సృష్ఠికి బ్రహ్మ బిడ్డకు అమ్మా
బ్రహ్మదేవుడి సృష్ఠికైన అమ్మకావాలి
బీజాన్ని చీల్చి అంకురింప చేస్తుంది ధరణి
గర్భందాల్చి శిశువును అందిస్తూంది తరుణి
భగవంతుడు ఇంటింటిలో ఉండడం కుదరక
ఇంటిఇంటికో అమ్మను సృష్టించాడు
అందుకె తల్లి తండ్రులు ప్రత్యక్ష దైవాలు
అమ్మకన్నా మించిన దైవం ఇంకొకటిలేదు
ఎన్ని ఛందాలు వద్దన్నా కన్న బంధం కాదనదు
ప్రపంచ మంతటా తమ కడుపుతీపిని
కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా అమ్మలు
పిల్లలు చెడ్డవారైనా క్షేమంగా ఉంటే చాలు
అనుకునేది అమ్మ మనసు
ప్రేమకు, అనంతమైన త్యాగానికి నిలువు
అమ్మ ఆశీస్సులు లేనిది బ్రహ్మ పూజ అందుకొనడట
అమ్మను ఒక్క కన్నీటి బిందువు
వేయి బిందువులై పిల్లలకు అడ్డుపడుతాయట
అమ్మలకు నిరాదరణ చెయ్యవద్దు
భారమని వృద్దాశ్రమాలకు పంపవద్దు
అమ్మ ప్రత్యక్ష్య దైవమని ఆరాధించండి
మీ బాటను సుగమం చేసుకోండి
అందుకే మాతృదేవో భవ: అన్నది వేదం