” …. ‘ ‘

జూలై 16న యాసిడ్‌ అమ్మకాలకు సంబంధించి సుప్రీమ్‌ కోర్టు వెలువరించిన తీర్పు చదివాక నా మనసులో ఒక దుఃఖ కెరటం ఎగిసిపడి, కళ్ళల్లోకి ప్రవహించింది. స్వప్నిక, ప్రణీత, అనురాధ, పేర్లు తెలియని ఇంకెందరో యాసిడ్‌ బాధిత స్త్రీలు గుర్తొచ్చారు. మన మధ్య లేకుండాపోయిన స్వప్నిక, మన మధ్య వుంటూనే యాసిడ్‌ గాయాలను మోసుకుంటూ తిరుగుతున్న ప్రణీత లాంటి వాళ్ళు నీళ్ళు నిండిన కళ్ళకి అస్పష్టంగా కనబడుతున్నారు. ఉదాత్తమైన, కడురమణీయమైన ‘ప్రేమ’ భావన ఇంతటి వికృత రూపాన్ని తీసుకోవడం భరింపశక్యం కాకుండా వుంది. యాసిడ్‌ లాంటి ప్రమాదకర రసాయనంతో దాడిచేసే కొంతమంది పురుషుల కౄరత్వం – అదీ తాము ప్రేమించామని చెప్పుకునే వారిపట్ల, ఎంత అమానుషమైందో వేరే చెప్పనవసరం లేదు.

స్పప్నిక, ప్రణీతల మీద యాసిడ్‌ దాడి జరిగిన వెంటనే నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసి చంపేసినప్పటికీ మన రాష్ట్రంలో వరుసగా యాసిడ్‌ దాడులు జరిగాయి. ఈ దాడులకు వ్యతిరేకంగా 2009లో భూమిక రాష్ట్రస్థాయిలో ఒక సమావేశం నిర్వహించి, అప్పటి హోమ్‌ మినిష్టర్‌ సబితా ఇంద్రారెడ్డిని ఆహ్వానించడం జరిగింది. యాసిడ్‌ లభ్యతల మీద ఆంక్షలు విధించాలని, బాధితులకు తగురీతిన నష్టపరిహారం చెల్లించాలని, నేరాన్ని నాన్‌బెయిలబుల్‌గా పరిగణించాలని, బాధితులకయ్యే వైద్య ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆనాటి సదస్సులో తీర్మానించడం జరిగింది. అప్పటి ఐ.జి. సి.ఐడి ఉమాపతి గారి చొరవతో క్రిమినల్‌ ప్రోసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 357కి సవరణ సూచించడం, ఒక డ్రాప్ట్‌ బిల్లును కేంద్రానికి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయంపై ఎలాంటి చర్య జరగలేదు. కనీసం మిగతా రాష్ట్రాలు చేసినట్టుగా యాసిడ్‌ అమ్మకాలకు సంబంధించి నియమనిబంధనలను కూడా మన రాష్ట్రం చెయ్యలేదు. ఎన్నోసార్లు ఈ అంశం మీద హోమ్‌ మినిస్టర్‌కి వినతి పత్రాలివ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు యాసిడ్‌ అమ్మకాలు, కొనుగొళ్ళు మీద ఎలాంటి నియమనిబంధనలు రూపొందించకపోవడం చూస్తే ఇంతటి సీరియస్‌ అంశంమీద ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో వుందో అర్థమవుతుంది.

ఈ నేపథ్యంలోంచి చూసినపుడు ఇటీవల సుప్రీమ్‌ కోర్టు వెలువరించిన తీర్పు ఎంతో ఊరటను కలిగించింది. యాసిడ్‌ దాడికి గురై ఎన్నో సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తున్న లక్ష్మి అనే మహిళ 2006లో సుప్రీమ్‌ కోర్టులో వేసిన పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్‌ కేసులో ఈ తీర్పు వెలువడింది. యాసిడ్‌ అమ్మకాల గురించి, బాధితులకు నష్టపరిహారం చెల్లించే అంశం గురించి సుప్రీమ్‌ కోర్టు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. యాసిడ్‌ దాడిని బెయిలు లభించని నేరంగా పరిగణించేలా విషప్రయోగ నిరోధక చట్టం 1919కి మార్పులు చేయాలని సూచించింది. యాసిడ్‌ అమ్మకాల మీద స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

ఎవరంటే వాళ్ళు షాప్‌ల్లోంచి యాసిడ్‌ను కొనుగోలు చేసే వీలులేదు. షాపు యజమానులు యాసిడ్‌ అమ్మకాల రిజిస్టర్‌ నిర్వహించాలి. అందులో కొనుగోలుదారు వివరాలు, అడ్రస్‌, ఫోన్‌ నెంబరు, యాసిడ్‌ కొన్న కారణాలు స్పష్టంగా నమోదు చెయ్యాలి. అలాగే కొన్న వ్యక్తులు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డును షాపు యాజమానికి చూపించాలి. యాసిడ్‌ దేనికి వినియోగిస్తున్నరో స్పష్టంగా పేర్కొనాలి. తన వద్ద వున్న యాసిడ్‌ నిల్వల వివరాలు సబ్‌డివిజనల్‌ మేజిస్ట్రేటు ముందు డిక్లేర్‌ చేయ్యాలి. 18 సంవత్సరాలలోపు వయసున్న వారికి యాసిడ్‌ అమ్మకూడదు. దుకాణదారు తన నిల్వల వివరాలు సక్రమంగా నిర్వహించకపోతే 50,000/- జరిమానా విధించవచ్చు. విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర విభాగాలు తాము యాసిడ్‌ను నిల్వచేస్తే, ఆ వివరాలను ఒక రిజిస్టర్‌లో నమోదుచేసి సబ్‌డివిజనల్‌ మెజిస్ట్రేట్‌కి తెలపాలి. ఇలా యాసిడ్‌ అమ్మకాలు, నిల్వల గురించి సుప్రీమ్‌ కోర్టు స్పష్టమైన నియమనిబంధనలు రూపొందించింది.

ఈ తీర్పులో మరో ముఖ్యమైన కోణం బాధితులకు నష్టపరిహరం చెల్లించే అంశం. నష్టపరిహారం చెల్లింపుల విషయంలో వివిధ రాష్ట్రాలు వివిధ పద్ధతులను పాటిస్తున్నాయి. అంతేకాకుండా చాలా తక్కువ కూడా చెల్లిస్తున్నాయి. ఈ అంశాన్ని పేర్కొంటూ సుప్రీమ్‌ కోర్టు ‘బాధితురాలు వరుసగా, ఖర్చుతో కూడిన ఎన్నో ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకోవాల్సి వుంటుంది. వైద్య ఖర్చులు భరించుకోవాల్సి వుంటుంది. ఇప్పుడు రాష్ట్రాలిస్తున్న నష్టపరిహారం ఎటూ చాలదు. కాబట్టి క్రిమినల్‌ ప్రోసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 357ని సవరించి 357ఏ ని చేర్చి బాధితురాలికి నష్టపరిహారం మీద ఒక స్కీమ్‌ని రూపొందించి, మూడు లక్షల రూపాయిలు పరిహారంగా ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాల్సి వుంటుంది. అది కూడా యాసిడ్‌ దాడి జరిగిన 15 రోజులకి ఒక లక్ష రూపాయిలు చెల్లించాలి. మరో రెండు నెలలలోపు మిగిలిన రెండు లక్షలు చెల్లించాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా సుప్రీమ్‌ కోర్టు యిచ్చిన తీర్పును అన్ని స్థానిక భాషల్లోకి అనువదించి, సమాచారాన్ని అందరికీ తెలిసేలా చెయ్యాలని కూడా చెప్పడం జరిగింది.

సుప్రీమ్‌ కోర్టు ఇంతటి స్పష్టమైన తీర్పు ప్రకటించినప్పటికీ ప్రభుత్వపరంగా ఎలాంటి స్పందనా వెలువడలేదు. సుప్రీమ్‌ కోర్టు రూపొందించిన గైడ్‌లైన్స్‌ ఆధారంగా రూల్స్‌ రూపొందించి, ఈ తీర్పు గురించి ప్రజాబాహుళ్యంలో ప్రాచుర్యం కలిగించాలని ‘భూమిక’ నుండి ప్రధాన కార్యదర్శికి ఫ్యాక్స్‌ ద్వారా రిప్రజెంటేషన్‌ పంపించాం. ప్రభుత్వం వెంటనే నియమనిబంధనలు రూపొందించి, యాసిడ్‌దాడి లాంటి కృరమైన దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించేలా, బాధితులను సత్వరమే అదుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈ విషయమై అందరం కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద వొత్తిడి పెట్టాల్సిన అవసరం చాలావుందని నేను భావిస్తున్నాను. రండి… యాసిడ్‌ దాడులకు వ్యతిరేకంగా పనిచేద్దాం.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

2 Responses to ” …. ‘ ‘

  1. sangeet says:

    మీరు చేస్తున్న క్రుషికి ధన్యవాదాలు.

  2. Raaji says:

    ఇదంతా సముద్రములో కాకిరెట్టలా లేదూ? ఇది ఎంత మేరకు సమాజంలో మార్పు తెస్తుంది? దొంగ దొంగ తనం చేయడానికి ఒక దారి మూసెస్తే ఇంకో దారి వెతుకుంటాడు. మనడదేశం లో క్రిమినల్సుకి ఎన్ని దార్లు ఉండటం లేదూ? ఏ మైనా తగ్గు తున్నాయా? అయినా గాడందకారపు చీకటిలో చిరుదివ్వే అయినా చాలు అనుకుంటామ లెండి! సంస్కౄతి పరంగా మగ మనస్తత్వాన్ని మార్చడానికి ఏమైనా దారులు ఉంటె వెతకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.