దేశవ్యాప్తంగా ప్రజలు తమ భూమి. నీరు అడవి సమతుల్యమైన పర్యావరణం మొత్తంగా జీవించే హక్కు కోసం చేస్తున్న పోరాటంపై ప్రభుత్వం పాశవికంగా విరుచుకుపడుతోంది, భారత దేశంలో అభివృద్ధి క్రమాన్ని, విధానాలను రూపొందిస్తున్న పాలకులు వీటి వలన జరుగుతున్న పర్యావరణ నష్టాలు, ప్రజల జీవితాలలో తెస్తున్న సంక్షోభం గురించి పట్టించుకోవడం లేదు. సెజ్‌లు. థర్మల్ విద్యుత్ ప్లాంట్లు కోస్టల్ కారిడార్ల ఏర్పాటు కోసం కొత్త చట్టాలను రూపొందించి బహుళ జాతి కంపెనీలకు గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థకు తలుపులు బార్లా తీస్తున్నారు. విదేశిమారకద్రవ్యం, ఉపాధి కల్పనకు అభివృద్ధి క్రమం అనివార్యమంటున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని సోంపేటలో ఇద్దరి రైతుల ప్రాణాలను ఈ అభివృద్ధి క్రమం బలిగొన్నది. ఇంతే కాకుండా పోలేపల్లి, గంగవరం, కృష్ణపట్నం, సత్యవీడు, కాకినాడ సెజ్ ప్రాంతాలలో ఈ దమన కాండ కొనసాగుతునే ఉన్నది. ధర్మల్, అణువిద్యుత్ కేంద్రాలను పెద్ద ఎత్తున కోస్తాతీర ప్రాంతంలో నెలకొల్పడం ద్వారా ఏర్పడే కాలుష్యం వలన నీరు, పర్యావరణం కలుషితం చేస్తున్నది. ఎందరో మత్స్యకారుల జీవితాలను మట్టుబెడుతున్నది. కాని ప్రభుత్వం వీటి గురించి చర్చిండానికి నిరాకరిస్తున్నది. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో కొద్దిమందితో సమావేశాలు నిర్వహించి రెవిన్యూ, పోలీసు శాఖలసహాయంతో నిర్భందంగా భూసేకరణ, నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నది. అటవీ, మత్స్య, పర్యావరణ శాఖలు తప్పుడు నివేదికలతోబహుళ జాతి కంపెనీలకు సహకరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. సోంపేట ధర్మల్ విద్యుత్ ఫ్లాంట్ విషయంలో కేంద్ర పర్యావరణ అప్పిలేట్ కమీషన్ వారి మద్యంతర తీర్పే దీనికి తార్కాణం.
సోంపేటలో ధర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణం పట్ల ప్రజలలో వచ్చిన వ్యతిరేకతతో తాత్కాలికంగా వెనక్కు తగ్గినా మంత్రులు, ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ధర్మల్ కేంద్ర నిర్మాణానికి అనుకూలంగా చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ప్రజల హక్కుల రక్షణకై పెద్ద ఎత్తున కృషిచేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఇప్పటికే ప్రజల హక్కుల రక్షణకై పెద్దఎత్తున కృషి చేయవలసిన అవసరం ఎంతయినా ఉంది. ఇప్పటికే ప్రజలు స్థానిక నాయకత్వంలో తమ పోరాటాన్ని ముందుకు తీసికొని వెళుతున్నారు. మరికొన్ని ప్రజాసంఘాలు ఈ పోరాటాలకు మద్దతు తెల్పుతున్నాయి.
అయితే మేధావులు, ఉద్యమ సానుభూతిపరులు, న్యాయవాదులు ఒక ప్రజాస్వామిక శక్తిగా మారి ఉద్యమాలకు సంఘీభావం తెల్పవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. విడివిడిగా జరుగుతున్న ప్రజాఉద్య మాలను సమన్వయపరుస్తు ఉద్యమ శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా పోరాటాలకు మద్దతుగా స్పందించిన కొందరు మేధావులు, సానుభూతి పరులు, ఉద్యమ కార్యకర్తలు, న్యాయవాదులు రాష్ట్ర స్థాయిలో ఒక ఇక్య కార్యావచరణ సంఘీభావ కమిటీగా ఏర్పడాలని అభిప్రాయపడి తేదీ 7-9-2010 నాడు హైదరాబాద్ నిజాం కాలేజీలో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సెజ్ వ్యతిరేక ఉద్యమకారులు మత్స్యకార సంఘాలనాయకులు, మేధావులు, న్యాయవాదులు, జర్నలిస్టులు హాజరై ఈ కమిటీ ఏర్పాటును ఆహ్వానించారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితిని చర్చించడంతో పాటు సంఘం యొక్క కార్యక్రమాల రూపకల్పనకు సలహాలివ్వడం జరిగింది. వాటి ఆధారం గానే ఈ కింది లక్ష్యప్రకటన రూపొందించడం జరిగింది. అభివృద్ధి కొరకు కేటాయిస్తున్న నిధులు ఎక్కడినుండి వస్తున్నాయి? వీటిని ప్రాధాన్యతా పరంగాదేనికి ఖర్చు చేయాల్సి ఉంటుంది? ప్రజల ప్రాధాన్యతలు ఏమిటి? అనేది ఎజెండాలోకి తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలలో శానిటేషన్, ప్రాథమిక ఆరోగ్యం, ప్రాథమిక విద్యకు నిధులివ్వకుండా డెంగ్యూ, మలేరియా రోగాలతో ప్రజలు చనిపోతూ ఉంటే విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం అవసరమా?
కొన్ని వేల కోట్లతో నిర్మిస్తున్న (17000 కోట్లు రూపాయలు అప్పుచేసి) కామన్వెల్తు క్రీడలు, ఫ్లై ఓవర్లు ఎందుకు నిర్మించాలి? అమెరికా, యూరప్‌లో నిషేధించిన రసాయనిక, ధర్మల్ అణు విద్యుత్ కేంద్రాలు మనదేశంలో ఎందుకు నిర్మిస్తున్నారు? అమెరికాలో ఉండే పర్యావరణ చట్టాలు మనం ఎందుకు రూపొందించ లేక పోతున్నాం? భోపాల్ విషాదం తరువాత కూడా పర్యావరణ ప్రమాదాల గూర్చి మనం ఎందుకు శ్రద్ధ వహించడం లేదు?
అప్పులు ఇచ్చే వారు తమకు లాభసాటిగా ఉండే వాటిని మనకు ఇస్తారు. ప్రజల ప్రయోజనాలకు బాధ్యత వహించరు. ప్రయివేటీకరణ పేరుతో ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించే చర్యలు చేపడితే ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజలు తిరస్కరిస్తే విధానాలు మార్చుకోవాలి. నిర్భందంగా దౌర్జన్యంగా విధానాల అమలును ఆమోదించకూడదు.
సోంపేటలో ఇదే విషయాన్ని మేధావులు ప్రశ్నించారు. ప్రభుత్వము పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా ప్రజలలోకి వెళ్ళి రాబోయే ప్రమాదాలను వివరించారు. ప్రమాదాన్ని అర్థం చేసికొన్న ప్రజలు సామూహికంగా ఎదురు నిలిచారు. పాలకులు వెనక్కు తగ్గాల్సివచ్చింది.సోంపేట అనంతరం జరుగుతున్న పరిణామాలు, పాలకులు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు అర్థం చేసికొంటున్నారు.
ఈ నేపథ్యంలో మేధావులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభివృద్ధి క్రమం సరయినదా? తక్షణం చేపట్టవలసిన ప్రాధాన్యతలు ఏమిటి? ప్రజల ఆరోగ్యం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? పాలకులు అప్పుల రూపేణా తెస్తున్న నిధులు దేనికి వెచ్చించాలి? ప్రజలందరూ రుణభారం మోసేటప్పుడు ప్రజల ప్రాధాన్యతలు కాకుండా కొద్దిమంది ప్రయోజనాలకు ఎందుకు వెచ్చిస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలకు విలువ లేకపోతే అది ఫాసిజం అవుతుంది. ఈ రకమైన విధానాల వలన పౌరుల హక్కులు హరించవేయబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌర, ప్రజాస్వామ్య శక్తులు ఈ క్రింద లక్ష్యాలకై సంఘీభావ కమిటీ పనిచేస్తుంది.
లక్ష్యప్రకటన :
ఖీ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు విధానాలకు, బహుళ జాతి కంపెనీలకు కొమ్ము కాస్తున్న పార్లమెంటరీ రాజకీయ పార్టీలు ప్రజల వనరులను అక్రమంగా దోచిపెడుతున్న తరుణంలో వాటిని వ్యతిరేకిస్తున్న ప్రజా పోరాటాలకు మద్దతుగా సానుభూతిపరులను, సామాజిక కార్యకర్తలను, మేధావులను, న్యాయవాదులను వివిధ వర్గాలవరిని ఇక్యపరచడ. ఈ ఐక్య సంఘటన ద్వారా ఉద్యమ శక్తిని పెంచడం. వివిధ ప్రాంతాలలో జరుగుతున్న పోరాటాలను వెలుగులోనికి తీసుకొని వచ్చి వాటి సమన్వయానికి కృషి చేయడం. తద్వారా ఒక ప్రజాస్వామిక వేదికగా ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి నమూనాకు కృషి చేస్తుంది.
ఖీ అభివృద్ధి పేరుతో జరిగే ప్రతి పనిని (ధర్మల్ అణు) ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రజాభిప్రాయాన్ని గ్రామగ్రామాన బహిరంగంగా నిర్వహించాలి. ప్రజలు కోరుకొన్న ప్రాధాన్యతల కనుగుణంగా శానిటేషన్, విద్య, ఆరోగ్యం సహకార రంగంలో చిన్న పరిశ్రమలు చేపట్టాలి.
ఖీ నిర్భంద భూసేకరణను, పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది.
ఖీ అభివృద్ధి చెందిన దేశాలలో లాగా పటిష్టమైన పర్యావరణ పరిరక్షణ చట్టాలు రూపొందేందుకు కృషిచేయడం, అవిప్రజ్ఞలలో విస్తృతంగా ప్రచారం చేయడం.
ఖీ నిజ నిర్ధారణ కమిటీలు, సదస్సులు, సెమినార్లు, చిత్ర కళా ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా ప్రజలలో చైతన్యం కలగ చేయడం
ఖీ ప్రజల పౌర ప్రజాస్వామిక హక్కుల రక్షణకై న్యాయవాదులతో కమిటీ ఏర్పరచి న్యాయపరమైన సహాయం అందించటం.
ఆశయాలు :
1. సమస్యల పైన ప్రజలను చైతన్యం చేయడంలో వారి స్థానిక నాయకత్వాలకు మద్దతు తెల్పడం.
2. అవసరమైనప్పుడు నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి సంబంధిత ప్రాజెక్టులను సందర్శించి వారి ఉద్యమాలకు బాసటగా ఉంటూ ప్రజల మద్దతు కూడగట్టడం.
3. ఇతర ప్రజా సంఘాల కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం.
4. న్యాయవాదుల కమిటీ ఏర్పాటు చేసి ఆయా ప్రజా ఉద్యమాలకు న్యాయ సహాయాన్ని అందించటం
5. వివిధ వ్యవస్థల మధ్య సమాచార మార్పిడికి కృషి చేయడం, ఉదా : ప్రింటు, మీడియా.
6. సామాన్య ప్రజల అవగాహన కొరకు చట్టాలను స్థానిక భాషలోకి తర్జుమా చేయడం.
7. ప్రజల నిర్ణయాల మేరకు చట్టాల రూపకల్పనకుక్ సువరణలకు కృషి చేయడం.
8. సమస్య పరిష్కారానికి ప్రజల పక్షాన ప్రభుత్వం అవసరమైన మేరకు చర్చలు జరపడం.
9. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రకృతి వినాశానాన్ని డాక్యుమెంట్ చేయడం. సంస్కృతి సామాజిక విలువలు కాపాడే కళారూపాలు తయారు చేయడం.
కార్యక్రమాలు
ఖీ బాధిత ప్రాంతాలు సందర్శించడం
ఖీ బహిరంగ సభలు, సెమినార్లు నిర్వహించడం
ఖీ వివిధ ప్రాంతాలలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ చేయడం.
ఖీ బాధితులకు అవసరమైన న్యాయ సహాయం అందించడం
ఖీ పర్యావరణ పరిరక్షణ ఉపాధి కల్పన తదితర విషయాలకు సంబంధించిన వివిధ కళారూపాలు తయారు చేయడం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags