వితంతువుల దినోత్సవమంట
మనకి అన్నీ ఉత్సవాలే
ఏముంది సెలబ్రేట్ చేసుకోవడానికి??
ఏమి సాధించామట???
భళ్ళున గాజులు పగలకొట్టడం మానేసారా???
కౄరంగా బొట్టు చెరిపేయడం మానేసారా??
తెల్ల చీరలు కట్టించడం మానేసారా??
సొంత బిడ్డల పెళ్ళి మంటపంలోకి గౌరవంగా పిలవటం నేర్చేసుకున్నారా??
లేనిపోని పవిత్రత ఆపాదించి అందరి మెడలకి తాకించే తాళి బొట్టుని ఆమె మెడకి కూడా తాకించే సంస్కారం అలవరుచుకున్నారా?
పొద్దున్నే కళ్ళబడితే తుపుక్కున ఊసే అమానవీయాన్ని మానవీయం చేసుకున్నారా???
ఏమి సాధించారని వితంతు దినోత్సవం జరుపుకుంటారు???
అసలు స్త్రీలు ముత్తైదువులుగా… వితంతువులుగా ఎందుకు విడదీయబడాలి???
ప్రపంచంలో వితంతువులే కానీ భార్యలు పోయినవాళ్ళు ఎందుకుండరు?
వాళ్ళకో పేరు ఎందుకు లేదు???
ఒక వికారమైన రూపమెందుకు లేదు??
భార్య చనిపోయిన నెలలోనే రెండో పెళ్ళికి నిద్ధమయ్యే మగవాళ్ళ…
వాళ్ళ మనశ్శరీరాల మీద భార్యా విహీనత గుర్తులేమీ ఉండక్కరలేదు.
అదే స్త్రీలైతే… మనసు నిండా దిగుళ్ళు… వికృతం చేసిన శరీరాలు
అందంగా ఉండే ఆమెను అందవిహీనను చేనేదాకా సాగే పరమ అసహ్యకరమైన తంతులు…
భార్య పోయిన నాటినుంచే బయట ప్రపంచంలో న్వేచ్ఛగా తిరిగే భార్యావిహీనుడు..
ఆమె మాత్రం చీకటి గదిలో కుళ్ళి కుళ్ళి శోకాలు పెట్టి ఏడవాలి.
ఎవ్వరికీ కనబడూడదు…
అశుభమట.. అధ్వాన్నమైన వ్యవస్థ ఇది. ఏది శుభం? ఏది అశుభం???
ఎవరు నిర్ణయిస్తారు??
ఆదారాలు.. కట్టుబాట్లు, సంప్రదాయాలు అన్నీ ఆడవాళ్ళ.
పురుషడెప్పుడూ అచ్చోనిన ఆంబోతులా న్వేచ్ఛగానే ఉంటాడు.
ఏ ఆచారమూ, ఏ కట్టుబాటూ, ఏ సంప్రదాయమూ అతడిని కట్టడి చేయలేదు.
ఎంతఘాెర అపరాధం ఇది???
ఈ అపరాధాన్ని భారతీయ సమాజం వేలాది ఏళ్ళుగా కొనసాగిస్తూనే ఉంది.
భర్త చనిపోతే ఆమెని మనిషిగా లెక్కగట్టని అమానవీయ సమాజం… భర్త చితిలోకి తోసి చంపేసే సంస్క ృతి.
కడుపునిండా తిననివ్వని, కంటినిండా నిద్రపోనివ్వని భయంకర సమాజం.
మధురలో, బృందావనంలో, మరెన్నో గుళ్ళ దగ్గర హీనాతి హీనంగా బతుకుతున్న వేలాది వితంతువులు భారతీయ సమాజం
చేనిన మహా గాయాలు…
నెత్తురోడుతూ, నిలవనీడ లేక, తినడానికి తిండి లేక, పురుష సన్యాసుల నుంచి నిరంతరం లైంగిక హింసకి, దోపిడీకి, గురౌతున్న
మధుర వితంతువుల దుఃఖం ఈ దేశంలోని నదులన్నింటిలోను కలసి ప్రయాణిస్తోంది.
మీరు మరీ విడ్డూరంగా రాస్తున్నారు.. రోజులు మారిపోయాయి…
ఇప్పుడెవ్వరూ ఆ పద్ధతుల్ని పాటించడం లేదు అని సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ళకి నా సూటి ప్రశ్న…
దయచేని మీ కళ్ళద్దాలను మార్చుకోండి…
నగర నేపథ్యంలోంచి వ్యాఖ్యానించడం మానండి…
పల్లెల్లో ఇప్పటికీ యదేచ్ఛగా అన్నీ సాగుతున్నాయి…
చైతన్యవంతులైన కొంతమంది అడ్డుకుని ఆపగలుగుతున్నారు
కానీ మెజారిటీ తుచ తప్పక పాటిస్తున్నారు
నేను చాలా దగ్గరగా చూసాను.
చాపకింద నీరులా కొన్నిచోట్ల కనబడకుండా కొనసాగుతోంది.
మన భాషలోంచి పునిస్త్రీలు, వితంతువులు అనే పదాలు పోలేదు.
పేరంటాలకి పునిస్త్రీలే ఇంకా అర్హులు.
తన సొంత బిడ్డల పెళ్ళి మంటపంలోకి వితంతువులకు అనుమతి లేదు.
భారత స్త్రీకి నిర్వచనం ముత్తయిదువే…
బొట్టు కాటుక, తలనిండా పూలు, రంగు రంగు చీరలు కట్టినవాళ్ళే భారతీయ స్త్రీ నమూనాలు,
పరమ వికారమైన, కడుపులో పేగులు లుంగలు చుట్టుకుపోయే దృశ్యాలు…
యుద్ధంలో మరణించిన ”వీరుల” కు మరణానంతర ఇచ్చే పరమవీర చక్రాలను అందుకోవడానికి తలనిండా ముసుగుతో తెల్ల
చీరలు కట్టి కుంగిపోతూ వచ్చే స్త్రీలు. వైధవ్యానికి ప్రతీకలుగా కనబడతారు.
పైగా వ్యాఖ్యానాల్లో ఫలానా సైనికుడి వితంతువు అని చెబుతారు తప్ప ఆమె పేరు ప్రస్తావించని మొరటు సంస్కృతి.
మగవాళ్ళు ఫలానా ఆమెకి వితంతువుడు అని చెప్పగా విన్నారా??
యుద్ధాలు చేని చనిపోయేది మగవాళ్ళే కదా అంటారా??
స్త్రీలను వితంతువులుగా… పునిస్త్రీలుగా విభజించి అవమానించే సంస్కృతి పోవాలంటే ఏం చెయ్యాలో మనం ఆలోచించాలి.
ఆ పదాలను భాషలోంచి తీసేయ్యాలంటే ఏం చేయాలి???
ముత్తైదువులని, పునిస్త్రీలని, వితంతువులని స్త్రీలని విభజించే దుర్మార్గ సంస్కృతిని వ్యతిరేకిద్దాం రండి.
ఈ సమాజము మారదానికి స్త్రీలె ప్రయతించల. వైధవ్యం చెయక్షానికి ఎవరు వస్తరు స్త్రీలె కదా.ఆఅనవసరంగ మగవారిని అనుకొవదమ ఏణ్డూఖూ.ఆడావరు పూలు పెత్తుకుంతె భోట్టూ ఫేట్టూఖూణ్టే ఏఆఋఊ వద్దని అన్నరు. వారు తమఏగొమ్మెకూసమె ఆళా ఛఃఏశ్టూణ్ణాఋఊ.