‘మితభాషి-సంతోషి’ వనజ

మితభాషి సంతోషి అయిన మా పనిమనిషి వనజ వయసు సుమారు పాతికేళ్ళు.తన పరిధిలో సాధ్యమైనంత ప్రణాళికాబద్ధంగా జీవించడం, సమయపాలన పాటించడం, ఉన్నంతలో ఆనందంగా గడుపుకోవడం తనలో నేనెపుడూ మెచ్చుకునే అంశాలు.
పరిశీలించి చూస్తే ఆధునిక స్త్రీ పనిచేయని రంగం అంటూ లేదని చెప్పచ్చు. పనిలో ప్రమాణాలు గాని, సదుపాయాలు గాని, వత్తిళ్ళు గాని రంగాన్ని బట్టి, స్థాయిని బట్టి, వ్యక్తి సామర్ధ్యాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇళ్ళలో పనిచేసే ఆడవాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, పూర్వానికీ ఇప్పటికీ వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే ఆలోచనతో ”వనజా, ఇలా వచ్చి కాసేపు కూర్చో, నీతో మాట్లాడాలి” అన్నా. ముందే చెప్పానుగా పంక్చువాలిటీ, ప్లానింగు తన సహజ గుణాలని. ”ఏందమ్మా?” అంటూ వింతగా చూస్తుంటే వివరించి చెప్పా నా ఉద్దేశ్యం ఇదని. ఇంటర్వ్యూకి కాస్త సమయం కేటాయించకుని వచ్చి కూర్చుంది.
మాది నల్లగొండ జిల్లాలో ‘పెద్దపడిశాల’ అనే ఊరమ్మా. మా అమ్మ నాన్న వడ్లు, పెసలు, కందులు, సెనగలు విడిగా కొని మార్కెట్లకి తీస్కపోయి అమ్మి వ్యాపారం చేసేవారు. ఎడ్ల బళ్ళ మీద సరుకు పెట్టుకొని, చానా దూరాలు నడుచుకుంటా పోయెటోళ్ళు. మేము నలుగురం. అందరం పదివరకు చదువుకున్నం. 97లో నా పెండ్లైందమ్మా, వెంకన్నతో. వాళ్ళది పక్క ఊరు. పెళ్ళైనాక కొరకండ్ల అనే ఊరిలో లుంగీలు, తువ్వాళ్ళు, చేనేత బట్టలమ్మే వ్యాపారం చేసుకున్నాం కొన్నాళ్ళు. ఆ యాపారంలో ముప్పైవేల అప్పు అయింది. రోజు గడిచేది కష్టమైపోయింది. 2003లో హైదరాబాదు వొచ్చాం. అప్పటికే మా అత్తామామా ఇక్కడ పనులు చేసుకుంటా ఉన్నారు. రాంగనే ఉప్పరపని దొరికింది. తర్వాత హాస్టలు ఊడ్చేపని దొరికింది. కొన్నిరోజులయినంక ఇండ్లలో గిన్నెలు తోమి, బట్టలుతికే పని దొరికింది. కాని మా అమ్మ, నాయన ఇంటిపని చేయొద్దని తిట్టారు. మావాళ్ళలో ఎవ్వరు ఇండ్లలో పని చేయలే. పరువు తక్కువని మావాళ్ళు వొద్దన్నరు. అప్పుడు 30 వేల అప్పుందమ్మ. ఎట్ల తీరాలె? ఎవరేమనుకున్న సరే నాకేం అనుకున్న, దొంగపని కాకుంటే చాలనుకున్న.
మొదట్లో అలిసిపోయేదాన్ని. పెద్దిళ్ళలో పనిచేసుడు తెలిసేది కాదు. ఎట్ల చెయ్యాల్నో నేర్పిచ్చినాక తేలికైపోయింది. ఇంకో ఇల్లు దొరికితే బాగుణ్ణు అనిపించేది. (కొంతసేపు చెప్పడానికిష్టపడలేదు. మొహమాటంగా నవ్వుతూ కూర్చుంది. మరికొంతసేపు అడిగాక) ఒక ఇంట్లో ‘పనోళ్ళు’ అని తక్కువగా చూస్తే బాధనిపిస్తదమ్మా. మెత్తగ చెప్పకుండా అథార్టీగా చెప్తరు పని. అపుడు బాధనిపిస్తది (చెప్పచ్చా, కూడదా అన్నట్టు చూస్తూ) ఎంత పొగరు వీళ్ళకి అనిపిస్తది. మంచిగ చెప్తే చేస్త కదా!
ఒక బాబు పుట్టినాక ఇక్కడికొచ్చినం. ఈ అప్పులతో పిల్లల్ని మంచిగ పెంచలేమని ఒక్కడే చాలనుకున్న. మళ్ళా గర్భమొస్తే తీయించేసుకున్నా. మీ ఇంట్ల పనిచేస్తూ మీ పాపని చూస్తే ఏడుపొచ్చింది. అపుడు మీరే ఎందుకేడుస్తున్నవని అడిగితే ఇంకా ఏడ్చినా. మీరు సద్దిచెప్పి, ”మళ్ళీ వస్తదిలే అప్పుడిట్ల చేయొ”ద్దని చెప్పినంక సరేననుకున్న. అట్లనే మళ్ళీ ఏడాది నెల తప్పితే పురిటికి జీతమిచ్చి సెలవిచ్చినావుగా. (నవ్వు) మంచిగ పాప పుట్టింది. మా ఆయన చేసేది వాచ్‌మేన్‌ పని గదమ్మ. కాంప్లెక్సులో కాపలా కాసుకుంటూ పాపని చూసుకునేవాడు. నేను పని మళ్ళీ మొదలుపెట్టుకున్నా. అన్నిటికి మా ఆయన సాయం చేస్తడు. అవసరాన్నిబట్టి పిల్లలవి, తనవి బట్టలు కూడ ఉతుకుతాడు. పిల్లల్ని స్కూలుకు తయారుచేస్తడు. కూరలు చేతకాదుగాని అన్నం తనే వండుతాడు. నామీద చెయ్యెత్తడం గాని, తిట్టడం గాని చెయ్యడు. పనులు కూడా సాయం మంచిగ చేస్తడు గాని ఎవరేన చూస్తున్నపుడు చేయొద్దంట. ఎవరన్న చూస్తే ఏమన్న అనుకుంటరని. అప్పు 30 వేలు తీరిపోయింది. ఇంకా పుస్తెలతాడు బంగారంది కొనుక్కున్న. పిల్లలిద్దరు మంచిగ స్కూల్లో చదువుతున్నరు. గవర్నమెంటు స్థలమిచ్చి, కొంత సాయమిచ్చింది. కొంత మీకాడ అప్పు తీసుకుని ఇల్లు కట్టుకున్నం.
ఇలా ఇళ్ళలో పని లేకుండ ఇంట్లోనే ఉంటే బాగుణ్ణనిపిస్తుందా? అంటే అట్లా అస్సలు అనిపించదమ్మ. మధ్యాహ్నం, సాయంకాలం ఖాళీ టైము ఉంటదిగా. కాపోతే చుట్టాలిళ్ళలో ఏవైనా కార్యాలు అయితే పోయేందుకు అమ్మగార్లు ఎక్కువ సెలవులివ్వరు. అపుడు ఈ పని లేకుంటె బాగుణ్ణు అనిపిస్తది. ఇంకో ఇల్లు దొరికితే చెయ్యనమ్మా. ఇట్లనే మంచిగా ఉంది. పిల్లల్ని చదివిచ్చుకుందుకు, ఇంట్ల పని ఆరామ్‌గా చేస్కునేందుకు ఇట్లనే మంచిగుంది.  ఇంటిపని ఆడవాళ్ళదే అనుకోనమ్మా. ఒక్కళ్ళకే కష్టం కాకుండ ఇద్దరూ చేసుకోవాలనుకుంట. మగాయన చేస్తున్నది తన భార్యా, పిల్లల కోసమేగాని మందికోసం (బయటివారికోసం) కాదుగా! మా అమ్మ మా నాయన వెంట పోయి యాపారం చేసేది. ఆమె కూడా సంపాదిచ్చేది. కాపోతే చానా దూరాలు నడిచి అలిసిపోయేది. నాకిట్ల బాగుంది. మొదట్లో ఇంటిపనిమనిషిగా చేస్తున్ననని మా అమ్మ, నాయన మా యింటికి రామంటే బాధపడ్డా. కాని మంచిగ అప్పులు తీర్చుకుని బాగుపడుతున్నమని వాళ్ళు కూడ సంతోషంగ ఉన్నరు. నన్ను చూసి ఇంకా మావోళ్ళు కొందరు ఈ పన్లోకి కూడ వస్తున్నరు. దొంగపని కాకుంటె చాలు ఏ పనైనా మంచిదే. అయితే యజమాన్లు ‘పనోళ్ళు’ అని హీనంగ చూసేది బాగుండదు. నే పనిచేసే ఇళ్ళలో ఒకరింట్లో అట్ల చూస్తరు. మానేద్దామని అనుకుంటున్న. ఇంతకుముందు ఆడోళ్ళని మగోళ్ళు కొట్టేది కొంచెం ఎక్కువ వుండేది. ఇప్పుడంతగా లేదు. ఆడపిల్లల్ని మంచిగ చదివిపిస్తున్నరు. ఆడోళ్ళు పన్లు చేసుకుని సంపాదిచ్చుకోవాల. ఇంటిపని ఇద్దరూ కలిసి చేసుకోవాల.
ఇంటర్వ్యూ :వారణాసి నాగలక్ష్మి

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.