వికలాంగుల పునరావాసానికి ప్రభుత్వం అందించే సౌకార్యాలు, రాయితీలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వికలాంగుల పునరావసం మరియు వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. 1995వ సంవత్సరములో కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టం చేయబడి 7-2-96వ తేదీన అమలులోకి తేబడిన వికలాంగుల సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం చట్టం, 1995 ఒకటవ చాప్టరులో వికలాంగుల నిర్వచనం ఈ విధంగా యివ్వబడి అమలులో ఉంది.
అ) అంధత్వం, తక్కువ కంటిచూపు :
ఈ క్రింద తెలిపిన పరిస్థితులకు లోనైన ఏ వ్యక్తి అయిన ఈ పరిధిలోకి వస్తాడు.
1) పూర్తిగా చూపు కనిపించకపోవడం లేదా
2) కళ్ళద్దాలు ధరించినప్పటికీ కొంచెం మెరుగ్గా ఉండే కంటిచూపు 6/60 లేదా 20/200 (స్నెలెన్‌) మించినట్టయితే లేదా,
3) కంటిచూపు పరిధి 20 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే, తక్కువ కంటిచూపు కలిగిన వ్యక్తి అంటే దృష్టిదోషాన్ని చికిత్సతో సరిచేసిన అనంతరం కూడా ఆ వ్యక్తి దృష్టిలోపం కలిగి ఉండటం, అయితే తగిన సహకార సాధనంతో ఒక లక్ష్యాన్ని నెరవేర్చడానికి లేదా ప్రణాళిక రూపందించడానికి అవసరమైన దృష్టి, శక్తి కలిగి వున్నప్పటికి తక్కువ కంటిచూపు కలిగి వ్యక్తిగానే పరిగణించబడుతుంది.
ఆ) కుష్ఠు వ్యాధిగ్రస్తులు – వ్యాధి నయమయినవారు :
”కుష్ఠువ్యాధి నయమయిన వ్యక్తి” అంటే కుష్ఠు వ్యాధి నయమైన తర్వాత ఈ క్రింది కారణాలతో బాధపడే వ్యక్తి.
1) అరికాళ్ళు, అరిచేతులు మరియు కంటిలో పూర్తిగా గాని పాక్షికంగా కాని స్పర్శ లేకుండుట, మరియు కంటిలో పాక్షికంగా కాని, పూర్తిగా కాని చచ్చుబడినట్లుగా బయ టకు తెలియని వైకల్పం లేకపోవుట.
2) అంగవైకల్యముతో చచ్చుబడిన చేతులు, కాళ్ళు కదిలిక కలిగి, దైనందిన కార్యకలా పాలు నిర్వహించగలగడం.
3) పూర్తి అంగవైకల్యం మరియు వయస్సు పై బడిన కొద్దీ, దైనందిన కార్యక్రమాల్లో మార్పు కాని, వృత్తిలో ప్రావీణ్యతతో పాల్గొన లేకపోవుట.
ఇ) వినికిడి లోపం :
వినికిడి లోపం అంటే సంభాషణల తరంగాల పరిధిలో చెవికి సంబంధించి 60 డిసిబుల్స్‌ లేదా అంతకంటే ఎక్కువ వినికిడిని కోల్పోవడం.
ఈ) కదలిక లేకపోవడం లేదా చలనశక్తికి సంబంధించిన వికలాంగత :
”చలనశక్తి వైకల్యం” అంటే ఎముకలు, కీళ్ళు, కండరాలు వైకల్యం వల్ల చలనాంగముల కదలిక తగినంతగా లేకపోవడం లేదా ఏ రకమైన సెరిబ్రల్‌ పాల్సీ (మెదడుకు పక్షవాతం) అయినా.
ఉ) బుద్ధి మాంద్యం :
”మానసిక వికలంగత” అంటే బుద్ధి మాంద్యతే కాకుండా మానసిక ఇతర మానసిక అస్వస్తత, బుద్ధిమాంద్యం అంటే ఒక వ్యక్తి మానసికంగా అసంపూర్తిగా ఎదగడం లేదా ఎదుగుదల ఆగిపోవడంతో ప్రత్యేకంగా అతి తక్కువ తెలివితేటలు కలిగి ఉండటం.
వికలాంగత గల వ్యక్తి అంటే ఒక వ్యక్తి 40 శాతానికి తక్కువ లేకుండా వైకల్యం కలిగి ఉన్నట్లుగా మెడికల్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇవ్వడం. అయితే మెడికల్‌ బోర్డు ప్రతినెల నిర్ణీత సమయాల్లో జిల్లా వైద్యశాల యందు సమావేశమై సర్టిఫికెట్లు ఉచితంగా అందజేస్తుంది.
వికలాంగుల పునరావస నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచే 1981 సం|| ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల సహకార సంస్థ. 1983 సంవత్సరం వికలాంగుల సంక్షేమ శాఖ స్థాపించడం జరిగింది. ప్రతి జిల్లాలో ప్రభుత్వ పథకాలు అమలు పర్చే నిమిత్తం సహాయ సంచాలకుల కార్యాలయాలు పనిచేస్తున్నవి. వికలాంగుల సహకార సంస్థ కార్యకలాపాలు పదవిరీత్యా జాయింటు కలెక్టరు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టగరుగా, సహాయ సంచాలకులు పదవిరీత్యా వికలాంగుల సహకార సంస్థ జిల్లా మేనేజరుగా వ్యవహరిస్తారు. మొత్తం మీద జిల్లా కలెక్టరు గారి అధికార పర్యవేక్షణలో వికలాంగు సంక్షేమం కొరకు నిర్దేశించబడిన పునరావాస కార్యక్రమాలు అమలుపరచబడు తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో వికలాంగులు పునరావాసం మరియు అభివృద్ధి కొరకు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా విభజించబడినవి.
1) విద్య :
అంధ మరియు బధిర, మూగ బాలబాలికలకు ప్రత్యేక పాఠశాలలకు నడుపబడుచున్నవి. వికలాంగలు సంక్షేమ శాఖ మరియు ప్రాథమిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ పాఠశాలలు నడుపబడు చున్నవి. భారత ప్రభుత్వం ద్వారా సహాయం పొంది, పొందుండా కూడా ఉన్న ప్రభుత్వే తర సంస్థలు విద్యారంగములో తమ వంతు సహాయం అందిస్తున్నవి.
ప్రత్యేక పాఠశాలల్లో ప్రవేశ నిమిత్తం ఆయా పాఠశాల ప్రిన్సిపాల్స్‌ / హెడ్‌ మాస్టర్లను సంప్రదించవలయును. ప్రతి సంవత్సరం మే నెల నుంచే తమ, తమ పిల్లలను చేర్పించడానికి చర్యలు తీసుకొన వలయును. అంగవైకల్య శాతం, తల్లి దండ్రుల ఆదాయ పరిమితికి లోబడి పాఠశాల స్క్రీనింగు కమిటీ విద్యార్థులను ఎంపిక చేస్తుంది.
ఇది గాక విద్యాశాఖ ద్వారా సమీకృత విద్యావిధానం కూడ ప్రవేశపెట్టబడి నది. ప్రతి జిల్లాలో బధిరులకు, అంధులైన విద్యార్థుల కొరకు ఒక్కొక్క తరగతి గుర్తించిన పాఠశాలలో ప్రారంభించబడినది. అందరికీ విద్య లక్ష్యంతో అవసరమైన ప్రతిచోట ఇటువంటి విద్యావిధానం అమలుకు విద్యాశాఖ దశలవారీగా చర్యలు తీసుకుంటున్నది.
విద్యాపరంగా ఈ దిగువ సూచించిన పథకాలు ప్రస్తుతం అమలులో ఉన్నవి :
అ) అన్ని రకాల విద్యా సంస్థలలో ప్రవేశానికి వికలాంగులయిన విద్యార్థులకు రిజర్షేన్‌ కల్పించబడినది. విశ్వవిద్యాలయాలు, సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు వగైరాలతో సహా ప్రతి యొక్క వికలాంగుడు తమకు అన్నిటా సమాన అవకాశాలు, సంఘంలో ప్రత్యేకించి ప్రభుత్వ యాజమాన్య సంస్థలో కల్పించబడాలి అనే ప్రాతపదిక గుర్తుంచుకొని జీవితంలో వారి హక్కుల సాధనకు ముందుకుపోవాలి. డాక్టరు కోర్సులలో 0.25% ఇంజనీరింగు కోర్సులలో 0.50% ప్రవేశంలో రిజర్వేషను కలదు.
ఆ) వికలాంగుల ఆశ్రమ పాఠశాలలే కాకుండా, వసతి గృహాలలో కూడా ఉండి చదువుకొనేందుకు వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా 3అవకాశాలు కల్పించబడినవి. వికలాంగులైన బాలబాలికలు తమ దగ్గరలో గల రాష్ట్ర సంక్షేమ శాఖ ఏ వసతి గృహంలో నయినా వారి నిబంధనలకు లోబడి ప్రవేశం పొందవచ్చును.
ఇ) ప్రభుత్వ గుర్తింపు మరియు సహాయం పొందిన విద్యాసంస్థలో చదివే వికలాంగ విద్యార్థులకు వారి విద్యా స్థాయిననుసరించి ఉపకార వేతనం మంజూరు చేయబడుతుంది. చలన సంబంధమైన వైకల్యం కల వారికి ప్రయాణపు అలవెన్సు, చలన పరికరాలను నిరంతరం ఉపయోగంలో ఉంచేందుకు (మెయింటెనెన్స్‌ అలవెన్సు), అంధులకు రీడర్సు అలవెన్సు మంజూరు చేయబడతాయి.
ఈ) ప్రి మెట్రిక్‌ (1 నుంచి 8 తరగతి వరకు) పోస్టు మెట్రిక్‌ (9వ తరగతి నుంచి ఆపైన) చదువులకు చెల్లించే ట్యూషన్‌ ఫీజులు వసతిగృహంలోని విద్యార్థులకు కొన్ని పరిమితులకు లోబడి చెల్లించబడతాయి.
ఉ) మానిసిక వికలాంగులకు ఉపకార వేతనాలు చెల్లించబడతాయి.
ఊ) మెట్రిక్‌ పూర్వపు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఉచిత సరఫరా (1 నుంచి 10వ తరగతి వరకు) (ప్రస్తుతం విద్యాశాఖ ద్వారా సరఫరా చేయబడుతున్నవి) అంధ విద్యార్థులకు రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ద్వారా బ్రెయిలీలో పాఠ్యపుస్తకాలు ముద్రించి సరఫరా చేయబడుచున్నవి.
ఋ) రీసెర్చి స్కాలర్లుకు ఉపకారవేతనాలు చెల్లించబడతాయి.
ఎ) ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల సహకారం సంస్థ ద్వారా అంధ విద్యార్థులకు టేప్‌ రికార్డులు, క్యాసెట్‌లు చదువుకొనే నిమిత్తం ఉచిత సరఫరా.
ఏ) అంధులు, చలన సంబంధమైన వైకల్యం కలవారికి పబ్లిక్‌ పరీక్షల సమయంలో 30 ని|| అదనంగా అనుమతిస్తారు.
ఐ) బధిర విద్యార్థులకు పబ్లిక్‌ 10వ తరగతిలో రెండు లాంగ్వేజెస్‌ వ్రాయకుండా ఇంటర్‌లో ఇంగ్లీషు లాంగ్వేజి వ్రాయకుండా మినహాయింపు.
ఒ) వికలాంగులైన 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు రాయితీ.
ఓ) అంధ విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షల సమయంలో ”స్కైబ్‌”ని ఇస్తారు.
2. శిక్షణ :
వికలాంగుల కొరకు వికలాంగలు సహకార సంస్థ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుచుండేవి. ప్రస్తుత తరుణంలో పారిశ్రామిక శిక్షణ సంస్థలు, బి.యి.డి, టి.టి.సి, కోర్సులలో వికలాంగులకు ప్రవేశానికి రిజర్వేషన్లు కలవు. వృత్తి విద్యా కోర్సులలో ట్యూషన్‌ ఫీజు తిరిగి ఇచ్చే పథకం కలదు. రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ సంస్థలు 1995 వికలాంగులకు సమాన అవకాశాలు. సంపూర్ణ భాగస్వామ్యం చట్టం అనుసరించి ఎంపిక చేసిన ఐ.టి.ఐలలో ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించింది. అయితే ప్రభుత్వం, మారుతున్న పరిస్థితులలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌లో శిక్షణలాంటి క్రొత్త కోర్సులలో ప్రవేశానికి చర్యలు తీసుకొంటుంది. ఐ.టి.ఐ సీట్లలో 2 శాతం మరియు టి.టి.సి.లో 3 శాతం రిజర్వేషన్లు, కలవు. అన్ని కోర్సులలో రిజర్వేషన్లు వికలాంగులకు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం గుర్తించి తదనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇది నిరంతర ప్రక్రియ. కాలానుగుణంగా సమాన అవకాశాలు, ప్రత్యేక అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఏ అంశాన్నయినా ప్రభుత్వ దృష్టికి తీసుకురావచ్చు.
3. ఉపాధి అవకాశాలు :
వికలాంగుల పునరావసం నిమిత్తం ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం పోస్టులు వికలాంగులకు కేటాయించబడినవి. (1 శాతం అంధులకు, 6వ రోష్టరు పాయింటు, 1 శాతం మూగ బధిరులకు, 31వ రోష్టరు పాయింటు, 1 శాతం చలన సంబంధమైన అంగవైకల్యం గల వారికి 56వ రోష్టరు పాయింటు)
వికలాంగుల కొరకు గుర్తించిన పోస్టులు 3 సం||ల వరకు ఖాళీగా ఉంచాలి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వయో పరిమితి అర్హత, వికలాంగుల కొరకు 10 సం||లు సడలించారు.
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో వికలాంగులకు కేటాయించబడిన ఉద్యోగాల నియామకం ఆ పోస్టు స్థాయిననుసరించి ఉపాధి కల్పన కార్యలయం ద్వారా గాని, పేపరు ప్రకటనలు, సర్వీస్‌ కమీషను ద్వారా గాని జరుగుతాయి.
కాలేజి సర్వీసు కమీషన్‌ నిర్వహించే ఐఉజూఊ/శ్రీ|ఉజూఊ కు హాజరయ్యే విద్యార్థులకు, అభ్యర్థికి రూ. 180/- పరీక్ష రుసుము ఇవ్వబడుతుంది. ఆదాయ పరిమితి సం|| రూ. 3600/-
4. స్వయం ఉపాధి :
అందరికి ఉద్యోగాలు లభించవు. కానీ జీవనం సాగించాలి. అందుచేత ప్రజల విస్తృత ప్రయోజనాలు, ఆర్థిక స్వావలంబన దిశగా ప్రయాణం సాగించేటట్లు చేయటానికి స్వయం ఉపాధి పథకాలు ప్రవేశపెట్ట బడినవి. స్వయం ఉపాధికి నిర్దేశించిన అన్ని గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి పథకాలలో వికలాంగులకు 3 శాతం కేటాయించారు. అలాగే సి.యం.ఇ.వై., పి.యం.ఆర్‌.వై. అన్ని బలహీన వర్గాల ఆర్థిక సహాయ సంస్థలలో వికలాంగులకు ప్రత్యేక కేటాయింపు ఉంది.
యన్‌.హెచ్‌.యఫ్‌.డి.సి. ద్వారా బ్యాంకులతో నిమిత్తం లేకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వమే స్వయం ఉపాధికి అప్పులిచ్చే పథకం ప్రవేశపెట్టింది.
వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా సబ్సిబీ యిచ్చే పథకం అమలులో ఉంది. దీని ద్వారా చిన్న, చిన్న వ్యాపారాలకు బ్యాంకులు అప్పు మంజూరు పత్రం ఇవ్వనిచో ప్రత్యేక పరిస్థితులలో నేరుగా రూ.3,000 మంజూరు చేయవచ్చు.
అయితే వికలాంగులు స్వయం ఉపాధిపథకం కోరే ముందు ఆ పథకం గురించి సరైన అవగాహన ఉండాలి. ఆ ఉపాధి పథకం వివరాలు పూర్తిగా తెలుసుకొని అందులో అవసరమయిన శిక్షణ పొంది ఉంటే ఆ పథకం సద్వినియోగానికి తోడ్పడుతుంది.
ఇవి గాక అనేక ఉపాధి పథకాలు రాష్ట్ర ప్రభుత్వంచే అమలు చేయబడుతున్నవి.
అ) వికలాంగులయినటువంటి ‘లా’ కోర్సు చదివిన పట్టభద్రులు లా పుస్తకాలు కొనుగోలు మరియు ఎన్‌రోల్‌మెంటు ఫీజు నిమిత్తం రూ. 1,700 మంజూరు అవుతున్నాయి.
ఆ) సివిల్‌ సప్లయిస్‌ వారి రేషన్‌ షాపులలో 3 శాతం వికలాంగుల నిమిత్తం కేటాయించాలి.
ఇ) స్టాంపుల అమ్మకం వ్యాపారం మంజూరు చేయునపుడు వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఈ) ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సహాయ సంస్థ అందచేసిన రుణాలలో వికలాంగులైన లబ్దిదారుల నిమిత్తం రూ. 50,000 వరకు తక్కువ వడ్డీతో అప్పు మంజూరు చేయబడుతుంది.
5. విద్య మరియు చలనన సంబంధమైన పరికరములు సరఫరా :
వికలాంగుల పునరావాసానికి, ‘చలనం’ అతి ముఖ్యమైన అంశం, వారు పరికరాల సహాయంతో ఇతర మార్గాల ద్వారా క్రొత్త క్రొత్త ప్రాంతాలకు వెళుతున్నట్లయితే ఎన్నో విషయాలు తెలుసుకోవడం, విద్యసభ్యసించడం ద్వారా వారి స్వయం పునరావసాన్ని మార్గం సుగమం చేసుకుంటారు. అందుచేత చలన పరికరాలు వికలాంగుల పునరావసంలో విడదీయలేని అంశం. ఈ పరికరాలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా సరఫరా చేయబడుచున్నవి. అయితే రాష్ట్ర ప్రభుత్వ కూడ ముందుకు వచ్చి, వికలాంగు లందరికీ చలన పరికరాలు అందచేయాలనే ఉద్దేశ్యంతో వారి అవసరాలను గుర్తించి దశల వారీగా వాటిని తీర్చే ప్రయత్నం చేయు చున్నది. ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల సహకార సంస్థ ఈ చలన పరికరాలు అందచేసే బాధ్యత తీసుకొన్నది. వికలాంగుల సహకార సంస్థ పరిధితో గల మూడు చక్రాల బళ్లు, సరఫరా కేంద్రాలు, కృత్తిమ అవయవములు, కాలిపర్లు, వినికిడి యంత్రాల సరఫరా కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమం అమలు పరచబడుతోంది. అంధులకు చేతికర్రలు కాసెట్స్‌, టేపురికార్డర్స్‌ బ్రెయిలీ పలకలు, టైపురైటర్లు, ఇతర విద్యసభ్యసించేందుకు అవసరమైన అన్ని పరికరాలను సరఫరా చేస్తుంది. పోలియో సోకిన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయబడుచున్నది.
6. సాంఘిక భద్రత :
వికలాంగుల కొంత బలహీనులు కావటం వలన వారికి సాంఘిక భద్రత కల్పించే విషయమై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు పరుస్తోంది.
అ) వికలాంగులకు పెన్షన్‌ నెలకు రూ.500/-
ఆ) సకలాంగుల, వికలాంగులను వివాహం చేసుకుంటే ఇచ్చే రూ.10,000/-లు ప్రోత్సాహక బహుమతి.
ఇ) బలహీనవర్గాల ఇండ్ల కేటాయింపులో లబ్దిదారుల వాటా వికలాంగులు 3 వాయిదాలలో కట్టే సౌకర్యం.
ఈ) ఎ.పి. హౌసింగు బోర్డు ద్వారా కట్టి మంజూరయ్యే ఇళ్ళలో 2 శాతం వికలాంగులకు కేటాయింపు.
7. అన్నిప్రభుత్వ పథకాలలో 3% నిధులు వికలాంగులకొరకు వినియోగం :
వికలాంగుల చట్టం 1995 నందలి ఏర్పాట్లననుసరించి అన్ని అభివృద్ధి పథకాలు మరియు దారిద్య్ర నిర్మూలన పథకములలో 3% నిధులు వికలాంగుల సంక్షేమం, పునరావాసానికి కేటాయించి ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
తదునుగుణంగా జిల్లా గ్రామీణాభి వృద్ధి సంస్థ, ఇందిరా క్రాంతి పథం, యస్‌.సి. కార్పొరేషన్‌, బి.సి. కార్పొరేషన్‌, మహిళా శిశు సంక్షేమ ఏజన్సీ, సెట్రాజ్‌, కెవిఐబి, జిల్లా పారిశ్రామిక కేంద్రం, మైనారిటీ కార్పొరేషన్‌ మొదలగు అన్ని సంస్థలు వారి వారి వార్షిక లక్ష్యములలో 3% వికలాంగులకు కేటాయించి ఖర్చు చేస్తాయి.
సర్వ శిక్షా అభియాన్‌ 15 సం||లోపు విద్యార్థులకు సహాయ వస్తు పరికరముల పంపిణీ మరియు ఆర్‌బిసి సెంటర్ల జరుగుచున్నది.
8. జాతీయ ట్రస్టు :
ఔటిజం, సెరెబ్రిల్‌ పాల్సి, బుద్ధి మాంద్యం, మరియు బహుళ వైకల్యం కలిగివున్న వారి సంక్షేమం మరియు పునరావాసం కొరకు భారత ప్రభుత్వము జాతీయ ట్రస్టును ఏర్పాటు చేసింది. ఈ జాతీయ ట్రస్టు క్రింద స్థాయిలో జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో స్థానిక స్థాయి కమిటీలు పనిచేస్తాయి. సంరక్షకత్వం ఇచ్చే అధికారం చట్టబద్ధంగా ఈ కమిటీలకు సంక్రమింప చేయబడింది.
9. ఇతర రాయితీలు :
అ) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిటీబస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం, సబర్టన్‌ బస్సులలో 50 శాతం రాయితీ.
ఆ) రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలో ఉద్యోగం చేసే వికలాంగులకు నెలకు రూ.400/- మించకుండా ప్రయాణపు రాయితీ (మూలవేతనంపై 10 శాతం)
ఇ) స్వయం ఉపాధితో జీవనం గడిపే వికలాంగులు మోటారు వాహనంపై ఇంటి నుంచి వ్యాపార స్థలం లేదా పనిచేసే స్థలంకు వెళ్ళి రావటానికి నెలకు రూ.25 లీటర్లకు మించకుండా పెట్రోలు వాడకంపై 50 శాతం రాయితీ.
ఈ) అంధ వికలాంగులయిన అధ్యాపకులకు వారు పాఠ్య ప్రణాళికలు వగైరా తయారు చేసుకొనే నిమిత్తం సహాయకుని నియమించు కొనేందుకు నెలవారీ రీడర్స్‌ ఎలవెన్సు మంజూరు.
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా డిశంబరు 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం, జనవరి 4న అంధుల లిపి ప్రదాత లూయీ బ్రెయిలీ జన్మదినోత్సవం వికలాంగులు జరుపుకుంటారు.
వికలాంగులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు-రాయితీలు
వికలాంగుల పునరావాసంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా అనేక పథకాలు రాయితీలు ప్రవేశపెట్టింది. అవి-
క) సాంఘిక న్యాయం, అధికారిత్వ మంత్రిత్వ శాఖ ద్వారా వివిధ కేటగిరీలకు చెందిన వికలాంగుల నిమిత్తం జాతీయ సంస్థలు, వాటి పరిధిలో ప్రాంతీయ సంస్థలు నెలకొల్పడం జరిగింది. అవి :
1) అంధులకు జాతీయ సంస్థ డెహ్రడూన్‌లో
2) మూగ, బధిర వికలాంగులకు జాతీయ సంస్థ ముంబాయిలో
3) చలన సంబంధమయిన లోపం కలవారి జాతీ సంస్థ కలకత్తాలో
4) మానసిక వికలాంగుల కొరకు జాతీయ సంస్థ – బోయినపల్లి, సికింద్రాబాద్‌లో పనిచేస్తున్నాయి.
ప్రతి సంస్థకు వాటి అవసరా లననుసరించి ప్రాంతీయ సంస్థలు నెలకొల్పడం జరిగింది. ప్రతి జాతీయ సంస్థలో ఇతర కేటగిరీలకు చెందిన వికలాంగులకు కూడా సమాచారం అందించే నిమిత్తం ఆయా కేటగిరిల విభాగాలను ఏర్పాటు చేశారు. ఇవిగాక చలన సంబంధమైన వికలాంగుల నిమిత్తం ఢిల్లీలో ఒక సంస్థ (|.ఆ.క.) కటక్‌లో నిర్థార్‌ (ఒరిస్సా), చలన సంబంధమైన పరికరాల సరఫరా నిమిత్తం కాన్పూరులో అలింకో సంస్థ ఉన్నాయి. బధిర వికలాంగుల శిక్షణ నిమిత్తం, హైదరాబాదులో ఒక శిక్షణ పనిచేస్తున్నది.
వికలాంగుల పూర్తి పునరావాసం లక్ష్యంగా పైలట్‌ ప్రాజెక్టులు దేశంలో 11 చోట్ల మంజూరు చేయగా ఒకటి విజయవాడలో పనిచేస్తుంది. అవి పూర్తి స్థాయి సంస్థలుగా 1991 నుంచే మార్పు చెందినవి.
వికలాంగుల సేవలో నిమగ్న మయిన ప్రభుత్వేతర సంస్థలకు ప్రత్యక పాఠశాలలు స్థాపించడం దగ్గర నుంచి పరికరాల సరఫరా వరకు వికలాంగుల పునరావాసంకు  అవసరమయిన ఏ పథకం కైన 90 శాతం నిధులు మంజూరు చేసి మారుమూల గ్రామాలలోని వికలాంగు లకు సైతం సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో, కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం అభ్యున్నతి మంత్రిత్వ శాఖ, పథకాలు అమలు చేస్తుంది.
ప్రతిభావంతులైన వికలాంగులకు, వికలాంగులకు అధిక సంఖ్యలో ఉద్యోగాలిచ్చి ఆదుకొనే సంస్థలకు వికలాంగుల కదలిక వగైరాల నిమిత్తం పరిశోధనలు చేసి కొత్త, కొత్త పరికరాలు కనుగొన్న వ్యక్తులకు, సంస్థలకు జాతీయ పురస్కారాలు ప్రతి సం||ము ప్రపంచ వికలాంగుల దినోత్సవమైన డిశెంబరు 3వ తేదీన భారత రాష్ట్రపతి ఒక ప్రత్యేక ఫంక్షన్‌లో అందచేస్తారు.
ఖ) కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ :
ఈ శాఖ పరిధిలో ప్రతి రాష్ట్రంలో వృత్తి పునరావాస కేంద్రాలు స్థాపించబడినవి. మన రాష్ట్రంలో విద్యానగర్‌, అవరణ హైదరాబాద్‌లో ఈ కేంద్రం పనిచేస్తుంది. వికలాంగుల ఉపాధి స్వయం ఉపాధికి సూచనల నిమిత్తం ప్రత్యేక ఉపాధి కేంద్రాలు, ప్రత్యేక సెల్స్‌ పనిచేస్తున్నాయి. మన రాష్ట్రంలో హైదరాబాద్‌, విశాఖపట్నంలో ఉన్నాయి.
గ) ప్రయాణ రాయితీలు :
అ) రైల్వే శాఖ : రైళ్ళ ప్రయాణానికి వికలాంగులయిన వారికి ఎస్కార్టులో 75 శాతం ప్రయాణ రాయితీ ఉంది. మూగ, బధిర వికలాంగులకు ఎస్కార్టు సౌకర్యం లేదు. అంధులు, చలన సంబంధమయిన వైకల్యం కలవారు, క్షయ, క్యాన్సర్‌ జబ్బుతో బాధపడేవారు. మానసిక వికలాంగులు, లెప్రసీ వ్యాధి సోకిన వారు (నాన్‌-ఇన్‌ఫెక్షన్‌) తలస్వేమియా వంటి పెద్ద వ్యాధులు సోకినవారు ఈ రాయితీకి అర్హులు.
ఆ) పౌర వియానయాశం : విమాన ప్రయాణంలో అంధులైన వారికి ప్రయాణ రాయితీ.
ఇ) టూరిజం శాఖ : ప్రభుత్వ టూరిజం కార్పోరేషన్‌ హోటల్స్‌లో బసచేసే వికలాంగులకు రాయితీలు పంపుటకు పోస్టేజ్‌ రాయితీ, లైసెన్సు ఫీజు, అంధ వికలాంగులకు శిక్షణ యిచ్చే సంస్థలకు వైర్‌లెస్‌ సెట్లు ఉపయోగించేందుకు కట్టే కస్టమ్‌ డ్యూటీ రాయితీలు.
ఈ) కస్టమ్‌ డ్యూటీ రాయితీలు : అంగవైకల్యం అధిగమించడానికి అవసర మయ్యే వస్తువులు విదేశాల నుంచి తెప్పించు కోవలసి వస్తే కస్టమ్‌ డ్యూటీ రాయితీ ఇస్తారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, వాతావరణ సెన్సర్స్‌, డ్రాఫ్టింగు, డ్రాయింగు ఎయిడ్స్‌, ప్రత్యేక గడియారాలు, ఆర్థోపెడిక్‌ పరి కరాలు, వీల్‌ చైర్స్‌, ఆడియో క్యాసెట్‌ మొదలగునవి. అంధ మరియు బధిర వికలాంగులకు సంబంధించిన రిజిస్టర్డ్‌ కో-ఆపరేటివ్‌ సంఘాలు ఎక్విప్‌మెంట్‌, పరికరాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
ఘ) మానవ వనరుల అభివృద్ధి :
అ) వికలాంగులయిన బాలబాలికలకు గ్రామీణ ప్రాంతాలలో విద్యావకాశాలు అందుబాటులో తెచ్చేందుకు సమీకృత విద్యావిధానం (ఇన్‌టిగ్రేటెడ్‌ ఎడ్యుకేషన్‌) ప్రవేశపెట్టారు. ఈ విద్యావిధానంలో వికలాంగులయిన పిల్లలకు ఎన్నో సౌకర్యాలు కలుగచేసారు. పుస్తకాలు యితర స్టేషనరీ నిమిత్తం సం||కు రూ.400 యూనిఫార్మ్‌ అలవెన్స్‌ రూ.50/- ట్రాన్స్‌పోర్టు ఎలవెన్సు నెలకు రూ.50 అంధ విద్యార్థులకు రీడర్స్‌ అలవెన్సు నెలకు రూ.50/- ఎస్కార్టు, అలవెన్సు ఎక్విప్‌మెంటు కొనుటకు అయ్యే అసలు ఖరీదు 5 సంవత్సరములకు రూ.2,000 మించకుండా మంజూరు.
ఆ) విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం సంవత్సరానికి ఒక్క ఫెలోషిప్‌ అయినా వికలాంగుడయిన యువ విద్యార్థికి ఇవ్వాలని సూచించింది.
విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం విశ్వవిద్యాలయాలకు ఈ దిగువ సూచనలిచ్చింది.
అ) విశ్వవిద్యాలయాలు, కాలేజీలలో ఉపాధ్యాయ వృత్తికి అర్హులైనపుడు, అంధులనే సాకుతో నిరాకరించకూడదు.
ఆ) అర్హత గల అంధులయిన అభ్యర్థులను బ్యుటోరియల్‌ పనికి, పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సులకు నియమించవచ్చును. అయితే పరిమిత సంఖ్య ఉన్నపుడే వారికి నియమించాలి.
ఇ) సంగీతం నేర్పే పోస్టులకు అంధులయిన అభ్యర్థులకు ప్రాధాన్యత యివ్వాలి.
చ) ఆదాయపు పన్ను రాయితీలు :
ప్రభుత్వ ఉద్యోగి వికలాంగుడయితే ఆదాయపు పన్ను చట్టం 461లోని కొన్ని క్లాజులననుసరించి 80 యు రాయితీలు యివ్వబడినవి. అలాగే ప్రభుత్వ ఉద్యోగిపై పూర్తిగా ఆధారపడిన వికలాంగులని నిమిత్తం కూడా సెక్షన్‌ 80 డి ఇంద రాయితీ కల్పించబడింది.
ఛ) గృహవసతి :
జనరల్‌ పూల్‌ ఇండ్ల కేటాయింపు- అర్హులయిన కేంద్ర ప్రభుత్వ వికలాంగులయిన ఉద్యోగస్తులకు గృహవసతి కేటాయింపులు సానుభూతితో పరిశీలించి ప్రతి ఉద్యోగస్తుని అవసరం ప్రతిపదికన జరుగుంది. ఇది వారిక జనరల్‌ పూల్‌ ఇండ్ల కేటాయింపు కంటే చాలా ముందుగా జరుగుతుంది. ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ వారు షాపులను, 1 శాతం ఇండ్ల స్థలాలను 1 శాతం ఇండ్లను (ప్లాట్స్‌) వికలాంగులకు కేటాయించారు.
జ) ఇతర సౌకర్యాలు :
అ) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ నియామకములో 10 సం|| యమో సడ లింపు ఇవ్వబడింది. వికలాంగులు యస్‌.సి., యస్‌.టి. అభ్యర్థులయితే మరో 5 సంవత్సరములు అదనంగా వయో సడ లింపు ఉంటుంది.
ఆ) వికలాంగులయిన అభ్యర్థులకు టైపు అర్హత వారు ఇతరత్రా అర్హులయితే సడలించబడింది. టైపు చేయలేరని మెడికల్‌ బోర్డు సర్టిపై చేస్తే సరిపోతుంది. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ మెడికల్‌ బోర్డు ఇస్తే సరిపోతుంది. సకలాంగుల వలే ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ విధానం అంతా ఆచరించవనసరం లేదు.
ఇ) మూగ, చెవుడు అభ్యర్థులను క్లరికల్‌ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించరాదు.
ఈ) ఒకే కన్ను అంధత్వం గల వార్ని గ్రూపు సి.డి. ఉద్యోగాలకు, వారు దృష్టి తీవ్రత అవరోధం కానట్లయితే మెడికల్‌ బోర్డు సిఫార్సు చేయవచ్చును.
ఉ) వికలాంగులయిన కేంద్ర ప్రభుత్వోద్యోగులకు క్రొత్త వేతన సవరణ సంఘం స్కేల్స్‌ అనుసరించి ప్రయాణ రాయితీ కొన్ని నిబంధనల మేరకు అత్యధికంగా నెలకు రూ.750/-లు మంజూరు చేయబడినది. ఇది ఈ వేతన సవరణ సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వంచే క్రొత్తగా ప్రవేశపెట్టిన పథకం.
ఊ) వికలాంగులయిన వ్యక్తులను కేంద్ర ప్రభుత్వ శాఖలలో గల గ్రూపు సి.డి. ఉద్యోగ నియామకాలలో 3% రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించారు. (అంధులకు 1% బధిరులకు 1%, చలన సంబంధమైన వారికి 1%)
ఋ) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు విక లాంగులయిన పిల్లలు ఉన్నట్లయితే 1 నుంచి 12వ తరగతి వరకు నెలకు రూ.50/- ఫీజు రీయింబర్స్‌మెంటు యిస్తారు.
బుూ) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల పదవీ విరమణ అనంతరం ఉద్యోగస్తులు వారి యితర సహచరులు కాలం చేసిన తర్వాత, వారికి మానసిక వికలాంగులయిన సంతానం ఉన్నట్లయితే అట్టి మానసిక విక లాంగునికి దగ్గరి బంధువులను గార్డియన్‌గా పెన్ష్‌నర్‌ నామినేట్‌ చేస్తే అట్టి వికలాంగుని జీవితకాలమంతా కుటుంబ పెన్షన్‌ వస్తుంది. ఇదే సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు వర్తిస్తుంది.
(పిలుపు మాసపత్రిక సౌజన్యంతో)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to వికలాంగుల పునరావాసానికి ప్రభుత్వం అందించే సౌకార్యాలు, రాయితీలు

  1. ramnarsimha says:

    ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.