భూమిక ఆధ్వర్యంలో జరిగిన సమ్మర్‌ క్యాంప్స్‌ – భూమిక టీం

భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని స్త్రీలతో పిల్లలతో పని చేస్తున్నది. మేము ప్రతి వేసవి సెలవల్లో పిల్లల్లోని నైపుణ్యాలను వెలికితీయడం, వారికి కొన్ని కొత్త నైపుణ్యాలను నేర్పించేందుకు, ఇంకా కొన్ని సామాజిక విషయాలపై వారి అవగాహనను పెంచేందుకు ఈ సమ్మర్‌ క్యాంపులను ఒక వేదికగా ఉపయోగించుకుంటాం.

ఇందుకోసం మేము ముందుగా ఈ సమ్మర్‌ క్యాంపులు నిర్వహించటం గురించి పిల్లల తల్లులతో ఒక సమావేశాన్ని ఏర్పరిచి ఈ విషయాన్ని గురించి వారితో చర్చించాము. వారందరూ భూమిక నిర్వహణలో సమ్మర్‌ క్యాంపులకు తమ పిల్లలను సంతోషంగా పంపిస్తామని భూమిక స్టాప్‌ అందరూ పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, వారు పిల్లలకు క్రమశిక్షణ, సమయపాలన, పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రుల కష్టాన్ని పిల్లలకు అర్థం చేయించడం, ఇంట్లో ఆడ మగ తేడా లేకుండా అన్ని పనులు అందరూ చేసుకునేలాగా, ఇంకా కుటుంబంలో ఆడవాళ్ళ పిల్లల అభిప్రాయాలను గౌరవించాలి అనేటువంటి ప్రజాస్వామిక విలువలను నేర్చుకుంటారని సంతోషం వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఎక్కడెక్కడో ఎండల్లో తిరిగి ఆడుకోవడం కంటే భూమిక వారు నిర్వహించే సమ్మర్‌ క్యాంపులకు పంపిస్తే వారి పిల్లలు సురక్షితంగా ఉంటారనే నమ్మకాన్ని వెలిబుచ్చి, వారంతట వారే స్వచ్ఛందంగా తమ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి పిల్లలందరినీ ఈ సమ్మర్‌ క్యాంపులకు హాజరయ్యేలా చేశారు.
ఆ విధంగా మేము మే నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, రంపచోడవరంలో మేము పనిచేస్తున్నటువంటి ఏరియాలో ఇంకా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలోని 10 కమ్యూనిటీలో మొత్తం ఒక 1048 విద్యార్థినీ విద్యార్థులతో 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో పిల్లలకు సమ్మర్‌ క్యాంపులు నిర్వహించాము. ఈ సమ్మర్‌ క్యాంపులో 440మంది మగ పిల్లలు 608మంది ఆడపిల్లలు పాల్గొన్నారు. ఆడపిల్లలు ఎక్కువ మంది ముందుకు వచ్చి ఈ సమ్మర్‌ క్యాంపులలో పాల్గొనడం మా అందరికీ చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సమ్మర్‌ క్యాంపులు జరపడానికి స్థలాన్ని ఎంపిక చేయడం ఒక పెద్ద సవాల్‌ వారితో ఆటలాడిరచడానికి డాన్సులు వేయించడానికి విశాలమైన స్థలం కావాలి. మేము ముందుగా ఆ స్థలాలను వెతికి పెట్టుకొని అవసరమైన దగ్గర అందుకు అనుమతులను తీసుకున్నాము. అంతేకాక సమ్మర్‌ క్యాంపు పిల్లలకు కావాల్సిన వాటర్‌ బాటిల్స్‌ చివర్లో వారికి స్నాక్స్‌ రెడీ చేయడం ఇదంతా కూడా చాలా శ్రమతో కూడిన వ్యవహారమే. ఆ కమ్యూనిటీలన్నీ చాలా కాలంగా మేము పనిచేస్తున్నవి అవడంతో అక్కడ వారితో మాకు ఉన్నటువంటి సాన్నిహిత్యము, పరిచయాలతో ఈ పనులన్నిటిని సులభతరంగా చేయగలిగాము. మామీద వారికున్న అభిమానం, నమ్మకంతో కమ్యూనిటీ వారు ఈ క్యాంపులకు ఎంతగానో సహకరించారు.
ఈ సమ్మర్‌ క్యాంపులో పిల్లలకు పేపర్‌ క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌, వివిధ రకాలైన ఆటలు ఆడిరచడంతోపాటు, కొన్ని పాటలు నేర్పించడం, పాడిరచడం, స్టోరీ టెల్లింగ్‌ ఇంకా మేము కథలు చెప్పడమే గాక, వారిని కూడా రేపు వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో కథ అందరికీ చెప్పేందుకు నేర్చుకు రమ్మని చెప్పాము. వివిధ సామెతలను కూడా మీ పెద్ద వాళ్ళ దగ్గర తెలుసుకొని రమ్మని వాటిని మరుసటి రోజు చెప్పాలని చెప్పాము. ఇంకా దేశ నాయకుల గురించి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకుడి పేరు ఇచ్చి ఇంట్లో తెలుసుకుని రమ్మని మరుసటి రోజు చెప్పాలని చెప్పాము. ఇలా వారు సమాచారం తెలుసుకోవడానికి వారి పేరెంట్స్‌కి ఉన్న ఫోన్లులో సోషల్‌ మీడియా వారికి బాగా ఉపయోగపడిరది. ఇంకా క్విజ్‌ పోటీలు కొన్నిచోట్ల అందుబాటులో ఉన్న బయటి రిసోర్స్‌పర్సన్స్‌ ద్వారా కరాటే ఇలాంటి సెల్ఫ్‌ డిఫెన్స్‌ పద్ధతుల్లో మెలకువలు ఇప్పించడం, మెహిందీ డిజైన్స్‌ ఎలా వేయాలో నేర్పించడం, పోషకాహారం గురించి, పర్సనల్‌ హైజిన్‌ గురించి, అమ్మాయిలు అబ్బాయిల ఉండే వివక్షతపై రోల్‌ప్లేలు నేర్పించడం, ఆ రోల్‌ప్లేలను వారే రెడీ చేసుకుని ప్రదర్శించమని చెప్పడం, సోషల్‌ మీడియా దుష్ప్రభావాల గురించి వారితో చర్చించడం, పిల్లలకు ఉన్న సపోర్ట్‌ సిస్టమ్స్‌, హెల్ప్‌ లైన్లు సమాచారం గురించి వారికి ఎంతవరకు తెలుసు అనేది చర్చించి తెలియని సమాచారాన్ని వారికి అందించడము, లైఫ్‌ స్కిల్స్‌లోని కొన్ని అంశాలు కమ్యూనికేషన్‌ ఇంపార్టెన్స్‌, టైం మేనేజ్మెంట్‌ లాంటి అంశాలపై వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది.
విజయవాడలోని వాంబే కాలనీ, అజిత్‌సింగ్‌ నగర్‌ కమ్యూనిటీలో ఇంకా రాజమండ్రిలో కోటిలింగాల పేట, మేదర్‌ పేట, ఆదిమ్మ దిబ్బ, రంపచోడవరంలోని 10 విలేజెస్‌లో ఈ సమ్మర్‌ క్యాంపులు నిర్వహించాము. ఈ సమ్మర్‌ క్యాంపులకు కొన్ని చోట్ల ఐసిడిఎస్‌ వారు, పోలీసులు కూడా సహకరించారు. విజయవాడలో ఈ సమ్మర్‌ క్యాంపులోని పిల్లలకు కుంగ్‌ ఫు నేర్పించేందుకు వేరే ఎన్జీవో వారు ఒక టీచర్ని స్వచ్ఛందంగా ఏర్పాటు చేయడంతో పిల్లలు సెల్ఫ్‌ డిఫెన్స్‌ విద్యను నేర్చుకోగలిగారు. ఈ సమ్మర్‌ క్యాంపులను సాయంత్రం నాలుగు గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించడం వల్ల పిల్లలు ఎండల్లో బయట తిరగకుండా చూసిన వాళ్ళం అయ్యాము. ఈ సమ్మర్‌ క్యాంప్‌ల్లో పిల్లలకు ఎండ దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడమే కాకుండా ఒకవేళ ఎవరికైనా ఎండ దెబ్బ తగిలితే ఏం చేయాలి అనేది కూడా కొన్నిచోట్ల వారికి నేర్పించడం జరిగింది.
పిల్లలు తాము ఈ సమ్మర్‌ క్యాంపు చివరి రోజున పిల్లలు అందరి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ అడిగాము. వారు మేము ఈ సమ్మర్‌ క్యాంపును చాలా ఎంజాయ్‌ చేశామని, తమకి చాలామంది కొత్తవారు ఫ్రెండ్స్‌ అయ్యారని, తమ నైపుణ్యాలను ప్రదర్శించుకోవడానికి అవకాశం దొరికిందని, తాము కూడా చాలా కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నామని చెప్పారు. మా మీద మాకు మరింత కాన్ఫిడెన్స్‌ పెరిగింది, మా స్నేహితులకు ఉన్న మంచి క్వాలిటీస్‌ ఏంటి అనేది మాకు తెలిసింది, ఐకమత్యంగా ఉండడంలోని బలం, సహకారం, సంతోషం మేము తెలుసుకున్నాము అని చెప్పారు. మాకు పనికొచ్చే ఎన్నో కొత్త విషయాలని నేర్చుకున్నాము. బూతు మాటలు మాట్లాడకూడదు, చెడు సావాసాలు, చెడు అలవాట్లు చేసుకో కూడదు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా పిల్లలు వాటికి అలవాటు పడితే వారి గురించిన సమాచారాన్ని భూమిక సంస్థకు అందచేయాలి, ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా చూడాలి, అందరిని గౌరవించాలి, ఎవరిపై పెత్తనం చేయకూడదు అని నేర్చుకున్నాం అని చెప్పారు. మాకు ఇలాంటి సమ్మర్‌ క్యాంపులు ప్రతి సంవత్సరం భూమిక సంస్థ ఏర్పాటు చేయాలని వారందరు మమ్మల్ని కోరారు. కమ్యూనిటీకి మరింత దగ్గరయ్యేందుకు, అక్కడి పిల్లలకు చేరువై వారికి అవసరమైన కొత్త విషయాలు నేర్పించేందుకు మాకు ఈ సమ్మర్‌ క్యాంపు వల్ల అవకాశం లభించింది.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.