జైలులో గాంధీ జయంతి – ఆర్‌. శాంతిప్రియ

భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ సంస్థ గత 30 సంవత్సరాలుగా మహిళల పిల్లల హక్కుల కోసం, వారిపై హింస లేని సమాజం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే చంచల్‌ గూడాలోని కేంద్ర మహిళా కారాగారంలో ఖైదీల సంక్షేమం పరివర్తన దిశగా అక్కడ కౌన్సిలింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నది.

అక్కడ ఉన్న మహిళలు కుటుంబాలకు, పిల్లలకు దూరమై బయటకు వెళ్లే మార్గం తెలియక దిక్కు తోచక అల్లాడుతూ టెన్షన్‌తో తీవ్రమైన మనోవేదనతో నిస్సహాయులుగా ఉంటారు. వీరిలో పేద, దళిత, ఆదివాసీ వర్గాల మహిళలు ఎక్కువమంది వారి మనోవేదనను వినడం, వారి నిస్సహాయతను అర్ధం చేసుకొని వారి కుటుంబాలలో, వారి అడ్వొకేట్లతో ఫోన్లో మాట్లాడి సమాచారం అందించటం ద్వారా వారికి ఒకింత ఓదార్పు, జీవితంపై ఆశ, నమ్మకం కల్గించగల్గుతున్నాము. వీరికి కౌన్సిలింగ్‌ సహాయంతో పాటు అవసరమైన సందర్భాలలో వారి కుటుంబాలకు కౌన్సిలింగ్‌ చేయటం జరుగుతుంది. కౌన్సిలర్‌ చేసే ఈ సహాయంతో వారికి ధైర్యం కలిగి బయటకు వచ్చాక కూడా మాకు ఏ సమస్య వచ్చినా భూమిక సంస్థకు ఫోన్‌ చేసి కావాల్సిన సలహా మద్దతు పొందవచ్చు అనే ఆత్మస్థైర్యం దొరుకుతుందని తెలిసి కౌన్సిలర్‌ రాక కోసం వారు రోజు ఎదురు చూస్తారు. కౌన్సిలర్‌ రాగానే ఫలానా ఆమెకు బెయిల్‌ వచ్చి వెళ్ళిపోయింది. ఫలానా ఆమెకి ములాఖత్‌ వచ్చింది అని ఆత్రుతతోను సంతోషంగానూ కబుర్లు చెపుతారు. ఒక్కోసారి వాళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళు తిట్టుకున్నారు, ఆమె ఆరోగ్యం దెబ్బ తినింది ఇలాంటి బాధ కలిగించే వార్తలు చెప్పటం మాములే. ఇదే కాక పాత వాళ్ళు కొత్తగా జైలుకి వచ్చిన వాళ్ళను వెంటబెట్టుకు వచ్చి ఈమెకు ఫలానా సమస్య ఉంది, మీతో మాట్లాడిరచడానికి తీసుకొచ్చాము అని చెప్పారు. ఇందులో చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు, భాష తెలియని వాళ్ళు, ఇల్లు తప్ప బయటి ప్రపంచం తెలియని వాళ్ళు ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుండి ఏవేవో కేసులతో తామేనాడు ఊహించని తెలియని ప్రాంతానికి తీసుకురాబడి తెలియని మొఖాలు, కష్టమైన రూల్స్‌, అర్థం కానీ భాష, రుచించని తిండి, కొత్త పద్ధతులతో బిక్కు బిక్కు మంటూ ఉండే ఈ మహిళలకు కౌన్సిలర్స్‌ పలకరింపు, ఊరడిరపు, కౌన్సిలింగ్‌ ఇతర సహాయాలు వీరికి ఎడారిలో ఒయాసిస్‌ లా అనిపిస్తుంది.
కోవిడ్‌ టైంలో ఈ పని ఆగిపోయినా గత ఆరు నెలల నుంచి భూమిక తరపు నుండి జైల్లో మా కార్యక్రమాలు మళ్ళీ మొదలైనాయి. ముఖ్యంగా జైల్లోని ఖైదీల పిల్లల క్షేమ సమాచారాన్ని వివిధ మార్గాల్లో పద్దతుల ద్వారా తెలుసుకొని వారిని ములాఖత్‌కు తీసుకురావటం, అవసరమైతే సి డబ్ల్యూ సి ద్వారా వారిని ఏదైనా హోంలలో, హాస్టల్స్‌లో చేర్పించటం, జైలు నుంచి రిలీజ్‌ అయిన ఖైదీలకు షెల్టర్‌ లేకుంటే ఆ సదుపాయాన్ని ఇతర యన్‌ జి ఓ ల ద్వారా కల్పించటం, అవసరమైన వారికి ఏవైనా ఉపాధి మార్గాలు చూపించటం, ఖైదీల కుటుంబాలకు అవసరమైతే కౌన్సిలింగ్‌ ఇచ్చి వారు జైల్లో ములాఖత్‌కు వచ్చేలా ప్రయత్నించటం, ఖైదీల కుటుంబాలకు వారి అడ్వకేట్‌లకు ఫోన్‌ చేసి సమాచారాన్ని తెలపటం లేదా వారిచ్చిన సమాచారాన్ని ఆ మహిళలకు అందచేయడం కౌన్సిలర్‌ చేస్తారు. అంతేకాకుండా వారికి పరిసరాల పరిశుభ్రత – ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, గృహ హింస – సపోర్ట్‌ సిస్టమ్స్‌, బహిష్టు దాని చుట్టూ అల్లుకుని ఉన్న పితృస్వామ్య భావజాలం, కట్టుబాట్లు, పునరుత్పత్తి, మహిళల ఆరోగ్యం ఇలాంటి అనేకానేక విషయాలపై నెలకు రెండు సార్లు సెషన్స్‌ ఏర్పాటు చేసి వారికి వివిధ విషయాలపై అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం అక్టోబర్‌ రెండవ తారీఖున గాంధీ జయంతి ఖైదీల సంక్షేమ దినంగా జరుపుతారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భూమిక సంస్థ వారికి రెండు రోజుల ముందు డ్రాయింగ్‌ కాంపిటీషన్స్‌, ముగ్గుల పోటీలు, ఇంకా ఆరు రకాల ఇండోర్‌ గేమ్స్‌ పెట్టాము. 150మంది మహిళా ఖైదీలు వీటిల్లో పాల్గొన్నారు. ఆ పోటీల్లో 25మంది విజేతలుగా నిలిచారు. ఈ ఆటల పోటీల తర్వాత వారినందరినీ కూర్చోబెట్టి ఈ రోజు మీకెలా అనిపించింది అని వారిని అడిగాము. మాకు బాధలు ఉన్న విషయమే ఈ రోజు మర్చిపోయాము అనో ఒకరు చెప్పగా, తమ బాల్యం, స్కూల్‌ గుర్తొచ్చింది అని ఒకరున్నారు. తమ ఇంట్లోని పిల్లలు గుర్తొచ్చారని ఒకరు అన్నారు. తాము ఇన్ని రోజులుగా ఇక్కడ ఉన్న ఒకరి గురించి ఒకరికి తెలియని విషయాలు, వెళ్లకుంటే నైపుణ్యాలు తెలిసాయని ఒకరు చెప్పారు. ఆటల వల్ల తమ మధ్య ఉన్న స్నేహానుబంధం బలపడిరది అని ఇంకొకరు అన్నారు. వారంతా నవ్వుకుంటూ, చిన్న పిల్లల్లాగా, గెంతుతూ ఆడుతూ ఉత్సాహంగా ఆ రోజంతా మాతో గడపటం మాకందరికి ఎంతో సంతోషంగా అనిపించింది.
ఈ అక్టోబర్‌ 2, గాంధీ జయంతి రోజున చంచలగూడలోని ప్రత్యేక మహిళా కారాగారంలో జరిగిన ఉత్సవాలకు ప్రత్యేక అతిధిగా రాష్ట్ర జైళ్ల శాఖ డి. జి. సౌమ్య మిశ్రా గారు హాజరై ఈ రోజును ఎందుకు ఖైదీల వెల్ఫేర్‌ డేగా దేశమంతా పరిగణిస్తారో ఈవిధంగా వివరించారు. గాంధీ గారు స్వాతంత్య్ర పోరాటంలో సబర్మతి జైలులో ఎరవాడ జైలులో ఎన్నో సంవత్సరాలు గడిపి జైలు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. జైల్లో ఖైదీలు మానసిక పరివర్తన దిశగా మానవీయంగా ఉండాలి. కానీ వారి మనసును కఠినంగా బండరాళ్ళుగా మార్చేలా అమానవీయంగా ఉండకూడదని జైల్లో ఎన్నో సంస్కరణల్ని ప్రతిపాదించారు. వారిని అనుసరించి ఈ విధంగా చేస్తున్నామని చెప్పారు. ఖైదీల వేతనాల్ని గణనీయంగా పెంచినట్లు తెలిపారు. జైలు సూపరింటెండెంట్‌ వెంకట లక్ష్మి గారు ఈ జైలు ఎప్పుడు ప్రాంభించబడిరది. ఖైదీల సంక్షేమానికి చేసిన వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్య అతిధులుగా డి సి హెచ్‌ డాక్టర్‌ బి. రవీంద్ర నాయక్‌ గారు ఖైదీలు మంచిగా తిని ఇమ్యూనిటీని పెంచుకోవాలని వారి కోసం జైల్లో ఒక డాక్టర్‌ నర్స్‌ ఉండేలా చిన్న హాస్పిటల్‌ను అలాట్‌ చేసి నడుపుతున్నామని చెప్పారు. మరొక ప్రత్యేక అతిథి మేడ్చల్‌, మల్కాజిగిరి కోర్టు సెషన్స్‌ జడ్జి వి. బాల భాస్కర్‌ రావు గారు పేద ఖైదీల కోసం అడ్వకేట్‌లను నియమించటమే కాక వారి రిక్వెస్ట్‌ మీకు షూరిటీలను ప్రభుత్వమే కోర్టుకు కట్టేలా చర్యలు తీసుకోని వారి విడుదలకు మార్గం సుగమం చేసాము. ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకొని ఖైదీలు కోర్టు వాయిదాలకు తప్పక అటెండ్‌ అయి నమ్మకాన్ని నిలుపుకొని క్షేమంగా ఉండాలని కోరారు. డి. జి. సౌమ్య మిశ్రా గారి చేతుల మీదుగా భూమిక సంస్థ చీఫ్‌ ఫంక్షనరీ సత్యవతి గారిని శాలువాతో సన్మానించారు. భూమిక సంస్థ జైల్లో కౌన్సిలింగ్‌ సెంటర్‌ నడుపుతూ ఖైదీలకు చేస్తున్న సేవలకు జైలు అధికారులకు వారి పనిలో తోడ్పడుతున్నందుకు అభినందించారు. గేమ్స్‌లో పాల్గొన్న విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. జైలు ఇన్‌ మేట్స్‌ బతుకమ్మలు చేసి రంగవల్లులు తీర్చి కోలాటం ఆడారు. డాన్స్‌లు చేసారు. భూమిక స్టాఫ్‌ ఇన్‌ మేట్స్‌తో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.