నేను సిద్ధం – మీరు సిద్ధమేనా -పి. ప్రశాంతి

 

డిసెంబర్‌ వచ్చేసింది. దాంతోపాటే చలికాలం వచ్చేసినట్లుంది. తెల్లవారుతుందనగా చలి పెరుగుతోంది. దానికి తోడు పొగమంచు తెరలు తరలుగా తరలిపోతోంది. రజాయిలో దూరి వెచ్చగా పడుకున్న నాగుకి హఠాత్తుగా మెలకువ వచ్చింది. కిటికి పక్కనున్న వేపచెట్టు మీంచి పిట్టల కిలకిలా రావాలు. దాంతో పాటే వాకిలి ఊడుస్తున్న చప్పుడు లయబద్ధంగా వినిపిస్తోంది. ఆ వెనకే కళ్ళాపి చల్లతున్న శబ్ధం, దానికి తోడుగా రంగి కూని రాగం… జానపద సంగీతంలా ఉంది. లేచి వచ్చి తలుపులు తెరిచే సరికి ఇంటిముందు పచ్చటి పేడకళ్ళాపి చల్లిన వాకిట్లో తెల్లటి ముత్యాల ముగ్గు… చిన్న కీటకాల కోసం పిచ్చుకలు గిరికీలు కొడ్తూ… మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఇంటిల్లిపాదీ ఇంకా మంచి నిద్రలోనే ఉన్నారు.

పెరటి తలుపు తెరిచి, కాలకృత్యాలు తీర్చుకుని బ్రష్‌ చేసుకొచ్చేసరికి పాల పాకెట్లు పొయ్యి గట్టుమీద పెట్టి, సింకులో వేసిన గిన్నెలన్ని బైట వేసుకుని చకచకా తోమేస్తోంది రంగి. జయ లేచి పనిలోకి దిగి పోయింది. తను పిల్లల్ని లేపి రెడీ చేసేలోపు రంగి వంట చేసి టిఫిన్‌ బాక్స్‌లు సిద్ధం చేసేస్తుందిలే అనుకుంటూ ఆ రోజు ఆఫీసులో సబ్మిట్‌ చేయాల్సిన రిపోర్ట్‌ రాసుకోవడానికి కూర్చునాడు నాగు.

8 గంటల షిఫ్ట్‌కి ఆఫీసుకి చేరుకో డానికి 7.30కంతా బయలుదేరి పోయాడు. మెయిన్‌ రోడ్డుమీదకి వచ్చేసరికి శుభ్రంగా ఉన్న రోడ్లు, ఫుట్‌పాత్‌లు మనసుని

ఉల్లాసపరుస్తున్నాయి. ఊరంతా నిద్ర పోతుంటే అర్థరాత్రుళ్ళు నిద్రపోకుండా, రోడ్లపైన ఎడాపెడా విసిరేసిన చెత్తా చెదారాన్ని శుభ్రం చేసే మహిళలు గుర్తొచ్చి ప్రజారోగ్యానికి వారే సమిధలు అనుకుంటూ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నాడు.

వెళ్తున్న దారిలో రోడ్లపక్కన దోశలు, పూరి, ఇడ్లీ వంటి టిఫిన్లు అమ్మే బండ్ల దగ్గర పనిచేస్తున్న మహిళలు… ఎక్కడో ఉన్న కూరగాయల, పండ్ల మార్కెట్ల నుండి తెచ్చి తోపుడు బండ్ల మీద, గంపల్లో వీధివీధికి, ఇటింటికీ తెచ్చి అమ్మే మహిళలు… ఎండైనా, వానైనా, చలైనా లెక్కచెయ్యక ఫుట్‌పాత్‌లపైన, మార్కెట్లలో చిరు వ్యాపారాలు చేసే మహిళలు… షాపుల్లో, మాల్స్‌లో కొనుగోలుదార్లకు సహాయం చేసే సేల్స్‌గర్ల్స్‌… ఆఫీసుల్లో వెళ్ళగానే మర్యాదగా, ఆదరంగా పలకరించే రిసెప్షనిస్టులు… చిన్న చిన్న క్లినిక్స్‌ నించి, కార్పోరేట్‌ హాస్పిటల్స్‌ దాకా పేషెంట్స్‌కి సేవలు చేసే నర్సులు, ఆయాలు… ఆఫీస్‌కి వెళ్ళేసరికి అంతా డస్టింగ్‌ చేసి, చెత్తబుట్టలు ఖాళీచేసి, ఎక్కడివక్కడ సర్ధేసి, వాష్‌రూమ్స్‌ కడిగేసి, ఆఫీస్‌ ఫ్లోర్‌ అంతా తడిబట్టపెట్టేసి సౌఖ్యంగా పనిచేసుకోవడానికి వీలుకల్పిస్తున్న మహిళా శ్రామికులు… కనబడగానే విష్‌చేసి, ఆప్యాయంగాను, ఆదరంగానూ పలకరించే తోటి మహిళా ఎంప్లాయీస్‌… ఈ రోజు నాగుకి ప్రపంచం వేరేగా కనిపిస్తోంది. కాదు… కాదు… ఈ రోజు తన దృష్టికోణం వేరేగా ఉంది ప్రతి పనిలోను, జరిగే అభివృద్ధిలోను ప్రత్యక్షంగా, పరోక్షంగా మహిళల భాగస్వామ్యం ఎంత ఉందో అర్థం చేసుకోగలుగుతున్నందుకు, తన కళ్ళకి పెట్టుకున్న పురుషత్వ కళ్ళద్దాలను ఊడబెరికి సమానత్వపు భావాలను తెచ్చుకోగలిగి నందుకు తనపట్ల తనకే నమ్రతగా అనిపిస్తోంది.

తన ఆఫీస్‌లో తనతో పాటు సమాన బాధ్యతలు నిర్వర్తించే సహోద్యోగినికి గత ఏడాది బెస్ట్‌ వర్కర్‌ అవార్డొస్తే ఈర్ష్యతో తనుచేసిన కామెంట్‌ తలుచుకుంటే తనకే అసహ్యమేస్తోంది. తన టీంలోని మహిళా

ఉద్యోగుల పట్ల చాలాసార్లు తనెంత ఇన్సెన్సిటివ్‌గా బిహేవ్‌ చేశాడో… ‘చంటిపిల్ల తల్లివైతే ఏంటి? నువ్వు ఉద్యోగం చెయ్య డానికి వచ్చావు. జీతం తీసుకోవట్లేదా! స్పెషల్‌ కన్సిడరేషన్‌ ఎందుకివ్వాలి?’ అంటూ ఆమెని రెండ్రోజుల పాటు క్యాంప్‌కి వెళ్ళాల్సిందే అని శాసించిన తనని తలుచు కుంటే జుగుప్సగా ఉంది. తనతో పాటే జాయినై తనకంటే ముందే ప్రమోషన్‌ వచ్చి హెడ్డాఫీసుకి ట్రాన్స్‌ఫర్‌ అయిన తోటి మహిళా కొలీగ్‌ని ‘ఏం చేశావ్‌… డబుల్‌ ధమాకా కొట్టేయడానికి…’ అని ద్వంద్వార్థంతో మాట్లాడిన సందర్భం గుర్తొస్తే ఇప్పుడు ముఖం ఎత్తుకోలేనట్టనిపిస్తోంది.

నాలుగురోజుల క్రితం ఆఫీస్‌లో మేల్‌స్టాఫ్‌ అందరికీ ఏర్పాటుచేసిన పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణ ట్రైనింగ్‌ సెషన్‌ తన భ్రష్టు పట్టిన ఆలోచనల్ని పరాకాష్ఠకి చేర్చింది. అప్పుడే, తను చేసిన కామెంట్‌ ఎంత రిగ్రెసివ్‌గా ఉందో ఇప్పుడు తలుచుకుంటే సిగ్గుగా, అవమానంగా అనిపిస్తోంది. తనేమన్నాడు – ”ఆడవాళ్ళు బైటికొచ్చి, ఉద్యోగాలు చేసి, పనిచేసేచోట, పబ్లిక్‌ ప్లేసెస్‌లోను లైంగిక వేధింపులకి గురవుతున్నామని మగవాళ్ళపైన కేసులుపెట్టి వాళ్ళజీవితాలని నాశనం చేసేబదులు అసలు ఇలా ఉద్యోగాలలోకి రాకుండా ఇళ్ళల్లో

ఉంటే ఏ బాధా ఉండదు కదా! ఈ ఏడుపంతా ఎందుకు, సంసార పక్షంగా

ఉంటే చాలు… దేశాన్ని ఉద్దరించినట్టే. మగవాళ్ళకి నిరుద్యోగం ఉండదు, ఆడవాళ్ళపై అత్యాచారాలుండవు”. ఎంత మతిలేని కూతో అది ఆ తర్వాత గంటపైగా తనతో మాట్లాడ్తూ తన కళ్ళకి పట్టిన మందపాటి పొరని ఊడబెరకడానికి ప్రయత్నం చేసిన ఇద్దరు మహిళా ట్రైనర్ల ద్వారా అర్థమైనా, దాన్ని ఒప్పుకుని తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోడానికి నాలుగురోజులు పట్టింది. ట్రైనర్లిచ్చిన ఉదాహరణలు, కథలు ప్రతి సందర్భంలో వెంటాడి, వెంటాడి మార్పు తెచ్చాయి.

స్త్రీలని సాటి మనుషులుగా, తోటి పౌరులుగాకాక వారిని స్త్రీలుగా… ఇంకా చెప్పాలంటే తల్లి, చెల్లి, బిడ్డ, భార్యగా మాత్రమే చూడడం వల్లే ఈ ప్రమాదం వచ్చింది. పురుషులంతా పితృస్వామ్య భావజాలాన్ని, … దాసి, … మంత్రి, … మాత, … రంభ లాంటివి రొమాంటిక్‌గా చెప్పు కోడాన్ని స్త్రీల సౌందర్యం పురుషుల కోసమేగా అంటూ పనికిమాలిన జస్టిఫి కేషన్లని, క్షేత్రం – బీజం వంటి నాన్సెన్సికల్‌ ఉపమానాల్ని రద్దు చేసుకోకపోతే మనం మనుషులుగా మనగలమా?? బాల్యం నుండే ఈ భావాల్ని ప్రతి ఒక్కరిలో నింపగలిగితే సమాజంలో మాన్‌, ఉమెన్‌ కాక హ్యూమన్లే కనిపిస్తారు కదా!! మరి ఈ బాధ్యత తలకెత్తుకోడానికి మీరు సిద్దమేనా.

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.