రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని 43 పోలీస్ ష్టేషన్లలో పని చేస్తున్న వివిధ స్థాయి పోలీస్ అధికారులకు జండర్ స్పృహ…మహిళలు,పిల్లలకు సంబంధించిన వివిధ చట్టాల మీద ట్రయినింగ్స్ మొదలయ్యాయి.
రాచకొండ కమీషనర్ శ్రీ మహేష్ భగవత్ గారి స్త్రీల అంశాలపై సున్నితంగా,మానవీయ కోణంతో స్పందించే దృక్పధం వల్లనే ఇది సాధ్యపడింది.
రాచకొండ కమీషనరేట్ ని జెండర్ సెన్సిటైసెడ్ గా రూపొందించి ప్రజలందరితో ముఖ్యంగా స్త్రీల సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించేలా చెయ్యాలన్నదే భూమిక లక్ష్యం.
ఆ దిశగా ఈ రోజు (15.2.17) తొలి అడుగు పడింది.తొలి శిక్షణలో దాదాపు 40 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు.ప్రశాంతి,నేను ఈ ట్రయినింగ్ చేసాం.