శ్రీమతి సత్యవతి గారికి,
నేను నెలనెలా భూమిక చదువుతున్నాను. ఏమిటి అందున్న ఆకర్షణ! కాశీ మజిలీ కథల్లేవు. స్త్రీ పురుషుల అర్థనగ్న చిత్రాల్లేవు. ఆడా మగా వెండి తెర వ్యక్తుల గురించి అనవసరమైన వ్యాఖ్యలు లేవు. ముఖానికిది రాసుకో తలకిది రుద్దుకో అప్సరవైపోతావన్న నర్మగర్భ ప్రకటనలు లేవు.
భూమికలో దాదాపు ప్రతి పుటా మానసిక వికాసానికి దైనందిన జీవితానికి పనికొచ్చేదే. తెలుసుకోదగ్గ విషయాలు తెలిపేదే. (మీరా సంఘమిత్ర కథ ఒక ఉదాహరణ మాత్రం).
ఇది చాలా (!) నేను శ్రద్ధగా మాసం మాసం చదవటానికి.
– వి.ఎ.కె. రంగారావు, చెన్నై