ఆ వీథి ఎప్పుడో
నిశ్శబ్దాన్ని కౌగలించుకుంది
వెన్నెలమ్మ ఒడిలో
సేద తీరుతూ…
పిల్లల కేరింతలు
గోరుముద్దలను
చూసి చుక్కలన్నీ
చిన్నబుచ్చుకున్నాయి
అయినా
ఆ రంగుల పిచ్చుకలన్నీ
చెట్టుకు వేలాడే గాలి పటాలుగా
మారి బిక్కు బిక్కుమంటూ
చూస్తున్నాయి
చీకటి దారాన్ని
అల్లుకుని నిద్దరోతుంటే
అప్పుడు
తెల్లారుతుంది నాన్నకి
ఆ దారి నిండా విప్పపూలు
చల్లుకుంటూ వస్తాడు
నిశ్శబ్దాన్ని నిద్ర లేపుతూ
అమ్మకు ఇంకో చిన్నపిల్లాడిలా
నాన్న ఎన్ని తిట్టినా
కండ్లనిండా ముత్యాలను నింపుకున్న
అమ్మ నవ్వేస్తుంది
నువ్వే నా ఇంటి దేవత
అని నాన్న కలవరిస్తున్నాడు రాత్రంతా…
ఉదయాన్నే ఆరుద్ర పురుగంత
మెత్తని స్పర్శ ఆ చిన్ని నుదుటి మీద నాన్న ముద్దు…
నాన్న మంచోడే కానీ…
ఉదయాన్నే ఆరుద్ర పురుగంత
మెత్తని స్పర్శ ఆ చిన్ని నుదుటి మీద నాన్న ముద్దు…
నాన్న మంచోడే కానీ…
అద్భుతమైన కవిత్వం