బీజమంత్రం ఒడియా మూలం-ప్రతిభారాయ్‌ అనువాదం-జయశ్రీ మోహన్‌రాజ్

పీనుగుల్ని కోసి పని చేయాల్సి వచ్చేది. వేళకు తిండి తిప్పలుండవు. అస్యృశ్యులుగా, దారిద్య్రంలో, అందరికి లోకువగా బ్రతకాల్సి వచ్చేది. మంచి బట్టలేసుకునేందుకు వీలుండదు. హీనమైన బతుకు వెళ్లదీయాల్సివచ్చేది. పరారుు రాష్ట్రంలో బతికినా ఊళ్లోకన్నా మంచి బతుకది చేతి జీతం వస్తుంది. కార్మికులన్న మర్యాద ఉంటుంది. కార్మికులు అంటరానివారు కారు మనసుకు నచ్చితే నిషా చేసేందుకు స్నేహితులతో కలిసి తాగుతారు. డబ్బుంటే తల్లిదండ్రులు తప్ప అన్ని దొరుకుతారుు అక్కడ. ఊళ్లో భార్య ఉంటుంది. ఊరికెళితే బంధువులు గౌరవిస్తారు. భార్య కూడా అతిధి మర్యాదలు చేస్తుంది. ఆమెకు సబ్బులు, అత్తరులు,నైలాన్‌ చీరల కోసం పాతిక రూపాయలు ఇచ్చేస్తే ఆమెకు సంతోషమే సంతోషం. ఇక వచ్చే యేడాది వరకూ తన కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. ఫిర్యాదు చేయకుండా వయసు పైబడిన కొద్దీ భార్యాభర్తల మధ్య ఆకర్షణ తగ్గుతుంది. ఫాక్టరీలో పని ఎక్కువవుతుంది. వీటన్నింటితో ఊరికొచ్చేది తగ్గుతుంది. వయసును ఆగకపోరుునా భార్య ఆగకుండా ఎక్కడకు పోతుంది? హరిజనవాడలలోని స్త్రీలకు బుద్ధి తక్కువ. లెక్క కడితే వైవాహిక జీవితంలో మూడు భాగాల్లో ఒక్క భాగం మాత్రమే భార్యా, భర్తలు కలసి ఉంటారు. అవే వారికి వెన్నెల రాత్రులు.

కలకత్తాలో ఉంపుడుగత్తెల పట్టు తప్పించుకొని భార్యల దగ్గరకు వచ్చేసరికి వారికి చాలా రోగాలు అంటినట్లు తెలుసుకుంటారు. తప్పుడు అలవాట్ల ఫలితంగా వచ్చిన రోగాలతో భర్తలకు చివరి వరకూ సేవలు చేస్తుంటారు. ఆ విషయానికొస్తే రాణి జీవితం అంత హీనమైంది కాదు. ఆమె ఒంటరితనం ఆమెను ఎప్పుడూ వెక్కిరించలేదు. ఆమె చేరుు ఎప్పుడూ ఖాళీగా ఉండలేదు.

వయస్సు మీద పడటంతో రాణి ఇక దూర ప్రయాణాలు పెట్టుకొలేదు. కాని దూర గ్రామాలు మాత్రం ఆమెను విడిచిపెట్టలేదు. అర్ధరాత్రులు వచ్చి ఆమెను తీసుకుపోయేవారు. చేతుల్లో పట్టు ఉన్నంతవరకూ, సుఖ ప్రసవాలు చేయొంచే శక్తి ఉన్నంత వరకూ ఆమె వంటింట్లో పొర్యుులో కట్టెలకు కొదవ ఉండలేదని కాని ఎప్పుడైతే ఆమె చూపు మందగించిందో, చేతులు వణకడం మొదలెపెట్టిందో రాణి నెమ్మదిగా పనికి వెళ్లడం తగ్గించుకుంది. అప్పటికి అర్ధరాత్రులు రాణి ఇంటిి తలుపులు తట్టడం ఆపలేదు జనం. ఆమెను బతిమాలుకుంటారు తమ ఆడకూతుళ్ల కడుపులు దించమని. ఆ వణికే చేతులతోనే పని జరిపించమంటారు. తల్లి ప్రాణాలు పోతే ఆమె తప్పు కాదు, తమ కంటే ప్రాప్తమని అంటారు. రాణికి తెలుసు వారి మనస్థితి. వాళ్లు తమ చేతుల్తో ఆడపిల్లకు విషమియ్యలేరు. పాప భీతివల్ల రాణి చేతుల్లో పిల్ల ప్రాణాలు పోతే వారికి దు:ఖమే గాని పాపం నిందల నుండి తమకు ముక్తి దొరుకుతుంది కదా.

చేతులు మొక్కి వారిస్తుంది రాణి. వారు తీసుకుని వచ్చిన డబ్బు ధాన్యం, చీరలను తిరిగి ఇచ్చేస్తుంది. తన చేతుల మీద ఆమెకు నమ్మకం తగ్గిపోరుుంది. చూపు కూడా మందగించింది. ఆశతో ఆడకూతుళ్లకు ప్రాణాపాయం తెచ్చేందుకు ఒప్పుకోలేదు. వాళ్లు నిందమోస్తూ బతికినా ఫర్వాలేదు.

ఈ ప్రపంచంలో ఎవరైనా ‘సతి’ అనిపించుకునే వారున్నారా ? సతీసావిత్రి నుదుట కుంకుమ పెట్టుకొని తిరగేవారి రహస్యాలు రాణికి తెలుసు. రహస్యం వెలికిరాకున్నంతవరకూ వారు సతులు విధి వక్రించి వారి రహస్యాలు బయటపడితే అసతులు కొందరు శారీరకంగా సతులు కావచ్చు కానీ మరి మానసికంగానో? రాణికి తన మనస్సులోని మాట తెలుసు. రాణికి పాదాలు తప్పుదోవ తొక్కలేదు కానీ మనస్సులో ఒకటిరెండూ సార్లు తప్పుడు ఆలోచనలు వయసు ప్రభావం వలన వచ్చాయని అందర్ని పిలిచి మరీ చెప్పలేదు కదా! అందువల్లనే ‘సతి’ అన్నమాట చెవిన పడ్తే రాణికి ఒళ్లు మండిపోతుంది.

రాణి క్కుపేరు ‘నెతి’ దాని కూతురు పేరు ‘దూతి’ దాని కూతురు ‘మోతి’ దాని కూతురు పేరు ‘రతి’. ఒక ఇప్పుడు రాణి ముసలితనానికి తోడుగా తాను కూడా వయస్సు మీద పడినా పాతపడిన ఇంటికి కాపలా కాస్తుంది. ‘సతి’-ఆ పేరు విని లోకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు.దాని పేరు సతి అంట! అంటరాని రాణికి జీవితాంతం పాపపు కడుపులను ఆదరించిన ఆడది. ఆమెకు ‘సతీనామం’ అంటే ఏమి అర్ధమవుతుంది?

కొంతమంది అగ్రకులస్తులు ఆమెను తప్పుపడ్తారు.ఆమె సతీ పదాన్ని అమర్యాద చేస్తూందని. కానీ రాణి తన జీవితంలో ఎవరిని వీరు సతులు అని కాని అసతులు అని కాని అమర్యాద చేసి ఎరుగదు. ఆమెకు తెలుసు సతీత్వం కాదు అసతీత్వం జన్మతోనే అబ్బుతుందని. సమాజం ఆ సతీత్వాన్ని సహంచకపోవడం వలన అది జన్మత: వచ్చిన గుణమైనా తప్పుగా పరిగణించబడుతుంది.కుక్కల సమాజంలో అసతీత్వం తృణీకరించబడలేదు. అందుకే నెతి, దూతి, రతి ఇంకా సతి ఊరుమీద పడి తిరిగి గంపెడేసి పిల్లల్ని కన్నా ఎవరూ వాటిని దూషించరు.రాణికి ‘సతి’ నామాన్ని విపరీతార్థం చేయడానికి రాణి తన కుక్కను సతి అని పిలువలేదు. మోతి, రతి ఇత్యాది పేర్లతో కలుస్తుంది నుక దీన్ని ‘సతి’ అని పిలిచింది.

చేరుు పట్టుకుని ఏడడుగులు వేసిన భర్త ఆమెపట్ల సరిగా వ్యవహరించలేదు. కన్న కొడుకు తల్లి పట్ల తన కర్తవ్యాన్ని నెరవేర్చలేదు. కుటుంబంలోని వ్యక్తులు ఇరుగు పొరుగువారు రాణి వెళ్లి ఉద్దరించి తల్లులుగా చేసినవారు, సంతానంలేని దంపతులకు దేవత ఆదేశమంటూ సంతానప్రాప్తి చేసి గౌరవించిన వారు కూడా ఆమె చివరి రోజుల్లో ఆమెను పట్టించుకోలేదు. కానీ వంశపారంపర్యంంగా ఆమెతో ఉన్న క్కులు మాత్రం ఆమెను వదిలివెళ్లలేదు. ఆమెను నీడలా కాపలా కాసేయి. ఈ నేతి, దూతి, మోతి, రతిలు ఆమెను విడిచి వేరోకరి గుమ్మం కూడా తొక్కలేదు. ఇప్పుడు సతి కూడా రాణిలాగే వయసు మళ్లింది. ఇప్పుడు రాణికి వంటా, వార్పు చేయలేకపోతుంది. మునుపట్లా చద్దన్నాలతోనే బొటా బొటిగా జీవిస్తుంది. అప్పుడు కూడా సతి రాణి వెన్నంటే ఉంది. రాణి ముందు చనిపోతుందో,సతి ముందు చనిపోతుందో తెలియదు. ఒకే రోజు పోతారా రుుద్దరూ? అలా జరుగకపోతే ఒకరు పోతే రుుంకొకరు అనాధలైపోతారు.

ఇంకా రాణి ఇంటికి ఎవరూ రావడం లేదు. ఆమె గుమ్మం ముందు ఎవరూ లేరు. రాణి చేతులు ఇక పనికి రాకుండా పోవడంతో ఊళ్ళో ఎవరికి సుఖ ప్రసవం కావడం లేదు. పాపగర్భం దించుకోవడం లేదు అనడానికి వీల్లేదు. ప్రపంచం ఎటు వైపు పోతోందో అటే ప్రయాణిస్తుంది, ప్రయాణించబోతుంది. ఒక్క పాపి చనిపోతే లోకంలో పాపం అంతా అంతమై పోదు గదా! ఒక్క పుణ్యవంతుడు చనిపోతే లోకంలో పుణ్యమంతా హరించుకుపోదు కదా! పాప పుణ్యాలు తొబుట్టువుల్లాంటివి. చెట్టాపట్టాలేసుకొని నడుస్తారుు.ఈ రోజు రాణి బాధతో దు:ఖంతో ఆకలితో కాలం వెళ్లదీస్తుంటే అది ఆమె చేసుకున్న పాపఖర్మ అని లోకులనడం సమాజన్యాయం.

రాణికి ఎటుంటి అంతుపట్టని వ్యాధి పీడిస్తూంది? రాజదర్పంతో నడిచిన రాణి ఈ రోజు ఓ పురుగులా దేకుతూ గుమ్మం వరకూ రాగలుగుతుంది. గుండెల్లో కడుపులో నొప్పి పెడుతూ ఉండగా ఎండ కాచుకుంటూ తన పాడుపడిన అరుగుమీద కూచొని ఉంటుంది. ఇంతకూ ఆమెకు వచ్చిన రోగమేంటి ? అది ‘పాపపు రోగం’. అనేక గర్భ స్రావాలు చేసిన పాప ఫలం. భ్రూణ హత్య పాపం. ఆ పాప ఫలం ఆమె ఈ చివరి దశలో అనుభవిస్తూంది. ప్రసవ వేదనలో మెలికలు తిరిగినట్లు రాణి నొప్పితో మెలికలు తిరుగుతూ ఉంటుంది. ప్రపంచంలోని అనేక అవాంఛనీయ గర్భాల విచ్ఛేధనాలను తనలో రుుముడ్చుకొని పాపాలన్నింటిని తన గుండెల్లో దాచుకుందేమో అన్నట్లు ఇప్పుడు వసుయడిగి శక్తి హరించి దర్ఫంపోరుు అశక్తురాలైనప్పుడు రాణిని ఆ పాపాలు చుట్టుముట్టారుు, ఆమెను మరణం వైపు నెట్టివేస్తున్నారుు అంటారు లోకులు.

రాణి చెవుల్లో పాపాల రాగాలు వినిపిస్తున్నారుు. గోడలకు చెవులుంటాయని అంటారు.వయస్సు మళ్లినా ఆమె మనిషే కదా. చూపు మందగించినా చెవులు బాగానే వినిపిస్తున్నారుు. తన పాపాల పట్టీని ఆమె ఎవరికీ అప్పజెప్పలేదు.ఆమె ఎవరి మీదా ఆధారపడలేదు. ఎవరికి జవాబివ్వలసిన అవసరం లేదు. తనను తానే ప్రశ్నించుకుంటుంది, తనలోతానే జవాబు వెతుక్కుంటుంది. సమాజం నియమించిన కట్టుబాట్లు తెంచుకొని ఏర్పడిన స్త్రీ, పురుష సంబంధంలో ఎక్కువ తియ్యదనం ఉంది, మత్తు ఉంది. నిజం ఉంది. కానీ ఆ అక్రమ సంపర్క ఫలం మాత్రం చాలా చేదుగా ఉంటుంది. విషంలా ఉంటుంది. ఆ విషయం తెలిసి కూడా మనుషులు అక్రమ సంబంధాల వైపు మొగ్గుతారు. అరుుతే ప్రసవ వేదనలో తేడా ఉండదు. అది సక్రమ సంతానమైనా, అక్రమ సంతానమైనా. అది పవిత్రమైంది. దాన్లో మాతృత్వపు రక్తం, కన్నీరు కలగలిసి అమృతమయం అరుు నిర్మలంగా మారుతారుు. ఆ విషయం రాణి కంటే ఎక్కువగా ఇంకెవరికీ తెలియదు. శాస్త్ర పురాణాలు చదివి ఏది మంచీ, ఏది చెడూ తెలిసిన వారికి కూడా ఈ విషయం అంతగా అర్ధం కాదు. అందుకే ప్రసవ వేదనలో కూడా మంచి,చెడులేదు. ప్రసవ వేదనలో మూల్గుతున్న తల్లి అరుపులను విని ఎవరైనా అది అక్రమ సంతానమో లేదా సక్రమ సంతానమో చెప్పగలరా? లేదు. ఈ ప్రపంచంలో అంతటి జ్ఞానులు ఇంకా పుట్టలేదు. మామిడిపండును తిని టెంక పారేయడం రివాజు అందుకే ఈ రోజు రాణి అష్టకష్టాలు పడుతున్నా ఎవరకి లెక్కలేదు.

రాణి ఆఖరి దశలో ఉందని చుట్టుప్రక్కల అందరికి తెలుసు. ఆమె కొడుకుకి కబురు వెళ్లింది. కొడుకు శెలవు తీసుకొని రావాలి. రాత్రంతా గుమ్మంలో ముసలి కుక్క ఊలపెడ్తూనే ఉంది. చుట్టు ప్రక్కలనున్న అందరి నిద్ర చెడింది. రాణకిి అదితప్పక కాళరాత్రి. ఉదయం నీరెండ అరుగుమీద పడింది. చూరు దగ్గరున్న రేగిపండు చెట్టులోని పండుటాకుల మధ్యనున్న పండ్లు నవ్వుతున్నారుు. ముసలికుక్క ఏడుపు ఆపింది. తోక ముడుచుకొని రోకలి బండలా ఓ మూల పడుకొని ఉంది. ఆకలో, దు:ఖమో తెలియదు. కాకి ఒకటి రాణి ఇంటి చూరు మీద కూర్చొని అరుస్తుంది. తెల్లవారుతూనే రాణి కొడుకు వచ్చి చేరాడు. రాణి ఒక్కతే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. రాజైనా చావులో ఒంటరిగానే పోరాడాలి. అందుకే ఆ విషయమై రాణికి చింతలేదు. కొడుకు వైపు చూస్తూ ఉండిపోరుుంది. ఏదో చెప్పాలని అనుకుంది. పెదవులు ఎండిపో యారుు. కొడుకు ఆర్ధ్రంగా అన్నాడు. ”ఏం చెప్పాలని అనుకుంటు న్నావమ్మా… చెప్పు నీ ఆఖరి మాట” ఆరిపోయేముందు ఎగసిన దీపశిఖలా రాణి గట్టిగా అంది. ”ఈ ఊరి మగాళ్లకి చెప్పు ఆడవాళ్లను ఆటబొమ్మలుగా చూడవద్దని. రక్త మాంసాల శరీరం ఉండగా కాలు జారదని ఎలా అనుకోవాలి? దారి జారుడుగా ఉంటే అది వారి తప్పెందుకు కావాలి? మగాళ్లే కదా ఆ దారిని చేసింది. వారు మాత్రం తమకు తోచింది చేస్తారు. ఆదవాళ్లని సతిగా ఉండమం టారు.నువ్వే ఇంటి పట్టున ఉంటే నీ పెళ్లాం చచ్చిపోయేదా? రాణి నవ్విందో ఏడ్చిందో తెలియదు. నవ్వి ఉన్నా మోహం ఈడ్చుకుపోరుు ఉండటంతో ఏడ్చినట్లే అనిపించింది. అంతే, రాణి కళ్లు మూసింది.

కలకత్తా నుండి తెచ్చిన మిఠారుులు కుక్కముందర జల్లేసాడు రాణి కొడుకు కాని దానివైపైనా చూడలేదు. కుక్క ఊరకే మూలుగుతుంది. కాళ్ల సందుల్లో మోహం దూర్చుకొని పడుకుంది.

రాణికి క్రియా కర్మలు చేసి ఆమె ఒక్కొక్కటిగా కూడాబెట్టిన డబ్బు దస్కం తీసుకొని వెళ్లిపోయాడు ఆమె కొడుకు ఇకపై తిరిగిరాలేదు.

రాణి పాడుపడిన గుడిసె అలానే వుంది. ఏదో భయంతో ఎవరూ ఆ ఇంటిని ఆక్రమించలేదు. అర్ధరాత్రి వేళల్లో ఆ ఇంట్లోంచి ఎవరిదో ప్రసవవేదన ఆక్రందనలు వినిపిస్తుంటారుు. అది పాప గర్భవేదనో సక్రమ సంతాన ప్రసవవేదనో ఎవరికి తెలుసు? అది ఒక ప్రళయ హుంకారం. చీకటి రాత్రిల్లో అందరిండ్ల తలుపులు మూసి ఉంటారుు.కాని రాణి రుుంటి తలుపు తట్టిన శబ్ధం వినిపిస్తుంది.

(అయిపోయింది)

Share
This entry was posted in అనువాదాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.