ఇష్టమనుకున్న అబ్బాయితో, స్కార్ఫ్ కట్టి
రయ్‌మని బైక్‌పై దూసుకెళ్తుంటే
నీ ఇమ్మెచ్యూరిటీ చూడటానికి
నీ వెల్విషర్స్కి అది అడ్డా తల్లీ!
స్కార్ఫ్ తీసి నిటారుగా నడూ చెల్లీ!
విశ్వమే నువ్ అవాల్సిన చోట
నీ కళ్ళు మాత్రమే లోకానికి చూపే స్కార్ఫ్
టిల్టింగ్ గ్లాసోలే ఇన్ఫీరియారిటీకి సింబాలిక్ అవ్వొద్దు
నీ పారదర్శకతే, దార్శనికతై తోడుంది
స్కార్ఫ్ తీసి నిటారుగా నడూ చెల్లీ!
ప్రపంచానికి నిన్ను చూపాలనీ,
ప్రపంచాన్ని నీ ముఖమంతా చూడాలనీ…
కానీ,
నిర్భయవు ఔతావనా…
ఇన్సెక్యూరిటీ ఎందుకు?
లోకమంతా… నీ కాలమై వెంటుంది
స్కార్ఫ్ తీసి నిటారుగా నడూ చెల్లీ…
గ్లోబల్ వార్మింగ్ నుండి తప్పుకోవాలనా…?
ఆ అతినీల లోహితాలను అడ్డుకోవాలనా…
సగం స్కార్ఫేం…? హిజాబ్‌ను నఖాబ్ చేయ్…
నీ తార్కికతే తత్వమై కదిలిస్తుంది
ఇక అసత్యమనే స్కార్ఫ్ తీసి, నిటారుగా నడూ చెల్లీ!
నీ నుదుటి రాతలు చదవాలనీ,
నీ బుగ్గల కాంతుల్ని తాకాలని
చిలక ముక్కు శ్వాసల్ని తగలాలని,
చుబుకపు కదలికలు గాంచాలనే
ప్రపంచానికి నీదైన ఉనికిని చాటి చెప్పు!
ఇవే,
ఆమ్ల దాడుల్నాపలేని స్కార్ఫ్ కన్నా శక్తిమంతురాలు…!
నీ సాధికారతే సత్యమై పరుగెత్తిస్తుంది
ఇక భయమనే స్కార్ఫ్ తీసి, నిటారుగా నడూ చెల్లీ!!