‘మంచితనం’ మంచులాగ కరిగిపోతోంది
మంచిగా ఉండఖ్ఖర్లేదు అంటోంది మన తరం
ఎవరికైనా హెల్ప్ చేస్తే అలుసయి పోతామట
మానవత్వం మంట కలుస్తోంది, కాదంటారా!?
ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటారులే
అని, ఎవరో కాదు, పెద్దలే అంటున్నారు
అమాయకుడంటారు
అయోమయం అంటారు
గట్టితనం లేదంటారు
‘పిల్లచేష్టలు’ అంటారు
ఇంతకీ ఎందుకిలా అంటారు
జాలిలేక కాదు.
ఉన్నదంతా ఊడ్చేస్తారని భయం
మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతారని భయం
ఊబిలోకి దింపుతారని భయం
అర్థించినవారే అలుసు చేస్తారని భయం
”ఎందుకొచ్చిందిలే” అని బిగించుకోక
మందహాసంతో ముందడుగు వెయ్యాలి
చిన్నా పెద్దా అని లేకుండా ముందుకు రావాలి
అడిగిన వాళ్ళని ఆదుకోవాలి
ఉడతాభక్తి మాత్రమే అయినా చాలు
చిరు చిరు చేతలే
చిరచిరలాడకుండా చెయ్యాలి
దాటేయడం పిరికితనం
ధైర్యం తెచ్చుకోవాలి
స్వలాభాపేక్ష తుంచుకోవాలి
అవసరమా?
మీరే చేసి చూడండి
ఒకరి మేలును తలపెట్టాలే కానీ
ఏమి హాయి! ఏమి ఆనందం!!
ఇందులోనే ఇమిడి ఉంది మోక్షం
మరి
”పరోపకారార్థ మిదం శరీరం” కదా!
అందుకు
మీరూ ఓ.కె.నా?!