కోటానుకోట్లున్న కోటీశ్వరులకేగా? బ్యాంకుల భరోసా
కొత్త నోట్లన్నీ బడాబాబుల చేతుల్లో వుంటే
సామాన్య ప్రజకు అందని ద్రాక్షాయె నోటు
బ్యాంకుల్లో సామాన్యుని కష్టాలు ‘శతాధికంగా’ పెరిగినా
సర్దుకుపోతున్నారంటు మోదంతో పొంగిపోయె ‘మోది’
ధనవంతునింట ‘పెళ్ళి’ ధనాగార సాయంతో ధగధగమని వెలుగగా!
సామాన్యునింట ‘పెళ్ళి’ సమస్యల మయమై సాగె
చిల్లర వర్తకుల జీవితాలు చీకాకులు పెడుతుంటె
నెల జీతగాళ్ళ బతుకులు వెల వెల బోతుండె
ఏరోజుకారోజు ఏ.టి.ఎం.ల దగ్గర పడిగాపులాయె
చాంతాడంత ‘క్యూ’లో కూటికి, నీటికి కరువాయె
మన డబ్బు, మన చేతికందుతుందో లేదోనన్న అనుమానమాయె
‘కరెన్సీ కష్టాలు’ కని, విని ఎరుగని కథలాయె
అందిన ‘డబ్బు’తోనే ఆనందపడిపోయె ‘సామాన్యుడు’
రేపటి ఆశే మనిషిని ముందుకు నడిపే సాధనమాయె