పిల్లలూ క్షేమమా… తల్లులూ క్షేమమా – ఉదయమిత్ర

పాపలూ కనుపాపలూ క్షేమమా.
పువ్వంటి తల్లిఒడిలోవెన్నెలంటి నవ్వులు క్షేమమా.
బడిలో బడిదారిలో
చేనుమడిలో మడిదారిలో
బాల్యాన్ని గమ్మేసే
ముదనష్టపు పనిలో
పొంచిఉన్న గుంటనక్కలనుండి
బాల్యమిట పదిలమేనా?
ఏదిఏమిటో తెలియనివయసులో
మొగ్గపూవుగ విచ్చుకుంటున్న దశలో
కలలదారులవెంట
పరుగులు దీస్తున్న దశలో
కమ్ముకొస్తున్న ఉన్మాదంనుండి
కామంకన్నుల
ఒంటికన్ను రాక్షసులనుండి
బతుకిక్కడ భద్రమేనా?
……
తల్లులూ…చదువుల కల్పవల్లులూ
క్షేమమా.
బతుకుదెరువుకోసం
బయలెల్లకతప్పని
బతుకులూ పదిలమేనా?
ఇటుకబట్టీలకాడనొ
వలసదారులవెంటనొ
రెక్కలుముక్కలై విరుగుతున్నచోట
యజమానుల చూపులకొసల
కరుకుకత్తుల గాట్ల నుండి
బతుకిక్కడ భద్రమేనా?
ఫ్యాక్టరీయొ ఆఫీసో
పనిజేసేకాడ
కనిపించని హింసలనుండి క్షేమమేనా?
వీధో వాహనమొ రోడ్డో
బతుకును క్షేమంగా ఇల్లుజేర్చేనా?
శకలాలు శకలాలుగ
బతుకు కాలిపోతుంటే
ఇంటా బయటా
పిల్లలూ తల్లులూ ముసలవ్వలూ
క్షేమమేనా?
ఆకాశంలో సగం అంటే
ఆక్రందనల సమారమేనా?
కాలం కడుపుతో ఉండి
కన్నది ఈ వికృతశిశువునేనా?
ఇది మన పుణ్యభూమేనా?
ఇది సంక్షేమరాజ్యమేనా?
……….

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.