స్వీకరించాలి.
పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం 2013లోనే అమలులోకి వచ్చింది. సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది మహిళల భద్రత, రక్షణ కోసం లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. చట్టమున్నప్పటికీ స్త్రీలు ఇంకా లైంగిక వేధింపులకి గురవడం, మౌనంగా భరించడం చూస్తూనే ఉన్నాం. దీనికి మంచి ఉదాహరణ సినీ పరిశ్రమలో నిర్లజ్జగా, చట్ట భయం లేకుండా కొనసాగుతున్న లైంగిక వేధింపులు, లైంగిక దోపిడీలు. పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీలను సినీ పరిశ్రమలోని వివిధ విభాగాలతో పాటు అన్నిచోట్లా ఏర్పాటు చేయాలి. అప్పుడే పనిచేసే ప్రదేశాలు స్త్రీలకు భద్రంగా ఉంటాయి. కమిటీ సమర్పించిన రిపోర్టును తక్షణమే ఆమోదించి, కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయాలి. అప్పుడే సినీ రంగంలో మహిళలు భద్రంగా పనిచేయగలుగుతారు.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.