గడ్డకట్టిన భావజాలంతో మొలత్తిెన మీ ప్రశ్న ..
నా మూలం ఏదనేగా మీ వెతుకులాట .?!
నా పుట్టుపూర్వోత్తరాలేమిటనేగా మీ గుంజులాట ?!!
నా అస్తిత్వం ఎక్కడిదనేగా మీ వాదులాట?!!!
నిజమే .. నేనెక్కడిదాన్ని ?
తమిళనాడు? ఆంధ్రా ..?? తెలంగాణా ..???
నాదే ప్రాంతం ? నేనేమని చెప్పుకోవాలి ??
నేను పుట్టిపెరిగిన ప్రాంతాన్నా ..
మా తాత ముత్తాతలు తిరుగాడిన తావునా
నా మూలాల తోనే
నా ఎదుగుదల, నా బతుకు ముడిపడి ఉందట !
అలలు అలలుగా ఎగిసిపడుతున్న ఆలోచనలు
ఆకాశ మేఘాల్లా.. తెల్ల ఐరావతంలా తోసుకువస్తూ ..
అమ్మా.. గోదారమ్మ తల్లీ నీవైనా చెప్పు తల్లీ
నీవెక్కడో పుట్టావ్ నాసిక్ లో ..
వాలుని బట్టి సాగుతూ వాగుల్ని వంకల్ని
ఐక్యం చేసుకుని కనువిందుచేస్తూ కొండాకోనల్ని
దాటుతూ గుండెని విశాలం చేసి గంగాజలమై జనం గొంతుల్ని
తడుపుతూ పంట పొలాల్ని
సస్యశ్యామలం చేస్తూ బంగారు పంటల్ని
ఇస్తూ బంగాళాఖాతంలో విశ్రమిస్తున్నావే
నీ నడక సాగిన పొడవునా అంతా నిన్నే
తలుస్తూ అక్కున చేర్చుకున్నారే ..
వేగం తగ్గిన నీ కోసం అర్రులు చాస్తున్నారే
ఎవరికివారు తమ చెందుతావంటున్నారే
మరి నన్నెందుకమ్మా ఇలా అవమానిస్తారు ..?
బతుకు మజిలీలో మావాళ్ళు చివరికిక్కడ చేరితే
జరిమానా నాకు విధించడం న్యాయమా ?
ధర్మం చెప్పమ్మా.. గోదారమ్మ తల్లీ
ప్రవాహ తీరు నీూ నాూ ఒకటి కాదా
పలుకు .. స్వరం మారిపోతుందా .. ?!
ఇన్నాళ్ళూ నాదైనది ఇప్పుడు కాదంటుంటే
ఇన్నేళ్ళ నా కృషిని మరుగుజ్జును చేస్తుంటే
ఎదనిండా శిలాక్షరాల గాయాలై నెత్తురోడుతుంటే ..
జలపాతపు ¬రులా సలుపుతుంటే
జాలరిలాగా జల్లెడ పడుతున్నా ..ఆత్మీయ కలయికలకోసం