సంపాదకులకు నమేస్తే,
ఏప్రిల్ నెల భూమిక అందుకోగానే ఆర్. శాంతసుందరి గారి చిర్నవ్వు ముఖచిత్రం ముచ్చటేనింది. సాహిత్య అకాడమీ అవార్డు అందుకోబోతున్న తరుణంలో వారికి అభినందనలు. . లలిత గారి వ్యాసం ఆ… ఏముందీ… ఇంటి పనేగా? మళ్లీ మళ్లీ చదవాలనిపించేంత ఆసక్తిగా సాగింది. మహిళలు ఎంతో బాధను, నొప్పిని అనుభవిస్తున్నా, శారీరకంగా బలహీనంగా ఉన్నా సరే, బండెడు చాకిరీని విసుగు విరామం లేకుండా ఎలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. శిలాలోలిత గారి వర్తమాన లేఖలు చాలా కుతూహలంగా దూసుకుపోతున్నాయి. సత్యవతి మేడవ్‌ు గారి సంపాదకీయం, ఆలోచనను రేత్తిెంచేవిధంగా ఉంది. డా|| ఎన్. గోపి గారి కవిత ద ట్రాన్స్‌లేటర్- శాంతసుందరి గారికి చంద్రునికో నూలు పోగులా ఆవిడ కృషిని అభినందిస్తూ సాగిన విధం హర్షణీయం. మళ్లీ వచ్చే భూమిక కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తూ… నమేస్తే, శెలవు. – బి. కళాగోపాల్
……..***……..
ఒక పాత భావ చిత్రం : అనుసృజన పేరుతో రాసిన తెలుగు ఘోరంగా విఫలమయ్యింది. ప్లీజ్, రైటర్స్‌కి చెప్పండి. టైం తీసుకుని వాక్య నిర్మాణం చేయాలని.జూపాక సుభద్ర, సుమతి నరేంద్ర రచనలు బాగున్నాయి.
సత్యవతి గారూ, భూమికలో ఈసారి అపురూప సన్మానాలు, చాలా కరెక్ట్‌గా ఎంపిక జరిగిన మీ అభిరుచి, విశ్వనాథ్ గారితో మీ నిర్మొహమాటపు స్త్రీ వాదన, అన్నీ నచ్చాయి. యద్దనపూడి సులోచన గారి నవలలు నేను చిన్నప్పుడు చదివి అద్భుతమైన ప్రపంచంలో విహరించేదాన్ని. ఆవిడకి అవార్డు ఇస్తే నాకు ఇచ్చినంత సంతోషంగా ఉంది. అదీకాక విశ్వనాథ్ గారితో.. వారిద్దరూ శ్రావ్య-దృశ్య కావ్యాల లాంటివారు. అవార్డ్ గ్రహీతలందరికీ నా అభినందనలు.
– ప్రొ|| విజయశ్రీ కుప్ప (ఇమెయిల్)