పుట్ల చిరునవ్వుల ఆహ్వానం
నాకు శాశ్వతం అనుకున్నాను
అప్పుడే పూచిన పువ్వులా వికసించి
కులమతాలు, మూఢవిశ్వాసాల నుంచి
తేరుకోకముందే
పుట్టెడు దుఃఖంలో ముంచింది హేమ.
లతలా అల్లుకున్న మానవత్వం
పరిమళాలై వికసించకముందే
అందనంత దూరంగా పారిపోయింది.
ప్రేమ పావురాల్ని ఎగరేసి
విహంగ వీక్షణానికి దారి చూపి
బాధ్యతగా దూరం జరిగింది
గాజుబొమ్మలాంటి బంధాలను తెంపుకు మరీ వెళ్ళింది.
విలువైన సమాజం కోసం
సమష్టిగా పోరాడి
సాటి మనిషిగా పాఠాలు బోధిస్తూ
భావి భారతావనికి బాటలు వేసిన
పుట్ల హేమలతలు మళ్ళీ పుడతారు
ఆదర్శవంతులుగా మిగులుతారు.