వహ్వా – జాతీయ మహిళా కమిషన్‌

– జూపాక సుభద్ర

ప్రభుత్వాలు మహిళల్ని ఏదో వుద్దరిస్తున్నట్లు కనిపించే దానికి మహిళ కమిషన్స్‌ వేస్తున్నయి. అదేంటో యిప్పటి దాకా వేసిన మహిళా కమీషన్స్‌లో దళిత ఆదివాసి, బీసి, మైనారిటీ మహిళలు కనిపించలేదు. వారి దృష్టిలోనే తీసుకుంటే మహిళలంటే విద్య, ఉపాధి రంగాల్లో ముందున్న మహిళల్నించి, చదువు, ఉపాధిలేక, మానవగౌరవాలు, మానవ హక్కులు లేక బతకడమే ఒక సమస్యగా వున్న దళిత ఆదివాసీ బీసీ, మైనారిటీ మహిళలంతా ఒక్కటే అయితే యీ సమూహాల్లోంచి, యీ కులాల్లోంచి కూడా మహిళా కమీషన్స్‌లో ప్రాతినిద్యం కల్పించాల్సి వుండింది. కాని ప్రభుత్వాలకు కూడా అన్ని అవకాశాలున్న పాలక కులాల మహిళలే మహిళలుగా కనిపించి వారి పేరుతో కింది కులాల మహిళలను ప్రాతిపదికంగా తీసుకొనక ప్రాతినిద్యంగా తీసుకొనక అణగారిన మహిళలకు అన్యాయం చేస్తున్నది.

భారతదేశంలో మహిళలు భిన్న కులాల్లో వున్న హైరార్కీని, కుల ప్రాతిపదికగా జరుగుతున్న అభివృద్ధి వాస్తవాల్ని గుర్తించకుండా నిరంకుశంగా మహిళ అంటే అగ్రకుల మహిళ జీవితాన్ని ప్రాతిపదికగా తీసుకొని యిప్పటి దాకా మహిళా చట్టా లొచ్చినాయి. కాని దళిత, ఆదివాసి మైనారి టీ బీసీ మహిళా కోణాల్నించి, వారి జీవితా ల్నించి వారి జీవన విధ్వంసాల పర్యావర ణం నుంచి చట్టాలు రూపొందించ బడలేదు.

అణగారిన మహిళలు కుల జెండర్‌ పీడనల్లో కనీస మానవ హక్కులు లేకుండా, మానవ గౌరవాలు లేకుండా, మెరుగైన జీవనం లేకుండా నిత్యం అనేక హింసలు, అవమానాలు, లైంగికదాడులు, దిన దిన గండం; బతకడమే ఒక పెద్ద సమస్యగా వుంది. మహిళా చట్టాలు వీరిని రక్షించేట్టు గా, భద్రతగా లేవని గుర్తించినట్లుంది జాతీయ మహిళా కమీషన్‌. అందికే పార్లమెంట్‌లో మహిళా హక్కుల బిల్లు పెట్టడానికి కసరత్తు చేయడం మంచి పరిణామమే. కాని ఆ బిల్లు కసరత్తు ఢిల్లీలో కాకుండా దేశం గల్లీలు, పల్లెలు, గూడాలు, తండాలు, అడివి ఆకుల దాకా జరగాల్సిన అవసరముంది. యిప్పటి దాకా జాతీయ మహిళా కమీషన్‌ మహిళా హక్కుల బిల్లు పెట్టబోతుందనే విషయం కూడా ఏ మహిళలకు తెలవదు. యీ బిల్లు ముసాయిదా కసరత్తు చర్చ యావద్భారత మంతా జరిగితేనే సార్థకత వుంటుంది. లేదా మిగతా బిల్లుల్లాగనే కొద్ది మంది మహిళల ప్రయోజనాలకు సంబంధించిన హక్కుల బిల్లులాగనే అయిపోతుంది.

జాతీయ మహిళా కమిషన్‌ పాలక కులాల మహిళల్ని పాలిత కులాలైన అణగారిన మహిళల్ని వారి అస్తిత్వాల్ని గుర్తించక తప్పన ట్లుంది. అందికే బిల్లులో ఎస్సీ ఎస్టీ మహిళ లకు ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఆర్ధిక సహకారం అందించాలని పెట్టడం జరిగింది. యిది మంచి పరిణామం యిట్లా యింకా అనేక అంశాలు బిల్లులో రూపొందించాలంటే చివరి మహిళ దాకా చర్చ చేరేటట్లు కమిషన్‌ చూడాలి. మైనారిటీ, ఎం.బీ.సీ మహిళల కూ డా ఆర్ధిక సాయం ఎన్నికల్లో అందించోంది.

జాతీయ మహిళా కమీషన్‌ యింకో గొప్ప సాహసం చేసింది. మామూలుగా ప్రభుత్వం తమ సంస్థల్ని తమకు వెన్ను దన్నుగా ఏర్పాటు చేస్తూంటాయి కాని జాతీయ మహిళా కమీషన్‌ ప్రభుత్వ సంస్థగా వుండి సైనిక దళానికి ప్రత్యేక అధికార చట్టాన్ని ఉపసంహరించాలని చాలా బలంగా సిఫార్స్‌ చేసింది. యిది మహిళా కమిషన్‌ చరిత్రలో గొప్ప సంగతి.

సైనిక దళాల ప్రత్యేక అధికార చట్టం వల్ల కాశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు నక్సల్‌ ఉద్యమ ప్రాంతాలు, చత్తీస్‌గడ్‌ (సల్వాజుడుం) ముఖ్యంగా ఆదివాసీ మహిళలు నిత్యం సైనిక, పోలీసు దళాల లైంగిక దాడులు, హింసలు ఎదుర్కుంటూ పోరాడ్తున్నారు. ఆ మహిళల గోసలు, గొంతులు యీ (అ) నాగరిక లోకానికి వినబడ్తలేవు. పచ్చటి ఆదివాసీ మహిళల మానప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. వీటి మీద పౌరసమాజాలు, సంగాలు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వాలకు స్పందన లేదు. పోలీసులు, సైనిక దళాలు చేసే లైంగిక దాడుల్ని, ఆగాయిత్యాల్ని ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయస్థానాలు వారినెట్లా రక్షిస్తయో వాకపల్లి ఘటన నిదర్శనం. మహిళా సంగాలు, సమాజాలు వాకపల్లి మహిళల మీద అన్యాయాల తీర్పులకు విలవిల్లాడినయి అసహాయంగా.

.. యిక కల్లోల కాశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక దుశ్చర్యలు ఎంత ఘోరంగా, కౄరంగా వుంటాయో అక్కడి మహిళా పోరాటాలు – ఇరోంషర్మిల పద్నాలుగేండ్ల దీక్షలే చెప్తాయి. వీటిని మీడియా కూడా పట్టించుకోదు.

యిట్లా యూనిఫామ్‌ వేసుకున్న దోషులు, నేరస్తులకు ప్రత్యేక అధికార చట్టాన్ని ఉపసంహరించుకోవాలని మహిళా కమీషన్‌ ప్రభుత్వానికి సిఫార్స్‌ చేయడం అభినందించ దగింది. ఆ సిఫార్సును అమలు చేసే దిశగా మహిళా సమాజాలు, ఉద్యమాలు ప్రభుత్వా న్ని వత్తిడి చేయాలి.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.