విద్య నేర్పిన గురువులారా
అందుకోండి… శత సహస్ర వందనాలు
పలురకాల వృత్తులకే వన్నె తెచ్చే
ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించిన ఉత్తమోత్తములు మీరు…
అజ్ఞానమనే అంధకారములో అణగారిపోతున్న
అజ్ఞానులకు ”అ, ఆ” లను దిద్దించి
జ్ఞానమొసగిన ధన్యజీవులు మీరు
బతుకు బంగారు బాట వేయు తీరు నేర్పిన సహృదయులు మీరు
సమాజానికి చైతన్య స్ఫూర్తిగా నిలిచిన దైవ స్వరూపులు మీరు
అజ్ఞాన సంద్రములో కొట్టుకుపోతున్న మాలో
దాగివున్న సామర్థ్యాలను వెలికి తీసి సానబెట్టి
చదువు నేర్పిన ”శారదాంబ బిడ్డలు” మీరు
అలుపెరుగక అందరి అభివృద్ధిని కాంక్షించే శ్రేయోభిలాషులు మీరు
మంచి మానవత్వమనే బీజములను విద్యాలయాలలో వెదజల్లి
విజ్ఞానపు పుష్పములను విరివిగా పూయించినారు
బొమ్మకు ప్రాణం పోసేది ఆ బ్రహ్మ దేవుడైతే
అదే బొమ్మకు జ్ఞానమొసగిన మీరు అపర బ్రహ్మలు,
అక్షరాలనే లక్షలుగా భావించి మంచి చెడులను
విపులముగా వివరించి
బడి అనే తోటలో బహురకాలున్న విద్యార్థులలో
విద్య అనే నీరు పోసి పరిమళాలను వికసింపజేసిన మీరు
”సదా పూజ్యనీయులే”….
నిస్వార్థ సేవలతో తరించే మిమ్ములను స్మరించుకోవడం
మా కనీస బాధ్యత