సుడిగాలి పర్యటన అనుభూతి

 – టి. అమూల్య

మా ప్రయాణం భూమిక ఆఫీసు నుండి సాయంత్రం 4.15 కు మొదలైంది. నిజామాబాద్‌లోని విజయ పబ్లిక్‌ స్కూల్‌ విపియస్‌ వెళ్ళేసరికి అమృతమేడం గారు తన సహచర బృందంతో మా అందరిని పేరు పేరున పరిచయం చేసుకొన్నారు. అమృతగా రి బృందం అందరిని ఆహ్వానించారు. ఎంతో ప్రేమతో మా అందరిని ఆహ్వానించారు.

వి.పి.ఎస్‌. నుండి అమృత మేడం కట్టించిన ‘అపురూప’ వేంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకెళ్లారు. ఆ గుడి ఎంతో అందమైన ప్రదేశంలో నిర్మించారు.

”లాలన” అర్థవంతమైన పేరు. అక్కడి వాతావరణం ఊరికి దూరంగా పచ్చటి చెట్ల మధ్య 5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులతో చాలా బాగుంది. అక్కడ గోశాల, కూరగాయల తోటా, చీకట్లో సరిగ్గా చూడలేదు.

అమృత తమ ‘ఆహ్లాద’ ఇంట్లోకి మా అందరిని ఎంతో ఆదరణతో ఆహ్వానించారు. మేము గేట్లోకి అడుగు పెడుతూనే మాకర్థమైందేందంటే మా కొరకు భోజన ఏర్పాట్లు లాన్‌లో చేసారు. అక్కడ విశాలమైన పోర్టీకో, లాన్‌లో స్వింగ్‌, గోడపైకి పాకించిన అందమైన పూలమొక్కలు, అవి విరగబూసిన పువ్వులతో, లైట్‌ల వెలుగులో ఎంతో హాయిగా అనిపించింది.

రాత్రి భోజనాలు తరువాత ముద్ర గేమ్‌ ఆడించి, మా అందరికీ ఒక్క క్రొత్త గేమ్‌ నేర్పించారు. దాంట్లో విజేతలకు బహుమతులు కూడా ఇచ్చారు. ఆ తరువాత పాటలు పెట్టి మా అందరితో డ్యాన్స్‌ కూడా చేయించారు. ఆ తరువాత ఉదయాన్నే వెళ్ళబోయే స్థలాల గురించి, బ్రేక్‌ఫాస్ట్‌ పొచ్చరలో, లంచ్‌ మొండి గుట్టలో, స్నాక్స్‌ బుర్కరేగడిలో అని ప్రోగ్రాం చెప్పారు. అక్కడ నుండి పడుకునేందుకు పైకి తీసుకెళ్ళారు. అక్కడికెళ్లి చూస్తే అందరికీ పక్కలు వేయించి రెడీగా ఉన్నాయి. ఇక్కడ మీ లగేజి పెట్టుకోవచ్చు. ఇక్కడ వాష్‌ రూం ఉంది అని దగ్గర ఉండి అన్ని చూపించి క్రిందికి వెళ్ళి అందరికి ఐస్‌క్రీమ్‌ పంపించారు, పడుకోబోయే ముందు మళ్ళీ తను పైకొచ్చి, అందరికి గుడ్‌ నైట్‌ చెప్పి, మంచి నీళ్ల ఏర్పాట్లు చూసుకొని, ప్రొద్దుటే అందరు టైంకి బయలు దేరాలని చెప్పి క్రిందికి వెళ్ళారు.

అనుకున్న టైంకి ముందే మా బస్సు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ చూడటానికి పోచంపాడ్‌ బయలుదేరింది. మాతోపాటు రమాదేవి గారు కూడా వచ్చారు. తర్వాత పొచ్చేర జలపాతంలో ఒక గంటసేపు అరుపులు, కేరింతలు, అల్లరి, ఆట, పాటలతో ఎంతో ఉత్సాహంగా జలకాలు ముగించారు. మాలో ముగ్గురం నీళ్ళలో ఆడకుండా దూరంగా ఉండి ఫోటోలు, వీడియోలు తీస్తుంటే, అది గమనించిన అమృత మేడం లేదమ్మా మీరు తప్పకుండా వెళ్ళాలి, మా వయస్సులో ఇవన్నీ ఎంజాయ్‌ చెయ్యలేరు అంటూ రమాదేవి గారిచే జలపాతం దగ్గరకు పంపారు. కావలసినంత సేపు స్నానాలు చేస్తూ, పాటలు పాడుతూ, ఓ ప్రక్క కాళ్ళు జారకుండా గట్టిగా చేతులు పట్టుకొని మాకు చాలనిపించే వరకు అక్కడ ఉండి ఆపై బయటకు వచ్చి తయారయ్యే లోపు అమృత గారు మాతో ఇంకో గేమ్‌ ఆడించే తయారీలో భాగంగా ‘ఎస్‌’ అక్షరంతో వచ్చే పేర్లు వ్రాయమన్నారు. ఆ విజేతకు బహుమతులు కూడా ఇచ్చారు.

కుంతాల జలపాతం చాలా పెద్ద జలపాతం, పొచ్చర జలపాతంతో పోలిస్తే చాలా విశాలమైంది. జలపాతం చుట్టూ పెద్ద వృక్షాలు, టేకు చెట్లు, మోదుగ చెట్లు ఎంతో అందంగా పేర్చినట్లుగా పెరిగి చల్లటి గాలిని, వెచ్చటి నీడనిస్తూ వచ్చి పోయే వాళ్ళని పలకరిస్తూ ఎంతో నిర్మలమైన ఆకాశంవైపుకు చూస్తూ, వచ్చిపోయే వారిని జలపాతంకు దూరంగా ఉండమని మందలిస్తూ, ఆ హెచ్చ రికను వినక జలపాతంలో పడిన వారిని చూసి రోదిస్తూ మేమేమి చెయ్యలేని నిస్సహా యులమన్నట్లు, ఆ చెట్లు వాటి సేవలలో అవి నిమగ్నమైనట్లు నాకనిపించింది. పొచ్చరలోనే గడిపాం కాబట్టి. ఎంతో ఉత్సాహంతో ఎన్నో ఫోటోలు, వీడియోలు తీసుకున్నాము. అయినా ప్రకృతిని బంధించటం మనిషికి సాధ్యమేనా అని అనిపించింది.

మా ప్రయాణం మొండిగుట్ట వైపుకు మొదలైంది. బస్సులో నుండి మౌనంగా వీక్షిస్తున్న ఆకాశాన్ని, పచ్చటి చెట్లను, పంటకొచ్చిన పత్తి చేనుని, మధ్య మధ్య పోడుభూమిని, ఆ చుట్టు ప్రక్కల తిరుగుతున్న రైతులను గమనించిన నాకు ఒక్కసారిగా రైతు జీవితం వైపుకు నా మనస్సు మరలి, పత్తి రైతుల ఆత్మహత్యలు, వారి అప్పులు, కష్టాలు గుర్తొచ్చాయి. అక్కడికి వెళ్ళగానే అమృత మేడం కరుణ మరియు తన చెల్లిని మా అందరికీ పరిచయం చేసారు. అక్కడ భోజనాలు ఇంక అన్ని ఏర్పాట్లు అక్కడ వాళ్ళే చూసుకున్నారు, మళ్ళీ అక్కడ ఇంకో విందు భోజనం అమృత మేడం ఏర్పాటు చేయించారు. రుచికరమైన భోజనం తిని, అక్కడ ఉన్న ఎలుగుబంట్లను, జింకలను చూచి ఫోటోలు తీసుకొని అక్కడున్న గదిలోనుంచి పైకి చెక్క మెట్లెక్కి పైకెళ్లితే అక్కడొక అందమైన ఓపెన్‌ హట్‌ ఉంది. ఆ గుడిసెకు నాలుగు వైపుల గోడలు లేవు. ఒక స్వింగ్‌, బల్ల మంచం, కుర్చీలు ఉన్నాయి. అక్కడ స్వింగ్‌ ఊగుతూ చుట్టు ప్రక్కల పంట కోసిన కాళీ భూమిని చూస్తూ, అక్కడ వచ్చే స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, అప్పుడే అక్కడికి వచ్చిన ఇందిర, ఉష గార్లతో నాకొచ్చిన ఆలోచనను షేర్‌ చేసుకున్న – కేరళ వెళ్లినప్పుడు అక్కడి బొటేజ్‌ పైన అచ్చు ఇలాంటి గుడిసెలే ఉంటాయి. అయితే అది నీటిలో ఇది భూమిపై అంతే తేడాగుందని చెప్పాను. భోజనానికంటే ముందే ప్రభా మేడం, వసంత మేడం, సుజాత మేడం మొదలగు వారు కలసి అమృత మేడం రచించిన పాటకు ఆటతో చక్కటి ప్రదర్శన చేసారు. అది మద్యం గురించి ఎంతో సరళమైన భాషలో రచించారు, అది సమాజానికి ఎంతో ఆలోచింపచేసే విధంగా ఉంది.

మొండిగుట్ట నుండి బుర్కరేగడికి 9 కి.మీ.ల అడవి ప్రయాణం. అది ఆదివాసీలు నివసించే కుగ్రామం. అక్కడికి వెళ్ళడానికి రెండు ట్రాక్టర్‌లను సిద్ధం చేసి అందులో ఎండుగడ్డి వేసి కూర్చోడానికి వీలుగా పైన జంపుకానా కూడ వేసారు. రెండు ట్రాక్టర్‌ల నిండుగా ఇరుకు ఇరుకుగా కూర్చుని అడవి ప్రయాణం అంత్యాక్షరితో మొదలైంది. మధ్యలో ఏ చిన్నవాగులొచ్చినా పెద్ద పెద్ద అరుపులు, కేరింతలు, ఆ అరుపులు విని మొదట డ్రైవర్‌ భయపడ్డాడు. అడవిలో ఎటువైపు చూసినా చెట్లు, ఇప్ప చెట్లు, మోదుగు చెట్లు, క్రింద ఎటువైపు చూసినా రకరకాల ఎండుటాకులు, పుల్లలు, చీమలు, దూరంగా కనిపించిన పుట్టలు, ప్రకృతిలోని ఎన్నో క్రొత్త దృశ్యాలను చూసినట్లు అనిపించింది. మార్గ మధ్యలో ఆకాశమంత ఎదిగిన రెండు చెట్లు ఒకటికొకటి కలిసి తీగలుగా అల్లుకుని పైన తీగకప్పులాగ ఎంతో కన్నులపండుగగా అనిపించింది. దాని క్రింద ఒక్క ట్రీహౌజ్‌ కట్టుకుంటే బాగుండనుకున్నాం. మొత్తానికి అరుపుల మధ్యలో బుర్కరేగడి రానే వచ్చింది. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు మంచాలు వేసి తయారుగా ఉన్నారు. మేమంత మంచి నీరు త్రాగి కూర్చునే లోపు గోండులు వాళ్ళు గుస్సాడి నృత్యానికి సంబంధించిన దుస్తులు, ముఖానికి నిండుగా బొగ్గుతో, నలుపు రంగును పూసుకుని, కాళ్ళకి మువ్వలు, తలకి నెమలి పింఛంతో తయారు చేసిన పొడుగైన టోపి లాంటి దాన్ని ధరించిన నలుగురు పురుషులు డప్పుల శబ్దంతో నృత్యాలు చేసుకుంటూ ఆ ఊరి మధ్య కూర్చోడానికి ఏర్పాటు చేసిన స్థలానికి వచ్చి వాళ్ల పద్ధతిలో చాల ఉత్సాహంతో డ్యాన్స్‌ చేశారు. దాని తరువాత ఆడవాళ్లు కూడ గుస్సాడి నృత్యాన్ని చేశారు. వాళ్ళతో పాటుగా మేము కూడ గంతులు కలిపి చాలనుకునే వరకు గంతులేసాం. ఒక్క ప్రక్క ఇది చూస్తుండగానే మాకు వేడి పెసరవడలు, మిర్చిబజ్జిలు, కూల్‌డ్రింక్స్‌, టీ అన్ని చేయించి సప్లయి చేయించారు అమృత మేడం. మళ్లీ అదే అడవిలో నుంచి తిరుగు ప్రయాణం మొదలు అదే అల్లరి, కేరింతల్తో గుట్ట చేరుకు న్నం. రాత్రి భోజనానికి జొన్నరొట్టెలు, ఉల్లిపచ్చడితో పాటుగా ఎన్నో రకాల వంటలు చేయించారు, భోజనాల తరువాత మేము ఉట్నూరులో రాత్రి బసకు వెళ్ళాలి. అమృత మేడం వారి మిత్ర బృందం మమ్మల్ని ఎంత గొప్పగా ఆహ్వానించారో అంతే గొప్పగా మా అందరికి వీడ్కోలు కూడ బస్సు వరకు వచ్చి సాగనంపారు.

ఆ రాత్రికి ఉట్నూరు గెస్ట్‌హౌజ్‌లో పడుకుని ఉదయం తయారై జోడ్‌ఘాట్‌కు ప్రయాణమైయ్యాము. అది ఘట్‌రోడ్‌ మార్గం, అడవిని చాలావరకు నరికివేశారు. అది చాల పలచబడింది. ఇక్కడ చెట్లు నరికి పంట చేలుగా మార్చారు. ఎక్కువ ఇక్కడ పత్తి, కంది, జొన్న, చెనగ పంటలు సాగు చేసుకుంటున్నారు. నారింజ బంతిలాంటి సూర్యోదయ దృశ్యం మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. బస్సు ఝాట్‌రోడ్‌ క్రిందికి దిగుతూ పరిగెడుతుంటే ఇంకెంత క్రిందికి వెళ్ళాలో అని చూసుకోవడం ఒక అనుభూతి. మార్గమధ్యలో మా బస్సులో కెక్కిన సక్రుబాయి, సరిత ఇద్దరు మాకు ఆ రోజంతా గైడ్‌ చేశారు. వాళ్లిద్దరు ఏపి మహిళా సమతా సొసైటిలో సభ్యులు. వాళ్లు చెప్పే మాటలు వింటుండేలోగా కోమరంభీమ్‌ సమాధి, విగ్రహం దగ్గరకు చేరుకున్నాం. అక్కడ మేమంత గ్రూప్‌ ఫోటో తీసుకుని, సక్రుబాయి చెప్పే మాటలు వింటున్నప్పుడు అక్కడి బడిపిల్లలు తెలంగాణ ప్రార్థన గీతం పాడడం విని, ఒక్కసారి నవ్వుకుని, మళ్లీ సక్రుబాయి చెప్పే మాటలు వినడం మొదలుపెట్టాం.

కోమరం భీం గురించి తెలుసు కొన్న విషయాలు ఏంటంటే కోమరంభీం, గోండూ తెగకు చెందిన ఆదివాసి గిరిజనుడు కోమరం వంశానికి చెందినవాడు. అదిలాబాద్‌ అటవిప్రాంతంలో ఆరు రకాల ఆదివాసి గిరిజను లుంటారట. ముందుగా లంబాడీలు, గోండూలు, ప్రాధాన్‌, తోటి, ఒజా, కోలాం. అదిలాబాద్‌ జిల్లా కెశ్లాపూర్‌లో జరిగే నాగోభా జాతర గోండూ తెగకు సంబంధించిందే. ఇక్కడికి కొందరు గోండులు అన్ని రాష్ట్రాల నుండి వస్తారు. నాగోభా జాతరను గోండూ తెగకు చెందిన మేస్‌రం వంశస్థులు నిర్వహిస్తారు. వీళ్లు పండించే పంటలు జొన్న, కంది, పత్తి. ఈ మధ్యకాలంలోనే గోండూ లిపిని కూడ పునరుద్ధరించారు. లంబాడీలు జనజీవన స్రవంతిలో కలిసిపోయినప్పటికి, మిగత నాలుగు ఐదు తెగలు అంతగా ఇష్టపడరట. కోలాం తెగకు చెందినవారు మరీ వెనుకబ డినవారు, వీరిలో స్త్రీ గర్భం దాల్చిన తర్వాత ఊరికి దూరంగా ఉండే గుడిసెలోనే ఉంటు, తన పనులన్ని తానే చేసుకుంటూ చివరకు ప్రసవం కూడా తనకు తానే చేసుకొని, పుట్టిన బిడ్డకు బొడ్డు కూడ తానే కత్తిరించుకోవాలి. అందుకే ఈ తెగలో తల్లీ, బిడ్డ చావుల శాతం ఎక్కువ. ఇక ఓజా తెగకు వస్తే వీరిది ఓజావృత్తి. జోడ్‌ఘాట్‌లో ప్రతి దసర పండుగ రోజు గోండులంత అన్ని రాష్ట్రాలనుండి అక్కడికి వచ్చి మేకలు, కోళ్ళు, కొబ్బరికాయలు అన్నింటిని బలి ఇచ్చి పండుగ జరుపుకుంటారు.

ఇప్పుడు మా ప్రయాణం మోడీ, ఝరికి మొదలైంది అయితే మార్గమధ్యలో బస్సు టయర్‌ పంచర్‌ అయింది. అందుకని 45 నిమిషాలు మేము ఆ చెట్ల మధ్య పుట్టలమధ్య పచ్చటి ప్రకృతిని ఎంజాయ్‌ చేసాము. చింత చెట్టును కట్టెతో కొట్టి కొన్ని చింతకాయలు, దాని కొమ్మలు లాగి కొన్ని చింతకాయలు కోసుకుని, ఒక నెక్‌లెస్‌ – హ్యాంగింగ్స్‌ తయారు చేసి సత్యవతిగారికి పెట్టి ఫోటో తీసాము. ఈలోపు బస్సు తయారైంది. మేము మోడి చేరేసరికి అక్కడి మహిళలు రంగోళిలతో స్వాగతించారు. ఆ రోజు బ్రేక్‌ఫాస్టు అక్కడే. మాకు వాళ్లు చేసిన పొంగళి, ఉప్మ, పచ్చిపులుసు, కుసుమ గింజల పొడి, ఉడికించిన గింజలు, పండ్లముక్కలు అన్ని చాల రుచికరంగా అనిపించాయి. ఇక తిన్న తరువాత నడక ప్రయాణం ఝరికి మొదలైంది. చెట్లు, చేమను గమనిస్తూ చివరకు మేము ఔరిళి-ఈరిఖీలిజీరీరిశిగి ్పుళిళీళీరిశిశిలిలి వారు సేకరించిన విత్తనాల దగ్గరకు చేరుకున్నాము. అక్కడ వాళ్ల ముఖ్య ఉద్దేశం ళిజీవీబిదీరిబీ ఎరువులతో పంటలు పండించడం, అంతరించిపోతున్న పురాతన విత్తనాలను రక్షించడం, వాటిని సేకరించి రైతులకు పరిశోధన విభాగాలకు సరఫరా చేయడం. మన దేశంలో మూడు రాష్ట్రాలను మాత్రమే ఔరిళి-ఈరిఖీలిజీరీరిశిగి ్పుళిళీళీరిశిశిలిలి క్రింద ఎన్నుకున్నారు. అందులో జు.ఆ. లోని అదిలాబాద్‌ జిల్లా. ముందు తరాలకు నాణ్యమైన పోషకవిలువలతో కూడి విత్తనాలను అందించడం వీరి లక్ష్యం. అక్కడ వారు మాకు చూపించిన ఉదాహరణ (రీబిళీచీజిలి) గింజలు జొన్నలు, ఎర్రచారల కందులు. ఈ విత్తనాలు తక్కువ దిగుబడి ఇచ్చిన, నీరు ఉన్న లేకున్న కొంచమైన పంట వస్తుంది. అక్కడ చేప పిల్లల తయారీ ప్లాంట్‌ను, కంది తోటను చూసుకొని ఉషెగాంకు మొదలైంది మా ప్రయాణం.

ఉషెగాం చేరేసరికి అక్కడ పెద్ద ఊరేగింపుతో వచ్చి తిలకం దిద్ది, అందరి మెడలో బంతిపూలు, చిక్కుడుకాయలతో కలిపి కుచ్చిన దండలను వేసి చాలా ఘనంగా స్వాగతించారు. మోడీ, ఝరి, ఉషెగాం అన్నిచోట్ల చేసిన స్వాగతం అంత ప్రశాంతికే చెందుతుంది. అక్కడి మహిళలకు ప్రశాంతి ఒక్క దేవత, ఎందుంటే వాళ్ల జీవితాల్లో వెలుగు నింపింది. ఊరేగింపుతో ఆ ఊరిలోకి తీసుకెళ్ళారు. అక్కడివాళ్లు ఓజా తెగకు చెందినవారు. వాళ్లు చేసే చేతివృత్తినీ ఓజా అంటారు. అది చాలా ఓపికతో కూడిన కష్టమైన పని. అది పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అందరూ చేస్తారు. తేనెతెట్టి మైనం ముద్దతో చెయ్యవలసిన ఆకృతిని చేసి దానిపై వేడి చేసిన ఇత్తడి పోస్తే, ఆ వేడికి మైనం కరిగి ఇత్తడి ఆ ఆకృతిని దాలుస్తుంది. ఈ కళను కూడ ఈ మధ్యకాలంలో బయట వాళ్లకు కూడ నేర్పడానికి మన ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వాళ్లు అక్కడ ప్రదర్శించిన ఓజా కళచే తయారుచేసిన వస్తువులను చూసి మాకు నచ్చినవాటిని మేము కొనుక్కున్నాం. ఒక మహిళ తను స్వయంగా ఓ వస్తువు తయారుచెయ్యడం చూపించింది. ఉషెగాం లోనే మధ్యాహ్న భోజనాలు పూర్తిచేసు కున్నాం. వాళ్లంతా ఎంతో ప్రేమతో వడ్డిం చారు. మినప్పు వడలు, వాళ్లు చేసుకునే సంక్రాంతి స్వీటు, చిక్కుడుకాయ కూర అన్ని చాలా రుచిగా వున్నాయి. ఉషెగాం నుండి నిజామాబాద్‌-ఎర్నికి వచ్చేసరికి రాత్రి 9:55 అయింది. చీకట్లో మాకు కనిపించినంత వరకు సమతానిలయం చక్కటి చెట్ల మధ్య ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడ పిల్లలు లోపల నుండి అమ్మమ్మ అంటూ సత్యవతిగారి కొరకు పరుగెత్తుకొచ్చారు. 50 మంది పిల్లలు ఆ ఆశ్రమంలో ఉన్నారు. ఆ పిల్లలకు భోజనం, బస ఆశ్రమంలోనే. బడికి ప్రభుత్వ పాఠశాలకు వెళ్తారు. వాళ్లలో చాలా టాలెంట్‌ ఉంది. అక్కడ వాళ్లు స్వయంగా పూలగు చ్ఛాలు, గ్రీటింగ్‌కార్డులు తయారుచేశారు. కథలు, పాటలు, కవితలు అన్నీ స్వయంగా రాస్తారు. మాకు కొన్ని మచ్చుకు చూపించారు. మా అందరికి వారు తయారు చేసిన గ్రీటింగ్‌కార్డులను ఇచ్చారు. అక్కడ రాత్రి భోజనాలు పూర్తిచేసుకొని హైదరా బాద్‌కు బయలుదేరేసరికి రాత్రి 12:00 గంటలయింది. హైదరాబాద్‌ వచ్చేసరికి ఉదయం 4:00.

మేము రెండు రోజులే తిరిగినప్ప టికి నిజామాబాద్‌, అదిలాబాద్‌ ట్రిప్‌ చాలా నేర్పింది. ఆలోచిస్తే ఇటు సత్యవతిగారు కాని, అమృత మేడంగారు కాని, ప్రశాంతి గారైనా వారు ఎంచుకున్న ఫీల్డ్‌లో చాలా ఉన్నతంగా ఎదిగారు. ఇంక వారికి సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి ట్రిప్‌కి త్వరత్వరగా వెళ్ళాలని నేనే కాదు, ట్రిప్‌కి వచ్చిన అందరి మనస్సులోని మాట ఇదే. అడవిలో ప్రయాణం, అమృతగారిచ్చిన ఙ|ఆ ట్రీట్‌మెంట్‌, ఎంటర్‌టెయిన్‌మెంట్‌, సమతానిలయం పిల్లలతో గడపడం మాకెప్ప టికీ గుర్తుండిపోయే చక్కని అనుభవం.

థాంక్యూ సత్యవతిగార్కి, అమృత గార్కి, ప్రశాంతి గార్కి, మీ అందరికి.

 

ఒక అద్భుతమైన అనుభవం

 

సత్యవతి మరియు ప్రశాంతి గార్లతో ఆ ప్రయాణం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. నా స్నేహితురాలు ఇందిర వలన నాకు ఈ చక్కని అవకాశం లభించింది.

మేము హైదరాబాద్‌ నుండే నిజామాబాద్‌కు బయర్దేరి వెళ్ళి అక్కడ విజయ హైస్కూల్‌లో అమృతలత గారింటికాడ ఆగి సేద తీర్చుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి మరియు సాయిబాబా గుడి చూశాం. అవి ఎంతో అందంగా వున్నాయి. చూడ ముచ్చటైన చెట్లతో చాలా అందంగా వున్నాయి. తర్వాత వృద్ధాశ్రమానికి వెళ్లాం. అమృతలత గారు దాన్ని చాలా చక్కగా మేనేజ్‌ చేస్తున్నారు. ఆ రాత్రి అమృతలత గారింట్లో రాత్రి భోజనం చేశాము. ఎంతో చక్కని భోజనం పెట్టారు.

తెల్లవారి శ్రీరాంసాగర్‌ ప్రాజక్ట్‌కు వెళ్ళాం. అక్కడ చూసి వచ్చాక జలపాతాలు చూశాం. చాలా బావుంది. అక్కడ నుండి కుంటాల జలపాతానికి వెళ్ళాము తర్వాత మొండి గుట్టకు వెళ్లి అక్కడ భోజనాల చేసాం. తెల్లవారాక కొమరం భీం స్తూపానికి వెళ్ళా అక్కడి నుండి కొన్ని గిరిజన గ్రామాలు, వాళ్ళ జీవనశైలి చూశాం.

మొత్తం ప్రయాణం ఎంతో అద్భుతంగా వుంది. నేను జీవితంలో మరిచిపోలేను.

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.