భూమికకు,
సావిత్రి, మీనాకూమారి బరువైన పాత్రలతో పేరుపొందారు. అలాంటి పాత్రలు అంత బాగానూ ఇతరులూ చేశారు. కానీ వారిద్దరూ చేసిన హాస్యపాత్రలు అద్భుతం. సావిత్రి ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్’ అందరికీ తెలిసినవే. మీనాకుమారి అంత అద్భుతంగానూ చేసినవి తెలుగు వారికి తెలియవు. ‘మిస్ మేరీ’ కాక, ‘చార్ అందాజ్’ కిశోర్ కుమార్‌తో, ‘కోహినూర్’ దిలీప్‌కుమార్‌తో పోటిపడి వారిద్దరిని చిత్తుగా ఓడించింది. ‘ఆజాద్’ (అగ్గిరాముడు తెలుగు)లో కూడా. డా|| భార్గవి గారి వ్యాసం నాకు అసూయ కలిగించేలా ఉంది.
జూన్ సంచికలో రజనీ గురించి పరుచూరి శ్రీనివాస్ వ్యాసం ప్రతిభావంతంగా ఉంది. విషయ వివరణ ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర ఘనత వివరిస్తే సమగ్రమయ్యేది ఒక కలం జారు వద్దే గొల్లెత స్త్రీ పురుష యుగళం బాలమురళితో పాడింది ఓలేటి కాదు, శ్రీరంగం గోపాలరత్నం అని జ్ఞాపకం
వి. ఎ. కె రంగ రావు