యం.సునీల్ కుమార్
మహిళలపై హింస తగ్గాలన్నా, పిల్లలకు ఆరోగ్య ప్రమాణాలు పెరగాలన్నా మొత్తంగా కుటుంబ హోదా, వ్యవసాయోత్పత్తి పెరగాలన్నా మహిళలకు సాగుభూమిపై హక్కుండాల్సిందే అని ఎన్నో అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. భూమిని కేవలం జీవనాధారంగానో లేదా ఆర్ధిక స్వావలంబనగానో మాత్రమే చూడలేం. ఒక ఆత్మవిశ్వాసం, సామాజిక గౌరవం అనేవి భూమి హక్కుద్వారా ఏర్పడతాయనేది వాస్తవం. అయితే వ్యవసాయ రంగంలో పేద స్త్రీల పాత్ర వ్యవసాయదారునిగా గుర్తింపు కన్నా వ్యవసాయకూలీగానో ఏమాత్రం ప్రాధాన్యత లేనిదిగా ఉంటోంది. అందుకే సమాజం రైతుకు ప్రతిరూపంగా స్త్రీని చూపదు. అసలు భూమి లేకపోవడం అనేది పేదరికం ముఖ్య కారణంగా మనకు కొన్ని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. గ్రామీణ భారతదేశంలో షుమారు 15 మిలియన్ పేద కుటుంబాలు భూమి లేని కుటుంబాలుగా చెప్పచ్చు. పైన తెల్పినట్లుగా వ్యవసాయోత్పత్తిలో ప్రముఖ పాత్ర వహిస్తున్న మహిళలకు ఏమాత్రం భూమి హక్కు లేదు. ఎప్పుడైతే మహిళలు, బాలికలు భూమి హక్కులు కల్గివుంటారో వారి కుటుంబాలలో ఆరోగ్యం, చదువు మరియు సంపాదనా సామర్ధ్యం మెరుగ్గా కల్గి వుంటారు.
మొత్తంగా వ్యవసాయ పనుల్లో ఒక కుటుంబం 53% పనిగంటలు వెచ్చిస్తుంటే అందులో మగవారితో పోలిస్తే 31% పనిగంటలు స్త్రీలు వెచ్చిస్తున్నారు. స్త్రీలు మగవారికంటే 1000 కేలరీలు భోజనం తక్కువగా తింటున్నారు. మహిళల జీవనోపాధి ఎక్కువగా వ్యవసాయం, వ్యవసాయనుబంధ సంబంధమైన అసంఘటిత రంగాలపైన ఆధారపడి ఉంది. కాబట్టి మహిళలకు భూమిపై హక్కు కల్పించాలనే ఉద్దేశ్యంతో మహిళలకు సాగు భూమి పంపకం జరుగుతోంది. మహిళలకు భూమిపై హక్కులు పొందే అతిపెద్ద అవకాశం ప్రభుత్వ భూముల ద్వారానే. ప్రభుత్వం నుండి గ్రామీణ నిరుపేదలకు భూమి పంపకం కార్యక్రమం కింద మగవారిపేరు మీద భూములు పంచినప్పుడు అవి అన్యాక్రాంతం అవుతున్న దాఖాలాలు ఎక్కువగా ఉన్న సందర్భంలో కుటుంబానికి భద్రతను అందించే ఉద్దేశ్యం. మహిళల పేరుతో మీదనే భూములు పంచాలనే ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. స్త్రీల ఆర్ధిక రాజకీయ సాధికారత వ్యవసాయ భూముల మీద హక్కు కల్పించడమనేది అత్యంత ముఖ్య విషయంగా నేషనల్ ప్రాస్పక్టివ్ ప్లాన్ ఫర్ విమెన్ (1988-2000) నివేదిక చెబుతుకుంది. అదే విధంగా 6 వ పంచవర్ష ప్రణాళిక (1980-85) పేద స్త్రీల ఆర్ధిక సామాజిక స్థితి, హోదా మెరుగుపడటం కోసం అభివృద్ధి పథకాలన్నింటిలోను భూమి, ఇల్లు వంటి స్థిరాస్తి వనరులను భార్య భర్తలిద్దరికి కలిపి ఉమ్మడిగా పట్టా ఇవ్వాలని సూచించింది.
మహిళలకు భూమి పొందే అతి పెద్ద అవకాశం ప్రభుత్వ భూమి కేటాయింపు ద్వారానే. స్వాతంత్య్రం వచ్చినప్పుడు నుండి నేటివరకు షుమారు 50 లక్షల ఎకరాల భూమి నిరుపేద కుటుంబాలకు పంచబడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో గత 25 సం. రాలుగా పేదలకు పంచిన ప్రభుత్వ భూమిలన్ని మహిళల పేరునే ఇచ్చి ఉండాలి.
కాని కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం ఇలా పంచబడిన భూముల్లో చాలావరకు ప్రస్తుతం పేదల చేతులలో లేవు. అంతేగాక పట్టాలిచ్చి భూములను చూపకపోవడం, భూమిని ఒకరి కంటే ఎక్కువ కేటాయించినప్పుడు పంచిన భూమి వ్యవసాయయోగ్యంగా లేకపోవడం వంటివి.
అసైన్మెంట్ పట్టా ఎవరికి జారీ చేస్తారు.
తి అసలు భూమి లేని నిరుపేదలకు గాని, రెండున్నర ఎకరాల మగాణి లేదా 5 ఎకరాల మెట్ట్ట భూమి, మించకుండా ఉన్నవారై ఉండాలి.
తి పట్టా లేకుండా ప్రభుత్వ భూమిని సాగుచేస్తున్న శివాయి జమాయిదారు పేదవారు అయివుండి ప్రత్యుక్షంగా ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్న భూమి అభ్యంతరం కాని, ఆక్రమణ అయి వుండి, శాశ్వత జీవనోపాధి కోసం భూమిని అభివృద్ధి చేసుకున్న, భూమిలేని పేదవారికి మాత్రమే నిబంధనలను అనుసరించి మంజూరు చేయాలి.
అసైన్మెంట్ పట్టా మంజూరు చేసే క్రమం
1. ప్రస్తుతం అమలులో వున్న నిబంధనల ప్రకారం మంజూరు చేసేందుకు అందుబాటులో వున్న ప్రభుత్వ భూములను దరఖాస్తు చేసుకున్న 3 నెలలలోగా అసైన్చేయాలి. దరఖాస్తు చేసిన భూమి ఇవ్వటానికి అందుబాటులో వుందా? దరఖాస్తుదారుడు అర్హుడేనా అనే అంశాలపై ముందుగా ప్రాధమిక విచారణ జరపాలి. ఎ-1 నోటీస్ను ఆ గ్రామంలో ప్రకటించాలి. ఆ తరువాత మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎ – మొమోరెండమ్ తయారుచేసి ఎ-1 నోటీసు, స్కెచ్లను పై అధికారికి పంపించాలి. దానితో పాటు గ్రామ పంచాయితీ తీర్మానం తీసుకొని దానిని ఎ- మొమోరెండమ్కు జతపరచాలి. ఒకవేళ ఆ భూమి పోరంబోకు భూమి అయితే వర్గీకరణ మార్పుకొరకు ప్రతిపాదనలను సంబంధిత ఆర్.డి.ఓలకు పంపాలి. ఒకవేళ ఆ భూమిలో చెట్లు, కట్టడాలు వుంటే వాటి విలువలను దరఖాస్తుదారు నుండి రాబట్టడం కోసం ఫారం-సి నోటీసును వారికి పంపాలి. డి.ఎన్. ఓ-17, ప్రభుత్వ ఉత్తర్వుల, షరతులకు లోబడి భూమి మంజూరు అవుతుంది. ఈ భూమిని వంశపారంపర్యంగా అనుభవాలించాలి. కాని అన్యాక్రాంతం చేయరాదు. ఒకవేళ షరతులు ఉల్లంఘిస్తే పట్టా రద్దు చేయవచ్చు.
అసైన్మెంట్ భూమి అన్యాక్రాంతం అయితే
ప్రభుత్వ పేదలకు అసైన్మెంట్ చేసిన భూములు అన్యాక్రాంతం చేయరాదు. ఒకవేళ అన్యాక్రాతం అయితే తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవాలి. తహసీర్దారు విచారణ జరిపి అన్యాక్రాతం అయిన ప్రభుత్వ భూమిల అసైన్మెంట్ పొందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూమిని బదలాయింపు నిరోధక చట్టం 1977 ప్రకారం తిరిగి అప్పగించాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఇతర పేదలకు మంజూరు చేసేందుకు ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి.
భూములకు సంబంధించి ఏ విధమైన సమస్యలు వున్నా కూడా వారి సమస్యలకు సంబంధించి ఇందిరా క్రాంతి పధంలోని భూవిభాగపు సిబ్బందిని సంప్రదిస్తే సమస్య పరిష్కారానికి తగు న్యాయ సహాయాన్ని అందిస్తారు. దీనికిగాను గ్రామస్థాయిలో పారాలీగల్, సర్వేయర్ మండలస్థాయిలోని మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పనిచేస్తారు. వీరికి మరింత సాంకేతిక సహకారాన్ని, న్యాయ సలహా సూచనలను అందించటానికి జిల్లా స్థాయిలో న్యాయవాదిని కూడా నియమించారు. వారు గ్రామ స్థాయిలో గుర్తించబడిన భూమి సమస్యల పరిష్కారానికై పని చేస్తారు.
కనుక మనకు ఎదురయ్యే భూమి సమస్యలను వీరి దృష్టికి తీసుకెళ్ళటంద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు. దీనిని వినియోగించు కొని భూమిపై పూర్తి స్థాయి హక్కులు పొందుదాం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags