మనోగతం

నసీమా హుర్‌జుక్‌
(నసీమా హుర్‌జుక్‌ది వీరోచితమైన గాథ. అప్పటి వరకూ హాయిగా ఆరోగ్యంగా నడిచిపోతున్న ఆమె జీవితం… పదహారేళ్ల వయసులో ఉన్నట్టుండి ఒక్కసారిగా తలకిందులైంది. అనూహ్యమైన అనారోగ్యం ఫలితంగా ఆమె పూర్తిగా చక్రాల కుర్చీకే అతుక్కపోవాల్సి వచ్చింది. ఆమె లేవలేదు. అడుగు పడదు. చివరికి మలమూత్రాలకు వెళ్లటం కూడా అసంభవంగా తయారైన ఆ తొలిరోజుల్లో ఆమె మానసికంగా పూర్తిగా కుంగిపోయి…నిట్టనిలువునా కుప్పకూలిపోయింది.
ఆ తర్వాత ఆమె సమున్నతంగా పైకిలేచి…ఆ వైకల్యంపై ఎంతటి ధీరోదాత్తమైన పోరాటాన్ని సాగించిందో కళ్ళకు కడుతుంది ఈ పుస్తకం.
ఇప్పుడు నసీమా చక్రాల కుర్చీలో కూర్చుని ఉండవచ్చుగానీ… ఆమె మనలో చాలామంది కంటే ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండి ఎంతో ముందుగా నడుస్తోంది. తాను నడవటమే కాదు. ‘హెల్పర్స్‌ ఆఫ్‌ ది హ్యాండికాప్డ్‌’ సంస్థను స్థాపించి ఎందరో వికలాంగులను కూడా పురోగమన పథంలో నడిపిస్తోంది.)
‘సకాళ్‌’ దినపత్రిక కొల్హాపూర్‌ ఎడిషన్‌ కొరకై నేను ‘1999’లో ‘చక్రాల కుర్చీ’ ఆర్టికల్‌ వ్రాశాను.’సప్తవర్ణాలు’ (సప్తరంగు) అన్న పేరుగల సప్లిమెంటరీ సంవత్సరం పాటు వచ్చిన ఈ ఆర్టికల్‌ ఇపుడు, అసంఖ్యాకులైన పాఠకుల కోరికపై పుస్తక రూపంలో వస్తోందన్నది చాలా సంతోషించదగ్గ విషయం. అప్పటి కొల్హాపూర్‌ ‘సాకాళ్‌’ పత్రిక సంపాకుడు, ఇప్పటి ‘పుణే’ సకాళ్‌ సంపాదకుడు ఐన శ్రీ అనంత దీక్షిత్‌, ఇంకా మా ”హెల్పర్స్‌ ఆఫ్‌ ది హ్యాండీకాప్డ్‌ కొల్హాపూర్‌, సంస్థ యొక్క కోఆర్డినేటర్‌, కోశాధికారి ఐన శ్రీ పి.డి. దేశపాండేగారు కోరడం వల్ల నేను రాయటానికై సిద్ధపడ్డాను. కాని మొదటి ఆర్టికల్‌ రాస్తున్నపుడు నా మనసుపైన బ్రహ్మాండమైన ఒత్తిడి ఉండింది. సమయం తక్కువ రాయటం అలవాటు లేదు. లేనిపోని ఝంఝాటం నెత్తిన వేసుకున్నానన్పించింది. కాని ఆర్టికల్స్‌ అచ్చవుతూ పోయేకొద్దీ నా ఆత్మవిశ్వాసం ఎక్కువవుతూ వచ్చింది. పాఠకుల వద్ద నుండి వచ్చిన ఇంతటి గొప్ప ప్రతిస్పందన నన్ను చాలా ఆనందపర్చి, నేను కూడా ఆదివారం పేపర్‌ కోసం ఎదురుచూసేలా చేసింది. గడిచిన 28 సంవత్సరాలుగా నేను వికలాంగ పునరావాస కార్యాల్లో తలమునకలై ఉన్నా నా కార్యసాధనల్లో ఎలాంటి అడ్డంకుల్ని ఎప్పుడూ లెక్కపెట్టలేదు. ఎవరైనా వికలాంగుడు కన్పిస్తే, అతని ఇబ్బందులు, అవసరాలు తెలుసుకొని నావైపు నుంచి సహాయం అందించి, ఆతని జీవితాన్ని సుగమం చేయటమే నా జీవిత ధ్యేయంగా ఉండింది. నన్నెప్పుడూ ”మీరీ క్షేత్రంలోకి ఎలా వచ్చార”ని ఓ ప్రశ్న అందరూ అడుగుతుంటారు. దీన్ని గురించి కొద్దిగా చెప్తాను.
నేను పుట్టుకతో వికలాంగురాలిని కాను. నాకు 16 సంవత్సరాల వయస్సులో ప్రీ డిగ్రీ చేస్తున్నపుడు బాగా వీపునొప్పి వచ్చేది. అలా మూడు నాలుగు సంవత్సరాలు వీపునొప్పి వస్తూ హాస్పిటల్‌ల్లో అడ్మిట్‌ అయినా ఏ డాక్టరూ సరిగా రోగనిర్ధారణ చేయలేకపోయారు. ఏ డాక్టర్‌కీ ఇది వెన్నెముకకు సంబంధించిన వ్యాధి అని తోచలేదు. పైగా నా నొప్పి కేవలం ఊహాజనితమని కూడా కొందరు డాక్టర్లు అన్నారు. పరిణామం, అకస్మాత్తుగా నా శరీరంలోని నడుము క్రింది భాగంలో చైతన్యం నశించిపోయి నేను వికలాంగురాలినయ్యాను. సరియైన సమయంలో సరియైన రోగనిర్ధారణ, తగిన వైద్యం జరిగి ఉంటే బహుశా ఇలా అయి ఉండకపోవచ్చు. నేను మీకు నాట్యరంగంలోనో, క్రీడా క్షేత్రంలోనో కానవచ్చి ఉండేదాన్నేమో?
స్కూల్లో ఎప్పుడూ, ఆటల్లో, నృత్యంలో ముందుండే నేను జయ్‌సింగుపూర్‌లో ఏడవ క్లాసు చదువుతున్నపుడు, పాఠశాల వార్షిక సాంస్కృతిక కార్యక్రమాల్లో ‘రాధాకృష్ణ’ నృత్యంలో రాధ పాత్ర వేశాను. నృత్యం ఆరంభమైన కాసేపట్లోనే స్టేజి కూలగా నేను క్రింద పడిపోయాను. నన్ను బైటికి తీసి టీచర్లు మిగిలిన ప్రోగ్రామ్‌ గురించి అనౌన్స్‌ చేస్తోంటే, వెంటనే నేను మిగిలిపోయిన మా సగం డాన్స్‌ని పూర్తిచేస్తానని పట్టుపట్టి కార్యక్రమం పూర్తిచేశాను. ఆ సమయంలో గెల్చిన బహుమతి నేను కింద పడినందుకు దొరికింది మాత్రం ఖచ్చితంగా కాదు.
…అంటే కిందపడి తిరిగి లేచే పట్టుదల నా స్వభావంలో చిన్నతనం నుండీ ఉంది. ఐనప్పటికీ ఈ నా అంగవైకల్యం వలన నేను శారీరకంగానూ, మానసికంగానూ బాగా కృంగిపోయాను. నేను వికలాంగురాలనైన ఆరునెల్లకి నా తండ్రి చనిపోయారు. అసలే చీకటిమయంగా ఉన్న నా భవిష్యత్తు ఇప్పుడింకా అంధకారమైపోయింది. నిరాశనిస్పృహలతో మంచానికి అంకితమై ఉన్న నాకు చాలామంది ధైర్యం చెప్పేవారు. నాక్కోపమొచ్చేది. ”వీళ్ళసొమ్మేంపోయింది? కాలినమ్మకేగా మంట గురించి” తెల్సేది అని వూరుకొనేదాన్ని?. వీల్‌చెయిర్‌ ఇవ్వబోతుంటే నాకా సహాయం తీసుకోతగ్గదిగా అన్పించలేదు. అలాంటి పరిస్థితిల్లో ఒకనాడు ‘శ్రీబాబూకాకా దివాణ్‌’ అన్న గొప్ప వ్యక్తితో నాకు పరిచయం లభించింది. శారీరకంగా, నాలాగే నడుము కింది భాగంలో పక్షవాతగ్రస్తుడైన, మూర్తీభవించిన చైతన్యమూర్తి. ఆయన నిస్సంకోచంగా, తన స్వానుభవంతో తెలుసుకున్న శారీరకబాధల గురించి, వీటి ఉపశమనం గురించి నాకు మార్గదర్శనం చేయటమేగాక, ”ఇతరుల నుండి సహాయం తీసుకోవటంలో సంకోచించకూడదనీ, న్యూనతాభావం అసలు మనస్సులోకి రానీయకూడదనీ, అవసరమైనపుడు ఇతర వికలాంగులకు సహాయం చేసి ఆ ఋణం తీర్చేస్తే చాలు” అనీ చెప్పారు. ఇదే నాకు నా కార్యకలాపాల్లో ప్రేరణమంత్రంగా పనిచేసింది.
బాబూకాకా దివాణ్‌ గారి ప్రేరణతో మేము 1972లో వికలాంగుల ఆటల పోటీల్లో పాల్గొనటానికి బెంగుళూరు వచ్చి అక్కడ ”అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజికల్లీ హ్యాండీకాప్డ్‌’ పేరుగల సంస్థ రూపంలో ఆయన నాటిన కల్పవృక్షాన్ని చూసి ఎంతో ప్రభావితులమై మనసులో ఆయన్నే గురువుగా తలచి ఆయన అడుగుజాడల్లోనే ఈనాటికీ నడుస్తూ వచ్చాను. 1973లో ముంబాయి, తర్వాత ఇంగ్లాండులోని ఆటల పోటీల్లో పాల్గొనటానికి నేనా ప్రదేశాలకి వెళ్ళినపుడు ‘విజయ్‌ మర్చెంట్‌’ పేరు గల ఒక మహా మనీషితో నాకు కొద్దిపాటి పరిచయం ఏర్పడింది. ఇంగ్లాండులో ఆటలపోటీల్లో పాల్గొన్న ఆత్మవిశ్వాసంతో వెలుగుతున్న వికలాంగుల ముఖాలు చూసిన తర్వాత, మనదేశంలోని వికలాంగుల ముఖాల మీద తాండవించే నిరాశ నన్నింకా బాధపెట్టసాగింది.
సమాజసేవా కార్యాలు చేస్తూ అనేక రకాలైన మంచి చెడు అనుభవాలను కొంగునకట్టుకొని, నేను, నా స్నేహితురాలు రజనీకర్‌కరే ”వికలాంగ పునరావాస సంస్థ”ను వదలి వచ్చేశాము. కొంతకాలం వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని పనిచేశాము. 1983లో మేమిద్దరం ఇతర మహిళల సహాయంతో ”హెల్పర్స్‌ ఆఫ్‌ ది హ్యాండీకాప్డ్‌ కొల్హాపూర్‌” పేరిట సంస్థ నొకదాన్ని స్థాపించి, 1 కోటి 25 లక్షల రూపాయల సహాయం, వికలాంగుల పునరావాసం కొరకు అందజేశాము. సమాజంలో ఈనాటికీ అంగవైకల్యం అన్నది పూర్వజన్మ పాప ఫలితమనే నమ్మకం ఒకటుంది. ఓవైపు దయ, మరోవైపు ఉపేక్ష ఇలాంటి భిన్న ధృవాలలో నివసించే వికలాంగుల సంఖ్య ఎక్కువవుతూనే ఉంది. వికలాంగుల మనసుల్లో న్యూనతాభావాన్ని పారదోలాలంటే సహృదయుల ప్రేమ, స్నేహం చాలా అవసరం.  నా అన్న, తమ్ముడు, వదిన, మరదలు, మామ, పెద్దమ్మలు, పిన్నమ్మలు, తల్లి, తండ్రి వంటి ప్రియజనులు నా మీద కురిపించిన మమతానురాగాలు వర్ణించనలవికానివి. సంస్థ పనుల మీద నేను రాత్రింబవళ్ళు, ముఖ్యంగా ఇంటి బైట చాలాసార్లు గడపాల్సి వచ్చినా ఓర్పుతో అర్థం చేసుకొనే మా ‘ఆయి’. చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి సముద్రతరంగాల్ని చూపించి నన్నానందపరిచిన నా తమ్ముడు, మా సంస్థకు విచ్చేసిన విశేష అతిథులకు రుచికరమైన వంటలు చేసి తిన్పించి, సంస్థకవసరమైన వస్తువులు, ధనం ప్రోగుచేసే తమ్ముడి భార్య ఇర్షాద్‌, నేను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండి నన్ను లేవనెత్తటం నుండి, సంస్థ రిజిష్టర్లు, రికార్డులు మెయిన్‌టెయిన్‌ చేసే మా బావగారు, రెహనా భర్త ఏత్‌బార్‌ఖాన్‌, మామయ్య హారూన్‌ ఖాన్‌ వీరందరూ ఎల్లప్పుడూ నాకు సహాయసహకారాలందించారు.
ముంబాయిలోని రిటైర్డ్‌ న్యాయమూర్తి సుభాష్‌ చంద్రదేశాయ్‌, పూణేకు చెందిన ప్రసిద్ధ సమాజ సేవకురాలు అనుతాయి భాగవత్‌, సంస్థ యొక్క మిత్రుడు మార్గదర్శకుడుగా ఉన్న ‘సకాళ్‌’ దినపత్రిక సంపాదకుడైన ‘అనంత్‌ దీక్షిత్‌’. మా సంస్థతో ముడిపడి ఉన్నారని చెప్పటానికి మాకెంతో గర్వంగా ఉంది. వైద్యపరంగా పునరావాస కార్యాల్లో అమూల్యమైన సహకారాన్నందించే శ్రీ పి.జి. కులకర్ణి, డాక్టర్‌ సావనిచౌగులే, డాక్టర్‌ షరద్‌శిండే ఇంకా ఎందరో డాక్టర్లు, భవన నిర్మాణంలో అందమూ, ఉపయోగమూ రెండింటినీ కలుపుతూ, వాస్తు రచన చేయించే శ్రీ ప్రమోద్‌బెరీ, ఆడిటర్‌కు సహాయపడే చార్టర్డ్‌ అకౌంటెంట్‌ శ్రీ శరద్‌ సామంత్‌, న్యాయ నిబంధనల గూర్చి సలహాల నిచ్చే అడ్వకేట్‌ శ్రీ మాధవరావ్‌ నానీవడేకర్‌. అడ్వొకేట్‌ శ్రీ స్వానంద్‌కుల్‌కర్ణి వగైరాలు వృత్తిలో తాము సాధించిన కౌశాల్యాన్నంతా సంస్థ కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు కనుకనే సంస్థ ఈనాడు ప్రగతిపథంలో నడుస్తోంది ఐనా ఇంకా ఎంతో మంది గురించి ఇక్కడ స్థలాభావం వల్లనో పొరపాటుగానో రాసి ఉండకపోతే అది మా తప్పిదంగా భావించమని నా మనవి.
గతించిన ఎన్నో సంవత్సరాలుగా నాకు లభించిన పురస్కారాలతో పాటు నాకందిన ధనమంతా సంస్థ కొరకే వినియోగించబడింది. ఇది సంతోషకరమైన విషయం. కాని అందరూ కలిసి పనిచేస్తున్నపుడు పురస్కారం మాత్రం నేనొక్కదాన్నే అందుకోవటం కొంచెం సంకోచాన్ని, అపరాధ భావాన్ని కల్గిస్తోంది. కనుక పురస్కారాలు వ్యక్తులకు గాక సంస్థలకు ఇవ్వాలని నా అభిప్రాయం. అలాంటి శుభఘడియ కొరకు నేను ప్రతీక్షిస్తున్నాను.
జీవితంలో, ఎన్నో చేదు సంఘటనలు, ఆశాభంగాలు నాకు ఎదురైనా నేను కలలు కనటం మాత్రం మానలేదు. కలలు కనని వ్యక్తి మృతప్రాయుని కిందే లెక్కని నా కన్పిస్తుంది. ”జాగ్రదావస్థలో ఉండి కలలు కను, ఆ స్వప్నాలను సాకారం చేసుకోవాలంటే నీ వంటి మీద స్పృహ లేనంతగా పని చేయి” అని బాబా ఆమ్టే అన్నారు. ఇదే నా ఆదర్శం.
మందబుద్ధులకు, పూర్తిగా వికలాంగులైన వారి కొరకై, హెల్పర్స్‌ తరఫున మేము ఒక నివాస స్థానాన్ని ఒకే కేంద్రాన్ని ‘దరియానీ ట్రస్ట్‌’ వారి సౌజన్యంతో లోణావాలా వద్ద నున్న ‘కాన్వే’లో సాయిబాబా సేవాశ్రమ్‌లో ప్రారంభించబోతున్నాము. ఈ కల నిజం కావాల్సిన ఈ సమయంలో నేను నా మనోగతం రాస్తున్నాను.  ఇలాంటి ఎన్నో స్వప్నాలు క్షితిజానికావాలి వైపు ఉన్నాయి. నేను నా చక్రాల కుర్చీ సహాయంతో వాటి వెనుక పరిగెడుతూనే ఉంటాను.( హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ, 2006, అనువాదకురాలు డా|| రాధామూర్తి గారికి కృతజ్ఞతలతో)

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.