మనతో ఉంటూ
మనలో తిరుగుతూ
మనమధ్యలో మనుగడసాగిస్తూ
మనపట్ల ప్రేమను కురిపిస్తూ
నమ్మిన బంటులా కనిపిస్తూ
వెనుక గోతులు తీసే గుంటనక్కలు
వెన్ను పోటుతో వెన్నెముక విరిచే మనుషులు
కుట్రలు పన్నే కపట బుద్ది మానవులు
స్వార్థం అనే దుప్పటి కప్పుకున్న వీళ్ళు
అన్నదమ్ముల్లేరు
అక్కచెల్లెళ్ళెరు
అమ్మనాన్నల్లేరు
బంధుమిత్రులు లేరు
తనొక్కడే ఎదగాలి
అందలం ఎక్కాలి
అందరిని అణగతొక్కాలి
బంధాలు ఏవైనా మోసానికి వెనుకాడరు
వీరి పయనం ఎటువైపో?