భూమిక మిత్రులకు, నమస్తే!
అనిశెట్టి రజిత గారికి రెడ్ శాల్యూట్‌తో… ఈ రోజు చాలా తలనొప్పిగా ఉంది సైట్ విజిట్ చేసి చైర్‌లో కూర్చొని ఆలోచిస్తూ భూమిక చదువుదామని ఆన్‌లైన్‌లో భూమిక సైట్ ఓపెన్ చేశా.. మొదలు మీ రచనలో భాగమైన గౌరి లంకేశ్ గురించి చదివి మల్లి రోల్ చేయగా ”వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ” చదవడం మొదలుపెట్టాను… ఉఫ్ ఓ మై గాడ్.. 17ఏళ్ళ వయసులో చిన్న పిల్లను వొదిలేసి దళంలో… మళ్ళి. రెండవ బిడ్డను వొదలటానికి 2 రోజులు నడిచి వెళ్లి మళ్లి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లి దళంలో చేరింది. నా కళ్ళల్లో నీళ్ళు సుడిగుండాలుగా రాలుతున్నాయి.. చాలా ఏడ్చేసాను.. పీడిత తాడిత ప్రజల కొరకు ఎందరో ఎందరో పోరాట తల్లులు తమ సర్వస్వాన్ని దారపోసారు.
నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు (జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యాను) వేసవి సెలవులో అప్పటి సి.ఎంకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ జరిగింది. ప్రతి ఊరికి వెళ్లి ప్రతి ఒక్కరి సంతకాన్ని సేకరిస్తున్నాం. జగిత్యాల తాలూకాలో ఒక చిన్న గ్రామానికి వెళ్ళాను. అక్కడ ఒక ముసలమ్మ (పూరిగుడిసె, కళ్ళు కనపడవు) బయట ఊడొస్తుంది. మేము వెళ్లి సంతకాన్ని తీసుకొన్నాకా అయ్యా!! నా కొడుకు డాక్టర్ చదవడానికి వెళ్ళాడు. బిడ్డ ఎప్పుడొస్తాడో అని ఎదురుచూస్తున్న అని అనేసరికి.. అక్కడ ఉన్న వాళ్లందరికి కళ్ళలో నీళ్ళొచ్చేసాయి. (ఎందుకంటే ఆ అమ్మ కొడుకు డాక్టర్ చదవేటపుడు దళంలో చేరాడు. అలా పనిచేస్తూ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఒక్కడే కొడుకు. ఎవరూ లేరు కనిపించి కనపడక వండుకుంటుంది). థాంక్స్ అక్కా మీ ద్వారా ఆ రోజును గుర్తు చేసుకున్నాను.
– పి. బాబయ్య, ఇ-మెయిల