అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవ సంబరాలు -భూమిక టీం

భూమిక విమెన్స్‌ కలెక్టివ్‌ – రూమ్‌ టు రీడ్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో – బాలల హక్కుల వారోత్సవ ను పునస్కరించుకొని నవంబర్‌ 14-19 వరకు వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించబడ్డాయి. హైద్రాబాద్‌లో రూమ్‌ టు రీడ్‌ సంస్థ పనిచేస్తున్న 8 ప్రభుత్వ పాఠశాలలైన – రాజ్‌భవన్‌ స్కూల్‌, కుల్సుంపుర స్కూల్‌, అమీర్‌పేట స్కూల్‌, గోషాకట్‌ స్కూల్‌, ఎన్‌బిటి నగర్‌ స్కూల్‌, సబ్జిమండి స్కూల్‌, లంగర్‌హౌస్‌ హైస్కూళ్ళలోని విద్యార్థినీ, విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో తీసుకున్న అంశం బాలల హక్కులు ః జీవించే హక్కు, రక్షణ, భాగస్వామ్య, అభివృద్ధి హక్కులు.

ఆరవ తరగతి విద్యార్థులకు నాట్య ప్రదర్శన, ఏడవ తరగతి విద్యార్థులకు కథ, పోస్టర్‌ మేకింగ్‌ ఎనిమిదవ తరగతి విద్యార్థులకు – డిబేట్‌, స్పీచ్‌, ఎస్సే రైటింగ్‌ పోటీలు నిర్వహించబడ్డాయి. (తిరిగి డిబేట్‌కి) – ఆడపిల్లలు పై చదువులు చదువుకుంటే కుటుంబంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అన్న అంశంపై డిబేట్‌ జరిగింది. స్పీచ్‌కు తీసుకున్న అంశం – ప్రస్తుతం ఆడపిల్లలపై జరుగుతున్న హింస, వారి చదువులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం కలుగజేస్తుంది? అలాగే ఎస్సే రైటింగ్‌ కి ఃసెల్‌ఫోన్‌, సోషల్‌ మీడియా మన ఎదుగుదలకు ఎంతగా ఉపయోగించుకోగలుగుతున్నాం? అనే అంశం ఇవ్వబడింది. భూమిక నుంచి కృష్ణకుమారి, శాంతిప్రియ, జబీనా, రెహమతుల్లా, పద్మ, అనూరాధ, తదితరులు ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పోటీలు నిర్వహించారు. మొత్తం 8 పాఠశాలల నుండి 750 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా, 238 మంది పిల్లలు వివిధ అంశాల్లో గెలుపాంది బహుమతులు గెలుచుకున్నారు. వీరు వివిధ అంశాల్లో పర్ఫామెన్స్‌ ఆధారంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు ఎంపికయ్యారు. ఈ బాలల హక్కుల వారోత్సవ ముగింపు వేడుకలు 20-11-2018న ప్రపంచ బాలల దినోత్సవం నాడు జరిగాయి. గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు ఈ కార్యక్రమంలో బహుమతులు అందజేశారు.

ప్రపంచ బాలల దినోత్సవ వేడుకలు

భూమిక విమెన్స్‌ కలెక్టివ్‌, రూమ్‌ టు రీడ్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 20/11/2018న హైదరాబాద్‌లోని కుల్సుంపురాలోని మోహినీ ఫంక్షన్‌ హాలులో ప్రపంచ బాలల హక్కుల వారోత్సవ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి రూమ్‌ టు రీడ్‌ సంస్థ పనిచేస్తున్న 8 ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థినీ,విద్యార్థులు, టీచర్లతో పాటు భూమిక సిబ్బంది సహా మొత్తం 150 మంది వరకూ హాజరయ్యారు. (అందరూ నీలిరంగు దుస్తులు ధరించి రావడంతో ఆ ప్రాంగణమంతా నీలిరంగు జనసంద్రమైంది.)

ఉదయం 10ః45కు కార్యక్రమం మొదలైంది. రూమ్‌ టు రీడ్‌ సంస్థ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ సరిత మొదట సమావేశాన్ని మొదలుపెట్టి నలుగురు విద్యార్థినీ విద్యార్థులతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. తర్వాత ఈనాటి కార్యక్రమం ఉద్దేశ్యాన్ని తెలియచేశారు. అనంతరం యూనిసెఫ్‌ సుధా మురళిగారిని భూమిక చీఫ్‌ ఫంక్షనరీ కె.సత్యవతిగారిని, శ్రీమతి వంగవల్లి పద్మ గారిని వేదికమీదకు ఆహ్వానించారు. అనంతరం సమావేశానికి హాజరైన సైబరాబాద్‌ డిసిపి అనసూయ గారిని కూడా వేదికమీదికి ఆహ్వానించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కె.సత్యవతి గారు ముందుగా యూనిసెఫ్‌ సుదా మురళిగారిని ప్రసంగించవలసిందిగా కోరారు.

సుధా మురళి గారు మాట్లాడుతూ ముందుగా పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు అందరూ బ్లూ డ్రెస్‌ ఎందుకు వేసుకున్నారు? అని అడిగి ఐక్యరాజ్యసమితి, ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద భవనాలు, ఇళ్ళు,పిల్లలు ఉండే ప్రదేశాలు, అన్నింటినీ పిల్లలే మేనేజ్‌ చేస్తే ఎలా ఉంటుంది? అని పిల్లల దృష్టితో ఆలోచించి 2018 సంవత్సరంలో ‘యూనివర్సల్‌ చిల్డ్రన్స్‌ డే’కి బ్లూ కలర్‌ను థీమ్‌గా నిర్ణయించారు అని ఆ రోజు అందరూ నీలిరంగు దుస్తులు ధరించటం వెనుక ఉన్న నేపధ్యాన్ని పిల్లలకు తెలియచేశారు. ఆమె మాట్లాడుతూ పిల్లలకు హక్కులు ఇవ్వాలని, గుర్తింపునివ్వాలనే ఆలోచనతో ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒప్పందాన్ని రూపొందించిందని చెప్పారు. ఆ సదస్సుకు అన్ని దేశాల ప్రధాన మంత్రులు, దేశాధ్యక్షులు, రాజులు హాజరై ఆ ఒప్పందం మీద సంతకాలు చేశారని చెప్పారు. అలాగే వారు తమ ప్రభుత్వాలు, అధికారులు, పంచాయతీలు, చట్టాలు, ఈ ఒప్పందం గురించి అర్థం చేసుకొని పిల్లలకు ప్రాధాన్యమిస్తూ తమ బడ్జెట్‌లలో, స్కీమ్‌లలో పిల్లలకు భాగమిస్తామని చెప్పి ఒప్పుకున్నారని సుధా మురళి గారు వివరించారు. ప్రధాన హక్కులైన (ఎ) పరిశుభ్రమైన ప్రాంగణాల్లో తరగతి గదులు కలిగి ఉండే హక్కు, (బి) విశాలమైన ఆటస్థలాలు కలిగి ఉండే హక్కు, (సి) విటమిన్‌లతో కూడిన పోషకాహారం కలిగి ఉండే హక్కు, (డి) మెరుగైన వైద్యం పొందే హక్కులను గురించి ప్రసంగించారు. ఈ హక్కులతో పాటు బాలికలకు పాఠశాలల్లో పరిశుభ్రమైన టాయ్‌లెట్‌లు, నీటి సౌకర్యం ఉండాలని, మగపిల్లలు ఆడపిల్లల పట్ల గౌరవం కలిగి ఉండాలని, వారు ఇంటి పనుల్లో భాగం పంచుకోవాలని చెప్పి ముగించారు.

తర్వాత గోషాకట్‌ పాఠశాల టీచర్‌ శ్రీదేవి మాట్లాడుతూ రూమ్‌ టు రీడ్‌ సంస్థ సభ్యులు వాళ్ళు తమ పాఠశాల పిల్లలకు అందిస్తున్న సపోర్ట్‌ను ఎంతగానో మెచ్చుకున్నారు. ఇందాక సుధా మురళి గారు మహబూబ్‌నగర్‌ జిల్లాలో బాల్య వివాహాలు జరుగుతున్నాయని అన్నారని, నిజానికి హైదరాబాద్‌ నగరంలో కూడా చాలామంది ఆడపిల్లలకు పదవ తరగతి తర్వాత వెంటనే పెళ్ళి చేసేస్తున్నారని చెప్పారు. రూమ్‌ టు రీడ్‌ సిబ్బంది తమ పిల్లలకు నేర్పిన జీవన నైపుణ్యాలు, ఇతర అంశాలపై శిక్షణనివ్వడం వల్ల ఆ పిల్లలందరూ బాల్య వివాహాలు జరగకుండా ఒక మార్పు తెస్తారని, జీవితాన్ని ప్రొటెక్ట్‌ చేసుకుంటారని పూర్తిస్థాయిలో సంతోషకరంగా ఉంటారని భావిస్తున్నానని చెప్పారు.

సత్యవతి గారు మాట్లాడుతూ బాల్యవివాహాలు ఆపడంలో ఉపాధ్యాయుల రోల్‌ చాలా ప్రాముఖ్యమన్నారు. మీలాంటి ఉపాధ్యాయులు ఉంటే పిల్లలకు బాల్యవివాహాలు, డ్రాపవుట్స్‌ తగ్గుతాయని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఆ తర్వాత అమీర్‌పేట స్కూల్‌ టీచర్‌ రమ్య మాట్లాడారు. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా పిల్లలు వారం రోజులపాటు సెలబ్రేట్‌ చేసుకోవచ్చని, రూమ్‌ టు రీడ్‌ సిబ్బంది తమ పాఠశాల విద్యార్థుల్లో మంచి మార్పులు తెచ్చారని అన్నారు. వారివల్ల పిల్లల్లో ఇతరులకు సహాయపడే గుణం,పెద్దవాళ్ళ పట్ల గౌరవం, వాళ్ళతో మర్యాదగా మెలగటం తదితర గుణాలు అలవర్చకున్నాయన్నారు. అలాగే రూమ్‌ టు రీడ్‌ వారివల్ల తమ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు పోషకాహారం లభిస్తోందని చెబుతూ వారికి ధన్యవాదాలు తెలిపారు. సత్యవతి గారు రూమ్‌ టు రీడ్‌ సిబ్బందిని ప్రశంసిస్తూ పిల్లలందరితో చప్పట్లు కొట్టించారు. ఆ తర్వాత పిల్లలు పాటలు పాడారు.

నాటక ప్రదర్శనః ఒక స్కూల్‌ టీచర్‌ తన క్లాస్‌ విద్యార్థినికి బాల్య వివాహాన్ని నిరోధించి ఆ పాప తిరిగి చదువుకునేలా ప్రోత్సహించడం ప్రధానాంశంగా పిల్లలు చక్కటి నాటకాన్ని ప్రదర్శించారు.

అనంతరం డిసిపి అనసూయగారు మాట్లాడుతూ పిల్లలు జీవితంలో పైకి రావడానికి ఏర్పరచుకోవాల్సిన లక్ష్యాలు, రూపొందించుకోవాల్సిన ప్రణాళికలు, అందుకు కష్టపడాల్సిన అవసరం గురించి తెలిపారు. అలాగే సమస్యలు వచ్చినపుడు వాటినుండి బయటపడడానికి ఏం చెయ్యాలో, ఎలాంటి సపోర్ట్‌ సిస్టమ్స్‌ ఉన్నాయో పిల్లలను అడిగి వారితో చెప్పించారు.

ఒక పాపను స్టేజ్‌మీదకు పిలిచి ఒక అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి, వేధిస్తే ఏం చేస్తావు అని అడిగారు. దానికి ఆ పాప సమాధానమిస్తూ మొదట మన నమ్మకస్తులైన వారికి, తల్లిదండ్రులకు అలాగే టీచ్లకు,భూమిక హెల్ప్‌లైన్‌కు, షీ టీమ్స్‌ వారికి తెలియచేయాలని చెప్పింది.

అలాగే మరో బాలికను స్టేజిమీదకు పిలిచి నిన్ను మీ నాన్నగారు చదువు మానేసి పెళ్ళి చేసుకోమని ఒత్తిడిచేస్తే ఏం చేస్తావని అడిగారు. దానికి ఆ పాప సమాధానం చెబుతూ పిల్లలకు చదువుకునే హక్కు ఉందని, మీరు ఎలాగూ చదువుకోలేదు కదా కనీసం మమ్మల్నయినా చదువుకునేలా చూడండని గట్టిగా చెప్తానని చెప్పింది. అలాగే భూమిక హెల్ప్‌లైన్‌కి,షీ టీమ్స్‌కు కాల్‌ చేసి చెప్తానని చెప్పింది. డిసిపి తిరిగి ఆ పాపనే ఒక అపరిచిత వ్యక్తి నీకు ఫోన్‌ చేసి నిన్ను ప్రేమిస్తున్నానని, బస్టాప్‌లో కలుసుకుందామని అడిగితే ఏం చేస్తావని మరో ప్రశ్న అడిగారు

దానికి ఆ పాప సమాధానమిస్తూ ఏం భయపడకుండా ఫ్రెండ్‌షిప్‌ చేస్తామని చెప్పి ఫోన్‌లో మాట్లాడి, నమ్మించి, టీచర్లకు,పెద్దవాళ్ళకు చెప్పి వారిని ఆ వ్యక్తి ఉండే ప్రదేశానికి తీసుకువెళ్ళి పట్టిస్తానని చెప్పింది. మీలో ఎవరైనా ఫేస్‌బుక్‌లో ఫోటోలు పెడతారా? ఈ ఊరు వెళ్ళాను, ఆ ఊరు వెళ్లాను అని ఫోటోస్‌ షేర్‌ చేస్తారా? అని డిసిపి అనసూయ పిల్లలను ప్రశ్నించారు.

సమాధానంగా ఇద్దరు, ముగ్గురు చేతులెత్తారు. తర్వాత ఆమె తిరిగి మాట్లాడుతూ నాకు 20 మంది స్నేహితులు మాత్రమే ఉన్నారు, ఇతరులకు 100,600,700 మంది వరకు ఉన్నారని ఆలోచించి డిప్రెస్‌ అవుతుంటారు. ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లలో ఫోటోలు పెడ్తుంటారు. కానీ ఈ ఫోటోలను మోసగాళ్ళయిన వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. వారికి విషయం తెలిసేసరికి చాలా డామేజ్‌ జరిగిపోతుంది కనుక జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

రాజేంద్రనగర్‌ షీ టీమ్స్‌ ఇన్‌ఛార్జి పద్మ మాట్లాడుతూ షీ టీమ్‌ సిబ్బంది మఫ్టీల్లో పాఠశాలలు, కాలేజీలు, బస్టాప్‌లు, రైల్వేస్టేషన్ల దగ్గర తిరుగుతూ అక్కడ వ్యక్తులను పరిశీలిస్తారు. పెద్దలు, పిల్లలు ఎవరైనా ఫిర్యాదు ఇస్తే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచి న్యూసెన్స్‌ క్రియేట్‌ చేసిన వాళ్ళను పట్టుకుంటారు. మీరు బస్టాప్‌కి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఎవరైనా వ్యక్తి బైక్‌ మీద వచ్చి మిమ్మల్ని వేధిస్తే అతని బైక్‌ నంబర్‌ నోట్‌ చేసుకుని మాకు ఇచ్చినట్లయితే ఆ నంబర్‌ ద్వారా అతని అడ్రస్‌ తెలుసుకని అతన్ని పట్టుకుంటాం. కాబట్టి భయపడకుండా మాకు ఫోన్‌ చేయండని చెప్పారు.

తర్వాత భూమిక ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ ఉష మాట్లాడుతూ ఇప్పటివరకు మంచి విషయాలు తెలుసుకున్నారు కదా. మీకు సమస్యలు వచ్చినపుడు షీ టీమ్స్‌,108, 1098, 100కి, 181కి భూమిక హెల్స్‌లైన్‌కు ఫోన్‌ చేయండని చెప్పారు. అలాగే బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ విద్యార్థుల పేర్లు అనౌన్స్‌ చేయగా శ్రీమతి వంగపల్లి పద్మ, డిసిపి అనసూయ, కె.సత్యవతి, యునిసెఫ్‌ సుధా మురళి, సరిత గార్లు గెలుపొందిన పిల్లలకు బహుమతులు అందచేశారు.

రూమ్‌ టు రీడ్‌ ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ సరిత గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది..

భూమిక టీం

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.