మార్చి 19వ తేదీన స్వార్డ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ ఆఫీసులో ”బాధిత స్త్రీల కోసం వున్న సఫోర్ట్ సిస్టమ్స్” అనే అంశం మీద ఒక సమావేశం జరిగింది. స్త్రీల అంశాల మీద, పిల్లల అంశాలమీద పనిచేస్తున్న వివిధ సంస్థల బాధ్యులు, న్యాయవాదులు, సైకియాట్రిస్ట్‌లు హాజరయ్యారు. ఆ సమావేశంలోనే ”ఎ.పి. కమిటీ టు సపోర్ట్ వుమన్ సర్వైవర్స్” కొండవీటి సత్యవతి కన్వీనర్‌గా ఏర్పాటైంది. బాధిత స్త్రీలకు అన్ని రకాల సహాయాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కమిటీ ఏర్పాటైంది.మార్చి 19వ తేదీన స్వార్డ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ ఆఫీసులో ”బాధిత స్త్రీల కోసం వున్న సఫోర్ట్ సిస్టమ్స్” అనే అంశం మీద ఒక సమావేశం జరిగింది. స్త్రీల అంశాల మీద, పిల్లల అంశాలమీద పనిచేస్తున్న వివిధ సంస్థల బాధ్యులు, న్యాయవాదులు, సైకియాట్రిస్ట్‌లు హాజరయ్యారు. ఆ సమావేశంలోనే ”ఎ.పి. కమిటీ టు సపోర్ట్ వుమన్ సర్వైవర్స్” కొండవీటి సత్యవతి కన్వీనర్‌గా ఏర్పాటైంది. బాధిత స్త్రీలకు అన్ని రకాల సహాయాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కమిటీ ఏర్పాటైంది.
ఏప్రిల్ 30వ తేదీన ఈ కమిటీ రెండో సమావేశం భూమిక ఆఫీసులో జరిగింది. కమిటీ ముఖ్య లక్ష్యాలు, ఉద్దేశ్యాలు రూపొందించాలని అలాగే కమిటీకి ఒక పేరును సూచించాలని నిర్ణయించారు. మహిళా సమల్ సొసైటి స్టేట్ ప్రోగ్రామ్ డైరక్టర్ ప్రశాంతి, సత్యవతి కలిసి ‘భరోసా’ పేరును మీతో మేము … మీ కోసం మేము.. ట్యాగ్‌లైన్‌ను ఎంపిక చేసి సభ్యులందరికీ తెలియచేయడం జరిగింది. ఈ పేరును అందరూ ఆమోదించారు.
”భరోసా” బాధిత స్త్రీల పక్షాన నిలవాలని, ఎన్నో కొత్త కార్యక్రమాలని చేపట్టాలనే ఆకాంక్షతో పనిచేయడం మొదలుపెట్టింది.
– కొండవీటి సత్యవతి, కన్వీనర్,
”భరోసా” కమిటి టు సపోర్ట్ వుమన్ సర్వైవర్స్.