అనగనగా ఒక ఊరిలో కుక్కపిల్ల ఉండేది ఒక రోజు కుక్కపిల్ల అడవికి వెళ్ళింది అడవిలో ఊయ్యాల కనిపించింది. కుక్కపిల్ల దాని పైన కూర్చొని ఊగింది. వాళ్ళ అమ్మ వచ్చి కుక్కపిల్లా, నువ్వు ఇక్కడ ఉన్నవా నీకోసం వెతికి వెతికి వచ్చాను. పద ఇంటికి వెళ్దాం. అని తీసికెళ్ళింది. దారిలో ఒక గట్టుపై ఉన్న చెట్టుపై రామచిలుక కుక్కపిల్లకి కనిపించింది. అబ్బా రామచిలుక ముక్కు ఎంత ఎర్రగా ఉందో అనుకుంది నేను నీతోస్నేహం చేయచ్చా రామచిలుకా అని అడిగింది రామచిలుక సరే అంది. అక్కడి చెట్టుకి గూడు కట్టుకుంటూన్న పిచ్చుక మరి నాతో స్నేహం చేస్తావా అని కుక్కపిల్లని అడిగింది.
ఏయి పిచ్చుకొ అట్లా గూడు ఎందుకు కడుతున్నావు అని కుక్కపిల్ల అడిగింది. వానాకాలం వచ్చేస్తుంది కదా. అందుకే తడవకుండా ఉండడానికే గూడుడుతున్నా. అని చెప్పింది. ఏయి ఇది నా ఊరు. నువ్వు ఇక్కడ కట్టుకోకు. ఫో. ఫో.. అంది కుక్కపిల్ల. పిచ్చుక చెట్టు కొమ్మలు నరుకుతున్న రాజు దగ్గరికి వెళ్ళి అయ్యోయ్యో చెట్టు ఎందుకు కొట్టేస్తున్నావు అని అడిగింది పిచ్చుక. చెట్టుమీద ఎక్కి మీ కాకులు, కొంగలు, కోతులు, అన్ని విసిగిస్తున్నాయి అన్నాడు రాజు. అంతలో కుక్క పిల్ల అక్కడికి వచ్చి ఏయి పిచ్చుక పొమ్మంటే పోకుండా ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అరిచింది. అంతలో దాని మీద చెట్టు కొమ్మపడి దెబ్బ తగిలింది. అప్పుడు కుక్కపిల్ల అమ్మా అమ్మా అని అరిచింది. ఏడ్చింది. అయ్యోయ్యో కుక్కపిల్లకు దెబ్బ తగిలింది. రక్తం వస్తుంది రండి రండి హాస్పటల్‌కి తీసుకెళ్దాం అని అంది పిచ్చుక. అప్పుడు అమ్మ పరుగు పరుగున వచ్చింది. రాజు కూడా వచ్చాడు. కుక్కపిల్లను లేపాడు. రామచిలుక వచ్చి గాయపాకు తెచ్చింది. ఆకు నలిపి కట్టు కడితే గాయం తగ్గిపోతుంది అని రామచిలుక చెప్పింది. కుక్కపిల్ల ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ ఏడవకురా ఏడవకురా అంటూ ఒళ్ళో కుర్చోబెట్టుకుంది. రామచిలుక, పిచ్చుక ఆకు మందు పెట్టి కట్టు కట్టాయి. చూడు కుక్కపిల్లా పిచ్చుక నీకు సహయం చేస్తోంది అన్నాడు రాజు. అట్లా పొట్లాడ కూడదు అని చెప్పింది కుక్కపిల్ల అమ్మ. అప్పటి నుండి మంచిగా ఒక కుటుంబంలాగా అయ్యారు అందరూ.