మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టం 1971 (MTP Act)

 కొన్ని రకాల అవాంఛనీయ గర్భాలను అబార్షన్‌ చేయించుకుని తొలగించుకునే సావకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. ఈ చట్టం 1971లో చేయబడింది.

–  ఈ చట్టాన్ని మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టమని పిలుస్తారు.

– జమ్ము-కాశ్మీర్‌ తప్ప బారత దేశమంతటా అమలు చేయబడుతుంది.

– ప్రభుత్వ రిజిస్టర్లలో వైద్యులుగా నమోదైన, గైనకాలజీ & ఆబ్ట్సికల్స్‌లో ప్రత్యేకత కల్గిన ప్రభుత్వ వైద్యుడు అవాంఛనీయ గర్భాన్ని అబార్షన్‌ ద్వారా తొలగిస్తే, ఐ.పి.సి కింద అతను శిక్షార్హుడు కాదని ఎమ్‌.టి.పి. చట్టం 1971 చెబుతుంది.

– ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ వైద్యులు మాత్రమే అబార్షన్‌ చేయడానికి అర్హత కలిగివుంటారు.

– అబార్షన్‌ చేయడానికి గర్భం 12 వారాలు దాటకూడదు.

– ఒకవేళ గర్భాన్ని తీసేయాల్నిన అవసరాన్ని ఇద్దరు ప్రభుత్వ వైద్యులు ధృవీకరిస్తే గర్భం/పిండం వయస్సు 20 వారాలు దాటకుండా అబార్షన్‌ చేయాలి.

– గర్భాన్ని కొనసాగించడం వల్ల మహిళ మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినే అవకాశముందని వైద్యులు భావించినపుడు అబార్షన్‌ చేయొచ్చు.

– పుట్టబోయే బిడ్డకి శారీరక, మానసిక అవలక్షణాలు వ్యక్తమయ్యే పరిస్థితిని వైద్యులు నిర్ధారించినపుడు, అంగవైకల్యం ఏర్పడేస్థితి వున్నపుడు అబార్షన్‌ చేయొచ్చు.

– మహిళ అత్యాచార బాధితురాలై, గర్భం ధరించినపుడు ఆ గర్భం వల్ల ఆ స్త్రీ తీవ్ర మానసిక ఆందోళనకి గురైనపుడు ఆ గర్భాన్ని విచ్ఛిత్తి చేయొచ్చు.

– కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నపుడు ఆ పద్ధతులు విఫలమై మహిళ గర్భం దాల్చినపుడు తమ కుటుంబ ప్లానింగ్‌ దెబ్బతినడం, అవాంఛిత గర్భంవల్ల మహిళ మానసికంగా కుంగిపోయినపుడు అబార్షన్‌ చేయవచ్చు.

–  18 సంవత్సరాలు నిండని బాలిక గర్భాన్ని అబార్షన్‌ ద్వారా తొలగించొచ్చు. అలాగే మానసికంగా బాధపడే బాలిక గర్భాన్ని ఆమె సంరక్షకుల అనుమతితో తొలగించొచ్చు.

అబార్షన్‌ నిర్వహించాల్సిన ఆసుపత్రులు

– ప్రభుత్వ నిర్వహణలో వుండే ఆసుపత్రుల్లోనే అబార్షన్‌లు నిర్వహించాలి.

– ప్రభుత్వ అనుమతితో ఎప్పటికప్పుడు ఎంపిక చేసిన ఆసుపత్రులలో మాత్రమే ఎం.టి.పి చేయాలి.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.