ఒక ఊరిలో 4 చెట్లు ఉండేవి. అవి మంచి మిత్రులు. అవి ఒక దానికి ఏదైనా జరిగితే మిగిలినవి అన్ని వచ్చి ఆదుకుంటాయి. అలానే నాలుగవ చెట్టు తుఫానుకు కొట్టుకుని పోతుండగా మిగతా మూడు చెట్లు వచ్చి దానిని కాపాడాయి. అవి ఇలా కలిసికట్టుగా ఉండేవి. ఒక రోజు పూలయ్య అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఆ నాలుగు చెట్లను చూసాడు. వీటిని చూస్తే అతనికి వాటిని ఎప్పుడు ఎప్పుడు నరికి వేయాలా అనుకుంటూ మరుసటి రోజు వచ్చాడు. అప్పుడు పూలయ్య గొడ్డలి తెచ్చి చెట్లను నరుకుతుండగా ఆ చెట్లు మమ్మల్ని నరక వద్దు మీకు నీడను ఇస్తాము, రోజు మీకు పండ్లను ఇస్తాము అని చెప్పాయి.
అయినా కాని పూలయ్య అనే వ్యక్తి వినిపించుకోకుండా మూడవ చెట్టును నరికివేసి వెళ్ళిపోయాడు. ‘మరుసటి రోజు వస్త’ అని చెప్పాడు. మిగతా మూడు చెట్లు ఎట్లా రక్షించుకోవాలో వాటికి అర్థం కావడం లేదు రెండవ చెట్టు ఒక ఉపాయం ఆలోచించింది. ఏమిటంటే అతను వచ్చే తోవలో ముళ్ళ చెట్లను నిలబెడితే అని రెండవ చెట్టు అనగానే మిగతావన్ని ఒప్పుకుంటాయి. ముళ్ళ చెట్లతో మాట్లాడి వాటిని దారిలో నిల్చోమని చెప్పుతాయి. సరే అని సరిగ్గా పూలయ్య వచ్చే సమయంలో దారికి అడ్డంగా నిలిచినాయి.
ముళ్ళు మొత్తం అతని ఒంటికి మొత్తం గుచ్చుకున్నాయి. అప్పటి నుంచి ఎక్కడ ఒక చెట్టు కనిపించినాకాని వాటికి నీరు పోస్తాడు ఎవరు కనిపించినాకాని వారికి చెట్లు నాటమని చెప్పుతాడు.
నీతి : మనం చెట్లు చేసిన మేలును మరిచి మనం నరుకుతుంటం కాని మనం ఒక చెట్టును నాటితే దానికంటే ఉత్సాహం లేదు.