కొన్ని రకాల అవాంఛనీయ గర్భాలను అబార్షన్ చేయించుకుని తొలగించుకునే సావకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. ఈ చట్టం 1971లో చేయబడింది.
– ఈ చట్టాన్ని మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టమని పిలుస్తారు.
– జమ్ము-కాశ్మీర్ తప్ప బారత దేశమంతటా అమలు చేయబడుతుంది.
– ప్రభుత్వ రిజిస్టర్లలో వైద్యులుగా నమోదైన, గైనకాలజీ & ఆబ్ట్సికల్స్లో ప్రత్యేకత కల్గిన ప్రభుత్వ వైద్యుడు అవాంఛనీయ గర్భాన్ని అబార్షన్ ద్వారా తొలగిస్తే, ఐ.పి.సి కింద అతను శిక్షార్హుడు కాదని ఎమ్.టి.పి. చట్టం 1971 చెబుతుంది.
– ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ వైద్యులు మాత్రమే అబార్షన్ చేయడానికి అర్హత కలిగివుంటారు.
– అబార్షన్ చేయడానికి గర్భం 12 వారాలు దాటకూడదు.
– ఒకవేళ గర్భాన్ని తీసేయాల్నిన అవసరాన్ని ఇద్దరు ప్రభుత్వ వైద్యులు ధృవీకరిస్తే గర్భం/పిండం వయస్సు 20 వారాలు దాటకుండా అబార్షన్ చేయాలి.
– గర్భాన్ని కొనసాగించడం వల్ల మహిళ మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినే అవకాశముందని వైద్యులు భావించినపుడు అబార్షన్ చేయొచ్చు.
– పుట్టబోయే బిడ్డకి శారీరక, మానసిక అవలక్షణాలు వ్యక్తమయ్యే పరిస్థితిని వైద్యులు నిర్ధారించినపుడు, అంగవైకల్యం ఏర్పడేస్థితి వున్నపుడు అబార్షన్ చేయొచ్చు.
– మహిళ అత్యాచార బాధితురాలై, గర్భం ధరించినపుడు ఆ గర్భం వల్ల ఆ స్త్రీ తీవ్ర మానసిక ఆందోళనకి గురైనపుడు ఆ గర్భాన్ని విచ్ఛిత్తి చేయొచ్చు.
– కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నపుడు ఆ పద్ధతులు విఫలమై మహిళ గర్భం దాల్చినపుడు తమ కుటుంబ ప్లానింగ్ దెబ్బతినడం, అవాంఛిత గర్భంవల్ల మహిళ మానసికంగా కుంగిపోయినపుడు అబార్షన్ చేయవచ్చు.
– 18 సంవత్సరాలు నిండని బాలిక గర్భాన్ని అబార్షన్ ద్వారా తొలగించొచ్చు. అలాగే మానసికంగా బాధపడే బాలిక గర్భాన్ని ఆమె సంరక్షకుల అనుమతితో తొలగించొచ్చు.
అబార్షన్ నిర్వహించాల్సిన ఆసుపత్రులు
– ప్రభుత్వ నిర్వహణలో వుండే ఆసుపత్రుల్లోనే అబార్షన్లు నిర్వహించాలి.
– ప్రభుత్వ అనుమతితో ఎప్పటికప్పుడు ఎంపిక చేసిన ఆసుపత్రులలో మాత్రమే ఎం.టి.పి చేయాలి.