19.10.2013న పని చేసే చోట మహిళలపై వేధింపుల నియంత్రణ చట్టం (2013)పై సంప్రదింపుల సదస్సు పబ్లిక్ గార్డెన్‌లోని జూబ్లీహాల్లో జరిగింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆక్స్‌ఫామ్ ఇండియా వారి సహకారంతో భూమిక ఉమెన్స్ కలెక్టివ్ మరియు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సంయుక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కె. సత్యవతి భూమిక విమెన్స్ కలెక్టివ్ అధ్యక్షులు, త్రిపురాన వెంటకరత్నం చైర్పర్సన్ మహిళా కమిషన్, మహేశ్ భగవత్ ఐ.జి (ఇంటిలిజెన్స్). చిరంజీవి చౌదరి కమీషన్ మహిళా, శిశు, అభివృద్ధి శాఖ. అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అంజని కుమార్, డి.సి.పి. (డి.డి.) వేంకట రంగారావు గారు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చట్టం గురించిన తమ అవగాహనలను అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. పని చేయడానికి సమాన అవకాశాలు ఉన్నప్పటికిని వేధింపుల కారణంగా మహిళలు వెనుకడుగు వేస్తున్నారు. వేధింపుల నివారణకు ఏప్రిల్ 13, 2013న పనిచేసే చోట మహిళలపై అమలులోకి వేధింపుల నివారణ చట్టం (2013). కాని ఈ చట్ట అమలుకు నిర్ధిష్టమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇంకా ప్రకటించడకపోవడం వల్ల ఈ సంప్రదింపుల సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో బృంద చర్చలు నిర్వహించి వాటిలో వ్యక్తమైన అభిప్రాయాలను ప్రభుత్వానికి, మహిళా కమిషన్‌కు అందజేస్తామని. భూమిక ఉమెన్స్ కలెక్టివ్ అధ్యక్షురాలు శ్రీమతి కొండవీటి సత్యవతిగారు అన్నారు.
మహిళలు పనిచేసే చోట జరుగుతున్న వేధింపుల నియంత్రణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించడం లేదని, ప్రభుత్వ కార్యాలయాల్లో 99% కంప్లయింట్లు లేవు. మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం అభిప్రాయపడ్డారు, కీలకోపన్యాసం చేస్తూ మహిళలు పనిచేసే చోట కమిటీలు వేధింపుల చట్టం 2013 ప్రకారం అంతర్గత విచారణ కమిటీ ప్రతీ కార్యాలయం, విద్యా సంస్థల్లో ఉండాలని, అందులోని సభ్యుల పేర్లు, వారి ఫోను నంబర్లు నోటీసు బోర్డుల్లో ఉంచాలని చెబుతున్నామని అమలు మాత్రం ప్రశ్నార్ధకంగా ఉందన్నారు. ఈ చట్టంపై పట్టణ, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో సుదీర్ఘమైన చర్చ జరగాలని అన్నారు.
వేధింపుల చట్టాలపై చాలా మంది పోలీసులకీ అవగాహన లేదు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టంలో అనుకూల, ప్రతికూల అంశాలున్నాయి. విశాఖ జడ్జిమెంట్లోనే పలు సిఫారుసులను సుప్రీంకోర్టు చేసింది. కేంద్రం చట్టం చేస్తే దానిపై నిబంధనలు రూపొందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. చట్టాలు చేయగానే దాన్ని అమలు చేసే మార్గదర్శకాలు నిర్దేశిత వ్యవధిలో సిద్దం కావాలి. లేకుంటే బాధిత మహిళలకు సత్వర న్యాయం జరగాలి. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు నిరోధక చట్టంలో విచారణ ఇన్ కెమెరా (కెమెరాతో వాగ్ములం చిత్రీకణ) జరుగుతోంది. వాంగ్మూలం నమోదు చేసుకున్నాక ఆ కాపీని సమాచార హక్కు చట్టం కింద పొందే అవకాశం లేకుండా చట్టం చేసారు. ఈ కమిటిలో జిల్లా స్థానిక కమిటీలు, పౌర సమాజం ప్రతినిధులు ఉంటారు. ఇంటర్నల్ కమిటీలు ప్రభుత్వ అధికారులు వేయకపోతే ఈ చట్టం కింద రూ. 50 వేల వరకు జరిమానా విధించవచ్చు. అని మహేష్ భగవత్ ఐజీ ఇంటలిజెన్స్ అన్నారు.
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నియంత్రణ కోసం ఇంటర్నల్ కమిటీలతో పాటు స్థానిక కమిటీలు వేయాలి. ఈ కమిటీలే ఫిర్యాదులు స్వీకరించి చర్యలు తీసుకోవాలి. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత విభాగాధిపతులదే. కమిటీలు వేయకపోతే ఈ చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవచ్చు. చట్టాలపై విస్తృత ప్రచారం జరగాలి. చట్టాలను అమలు చేసే బాధ్యత ప్రజలందరిపై ఉంది. ఫిర్యాదుల కమిటి ఉందో లేదో తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ చట్టం అనుసరించి, నియమాలు రూపొందిస్తాం. ఆ తర్వాతే నిరంతర పర్యవేక్షణతో చట్టాన్ని అమలు చేస్తాం అని చిరంజీవి చౌదరి కమీషనర్, మహిళా శిశు సంక్షేమ శాఖ అన్నారు.
జమున, మెంబర్, మహిళ కమిషన్ గారు మాట్లాడుతూ పనిచేసే చోట వేధింపులు మొదట పోలీస్ దృష్టికి తీసుకువెళ్ళినపుడు వారు, బాధితుల దృష్టికోణంలో కాకుండా వేరే విధంగా విశ్లేషించడం వల్ల సరియైన న్యాయం జరగడం లేదని అందుకు దీన్ని. ఇంటర్నల్ గ్రీవెన్స్ కమిటీ దృష్టికి మాత్రమే తెచ్చే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు.
శ్రీ రంగారావు డిసిపి మహిళా పోలీస్ స్టేషన్, బషీర్‌బాగ్ మాట్లాడుతూ, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నియంత్రణ చట్టాన్ని సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయాలని లేదంటే ఇతర చట్టాల్లా ఈ చట్టం కూడా మరుగున పడే అవకాశం ఉందని అన్నారు. చట్టం అమల్లో కఠినమైన నిబంధనలు లేనిదే వేధింపులని నిరోధించడం సాధ్యం కాదని అన్నారు. దీనికై ఎన్ఫోర్స్మెంట్ ఎజన్సీస్ యొక్క సహాయం పొందితే బాగుంటుందన్నారు. ఎన్‌జిఒల సహకారంతో, ఎన్ఫోర్స్మెంట్ ఎజెన్సీలు దృడంగా అయ్యాయన్నారు. నిబంధనలు నిర్మించడానికి పోలీస్ వ్యవస్థ సహకారం ఉంటుందని ప్రజల రక్షణే పోలీస్ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.
అంజనీ కుమార్ అదనపు కమిషన్ మాట్లాడుతూ నేరం జరగకుండా నిరోధించాలి. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై ప్రచారం కల్పించాలి. సైబర్ ప్రపంచంలో అసాంఘిక శక్తులు పెరిగాయి. అందుకే పిల్లలను కట్టడి చేయాలి. నగరంలో బాలికల అక్రమ రవాణ జరుగుతుంది. దీన్ని అడ్డుకోవాలని, వివిధ చట్టాలపై విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు, ఆహ్వానితులంతా నాలుగు గ్రూపులుగా ఏర్పడి ఒక్కో గ్రూపు ఒక్కో విషయంపై సూచనలు చేసాయి.
గూప్-1.: చట్టంపై అవగాహన కల్పించడం: ఈ గ్రూపులో అందరు కలిసి చర్చించుకొని చట్టం అవగాహన ఏ విధంగా కల్పించాలో
సూచించారు. అందులో ముఖ్యంగా కరపత్రాల పంపిణి ద్వారా, గోడ పత్రికల ద్వారా, రచనలు ద్వారా, గోడలపై పెయింటింగ్ ద్వారా సెన్సిటేషన్ వర్క్‌షాప్స్ పిల్లలు టీచర్లు తల్లిదండ్రులు వివిధ విభాగాల అధిపతులకు అవగాహన కల్పించడం ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, టెలివిజన్ కార్యక్రమాల్లో స్కోల్ చేస్తూ, టోల్‌ఫ్రీ ఫోన్ నంబరు ఏర్పాటు చేయాలి. గ్రీవెన్స్ కమిటీలను ప్రతి ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలి. వీటిని నెలకోసారి సమిక్షించాలి, స్కూల్లో, కళాశాలల్లో విద్యార్ధులకు అవగాహన కల్పించాలి. ఎన్‌జిఒలకు, సోషల్ యాక్షన్ కమిటీలు, ఎస్ఐఎజి, జెండర్ కమిటీలకు, సమత దండు, మహిళ కోర్టులకు మరియు చట్టంపై అవగాహన కల్పించడానికి ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేయాలి. మొబైల్ కోర్టులు ఏర్పాటుచేయాలి. బాధించేవారిని వెంటనే శిక్షించాలి. చట్టం అమలుపై నిరంతర నిఘా ప్రభుత్వానికి ఉండాలి. అది గ్రామ స్థాయి నుండే ఉండాలి. ఏ సంస్థలో చట్టం అమలులో లేదో ఆ సంస్థలపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. చట్టం అమలుకు సరియైన నిధులను ప్రభుత్వం అందించాలి.
గ్రూప్-2 : అసలు వేధింపులు ఏమిటో తెలియజేసాయి: సెల్ఫోన్లో మెసేజ్ పంపడం, బొమ్మలు పంపటం, ఆఫీసు ఫైళ్ళపై, ఉత్తరాలపై రాతలు, పాటలు పాడడం, చూపులు, ముఖ కవళికలు, సంకేతాలు చూపడం (వంటివి) (వాడే) భాష ఉపయోగంలో మాటల్లో, రాతల్లో కాని, మొదలైనవి మరియు మధ్యవర్తిత్వ, బెదిరింపులు, ఒత్తిడికి గురిచేయడం మరియు బ్లాక్మెయిల్ చేయడం మొదలైనవి. ఆర్ధిక అవసరాలను తీరుస్తామని భరోసా ఇవ్వడం, బెదిరించడం, మొదలైనవి.
గ్రూప్-3 : కంప్లెయిట్ కమిటీలు: ప్రభుత్వ, ప్రభుత్వేతర, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, మీడియా కార్పోరేట్ కంపెనీలు ఎడ్యుకేషన్ ఇన్స్టూట్యూట్లు, ఆరోగ్య సంస్థలు, మరియు కూలీ సంఘాలలో ఈ కమిటీలను విధిగా ఏర్పరచాలి. ప్రతి కమిటీలో (మానసిక) మనో వైజ్ఞానికుల్ని నియమించాలి. గ్రామస్థాయిలో ఎస్‌హెచ్‌జిలను, యూత్ గ్రూపులను ఈ కమిటీలలో సభ్యులను చేయాలి. మండల స్థాయిలో మండల సమీక్ష సభ్యులను, యండిఒ, యంఆర్ఒ, ఐసిడిఎస్‌లను మరియు వ్యవసాయ పారిశ్రామిక రంగాల నుండి సభ్యులగా నియమించాలి.
గ్రూప్-4 : రిడ్రెసల్ గ్రూప్: చట్టం అతిక్రమిస్తే ఉండే పర్యవసానాలను నోటీస్ బోర్డుల్లో పెట్టాలి. కమిటీ మెంబర్ల వివరాలు కూడా ఉంచాలి. విచారణ కమిటీలో ఇద్దరు మహిళా మెంబర్లతో సహా, ఎన్‌జిఒ ప్రతినిధులను, సోషల్ వర్కర్లను మరియు కౌన్సిలర్లను నియమించాలి. ఇద్దరిని విచారించి వివరాలు సేకరించాలి. అవసరమైతే వారి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సింగ్ చేయాలి. శిక్షలు వృత్తి పరంగా కూడా ఉండాలి. ఉదా|| ఇంక్రిమెంట్, బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించినవి. కమిటీలలో వారాంతం మరియు నెలలో ఒక్కసారైన రివ్వ్యూ మీటింగ్‌లను పెట్టాలి.