అనుసృజన : సత్యవతి కొండవీటి
(రచయిత్రి ఎవ్వరో తెలియదు)
నేను వండిన కూర అతనికి నచ్చలేదు
నేను చేసిన కేకూ నచ్చలేదు
అతనన్నాడు
నేను చేసిన బిస్కట్లు గట్టిగా వున్నాయని
వాళ్ల అమ్మ చేసినట్టు లేవట
నేను కాఫీ కూడా సరిగ్గా చెయ్యలేదట
ప్రేమగా చేసిన స్వీటూ నచ్చలేదు
అతని తల్లి మడత పెట్టినట్టుగా
అతని బట్టలు నేను మడత పెట్టలేదట
నేను వీటన్నింటికి సమాధానం ఏంటి అని వెతుకుతుంటే
ఒక క్లూ కోసం మధనపడుతుంటే
అతని తల్లి చేసినట్టే నేను ఏమైనా చెయ్యగలనా
అని ఆలోచిస్తుంటే
నా పెదవుల మీద చిరుదరహాసం మొలకెత్తింది
ఓ వెలుగు కిరణం నా కళ్ళ ముందు కదలాడింది
ఓ పని ఖచ్చితంగా
వాళ్ళ అమ్మ చేసినట్టు
చెయ్యగలననిపించి
చాచి ఓ లెంపకాయ అతని చెంప మీద వేసాను
వాళ్ళ అమ్మ ఎప్పుడూ చేసేలా
మంచి పని చెసారు. హా హా హా ! !!
వ.వ…వ చాలా బావుంది.
ఇక ఇదే అందరం పాటించవచ్చు.
థాంక్యూ సత్యా.
చాచా బాగుంది. ప్రతినిత్యమూ ఎదుర్కొనె సమస్యను చెప్పిన విధానము
దభినందనలు
Excellent ..! 🙂
చాలా బాగుంది.
భలె చెప్పారు.
భలె బాగుంది
ఒక చె0ప అదరహొ..కానీ అమ్మవెంటనె చేరదీసి తల నిమురుతు0ది.
చాల చాలా బాగుంది.
త ల మీ ధ మొ త్థాను అని అంతె బాగా ఉం దు
కొట్టడం న్యాయం కాదు కదా?
అలాగే అది సమస్యకు పరిష్కారం కూడా కాదు.
నేనూ మా ఆవిడ కలిసి చదువుకుని హాయిగా నవ్వుకున్నామీ కవిత చదివి.
డా. దార్ల వెంకటేశ్వరరావు
కెవ్వు