– రమ్య,
భూమిక. ‘పిల్లల ప్రపంచం’ అనేది ఒక చిన్న పిల్లల పత్రిక. ఈ పత్రిక ఆవిష్కరణ 24.3.2014న మసాబ్‌ట్యాంక్, విజయనగర్ కాలనీ, గవర్నమెంట్ హైస్కూల్ లో జరిగింది. ముఖ్య అతిధులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఈ పత్రికను ఆవిష్కరించారు.
ఈ పిల్లలు అమన్ వేదిక అనే స్వచ్ఛంద సంస్థ నుంచి గవర్నమెంట్ హై స్కూల్‌లో చదువుతున్నవారు. పుస్తక ఆవిష్కరణ గురించి పిల్లలు చేసిన స్టేజీ డెకరేషన్, పిల్లల్లో ఉన్న యూనిటీ, పిల్లలు వాళ్ళకై వాళ్ళు పెట్టిన క్లబ్స్, లైటింగ్, స్పోర్ట్స్, గార్డెనింగ్, ఎగ్జిబిషన్ చాలా బాగా నిర్వహించారు. వాళ్ళకి వచ్చిన ప్రైజులు, పెయింటింగ్స్ ప్రదర్శనలో పెట్టారు. పిల్లలు నిర్వహించిన ఈ పుస్తక ఆవిష్కరణలో పిల్లలు చేసిన ఎక్టివిటీస్ అన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఒకరు కవితలు, ఒకరు బొమ్మలు ఇలా ఎన్నో ఆ పిల్లల ప్రపంచం పుస్తకంలో చక్కగా పొందుపరిచారు. ఇంక పిల్లలు పండిస్తున్న కూరగాయలు వంకాయలు, బెండ, టమాటాలు, పచ్చి మిరపకాయలు, కాకరకాయలు అందరికీ చూపించి ఇంకా పండిచడానికి కావలసిన మొక్కలను డోనేట్ చేయమని వారు కోరారు. పండించిన కూరగాయలను అమన్ వేదిక పిల్లలు తినడానికి మరియు ఇతర పిల్లలకు కూడా డోనేట్ చేస్తారు.
ముఖ్య అతిధులు అందరూ మాట్లాడుతు పిల్లలకు మంచి మాటలు చెప్పారు. చదువు కోవలసిన అవసరం, విలువలను, భవిష్యత్తులో ఎదగాల్సిన అంశాలు, చేరాల్సిన లక్ష్యాలను, పత్రికలో రాసిన అంశాలు వివరిస్తూ మంచి పని చేసారని పిల్లలను పొగడారు. ఇంకా ముందు ముందు మీరు మంచి రచయితలు కావాలని అన్నారు.
మరొక ముఖ్య అతిధి సత్యవతి కొండవీటి గారు మాట్లాడుతూ పిల్లలు చాలా మంచి పని చేసారు. నేను ఒక పత్రిక భూమిక నడుపుతున్నాను, నా పత్రికలో వేయడానికి మీరు రాస్తారా అవి అడిగితే అందుకు ఒకేసారి ఒహో ఒహో అని గట్టిగా సమాధానం ఇస్తూ మా పిల్లల ప్రపంచానికి కూడా మీరు రాయాలని అడిగారు. ఇంకా మంచిగా చదువుకొని గొప్ప వ్యక్తులు కావాలని ఇలా మంచి మంచి యాక్టివిటీస్ చేయాలని చెప్పారు.
విమల మాట్లాడుతూ ఎప్పుడైతే మంచి మంచి యాక్టివిటీస్ చేస్తున్నారో అప్పటి నుంచి పిల్లలు చాలా ఐక్యంగా కలసి పనిచేసుకోవడం, చక్కగా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు అన్నారు. పిల్లల ఆలోచనలో చాలా మంచి మార్పు వచ్చింది అన్నారు. ఈ సమావేశంలో కె.సజయ, విమల, అంబిక, అనురాధ తదితరులు పిల్లల నుద్దేశించి మాట్లాడారు.