పల్లెటూళ్ళ నుండి వచ్చే కూలీలకు తక్కువ కూలీ దొరికేది. పని కూడా ఎక్కువ చేయించుకునే వాళ్ళు కాదు. ప్రారంభంలో ఈ కార్మికుల ఐక్యతను విడగొట్టాలని స్థానీయ కాంట్రాక్టర్లు లోకల్ లేక ఊరివాళ్ళతో బంధుత్వం కలుపుకుంటూ ఊరు, ఊళ్ళలోని ఇళ్ళ గురించి మాట్లాడుతూ వీళ్ళని బ్లాక్-షీప్ లాగా ఉపయోగించుకునే వాళ్ళు. అంటే ఒక రకంగా సమ్మెని చేయకుండా చేనేవారు. కాని తరువాత పల్లెలనుండి వచ్చిన ఈ కార్మికులు కొంత తెలివితేటలు తెచ్చుకున్నారు. మేం వీళ్ళందరిని కార్మికుల హక్కులకోసం చేనే పోరాటంలో పాల్గొనడానికి ఎంతో ప్రోత్సహించేవాళ్ళం. వీళ్ళ ఈ ఐక్యత నేషనలైజేషన్ అయ్యాక ఇంకా పెరిగింది.
ఆరా, ఛపరా, పాట్నా, బలియా, బెంగాల్‌లోని చదువుకున్న ముంషీ బాబులు (గుమాస్తాలు) సర్వేయర్, చెన్‌మెన్, మైనింగాన్ సర్‌దార్, ఓవర్‌మెన్‌ల పనులు చేనేవాళ్ళు. ఈ స్థాయిలలోని చదువురాని వాళ్ళు, రంగ్‌దార్ట్‌గా, గార్డ్‌లుగా చౌకీదార్లుగా పనులు చేనే వాళ్ళు. యజమానుల తరపున నుండి పహెల్‌వాన్ల పనులు చేనేవాళ్ళు. గయ, నలందా, ఔరంగాబాద్, ఛపరా, ఆరా, బలియాలోని కొయరీ, కూర్మీ, యుదవ్, దుపాధ్‌ల గుప్పిట్లో ఉండేవాళ్ళు. వీళ్ళందరు తమ తమ క్షేత్రాలలోని ధనవంతులు. వీళ్ళు తమ తమ గ్రామాలలో వీళ్ళను ఉపయోగించుకుని తమ రాజనైతిక, ఆర్థిక పరిన్థితులను మెరుగు పరుచుకునేవారు. గనులలో తమ రక్షణ కోసం వీళ్ళని తీసుకు వచ్చేవాళ్ళు.
కొత్త కొత్త యూనియన్లు తయారవుతున్నాయి. వీటి సంఖ్య పెరగసాగింది. టాటా కంపెనీ వెన్ట్ బొకారో లోయలలో ఒక యూనియన్ పెద్ద ఉద్యమం నడప సాగింది. ఎన్.ని.డి.పి. గనులలో సమ్మెలు మొదలయ్యాయి. ఈ సమ్మెలు ఎన్.ని.ఓ.ఈ.ఎ. ల నేతృత్వంలో జరిగేవి. 1957-58 సం||లోనే గనులలో కొంత ఉద్యమం మొదలయింది. అందువలన రాజు సాహెబ్ కాంట్రాక్టర్లందరికీ యూనియన్లను ఎవరు ఏర్పాటు చేయకుండా చూడాలని ఆజ్ఞ జారీ చేసారు. ఇట్లు చేయడం కాంట్రాక్టర్లకి కొంత లాభమే. ఈ యూనియన్లు కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినవి. అక్కడక్కడా జయప్రకాష్ నారాయణగారి సోషలిస్టు పార్టీకి సంబంధించిన యూనియన్ కూడా ఉండేది. రాజు సాహెబ్ వీటన్నింటికి విరోధి. అందువలన ఆయన బొగ్గుగనులలో మేం రాకముందు ఎప్పుడు ఎటువంటి యూనియన్ లేదు.
హజారీబాగ్, రాoగఢ్, కోడరము మొ||లైన నగరాల వ్యాపారస్థులు, చిన్న చిన్న కుగ్రామాల చిన్న చిన్న వ్యాపారస్థులు, కార్మికులకు జీతం ఇచ్చే రోజున అంటే ఆదివారం, సోమవారాలలో సామాన్లు తెచ్చి లోయలలో, రోడ్లలలో సంతలను పెట్టేవారు.
వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినంత ధరలకు వస్తువులను అమే్మనవాళ్ళు. సరుకులు తీసుకురావడానికి సాధనాలు లేవు. ఎడ్లబళ్లమీద, ట్రక్కులమీద సరుకులు వేసుకు వచ్చేవారు.
సంతలు ఇప్పుడు ఉన్నాయి. కాని ఇప్పుడు టాక్సీలు, మాక్సీ, ట్రాక్టర్స్, బన్‌లు వచ్చాయి. ప్రారంభంలో మొదటివారంలో సంతల ఏర్పాటు ఉండేది. కాని ఇప్పుడు వీటి సంఖ్య చాలా పెరిగింది.
1957లో ప్రభుత్వం ఏర్పాటయ్యాక మళ్ళీ రాజు కామాఖ్యా నారాయణ్ ఆన్తిపాస్తులు గవర్నమెంటు తీసుకోవాలి అన్న విషయంలో చర్చ మొదలయింది. ఒకసారి రాజుసాహెబ్ జనతా పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయింది. ఆయన తన పార్టీ కోసం తవ్వకాలను, వనమంత్రాలయున్ని తీసుకున్నారు. తన ఆన్తి-పాస్తులకు సంబంధించిన కాగితాలను ఆయన మాయం చేసారు. సంయుక్త సోషలివ్డ్‌ు పార్టీ అధ్యక్షుడు ప్రణవ చటర్జీ, కర్పూరీఠాకుర్‌లు ఈ విషయంలో ఎంతో కాలం చర్చ జరిపారు. హజారీబాగ్ జిల్లా గనుల అధికారి శ్రీ నమో నారాయణ్ ఝా కూడా ఈ విషయంలో ఎంతో పోరాడారు. చివరికి 1968లో రాజు సాహెబ్ గారి గనులు, తదితర ఆన్తిపాస్తుల విషయంలో కోర్టు తీర్పు ఇచ్చింది. బీహారు ప్రభుత్వంలోని ఒక పై అధికారిని గనుల రినీవర్‌లో నియమించారు. రాత్రికి రాత్రి రాజు సాహెబ్ ఆన్తిపాస్తులను బీహారు ప్రభుత్వం జప్తు చేనింది. ఎవరికి లేశమాత్రం ఈ విషయం గురించి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. రాజు గారికి ూడా తెలియదు. ఒకవేళ ఇట్లా జరగకపోయి ఉంటే సుేలపైన సుేలు వేస్తూ తన పబ్బం గడుపుకునేవారు. ఆయన తమ ఆన్తి-పాస్తులను ఏమాత్రం ఒదులుకునే వారు కారు. పై కోర్టులకి ఈ కేసును తీసుకు వెళ్ళేవారు. బహుశ ఇప్పటిదాకా ఈ కేసు నడుస్తూనే ఉండేది. శ్రీ సుబ్రహ్మణ్యం గారు (ఐ.ఎ.ఎన్) రినీవర్‌గా నియమింపబడ్డారు. నమో నారాయణ ఏజెంట్‌గా నియుక్తమయ్యారు. రాజుగారి పద్మామహల్‌లో కొంత భాగాన్ని (ఇక్కడ వీళ్ళ అమ్మగారు ఉండేవారు) ప్రభుత్వం వదిలేనింది. మహల్‌లోని తక్కిన భాగం అంతా గవర్నమెంటు తీసుకుంది. తరువాత అక్కడ బి.ఎo.పి. ట్రైనింగ్ సెంటర్ పెట్టారు.
రాజు సాహెబ్ అధికారం ఉన్నంతకాలం అక్కడ యూనియన్ తెరిచే అధికారం ఎవరికీ లేదు. అసలు ఏ యూనియన్ నాయకుడు అటువైపు వెళ్ళడానికి ూడా సాహనించలేదు. ఒకసారి ఇంటెక్ నేత అయిన నిద్ధేశ్వర్ ప్రసాద్; వీరే తరువాత బీహారు కాంగ్రెసు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసారు; యూనియన్‌ని స్థాపించాలని ప్రయత్నం చేసారు. కాని రాజు సాహెబ్, ఆయన దగ్గర పనిచేనే కాంట్రాక్టర్లు, ‘చావడానిౖనా ఇష్టపడు. లేకపోతే అమ్ముడు పోవడానిౖనా, ఈ రెండూ కాదంటే ఈ ప్రదేశం వదిలి వెళ్ళిపో…” అంటూ బెదిరించారు. ఇక చేనేది ఏమీలేక నిద్ధేశ్వర్ గారు వెనక్కి వెళ్ళిపోయారు.
టాటా కంపెనీ-వెన్ట్ బోకారోలో గనులు ఘుటో టాండ్‌లో కూడా ఇదే ఆచారం నడుస్తూ ఉండేది. టాటా కంపెనీలో వేలం ఇంటెక్ యూనియన్ మాత్రమే అనుమతి ఉండేది. తక్కిన యూనియన్లను వీళ్ళు అణిచేనేవారు. టాటాలో రాజు అనే ఒక నేత నేతృత్వంలో ఉద్యమం ప్రారంభం అయింది. కాని దీన్ని పై అధికారులు అణచివేసారు. కాని కార్మికుల మనస్సులలో ఆ నేతపట్ల ప్రేమ-మమకారాలు ఉండేవి. తమ అసమర్థత మీద వాళ్ళకు కోపూం ఉండేది. సమ్మె 100 రోజులు నడిచింది. కాని తరువాత ఆపేయాల్సి వచ్చింది. కాని కార్మికులు ఈ సమ్మెను గుర్తుంచుకుని తలపైత్తిె నడిచేవారు. కార్మికులు నిస్సహాయులై ఇంటెక్ నేతల దగ్గరికి వెళ్ళే వాళ్ళు. కాని వాళ్ళు లోలోపల వీళ్ళంటే అసహ్యించుకునేవాళ్ళు.
బేరమొఫీల్డ్ గనులపై ధూరీ రాజుగారికి అధికారం ఉండేది. అందులో ఓ పెద్ద దుర్ఘటన జరగటం వలన 300 మంది కార్మికులు చనిపోయారు. కాని రికార్డులలో కనీసం ఈ కార్మికుల పేరైనా నమోదు కాలేదు. ఈ దుర్ఘటన మూలంగా రాజుగారి పేరు పాడయిపోయింది. ప్రజలదృష్టిలో వారు దిగజారిపోయారు. ఈ ప్రదేశంలో ూడా ఇంటెక్ యూనియన్ ఉండేది. కాని ఈ యూనియన్‌లో ఎక్కువగా కాంట్రాక్టర్లు, పహిల్‌వాన్ల ప్రభావం ఎక్కువగా ఉండేది.
ఆ కాలంలో వేలం దేలా, ఝూర్‌ఖండ్, ఝరవాలలోనే గనుల త్రవ్వకాలు జరిగేవి. యూనియన్‌ని తయారు చేనే ధైర్యం ఎవరికి లేదు. ఝూర్‌ఖండ్‌లో బాబూ శివరామ సింహ్, బ్లాక్ నంబర్ త్రీలో గోపాల్ ప్రసాద్ (వైన్ ఛాన్స్‌లర్, మగధ యూనివర్సిటీ, గయ) బ్లాక్ నంబర్ వన్, టూ లో పి.డి. అగర్‌వాల్, పెద్దసంఖ్యలో పైటీ- ఠేకీదారులతో కలిని రేజింగ్ కవ్‌ు నీలింగ్ కాంట్రాక్టర్లుగా పనిచేసారు. పి.డి. అగర్‌వాల్ ఝరియాలో గనుల త్రవ్వకాలను కొనసాగించేవారు. తన స్వంతంగా గనులు తవ్వించకుండా పైటీ ఠేకీదారుల నుండి రాయల్టీ వసూలు చేని, తన భాగాన్ని తాను ఉంచుకుని రాజు సాహెబ్ దగ్గర జమ చేనేవారు. నిజానికి ఇది ప్రభుత్వం నుండి లభించిన దలాలీ. శివరావ్‌ు నింహ్ కతారప్‌లో పేరుమోనిన గుండా. యూనియన్ పైన ఈయన పెత్తనం చాలా ఉండేది. గోరఖ్‌పూర్ కార్మికులతో గనుల త్రవ్వకాల పనిచేయించేవారు. ఈ కార్మికులతో తక్కిన కాంట్రాక్ట్ పని తీసుకున్న కార్మికులకు విరుద్ధంగా పని తీసుకునేవారు. గోపాల ప్రసాద్ ఎల్‌ెనంటీ లాండ్ లార్డ్. ఆయన దగ్గర పనిచేనే వాళ్ళు, స్వయంగా పైటీ ఠేకీదార్లుగా పనిచేనేవాళ్ళు. వాళ్ళు గయ, ఔరంగాబాద్‌ల నుండి కూలీలను తీసుకువచ్చేవారు. వాళ్ళు బిలాన్‌పూర్ కూలీలను కూడా ఉంచుకునేవారు. బొగ్గుగనులలో కూడా వీళ్ళ పెత్తనం నడిచేది.
”గనుల పనులు చేయడంలో ఏమాత్రం మాకు అడ్డంకులు కలిగించినా మీ గ్రామాలలోని ఇళ్ళని నేలమట్టం చేనేస్తాం” అంటూ కాంట్రాక్టర్లు కూలీలను అదిరించి బెదిరించేవారు. ననియుం, భయియుం కూలీలను తమ గుప్పెట్లో పెట్టుకునేవారు. ఝరనాలో ఒకళ్ళిద్దరు చిన్నా-చితక కాంట్రాక్టర్లు ఉండేవారు. ఒక బొగ్గుల గనిని శివరావ్‌ు నింహ్ తీనేసుకున్నాడు. ఈ గనులను నీజనల్ కాకపోయినా తవ్వకాల విభాగాలతో కలిని వర్షాకాలంలో మూనేయించేవారు. రోడ్లు లేనే లేవు. దనియాలోని రైల్వే ెనౖడింగ్ మీద శివారవ్‌ు సింహ్ పెత్తనమే ఉండేది. కొంత బొగ్గు గోపాల్ ప్రసాద్ గనుల నుండి కూడా సైడింగ్ పైన పంపేవారు. ఝార్‌ఖండ్ పక్కన ఉన్న లయియో బొగ్గుగని ధన్‌బాద్‌కి చెందిన ఒక పంజాబీది. ఆయన దీని బాధ్యతను తన వోవర్‌మెన్ ఎన్.డి. శర్మకి ఇచ్చారు. లయియో బొగ్గు కూడా సైయిడింగ్ నుండి వెళ్ళేది. అక్కడ ఎక్కువమంది కార్మికులు గయ, పురలియా, దనియాల చుట్టుపక్కల వాళ్ళు. లయియా శివరామ శర్మ గారికి, శివరామనింహ్ కంపెనీతో ఎప్పుడు పడేది కాదు. ఎన్నోసార్లు ఇద్దరు పోట్లాడుకున్నారు. ప్రజలు శర్మగారిని తమ యజమాని అని అనుకునేవారు. ఎందుకంటే అసలు యజమాని అక్కడికి ఎప్పుడు రాడు. ఇక్కడ పనిచేనే నిబ్బంది యజమానికన్నా శక్తివంతులుగా ఉంటారు. ఇటువంటి న్థితి ధన్‌బాద్‌లో ఎక్కువగా ఉంది. సత్‌దేబ్‌నింహ్, శంకర్‌దయాళ్ నింహ్, సూరజ్‌దేవ్ నింహ్‌లు తమ యజమానులను తరిమేని గనులను తీనేసుకున్నారు. నేను రాక ముందు కౌదలాక్షేత్రంలో ఏ యూనియన్ ఉండేది కాదు. పక్కన కుజుక్షేత్రంలో ఎక్కువగా బెంగాలీ యజమానులు ఉండేవారు. వీళ్ళు రేజింగ్, పైటీ ఠేదాేర్లకు ప్లాట్లు పంచేవారు. కాని కుజాక్షేత్రంలో ఇంటక్ కాంతి మెహతా సపోర్టుకల యూనియన్‌ను వశిష్ఠ నారాయణనింహ్ నడిపేవారు. పైటీ ఠేకీదార్లు దీనిపై పెత్తనం చేనేవారు. నారాయణనింహ్ గారి సోదరుడు ఆ గనులలో మేనేజర్‌గా పనిచేనేవాడు. ఈ గనులలో ఇద్దరికి భాగస్వామ్యం ఉంది. రాజు కామాఖ్యానారాయణ్ కాంగ్రెన్ విరోధి. అందువలన తన రాజకీయ రక్షణకోసం ఈ ఇంటెక్ యూనియన్‌ని ఏమాత్రం చొరబడనీయలేదు. దీనివలన వారికి ఆర్థికంగా ఎటువంటి లాభం లేదు. ఆ రోజుల్లో కుజూ-కౌదలా క్షేత్రాన్ని ‘నోమూన్స్‌బైలాండ్’ అని పిలిచేవారు.
రినీవర్ అక్కడ నియుక్తం కాగానే ఒకవైపు మా యూనియన్ ‘కోయలా శ్రమిక్ సంఘఠన్’ ఏర్పాటయింది. మరోవైపు రినీవర్ తవ్వకాల గతిని పెంచాడు. గనుల వికాసం బాగా పెరిగింది. మొదట తాపిన్ నార్త్, తాపిన్ సౌత్ ఇంకా ఝరనా క్షేత్రాలలో ఎన్నో ప్లాట్ల తవ్వకాల కోసం మేనేజింగ్ కాంట్రాక్టర్లకు ఇచ్చి తవ్వకాలను మొదలు పెట్టించారు. మొట్టమొదట్లో ముగ్గురు రేజింగ్ కాంట్రాక్టర్లు ఉండేవారు. పి.డి. అగ్రవాల్, గోపాల్ ప్రసాద్, శివరావ్‌ు నింహ్. తరువాత దాదాపు నలభైమంది మేనేజింగ్ కాంట్రాక్టర్లకు ప్లాట్లు ఇచ్చారు. తవ్వకాలు ప్రారంభించారు. కాంట్రాక్టర్లు తరువాత రేజింగ్ ఠేకీదార్ల, పైటీ ఠేకీదార్ల సంఖ్యను బాగా పెంచారు. మా యూనియన్‌ని గుప్పిట్లో పెట్టుకో డానికి గుండాల సంఖ్యను కూడా పెంచారు.
ఏ పైటీ ఠేకీదార్ల సహాయంతో మేము హజారీబాగ్‌లో పి.డి. అగర్‌వాల్ ఇంకా మరికొందరి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించామో, ఆ ఠేకీదార్లే రాయల్టీ తగ్గించాలి అన్న ఇష్యూమీద పి.డి. అగర్‌వాల్ నుండి విడిపోయి ‘జ్యోటే టిక్ కోల్ కంపెనీ’ అన్నపేరున వేరే కంపెనీని రిజిస్టర్ చేయించారు. వాళ్ళు కౌదలా పి.డి. అగర్‌వాల్ ప్లాట్‌లోని పెద్ద భాగం రినీవర్‌తో తన పేరన చేయించుకున్నారు. దీనికి మేనేజింగ్ డైరెక్టర్‌గా అఖిలేష్ ప్రసాద్ నింహ్ ఉండేవారు. ఆయనను ‘మామూ బాబూ’ అని పిలిచేవారు. బాబా మామూ, బాబూ జీత్‌నాథ్ నింహ్ లే ఈ కంపెనీ ఏర్పడడానికి కారకులు. జీత్‌నాథ్ నింహ్ చతరా జమీందారు. ఆయన సోదరుడు శాలీగ్రావ్‌ు నింహ్ జయప్రకాష్ గారిని హజారీబాగ్ జైలు నుండి తీసుకుని పారిపోయారు. 1968 సం||లో విధానసభ ఎలక్షన్లలో ఈయనతో నాకు పోటీ చేయాల్సి వచ్చింది. కాని రాజుసాహెబ్ ఈయనని ఎప్పుడు ఎలక్షన్ల సభలలోకి రానిచ్చేవారు కారు. మొట్టమొదట్లో మాకు వేలం ఒక కాంట్రాక్టరుతో మాట్లాడాల్సి వచ్చేది. ఈ కంపెనీ వచ్చాక మాకు దాదాపు నలభైమంది కాంట్రాక్టర్లతో పోటీ తప్పేది కాదు. పోటీ చాలా టఫ్‌గా ఉండేది. వీళ్ళని ఓడించడానికి మేము చాలా కష్టపడేవాళ్ళం. ఒకసారి తక్కువ పనిచేని మరోసారి ఎక్కువ పనిచేని కార్మికులు కొంత వ్యాపార దృష్టిని అలవరచుకున్నారు.
(ఇంకావుంది)