ఒకరి కోసం ఒకరు : అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు – ఆంగ్లమూలం: వసంత్‌ కన్నభిరాన్‌ – తెలుగు అనువాదం: చంద్రలత

గత సంచిక తరువాయి…)

ఖచ్చితంగా! కానీ కొయిలీ, బెర్హంపూర్‌ నుంచి విగతజీవిని తీసుకురావాలన్నా చాలా కష్టమయ్యేది.

అవును.. ఖచ్చితంగా.

ఎదురుచూడడం, తరలింపులోని ఇబ్బందులు, ఎక్కడ శరీరం పాడవుతుందో అన్న భయం… అదంతా…

అప్పటికే అదొక శరీరం, అది అతను కాదు. అదొక శరీరం. అది సరే. ప్రతి ఒక్కరూ ఆ శవాన్ని ఎప్పుడు తీసుకువస్తారు వంటివన్నీ మాట్లాడుకొంటారు. లేదూ, ఎవరూ రారు. ఇప్పుడు వెనక్కి ఆలోచించుకుంటే, థాంక్‌ గాడ్‌. ఇదంతా కలకత్తాలో జరగలేదు అనిపిస్తుంది.

చాలా తెలివైన నిర్ణయం. మొత్తానికి ఒక శాంత భావన మిగులుతుంది మీలో..

ఒకవేళ కలకత్తాకు తీసుకువచ్చి ఉంటే, ఎడ తెరిపిలేని వివరాలు, వివరణలూ…అదీకాక ఈ ఇంట్లో ఉండడం దాదాపు అసాధ్యమైపోయేది నాకు. ఎందుకంటే నేను ఒక్కదానినే ఉంటాను. ఇక్కడికి తీసుకువస్తే, తర్వాత నేను ఒంటరిగా

ఉండడం కష్టమయ్యేది. నేను పూజారులను అడిగాను. శ్రాద్ధకర్మలు తొమ్మిదో రోజునా, పదకొండో రోజునా అని. ఎవరూ స్పష్టంగా చెప్పలేదు. నాకు మా అల్లుడు ఉండడం ముఖ్యం. అతను వారంకన్నా ఉండలేడు. దాంతో మేము శ్రాద్ధకర్మలు ఏడో రోజు నిర్వహించి, సోమవారం సాయంత్రానికల్లా కలకత్తాకు తిరిగి వచ్చాము. శనివారం రాత్రి ఒబెరాయ్‌ రిసార్టులో కుటుంబమంతా గడిపాం. ఇది చాలా వింతగా తోచింది. కుటుంబమంతా కలిసి ఇలా వెళ్ళాలని ఎన్నోసార్లు అనుకున్నాం. కానీ, ఎవరో ఒకరికి వీలు పడకపోవడం వలన ఆ ప్రయత్నాలు సాగలేదు. చివరికి… ఇలా…

అదొక అందమైన ఉదయం. ఏం చెప్పాలి. నాకు ఎలాంటి అశాంత భావన కలగలేదు.

ఆ ఉదయం ఎంత అందంగా ఉందో నేను చెప్పలేను. మేము రాత్రంతా మెలకువలో ఉన్నాం. ఆకాశం ఇంకా పూర్తిగా తెల్లబడలేదు. సముద్రపు ఒడ్డు ఎంతో అందంగా ఉన్నది. శుభ్రంగా ఉంది. కేవలం పక్షుల కువకువలు, మా చేతిలో చితాభస్మం. మేం పెద్ద అల రావడం కోసం ఎదురుచూస్తున్నాం. అంతే.

ఆదివారం ఉదయం ఎనిమిది గంటలప్పుడు మేము గోపాల్‌పూర్‌ నుంచి బయల్దేరి భువనేశ్వర్‌ చేరుకున్నాం. ఆ పూట మాకు ఏ టికెట్లు దొరకలేదు. సోమవారం ఉదయం విమానంలో కలకత్తా చేరుకున్నాం.

ఆ తర్వాతి ఆదివారం మా ఇంట్లో ఒక ప్రార్ధన నిర్వహించాం. యజ్ఞం చేశాం. అది కూడా మా అత్తగారి వాళ్ళకు కోపం తెప్పించింది. అసలే ఏడవరోజు శ్రాద్ధ కర్మలు చేశాం. అదీ ఇక్కడా కాదు, అక్కడా కాదు. అది ఆచారం కాదు. పైనుంచి నేను సాంప్రదాయాలేవీ పాటించలేదు… నేను కేవలం ఈ యజ్ఞం చేశాను. మా కుటుంబానికి సంగీతం ఇష్టం కనుక పాటలు పాడుకొన్నాం. అతని గురించి స్నేహితులు నాలుగు మాటలు మాట్లాడారు. ఆదివారం ఈ ప్రార్ధనా కార్యక్రమం నిర్వహించాము. సోమవారం నుంచీ పనికి వెళ్ళడం మొదలుపెట్టాను. నాకు తెలియదు, చూసిన వారన్నారు చిక్కిపోయానని. నా చిన్ననాటి స్నేహితురాలంది, ”కొయిలీ నీలో జీవకళ పోయింది. నీవతనిని ఇంకా ప్రేమిస్తున్నావు. నీవు అతనికి మించి ఎదిగావనుకొన్నాను…” అంది. ”మంజూ, మేము విడిగా ఎదగలేదు. కానీ, మా మధ్య సమాచార సంబంధం కొరవడింది. ఆ అనుబంధం మిగిలిపోయింది. ఇది పదేళ్ళ వయసులో మొదలైన బంధం…”

అది చాలా సుదీర్ఘమైనది. అందుచేతనే కావచ్చు, అసంబద్ధమైనదేదీ నేను గుర్తు చేసుకోలేకపోతున్నాను.

దాదాపు ముప్ఫై, ముఫ్ఫై అయిదేళ్ళు. అందులో రెండు, మూడేళ్ళు ఆదర్శప్రాయం కాకపోవచ్చు. అది ఒక దెబ్బలా కనబడకూడదు. కానీ, అలా గాయంతో ముగిసింది.

ఆ బాధ సలుపుతూనే, ముప్ఫయ్యేళ్ళ జీవితాన్ని మర్చిపోనివ్వలేదు …

లేదు, నిజంగా. అప్పడు నాకు తెలియలేదు కానీ, తర్వాత అది నా ఆరోగ్యం మీద ప్రభావం చూపడం ప్రారంభించింది. ఖచ్చితంగా, మనం చాలా దృఢమైన వారమని చూపించే ప్రయత్నం వల్ల అలా జరుగుతుందా? లేదు, ఒంటరి ఇంటిలోకి నడిచి రావడం అన్నది సులభం కాదు. మొదట్లో విపరీతంగా ఏడ్చేదాన్ని ఒంటరిగా.

ఎప్పుడు ఏడవడం మొదలుపెట్టావు? తిరిగి వచ్చాకా?

అవును. తిరిగి వచ్చాక. పిల్లలు తిరిగి వెళ్ళాక. ముఖ్యంగా ఉదయాలు ఘోరంగా ఉండేవి. ముఖ్యంగా, మా

ఉదయాలు చాలా తియ్యగా సాగేవి. అతను పొద్దున్నే తెల్లారకముందే నడకకు వెళ్ళేవాడు. చీకట్లో వెళ్ళొద్దు అని నేను కోప్పడేదాన్ని. కలకత్తాలో చాలా అపహరణల వార్తలు వస్తుండేవి. అతను తయారయి, కిటికీ పక్కన తనకు ఇష్టమైన సోఫాలో కూర్చునేవాడు. పొద్దు పొడవగానే, బయలుదేరి వెళ్ళేవాడు.

అతనికి ఎవరినీ కలవడం ఇష్టముండేది కాదు. అందులోనూ, కొత్త అలీపూర్‌ ఒక పల్లెటూరు లాంటిది. బయటకు వ్యాహ్యాళికి వెళ్తే, ఎవరో ఒకరు పలకరిస్తారు అదీ ఇదీ అంటూ. అతను తిరిగి 6ః30 గంటలకంతా వచ్చేసేవాడు. అందరూ ఉదయం నడక మొదలు పెట్టకముందే. నేను నిద్రలేచే దాకా అతను ఎలాంటి శబ్దాలు చేయకూడదు! గేటు దగ్గరే ఉండి హలోలు, నమస్కారాలు ఇంట్లోకి తీసుకురాకుండా, పలకరింపులు అన్నీ వాకిట్లోనే తెముల్చుకోమని చెప్పాను. అందుకని, అతను గేటు వద్దనే నిల్చునేవాడు. వచ్చేపోయే వారిలో ఎవరు వేగంగా నడుస్తున్నారు, ఎవరు నిదానంగా అడుగులు వేస్తున్నారు అని గమనిస్తూ, అతను కామెంట్లు విసురుతూ ఉండేవాడు. అలాగే నేను నిద్రలేచానా అని నాపై ఒక కన్నేసి ఉంచేవాడు. నేను నిద్రలేచి బాత్రూంలోకి వెళ్ళగానే, వంటింట్లోకి వచ్చి టీ తయారు చేసేవాడు.

టీ చక్కగా ట్రేలో అమర్చి నాకోసం ఎదురు చూసేవాడు. నేను వచ్చి అతని కప్పులో టీ పొయ్యాలి. ”నువ్వెందుకు నీ కప్పులో టీ పోసుకోవు? నీవే చేసావు కదా” అంటే ”వద్దు” అనేవాడు. నేనే అతని కప్పు టీ తో నింపాలి.

ఉదయాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. అవునవును. అతను తన కప్పు టీ మాత్రం పోసుకునేవాడు కాదు. కానీ, రోజువారీ పనులన్నీ అతనే చేసేవాడు. నా టిఫిన్‌ ఉందా లేదా, నా నీళ్ళ సీసా తీసుకొన్నానా లేదా, నేను నా మొబైల్‌ తీసుకొన్నానా లేదా, అన్నీ వివరంగా గమనించేవాడు. నేనెప్పుడూ ఇంటికి వస్తాను అవన్నీ అడిగేవాడు. అందుకే, మా పిల్లలు వెళ్ళిపోయాక ఇల్లు బోసిపోయినట్లుంది. నేను ఏడవడం మొదలుపెట్టాను. ప్రతి ఉదయం ఏడ్చేదానిని. కానీ, వసంత్‌ ఇప్పుడు ఏడవడం లేదు. ఇది మీకు చెప్తున్నప్పుడు కూడా ఏడవటం లేదు.

అతనికి అరవై ఏళ్ళన్నావు…

కొద్దికాలంగా అతను అంటూనే ఉన్నాడు, అరవై ఏళ్ళ వయసు చనిపోవడానికి అనువయింది అని. పై నుంచి నన్ను ఆటపట్టించేవాడు, ”నీకు నీ చుట్టూ ఉన్నా వాటన్నింటిపై అంతులేని ప్రేమ. నీవు చాలా కాలం బతుకుతావు” అని.

నేను కనీసం డెబ్భై ఏళ్ళ వయసు వరకన్నా బతుకుతాను. నా మనవలతో ఆడుకోవాలి.

మనందరం మనవలతో ఆడుకొంటాం. ఎక్కువ కాలం జీవిస్తాం.

నేను అతను నా భర్త అని చెప్పడంలేదు. అతను చాలా స్వచ్ఛంగా ఉండేవాడు. బంధనా విముక్తుడై ఉండేవాడు. అతను తన ఆఖరి ఘడియలు దగ్గరకు వస్తున్నాయని గ్రహించాడేమో నాకు తెలియదు.

ఇది కొంత విచిత్రంగా తోస్తోంది కానీ, అతను సెల్‌ఫోన్‌లో రోమింగ్‌ అడిగాడన్నావ్‌. మీ అందరితో మాట్లాడాడు. నాకేదో ఒక వింత భావన కలుగుతోంది. బహుశా అతను జరగబోయేది గ్రహించి ఉంటాడా అని…

నిజమే. రేష్మి కూడా అదే అంటూ ఉంది. అమ్మా! నాన్నకు ముందే తెలుసు. అతనికి కుటుంబమే అన్నీ. అతను దూరంగా వెళ్ళాడు కానీ, బహుశా మనతో ఉండి ఉంటే.

ఆఖరు ఘడియల్లో ఉన్న మనిషి, తనకు ప్రియమైన వాళ్ళు కనుమరుగయ్యేదాకా, కొన ఊపిరి వదలడంట. గదిలో నుంచి అయిదు నిమిషాలు బయటకు వెళ్ళినా సరే…

మరొక విషయం ఏమిటంటే, అతను కుటుంబీకుడు. అతనికి తన భార్యా బిడ్డలే సర్వస్వం. అతనికి తన చుట్టూ గుంపులు చేరడం ఇష్టం ఉండదు. అందుకే కాబోలు, అంత్యక్రియలకు కేవలం మేమే ఉన్నాం. ఇదే కలకత్తా అయితే అన్నదమ్ములు అన్నీ మేమే చేస్తామనేవారు.

లాంఛనాలు, కర్మలు మొదలైనవన్నీ…

నిన్ను దూరంగా ఉంచేవారు. నీ పాత్ర నామమాత్రంగా ఉండేది. అతను ఆ ఇంటి కుమారుడు. ఇంకా…

ఖచ్చితంగా. కరెక్ట్‌. ఇదంతా ఎలా జరిగిందంటే, అన్నీ ఎలా జరగాలో నేను నిర్ణయం తీసుకున్నాను. అదే అతను ఎప్పుడూ కోరుకున్నాడు.

అది అతనితో ఉన్న వ్యక్తి మనస్తత్వంలోనే కనబడుతుంది. నీవు ఇప్పుడే అన్నావు, నేను ఏడవడం లేదని. దాని గురించి మాట్లాడాలని కోరుతున్నా. అతని జీవితం అతను జీవించాడు. అతను వెళ్ళిపోయాడు. దీన్ని నువ్వెలా చూస్తున్నావు? దీనిలో నీకు బాగా కష్టం కలిగించిందేమిటి?

మొదట్లో అంతా మిశ్రమ భావనలు. ఒక్కోసారి అనిపిస్తుంది… నా జీవితం గడిచిపోవడానికి చూస్తున్నానని. ఒక్కోసారి అనిపిస్తుంది నేను సిల్లీగా ప్రవర్తిస్తున్నానని. ఎందుకంటే నేను జీవించి ఉన్నంతవరకూ ఎవరికైనా ఉపయోగపడాలి అన్న భావన. అప్పుడు కొత్త ప్రాజెక్టు ప్లాన్‌ చేస్తాను. నేనిప్పటికే ఆలోచిస్తున్నాను. 2007లో నా ఉద్యోగ విరమణ తర్వాత, నేను స్వతంత్రంగా చేయాలా వద్దా అనే ఆలోచనల్లో ఉన్నాను. ఒక ఆలోచన నన్ను బాగా భయపట్టేది ఏమిటంటే, నేనెక్కడ మంచాన పడతానో అని. ఎందుకంటే నన్ను అతను ఎంతో కాపాడేవాడు. దగ్గినా, తుమ్మినా కనిపెట్టుకుని ఉండేవాడు. ఈ విషయమే నన్ను బాధిస్తోంది. ఎప్పుడూ ఆందోళన పడుతున్నాను.

నాకు జబ్బు పడడం అంటే ఇష్టముండదు. మరొక ఆలోచన ఏమిటంటే, నేను ఒంటరిగా ఉంటాను.

పిల్లలిద్దరూ దూరంగా ఉంటారు. వాళ్ళని నేను ఇబ్బంది ఇదీ ఒక వైపు పెడతాను. ఈ ఒక్క విషయంలోనే నేను చాలా కదిలిపోయాను, అభద్రతగా భావిస్తాను.

నీ పాదాలను మర్దన చేసేవాడనీ, నువ్వు ఆఫీసు నుంచి రాగానే ఒక గ్లాసు విస్కీ ఇచ్చేవాడనీ చెప్పావు!

అవును. అతను బావుండేవాడు. నిజానికి, నాకు ఒక డ్రింక్‌ కావాంటే, బాగా అలసిపోయి వచ్చినపుడు, అతను పడుకోమని చెప్పి డ్రింక్‌ తీసుకు వచ్చేవాడు. ఆ తరువాత నా పాదాలను మృదువుగా మసాజ్‌ చేసేవాడు.

”సరే, మొదట ఒక డ్రింక్‌ తీసుకొందాం” అని ”నీకేం కావాలో చెప్పు?” అనేవాడు. అతనొక కనొసర్‌. అతను మద్యం రుచి, మర్మం ఎరిగినవాడు. మంచి కాక్‌టైల్‌ తయారు చేయగలడు. నేను అతనితో పాటు కలిసి డ్రింక్‌ తీసుకుంటే చాలా సంతోషపడేవాడు. కానీ, నేను మెల్లిగా డ్రింకులకు అతీతమయ్యాను. ఎందుకంటే, అతనికి వాటిపట్ల ఇష్టం పెరిగిపోయింది.

అదొక తరహాగా…

అవునవును. అదొక ప్రతిచర్య లాగా జరిగింది. అతను నా పట్ల చాలా శ్రద్ధ తీసుకొన్నాడు. అతనినెప్పుడూ జబ్బున పడడం చూడలేదు. నేనతను తుమ్మినట్లు కానీ, దగ్గినట్లు కానీ చూడలేదు. మా వైవాహిక జీవితంలో అతను బాగా చూసుకున్నాడు.

అతను వంట బాగా చేసేవాడు. నాకు వంట చేయడం ఇష్టం లేదు. నేను వంట చేయవలసి వచ్చినపుడే చేసేదాన్ని. అతను ప్రపంచంలో నేనే గొప్పగా వంట చేస్తాననుకునేవాడు. నేను వంట చేస్తుంటే చూస్తూ ఉండేవాడు. నా కోసం బీరును అందిస్తూ, జిన్‌ తయారు చేసి ఇవ్వడం చేసేవాడు.

నా చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ”నువ్వేమీ చేయనక్కరలేదు. నేను తొందరగా వంట ముగించుకొస్తాను” అనేదాన్ని. అతను వెంటనే అనేవాడు, ”ఓహ్‌! నువ్వు అలసిపోయి ఉంటావు. నువ్వు మసాలాలు వెయ్యి చాలు. మిగిలిన వంట నేను చేస్తాను” అనేవాడు. ”కానీ, ఎంతెంత వేయాలో నువ్వు చెప్పు, నేను చేసేస్తాను” అనేవాడు. కానీ, కొన్నిసార్లు అతనే వండేవాడు. చాలా శ్రద్ధ తీసుకొనేవాడు. చాలా చాలా శ్రద్ధ…

చాలా శ్రద్ధ. తను నిన్ను బాగా చూసుకొన్నాడు. చాలా అపురూపంగా భావించేవాడనిపిస్తుంది.

అవును. నేను అతను చేసినంత చేశానని అనుకోను.

కాదు. నువ్వక్కడ ఉన్నావు. అది చాలు. అతను నిన్ను నువ్వేమిటో అలాగే ఉండడాన్ని ఇష్టపడ్డాడు. అతను నిస్సందేహంగా నీ గురించి సంతోషపడ్డాడు. నీవిప్పుడు మరొక అంకంలోకి ప్రవేశించావు. ఇది అంతకు మునుపుకన్నా భిన్నమైనది. నీవు చాలా వెలుగుతో కనబడుతున్నావు. నీవు ఎలాంటి చేదు అనుభవాల్ని మాట్లాడడం లేదు.

అతని గురించి మాట్లాడడం….

అతని గురించి మాట్లాడడం… అప్పుడు నీ కళ్ళల్లో ఎంత సున్నిత భావం ప్రతిఫలిస్తుందో… నీకై నువ్వు జ్ఞాపకం చేసుకోనిస్తున్నావు.

నీకు తెలుసు కదా, నా ఆలోచనల్లోకి ఏదీ రావడం లేదు, ఆ ఆఖరు ఘడియలు తప్ప. ఎందుకో తెలియదు. నేను ప్రయత్నించాను…

అంతా ప్రశాంతం. ఆ సందర్భం అంతా నీ ఆధీనంలో ఉందని అనుకోలేవు. నీవు నీ భావోద్వేగాలను పూర్తిగా అదుపులో

ఉంచుకున్నావు. నీవు ఎక్కడ ఉద్రేకపడలేదు. నీవు ఆలోచించుకున్నావు. ఎలా చేయాలో అనుకున్నావు. నీవు ఇటువంటి సందర్భాలను ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇవ్వబడ్డావు. ఎందుకంటే, మా అందరిలాగే ఇటువంటి సందర్భాలను ఎదుర్కొనేలా నీవు శిక్షణ పొందావు. కానీ, నీవు ఎక్కడో లోతుగా గాయపడ్డావన్న అంశాన్ని పక్కకు పెట్టలేదు. నీవు కూడా ఆ విషయాన్ని నీకై నీవు ప్రస్తావించక తప్పలేదు.

నాకు తెలియదు. నేను నా ప్రణయ కాలం నాటి రోజుల్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. మా పెళ్ళి గురించి, మేమిద్దరం కలిసి గడిపిన మధుర ఘడియల గురించి మాట్లాడడానికి ప్రయత్నించాం. కానీ, మా వెనకటి రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకోవాలంటే, అంతా శూన్యం. నీతో మాట్లాడుతున్నాను కాబట్టి, అతను నాకు డ్రింక్‌ ఇవ్వడం, నేను అలసిపోయినపుడు నా పాదాలు మర్దన చేయడం చెప్పాను. కానీ, లేకపోతే, నాకు ఏమీ గుర్తుండదు.

అవును, కానీ నువ్వు గుర్తు తెచ్చుకోవడానికి ఇష్టపడనివి ఉన్నాయి కదా? నీవు వాటికి తాళం వేస్తున్నావు. ఎందుకంటే నీకు వాటిని జ్ఞాపకం చేసుకోవడం ఇష్టం లేదు.

తాళం వేస్తున్నానా? నిజంగానా? అవును. కావచ్చు. నిజానికి ఇప్పుడు నీవంటున్నావంటే నిజమే కావచ్చు. నాకు గుర్తుంది. ఒకసారి మేము దూర ప్రయాణం చేస్తున్నాం. ఒక స్నేహితుని పెళ్ళికి. అతని తల్లి, అక్క అందరూ కారులో ఉన్నారు. అతను కారు నడుపుతున్నాడు. బిడియం లేకుండా అతను కారు అద్దం జరిపాడు, నేను అతనికి ఎప్పుడూ కనబడుతూ ఉండేలా. అతని తల్లి చాలా ఇబ్బంది పడింది. అతను ఇబ్బంది పడలేదు. అతను తన ప్రేమను, ఆప్యాయతను, మోహాన్ని బహిరంగంగానే వ్యక్తపరిచేవాడు. నేను మొహమాటపడ్డాను. అతని చెల్లెళ్ళు, బావలు మొహమాటపడ్డారు. చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. అతను ఏ మాత్రం బిడియపడలేదు. అతను బాగా నాట్యం చేసేవాడు. మేమిద్దరం ఒకరికి ఒకరం బాగా దగ్గరవుతూ వాల్ట్జ్‌ చేసేవారం. మా అన్న ఇక్కడ ఉంటే అనేవాడు, ”నేను మీ ఇద్దరితో కలిసి డాన్సింగ్‌కి రాను. అతను నిన్ను గట్టిగా పట్టుకునే తరహా చూస్తే” అని. నేను ఒకరోజు అతనికి చెప్పాను, ”అలా చేయొద్దు. ఇక్కడివారు అంతటి దగ్గరితనాన్ని చూడలేరు” అని.

ఇది ఖచ్చితంగా అతని తరహా భావోద్వేగాల ప్రకటన. అతనికి నా గురించి బాగా తెలుసు. నాకేం నచ్చుతుందో, నాకేం నచ్చదో, నా ఆహారపు అలవాట్లు అన్నీ. ఇప్పుడు తలచుకుంటే చివరి రెండు, మూడేళ్ళ కాలమే గుర్తొస్తోంది. మేం ఎక్కువగా మాట్లాడుకోలేదు. మేం ఒకప్పుడు ఒకరికి ఒకరం సరిజోడైన జంట. ఇప్పుడు నాలో ఎలాంటి అపరాధ భావన లేదు కానీ, నేను ఇంకా బాధపడుతూనే ఉంటాను.

అందరం వివిధ దశలలో కష్టాలను ఎదుర్కొంటాం. బహుశా ఆ ఇబ్బందులు ఉన్న సమయాన అతను విషయం గ్రహించి ఉండడు.

నేను ప్రయత్నించాను. గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి ”మనం పంచుకొందాం, ఒకరికి ఒకరం ఉండేది ఎందుకు?” అని. కానీ, అతను మనసు విప్పి మాట్లాడలేదు.

నేను దీని గురించి వ్రాసాను. అతని చివరి రోజుల్లో మొదలై, ఆ తర్వాత కొన్ని సంఘటనలను ప్రస్తావించాను.

కానీ, నాకు ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే, నాకు ఎలాంటి ఉద్వేగం కలగదు ఇప్పుడు చదువుతుంటే.

దానర్థం ఏమిటంటే, నిన్ను నీవు ఎవరూ కదిలించలేని ఒక స్థిరమైన స్థాయిలో ఉంచావు.

నీవు అలా అనుకొంటున్నావా?

నేను అలా అనుకుంటున్నాను. మొదటిసారి నువ్వు అతని గురించి మాట్లాడినప్పుడు, ఇప్పుడు కూడా నీ ముఖం వెలిగిపోతున్నది. నీవు నిఖార్సయిన నిజాయితీ పరురాలివి. నీకై నీవు ప్రశ్నించుకొంటున్నావు, ”ఏమిటిది? నేనెందుకు ఉద్వేగానికి లోను కావట్లేదు అని”. అదే సమయాన, నిన్ను నీవు గట్టి బంధంలో ఉంచుతున్నావు. నీవు ఎంత పని రాక్షసివంటే, నీవు ఏ విషయాన్నీ తేలికగా వదిలిపెట్టవు.

ఉదాహరణకి మీ పిల్లలు వెళ్ళాక, ఒంటరిగా ఉన్నప్పుడు… ఎన్ని రోజులు ఏడ్చావు?

మొదటి ఒకటి, రెండు నెలలు.

మొదటి రెండు నెలలు. అది ఒట్టి వంటరితనమూ, దిగ్భ్రమ. కానీ, అతని దుఃఖాన్ని నీవు అనుభవించలేదు. మీ సంబంధం చాలా అపురూపమైనది, బలమైనది. నీకు చాలా ముఖ్యమైనది కూడా. దానర్ధం కూర్చుని ఏడ్చి గగ్గోలు పెట్టమని కాదు. కేవలం ఆ అపురూప కాలాన్ని తిరిగి పొందడం అన్నది. అంటే, నా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మనం ఎన్నో సర్దుబాట్లు చేసుకొంటాం. మనం అవతలి మనిషికి దగ్గరవడానికి ఎన్నో చేస్తాం. నీవు రాజకీయాల్లోకి రావాలనుకున్నావు. అతను మన దారులు వేరవుతాయి అన్న క్షణాన ఆ ఆలోచనను వదులుకొన్నావు. మరి కొన్ని విషయాలున్నాయి. నీవు ఇంటిని జప్తు చేయకుండా కాపాడినప్పుడు నీకు కృతజ్ఞత చూపలేదు. అది నీకు బాధ కలిగించింది. ఈ విషయాలు గుచ్చుకొంటాయి. మరికొన్ని విషయాలు మిగిలి ఉంటాయి. జ్ఞాపకాల్లో చాలా సున్నితత్వం

ఉంది. మనం గుర్తు చేసుకునే విషయాలు, ఘనీభవించిన జ్ఞాపకాలు. నీకు తెలుసు, నీకు తెలియదు. కరుడుగట్టిన గాయాలుంటాయి. కనుక, దాదాపు అవి అక్కడ లేనట్టే. అది పూర్తిగా ఎండిపోయి, మాడిపోయింది. అది అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. కొన్ని క్షణాలు నిన్ను తినేస్తుంది. ఉదాహరణకి నువ్వు రాజకీయాల్లోకి రాకూడదు అనుకొన్నావు. మానుకొన్నావు… ఆ ఎంపిక గురించి ఎప్పుడైనా తరిచి చూసుకొన్నావా?

ఎన్నడూ లేదు. అది నేను తీసుకున్న నిర్ణయం. తరువాత అర్థమైనదేంటంటే, కుటుంబ జీవనానికి, మన దేశ రాజకీయ వ్యవస్థలో, దేనికీ సర్దుబాటు కాని మనలాంటి వాళ్ళకు చాలా కష్టం.

అతనితో ఎప్పుడైనా ఆ విషయం గురించి చర్చించావా?

లేదు. ఒక కారణం ఏమిటంటే, నేను చేసే పనిమీద నేను చాలా స్పష్టత కలిగి ఉన్నాను. నిజానికి మరొక స్వీయ నిర్ణయం ఒకటి తీసుకున్నాను. నేను ఇంగ్లీష్‌ వార్తలు చదివేదాన్ని. బాగా చదువుతానని అనేవారు. అప్పుడు దూరదర్శన్‌ కొత్తగా వస్తున్నది. టెలివిజన్‌ వేగం విస్తరిస్తోంది. ఆకాశవాణి డైరెక్టర్‌ నన్ను ప్రత్యేక శిక్షణకు పంపాలనుకునేవారు. శిక్షణ అనంతరం నేను కలకత్తా ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు తీసుకోవాలని వారి ప్రతిపాదన. నేను అతన్ని వదిలి వెళ్ళలేదు. ఇది నేను పూర్తిగా స్పృహతో తీసుకున్న నిర్ణయం. అది వృత్తిపరంగా మంచి అవకాశం. ఎందుకంటే, నేను నా పనిలో సంతోషంగా ఉన్నాను. నేనేమంత గొప్ప పని చేయలేదు కానీ, చేసిన కొద్ది పని సంతోషాన్ని కలిగించేది. నేను చేసిన దానికి మంచి పేరు వచ్చింది. అందుచేత నాకు ఆ దిశగా ఫిర్యాదులేమీ లేవు. బహుశా అప్పటికి నేను నిరుద్యోగిగా ఉంటే నేను ఫిర్యాదు చేసేదాన్నేమో. ప్రాథమికంగా, ఆ నిర్ణయం నా గురించి కూడా. నూటికి నూరుపాళ్ళు అతని కోసం కాదు. ఏ మూలో అది సరేలెమ్మని అనుకొన్నాను. అందుకే అది ఒక సమస్య కాదు.

అతనితో వచ్చిన సమస్య ఏమిటంటే, మేము లోకానికి సంబంధించిన విషయాలన్నీ బాగా మాట్లాడుకునే వాళ్ళం. వ్యక్తిగత విషయాలు వచ్చేసరికి అతను నాతో, ”నీకేం కావాలో నాకు అర్ధమవుతుంది. నీకేం కావాలో, ఏమేమి ఇష్టమో నాకు తెలుసు” అనేవాడు.

”నీకేం కావాలో నాకు అర్థం కాదు… నాకు చెప్పండి…” అనేదాన్ని. అతను నన్ను అంతగా చదివాడు.

అది ఎందుకంటే, నీకేం కావాలో నువ్వు స్పష్టంగా చెప్పేదానివి. అందుచేత అతనికి అన్నీ స్పష్టంగా తెలుసు.

అవును. ప్రతిసారీ ఇదే సమస్య, పెద్ద సమస్య. అతను ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడడు. నాకు తెలియాలని అతను అనుకునేవాడు. నేననే దానిని నేనేమీ ఇంద్రజాలికురాలిని కాదు, నీవు చెబితేనే నాకు తెలుస్తుంది అని. అతనికి ఖచ్చితంగా తెలుసు, నాకు కొద్దిపాటి తలనొప్పితో ముఖకవళికల్లో మార్పు వచ్చినా కనిపెట్టేసేవాడు. నేనెప్పుడూ అతన్ని మనసు విప్పి మాట్లాడించలేకపోయాను. అది రాన్రాను మరింత జఠిలమైపోయింది.

నువ్వు నీ చుట్టూ ఉన్న వైవాహిక సంబంధాలను చూస్తూ ఉంటావు కదా. మీ సంబంధం ఎలా ప్రత్యేకమైనదని అనుకొంటావు?

ముందు చెప్పినట్లుగా, అతను పూర్తిగా కుటుంబ వ్యక్తి. అతని జీవితమంతా భార్య, అతని ఇద్దరి పిల్లల చుట్టూ తిరుగాడింది. అది నిజం. ఎవరూ, ఎవర్నీ అతనితో పోల్చలేం. అతని స్నేహితుల్లో కూడా అదే చర్చనీయాంశం.

మీ అమ్మాయి లైలీ ఏం చేస్తుంది?

లైలీ. ఒబెరాయ్‌లో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేసింది. కానీ రెండో బిడ్డ పుట్టాక, పని మానేసింది. ఇప్పుడు తన స్నేహితురాలితో కలిసి ఒక కన్సల్టేషన్‌ ఫర్మ్‌ మొదలుపెట్టింది. పిల్లల్ని చూసుకొంటూ హాస్పిటాలిటీ వ్యాపారంలో ఉండడం కష్టం. మా అల్లుడిని చూసి గర్వపడతాను. అదృష్టవశాత్తు సౌమ్య చాలా…. నేనెలా చెప్పాలి? వాళ్ళిద్దరూ స్నేహితుల్లా

ఉంటారు. వారి సంబంధం మళ్ళీ మాలాగానే. చిన్నప్పటినుంచీ ప్రేమికులు. సౌమ్య లైలీని ఎంతో గౌరవిస్తాడు. లైలీ తన భర్తంటే గర్వపడుతుంది. నా భర్తకు సౌమ్య ఒక చెఫ్‌ అని ఇష్టంగా ఉండేది కాదు.

మా అబ్బాయి అరవింద్‌ కెమెరా చేతపట్టుకుంటానన్నప్పుడు మా అత్తగారు చాలా దిగులుపడ్డారు. కెమెరా ముందు ఉండడు అని తెలుసుకున్నాక ఆమె తెరిపిన పడ్డారు.

అవునవును. నిజానికి, నేను ఇంటికి తిరిగి వెళ్ళేసరికి నేను చేసినదానికన్నా ఆకర్షణీయంగా, ముఖ్యంగా ఉండేది. మా సహోద్యోగి శాంతి దీ నన్ను ఆటపట్టించేది. ‘నీవు శిక్షణ పొందావు. కమిటీ మీటింగులు శనివారం ఉండాలి, కానీ రెండింటి లోపలే’ అని. రెండు దాటితే నేను చాలా అసహనంగా ఉండేదాన్ని. అతను నాతో భోజనం చేయడానికి ఎదురు చూస్తూ ఉండేవాడు. అందుకే శాంతి దీ నన్ను ఆటపట్టించేది. రెండు నెలల క్రితం ఆమె నాతో, ”ఇక నీవు శనివారం మధ్యాహ్నం పరుగులు పెట్టాల్సిన పని లేదు” అంది.

కాబట్టి, వివాహంలో ఉన్న ప్రత్యేకత ఏమిటని నీవు అడగగానే, అతను వివాహాన్ని నిర్మించాడు అనిపించింది. నేనెలా చెప్పాలి. అతను మా ఇంటిని తీర్చిదిద్దాడు.

ఇది అసాధారణం. మామూలుగా ఆడవారు ఆ పనిని చేస్తారు!

అవును, నా కన్నా ఎక్కువగా. ఎంతగా అంటే, ఇప్పటికీ నాకు ఇంటికి వెళ్ళాలంటే ఉత్సాహంగా ఉంటుంది.

నేనిక్కడ ఉన్నాను. కొద్దిసేపటికి అసహనంగా అనిపిస్తుంది. తిరిగి ఇంటికి వెళ్తాను. ఖచ్చితంగా అతను ఏదో ప్రత్యేకతను నింపాడు. అతను బెంగుళూరు వెళ్ళినపుడు కూడా, ఇంటికి అవసరమైన సరుకులన్నీ తెచ్చిపెట్టి వెళ్ళాడు. చివరి రెండేళ్ళు ఇంట్లోనే

ఉన్నప్పుడు, ఇంటి పనులన్నీ తానే చూసుకునేవాడు. నేను చేసే పని బహుశా ఒక్కటే. ఏ పూట ఏమి వండాలో నిర్ణయించడం. అంతే. ”ఆ కూరగాయలు ఇక్కడున్నాయి. ఈ చేప అక్కడుంది…” ఇలా అంతే. నేననేదాన్ని, ”నీవు కంగారుపడొద్దు. నేను చూసుకొంటాను” అని. నేను చూసుకోలేనని తను ఎప్పుడూ కంగారు పడుతూ ఉండేవాడు. నేను అసౌకర్యంగా భావించేదాన్ని, తను అంతగా కనిపెట్టుకుని

ఉండేవాడు.

ఒకరు ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటుంటే మరొకరు పట్టించుకోవడం మానేస్తారు.

నాకు జ్ఞాపకం వస్తోంది. మా పెళ్ళయ్యాక మొదటి విందుకి వెళ్ళి వచ్చాం. చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాం. నేను నా చీర ఒక పక్కన, జోళ్ళు ఒక పక్కన, బ్యాగ్‌ మరో పక్కన పడేశాను. నైటీ వేసుకుని పడకేశాను. పది నిమిషాలు, పదిహేను నిమిషాలు… అతను ఎంతకూ రాలేదు. నేను నిద్రమత్తులో ఉన్నాను. అతను నా చీర మడతేశాడు. నా చెప్పులు షూ రాక్‌లో పెట్టాడు. బ్యాగ్‌ను అల్మారాలో పెట్టాడు. నా నగలు, తన దుస్తులు అన్నీ ఎక్కడివక్కడ సర్ది అప్పుడు పడుకున్నాడు. అప్పుడు నేను, ”ఓరి దేవుడా!” అనుకున్నా.

ది మొదటి సందేశం అన్నమాట!

మా ఇంట్లో మొదటి పార్టీ అయ్యాక కూడా అంతే. తెల్లవారుజామున 2ః30 గంటలు. నేను హాయిగా మంచమెక్కాను. కానీ అతను యాష్‌ట్రేలు శుభ్రం చేసి, డ్రాయింగ్‌ రూం సర్ది, ప్రతి ఒక్క వస్తువును యధాస్థానానికి సర్దుతూ ఉన్నాడు.

సలాం నమస్తే లాగా…

ప్రతి ఒక్కటి వాటి స్థానాల్లోకి ఉండాలి. ఆ విధంగా అతను చాలా శుభ్రంగా ఉండేవాడు. అతని చేతిరాత చాలా అందంగా, శుభ్రంగా ఉండేది. అతను మంచి ఆటగాడు. బ్యాడ్మింటన్‌, క్రికెట్‌…ఏదైనా ఆడేవాడు. అతనికి ఆటలంటే బాగా ఆసక్తి. అతను ఇంట్లో

ఉన్నంతసేపూ స్పోర్ట్స్‌ ఛానళ్ళు మోగుతూ ఉండేవి. గోల్ఫ్‌, క్రికెట్‌ లేకపోతే టెన్నిస్‌… మరేదయినా.

మిమ్మల్ని ఏమి నిలబెట్టింది?

ఖచ్చితంగా పనే. నేను కలకత్తాలో ఒంటరిగా ఉంటాను. మా అమ్మాయిలిద్దరూ నా జీవితానికి గొప్ప ఆశీర్వచనాలు. వాళ్ళు ఆ సందర్భాన్ని ఎలా సమర్ధించుకున్నారో, ఆ పై ఎలా చూసుకొంటున్నారో… నేననేది చిన్న విషయాల గురించి. ఇది వ్యక్తిగత విషయం. మా చిన్నమ్మాయి నా సంపాదనలో కానీ, అతను వదిలి వెళ్ళిన సంపదలో కానీ ఒక్క పైసా ఖర్చు పెట్టనివ్వదు. ఆమె అంటుంది, ”ఎప్పుడైనా నేను చెడ్డ కూతురిని అయిపోయి నిన్ను చూసుకోలేదనుకో, అప్పుడు నీకు ఆ డబ్బు పనికి వస్తుందిలే” అని. అప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అందుకే నా సంపాదన, అతను ఇచ్చి వెళ్ళింది… అంతా అలా పక్కకు ఉంచుతున్నాం. ”నీ తర్వాత మేమెలాగు వాడుకొంటాం కదా. మాకు అన్నదమ్ములు ఉన్నారా? మేము ఇద్దరమే”. ఈ మాటలకూ నాకు ఏడుపు వచ్చింది. మా పెద్దమ్మాయి స్నేహితురాలిలా

ఉంటుంది. ఇద్దరు పిల్లలు వాళ్ళ నాన్నకు చాలా సన్నిహితం. నిజానికి, మా ఇద్దరి మధ్యా వాదన వస్తే వాళ్ళే ”అమ్మా నువ్వు కూడా…” అని గది బయటికి వెళ్ళిపోయేవారు.

అవును! పిల్లలు పెద్దయ్యాక మనకు చెబుతారు, ”పిల్లల్లా గొడవలు పడకండి” అని.

కానీ, చివరికి మేము గొడవలు పడడం కూడా మానేశాం. చివరికి మా మధ్య మాటలు కరువయ్యాయి. తగవులు కూడా లేవు. నాలో అంత అభద్రతకు కారణం నేను అస్వస్థతకు గురి కావడమే. నేనెప్పుడూ అనుకునేదాన్ని అతని చేయి నా నుదుటి మీద పెడితే బావుండేదని. నాకు కొద్దిగా బాగోలేకపోయినా, అతని చేతిని నా నుదుటి మీద పెట్టమనేదాన్ని. నాకు తగ్గినట్లనిపించేది. అతను మామూలు వారికన్నా కాస్త భిన్నం. నేననేది నిజాయితీలో. అతను వివేకానందను నమ్మేవాడు. అతని పుస్తకాలన్నీ చదివేవాడు, కానీ దేవుడి గురించి మాత్రం కాదు. ”మనం నమస్కారం ఎందుకు పెడతాం. అదొక సంజ్ఞ అలాగే, ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు నవ్వుతావు. ఏడ్చావు అంటే దుఃఖంలో ఉన్నావని. నువ్వు ఇలా చేసావంటే, నీవు గౌరవం చూపుతున్నట్లు. కానీ, అతను ఏ పూజా పునస్కారాలను నమ్మలేదు. గుడికి వచ్చేవాడు కాదు.

నేను దేవుడ్ని నమ్ముతాను. ఏ పేరు మీదైనా పిలవండి. నేనొక శక్తిని నమ్ముతాను. ఎవరినైనా ఎలా ప్రార్ధిస్తాము?

ఇది అతనిలో మరో పార్శ్వం. అతని కుటుంబం ఆస్తికులు. అది అతన్ని ప్రభావితం చేయలేకపోయింది. అతను చాలా గట్టి మనిషి. అతనిలో కొన్ని లక్షణాలు చాలా స్పష్టంగా ఉండేవి. అతని తండ్రి అరవై మూడు, అరవై నాలుగేళ్ళ వయసులో చనిపోయారు. అతను ఇంగ్లాండ్‌ నుంచి తిరిగి రాగానే, బహుశా మా పెళ్ళయిన ఏడాదికో, రెండేళ్ళకో… నాకు సరిగా గుర్తులేదు. అతని తండ్రి అతనికి వ్యాపారం అప్పజెప్పాలనుకున్నాడు. కానీ అతను, ”నీవు నా మీద ఇప్పటికే చాలా పెట్టుబడి పెట్టావు. నా జీవితం నేను జీవించగలను. ఈ వ్యాపారం అన్నకు ఇవ్వండి. అతనికి అవసరం ఉంది” అని. అతనికి చాలా దృఢమైన వ్యక్తిత్వం. అది చాలా పెద్ద వ్యాపారం. అదంతా పోయింది. అతని వ్యక్తిత్వం గురించిన మరొక విషయం, మన నిర్ణయాలు ఖచ్చితంగా మన సంబంధాలపై ఆధారపడి ఉంటాయి. అతను చాలా స్పష్టంగా చెప్పాడు, ”నాకు నచ్చినదేదైనా నా కూతుళ్ళు చేసినా లేదా నువ్వు ఒప్పుకోకపోయినా, ఇక అంతే”.

మీకు నేను చెబుతున్నట్లుగా, అతనికి అన్నీ నలుపు, తెలుపు మాత్రమే. ఆ నడుమ ఉన్న బూడిద వర్ణపు ఛాయలు తెలియవు. ఒక పని తప్పయితే, అది అమ్మయినా, నాన్నయినా, అన్నయినా, తమ్ముడయినా తప్పు తప్పే కదా! ఇది అతనిలో ఒక దృఢమైన పార్శ్వం. ప్రాథమికంగా అది తన వారయినా, పరాయి వారయినా, అమ్మయినా, నాన్నయినా, కొడుకైనా, ఎవరైనా ఒకటే. మా ఇద్దరి నడుమ ఉన్న ముఖ్యమైన తేడా ఇదే. అందుచేతే, అతను నన్ను నిజాయితీపరురాలిని కానని భావించేవాడు.

కొయిలీరాయ్‌

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.