భూమిక ఎడిటర్ గారికి!
భూమిక గత సంచికలోని ”తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ? సంపాదకీయం మీరు చెప్పినట్లుగా ఈ మొత్తం వ్యవహారంలో నవమాసాలు మోసి, బిడ్డల్ని కనే తల్లి స్వరం విన్పించడం లేదు? ఇది దేనికి సంకేతం, తండ్రులకు మాత్రమే ప్రేమ ఉందా? తల్లి ప్రేమలేయ్యాయి? తల్లులెందుకు అదృశ్యమయ్యారు? నిజానికి గర్భశోకం ఆమెకు కదా! దీనిపైన చర్చించవలిసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యక్తులు, వ్యవస్థలు, పత్రికలు ముఖ్యంగా ప్రభుత్వాలు ఈ విషయమై ఆలోచన చేయవలసిన అవసరం ఎంతో ఉంది, లేకపోతే మరో సతిసహగమనాల వంటి సాంఘిక దురాచారాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది.
– రవి పూరేటి, ఇ-మెయిల్