ఉపాధ్యాయుడు, కవి బాలసుధాకర్ మౌళి సంకలనం చేసిన ‘స్వప్నసాధకులు – విద్యార్థుల కవిత్వం’ పుస్తకం నుండి ఆరవ తరగతి పూర్తి చేసిన ఎస్. ఉమామహేష్ రాసిన కవితలు
ఉదయం కురిసిన వాన
– ఎస్.ఉమామహేశ్
ఈ రోజు ఉదయం కురిసిన వాన
మన జీవితాన్ని మారుస్తుంది
ఈ రోజు ఉదయం కురిసిన వాన
ప్రకృతిని అందంగా మారుస్తుంది
ఈ రోజు ఉదయం కురిసిన వాన
పంటలను పండిస్తుంది
ఈ రోజు ఉదయం కురిసిన వాన
పువ్వులను పూయిస్తుంది
ఈ రోజు ఉదయం కురిసిన వానలో
నా మనసు చిందేస్తుంది
ఈ రోజు ఉదయం కురిసిన వాన
రైతుల్లో ఆశను నిలుపుతుంది
ఈ రోజు ఉదయం కురిసిన వానలో
భూమి ఆహ్లాదంగా ఉంది.
ఎంత బాగుండేదో
అప్పుడైతే
పక్షులు గాల్లో
రివ్వున ఎగురుతుండేవి
ఆవులు, మేకలు
పచ్చపచ్చని గడ్డిని మేసేవి
మేఘాలు మబ్బులు వేసి
వర్షం పడేది
చెరువులో చేపలు
టపటపా ఆడేవి
రైతులు పంటలు వేసి
ప్రజల ఆకలి తీర్చేవారు
అప్పుడైతే ఎంత బాగుండేదో
ఏమైంది ఈ లోకానికి…
ఏమైందో ఈ లోకానికి
పచ్చని పొలాల్లో
నల్లని రోడ్లు వేశారు
పచ్చని కొండల్లో
నల్లని రాళ్ళను మిగిల్చారు
పశువులు మేసే నేలమీద
వాహనాలు నడుపుతున్నారు
ఇంట్లో దీపం లేకుండా
విద్యుత్‌ను ఎంతో వాడుతున్నారు
ఆకాశంలో పక్షులు ఎగరకుండా
విమానాలు ఎగురుతున్నాయి
చూశారా
ఏమైందో ఈ లోకానికి…!
ఎంత బాగుంటుందో
మర్రిచెట్టు ఊడలతో ఊగితే
ఎంత బాగుంటుందో
చెరువులో ఈత కొడితే
ఎంత బాగుంటుందో
పొలం గట్టు మీద బడికి వెళ్తే
ఎంత బాగుంటుందో
అమ్మా నాన్నలకు పనులలో సాయం చేస్తే
ఎంత బాగుంటుందో