ఆమె శత్రువు !! -ఉమా నూతక్కి

 

”మంచిగా ఉండాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే అమ్మాయిలు సంఘం కక్ష కడితే ‘విక్టిమైజ్డ్‌ రోల్‌’లో ఇమిడిపోతారు. ఇందులో చాలా మంది సినిక్స్‌ అయిపోయి, చాలా భయంకరమైన అత్తగార్లుగా, స్నేహాన్ని ఇవ్వలేని తల్లులుగా తయారైపోతారు”.

‘పున్నాగ పూలు’ నవలలో రచయిత్రి జలంధర గారు చెప్పిన మాటలివి.

”ఆడదానికి ఆడదే శత్రువు” అనే మాట మనలో చాలా మందిమి వినే ఉంటాం… లేదా అనే ఉంటాం. అసలు ఆడదానికి ఆడది శత్రువెలా అయింది అని ఆలోచించేవాళ్ళు ఎంతమంది? ఏ పరిస్థితులు వాళ్ళని అలా తయారు చేస్తున్నాయి? ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? ఒకటి రెండు చోట్ల ఎవరైనా మాట్లాడారేమో తప్ప అంత లోతుల్లోకి మనం వెళ్ళం.

మనం విక్టిమ్‌గా మన మీద డైరెక్ట్‌గా ఎటాక్‌ చేసిన వాళ్ళ గురించే మనం అనుకుంటాం. సాధారణంగా అలా ఎటాక్‌ చేసిన వాళ్ళల్లో ముందుగా ఆడవాళ్ళే కనబడతారు మనకి. వాళ్ళే మన శత్రువర్గం అవుతారు తప్ప అసలు వాళ్ళకి మనం, మనకి వాళ్ళు ఎందుకు విక్టిమ్స్‌గా మార్చబడుతున్నాం అనేది మన ఆలోచనల్లోకి ఎప్పుడూ రాదు.

ఇదంతా శిఖండిని ముందు పెట్టుకుని భీష్ముని పడగొట్టిన తీరు అని ఎవరికీ తలపుకు రాదు. ఎలా వస్తుంది? తరతరాలుగా మనం కొన్ని రోల్స్‌కి పరిమితమయ్యాము, కాదు పరిమితం చేయబడ్డాం. మనం కట్టుకునే వలువలకే కాదు మన నవ్వులకీ… ఏడుపులకీ కూడా కొలతలు యుగాల క్రితమే రాయబడ్డాయి. ఆడదంటే ఇలా బట్ట కట్టుకోవాలి, ఇలా నిలబడాలి, ఇలా నడవాలి, ఇంతే నవ్వాలి, ఇక్కడే ఏడవాలి, ఇలా ఒకటేమిటి..? ఎన్నో, ఎన్నెన్నో…! అసలు మనం ఎలా తయారు చేయబడ్డామో తెలుసా? తండ్రి చాటు బిడ్డగా… భర్త చాటు భార్యగా, కొడుకు చాటు తల్లిగా… ఇలా పురుషుని చేత పురుషుని కొరకు పురుషుని చుట్టూ తిరగవలసిన ప్రాణమున్న యంత్రాల్లా!!

మన పుట్టుకతో మొదలయ్యే కట్టుబాట్లు మన నిష్క్రమణలోనూ వీడవు. భర్తకన్నా ముందుపోతే పుణ్య స్త్రీ అంట. తర్వాత ఐతే తలచెడిన ఆడదట. ఆమె ఏ విధంగా చెడినట్లు? ఎక్కడినుండి మొదలయ్యాయి ఈ వాదాలు, ఈ భావనలు. మాతృస్వామ్య వ్యవస్థ నుండి పితృస్వామ్య వ్యవస్థకి సమాజం మారినప్పుడు ఆ వ్యవస్థని శాశ్వతంగా పరిపుష్టం చెయ్యడానికి అప్పట్లో రకరకాల స్మృతుల పేరిట, సుభాషితాల పేరిట, నీతిబోధల పేరిట స్త్రీ చుట్టూ వేయబడిన కంచెలవి. నెమ్మది నెమ్మదిగా ఆ కంచెలే సంప్రదాయాలుగా, నమ్మకాలుగా మారి వాటిని తప్పితే ప్రళయమేదో వచ్చేస్తుందేమో అన్నట్లుగా భయపడిపోతున్నాం.

ఈ భావనలు అమ్మమ్మల అమ్మమ్మల నుండి వారసత్వంగా మనలో ఇంకిపోయి మన పరిధుల్ని మనమే నియంత్రించేసుకుని ఆ చిన్న పరిధిలో మన అధికారం చూపెట్టాలి అనుకోవడంలో అత్తా కోడళ్ళ మధ్య, ఆడపడుచుల మధ్య, తోడికోడళ్ళ మధ్య… మహిళా ఉద్యోగుల మధ్య, ఇరుగు పొరుగు ఆడవాళ్ళ మధ్య కలతలుగా మొదలై విద్వేషాలు పెరిగిపోయి శత్రుత్వం శాశ్వతమవుతుంది. ఆ శత్రుత్వం వారసత్వంగా మన తరువాతి తరాల స్త్రీలకి చేరుతూ ఉంటుంది. ఆడవాళ్ళ శతృత్వాలను వ్యంగ్యంగా ఏమంటూ ఉంటారో తెలుసు కదా ”వంటింటి రాజకీయాలు”. దాని అర్థమేమిటి? మన వరకూ సమాజమంటే వంటిల్లు అనే కదా?

కావాలంటే ఒక్కసారి పాతకాలం సినిమాల నుండి ఇప్పుడు వస్తున్న టీవీ సీరియల్స్‌ వరకూ చూడండి. ప్రతి చోట గొడవకి మూలకారణం ఆడది అన్నట్లు చూపించారు… చూపిస్తూనే ఉన్నారు. కానీ ఈ సినిమాలు కానీ, సీరియల్స్‌ కానీ తీసేవాళ్ళలో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? అక్కడే అర్థం కావటం లేదా… ఇంకా అవే భావనలు మనలో నూరిపోస్తున్నారు అని. ఇక్కడ విషాదం ఏంటంటే ఆ సీరియల్స్‌ చూసేది, వాటి గురించి చర్చించేది కూడా మన ఆడవాళ్ళే. మనల్ని మనం సెకండ్‌ క్లాస్‌ సిటిజన్స్‌లా భావించుకుని ఆ పరిధిలోనే మన ఆలోచనలని పరిమితం చేసుకోవడం కాదా ఇది? ఈ పరిధులను దాటి ఏ స్త్రీ అయినా ముందుకు వెళదామని అనుకుంటే తన వ్యక్తిత్వాన్ని హననం చేయడంలో ప్రథమ పాత్రని మళ్ళీ మన స్త్రీలకే ఇచ్చేలా సాగిపోతుంది ఈ సమాజం.

ఒక మతమని కాదు, ఒక కులమని కాదు… అన్నిచోట్లా స్త్రీ పరిస్థితి అథమమే.

ఈ వలయం ఆపాల్సింది ఎవరు? మనమే కదా! మార్పు మనలోనే మొదలవ్వాలి. మంచిలోనూ చెడులోనూ మనకి మనమే ఒక ఆసరా అవ్వాలి. స్త్రీగా ఇంట్లో, బయటా మన రోల్‌ ఎలా అయినా మారుతూ ఉండవచ్చు. కానీ ఆ ప్రతి రోల్‌ మధ్య మానసికంగా ఒక ఎమోషనల్‌ రిలేషన్‌ని పెంచుకోగలిగితే ఆ రిలేషన్‌ ఒక సానుకూలతని నింపుకోగలిగితే..

తాను ఎవ్వరికీ… ఎప్పటికీ… శత్రువు కాదు.

మరి అప్పుడు…

ఆడదానికి ఆడదే భరోసా…!

Share
This entry was posted in మంకెన పువ్వు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.