CAA – అస్సాం పౌరసత్వ సవరణ చట్టం -రమామేల్కోటే

పౌరసత్వ సవరణ చట్టాలకు అస్సాంలో ప్రారంభమైన వ్యతిరేకత దేశవ్యాప్తంగా ఆందోళన ఊపందుకుని మరింత ఉధృతమవుతున్నది. ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో, అన్ని రాష్ట్రాలలో ఈ ఉద్యమం ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని, కొత్త హంగులతో, ఒక సాంస్కృతిక ఉద్యమంలా మొత్తం దేశాన్నే కుదిపివేస్తున్నది. ఈ ఉద్యమంలో స్త్రీలు, ముస్లిం మహిళలు ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున పాల్గొనడమే కాకుండా, ముందుండి ఉద్యమాన్ని నడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపైన, అధికార పార్టీ బిజెపి పైన వ్యతిరేకత పెరుగుతున్న సందర్భంలో, ఫెడరల్‌ వ్యవస్థపై కూడా దాని ప్రభావం తప్పనిసరిగా వ్యక్తమవుతున్నది. కొన్ని రాష్ట్రాలు ఈ చట్టాలపై వ్యతిరేకత చూపడమే కాకుండా, శాసనసభల్లో ఈ చట్టాలను అంగీకరించబోమని, వాటిని అమలు చేయమని కూడా తీర్మానాలు పాస్‌ చేయడం జరిగింది.

ఉదాహరణకు కేరళ, పంజాబ్‌ రాష్ట్రాలు చట్టసభల్లో తీర్మానం చేశాయి. అయితే అస్సాంలో సిఏఏపై వ్యతిరేకత ఉధృతమైనప్పటికీ, National Register of Citizenship (NRC) ని మొదటిసారిగా అమలు చేసిన అస్సాంలో 19 లక్షల మంది ఆ జాబితాలో లేకపోవడమనేది, ఎన్నార్సీ ఎంత లోపభూయిష్టమైనదో వెల్లడిస్తోంది. ఎన్నార్సీపై అసంతృప్తి, సిఏఏపై వ్యతిరేకత ఉన్న అస్సాం ప్రజలు 2019లో జరిగిన ఎన్నికల్లో తిరిగి బిజెపికి ఎందుకు ఓటు వేసిపట్టం కట్టారు అనే ప్రశ్న అడగవలసి వస్తుంది. దీనికి సమాధానం అస్సాం రాజకీయాల్లో, చరిత్రలో వెతకాలి.

ఈశాన్య ప్రాంతాలలోని ఏడు రాష్ట్రాలలో (Seven Sisters) అస్సాం ఒకటి. ఇవి అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, త్రిపుర. బంగ్లాదేశ్‌, టిబెట్‌, మయన్మార్‌, భూటాన్‌ మధ్యలో ఉన్న ఈ ప్రాంతం సిలిగురి (బెంగాల్‌) అస్సాం సరిహద్దుల్లో ఉన్న చికెన్‌ నెక్‌ కారిడార్‌ ద్వారా ఇండియాతో కలుస్తుంది. ఈశాన్య ప్రాంతంలో ఒక రెండు శాతం భూభాగం మాత్రమే ఇండియాతో కలుస్తుంది. ఈ ఇరుకైన ప్రాంతంలో నుంచే రోడ్డు, రైలు మార్గాలు, చమురు, గ్యాస్‌ పైప్‌లైన్స్‌ ద్వారా భారతదేశంతో కలుపుతుంది. ఈ ప్రాంతంలో చమురు, కలప, టీ తోటలు సమృద్ధిగా ఉండడం వల్ల, కొద్దిమంది ఆధిపత్యంలో ఉన్న కంపెనీలు అభివృద్ధి పేరుతో లాభాలు గడించి అసమానతకు దారితీశాయి. చమురు, గ్యాస్‌ ప్రభుత్వ రంగంలో ఈ మధ్య కాలం వరకు ఉండి, క్రమంగా ప్రైవేటీకరణకు లోనయింది. 1952లో ప్రారంభమయిన నాగా ఉద్యమం క్రమంగా ఉధృతమై భారత రాజ్యాన్ని ఎదిరించి ఈశాన్య ప్రాంతాన్ని సైనిక ప్రాంతంగా మార్చివేసింది. అస్సాంలో భారతదేశం నుండి ‘విడిపోయి విముక్తి’ చెందాలని వచ్చిన ఉద్యమం ఉల్ఫా (ఖకూఖీూ) సాయుధ పోరాటంగా మారడంతో దాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం సైన్యాలను ఉపయోగించింది. 1989-90లో అత్యవసర పరిస్థితిని ప్రకటించి, అస్సాంను డిస్టర్బ్‌డ్‌ ఏరియాగా గుర్తించి ఈ చట్టాలను తెచ్చింది. Disturbed Area Act, 1990 ýË Armed Forces Special Powers Act, TADA, Unlawful Activities Prevention Act. ఈ చట్టాల అమలుతో మానవ హక్కుల ఉల్లంఘనలు సర్వసాధారణం అయిపోయాయి. మణిపూర్‌లో AFSPA. చట్టాన్ని రద్దు చేయమని మహిళలు నగ్నంగా ప్రదర్శనలు చేయడం, ఈరోమ్‌ షర్మిల నిరవధిక నిరాహార దీక్ష అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అనేక అస్తిత్వ ఉద్యమాలు ఆయా ప్రాంతాల ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలుగా మారి ఈశాన్య ప్రాంతాన్ని భారత ప్రభుత్వానికి ఒక చిక్కుముడిగా మార్చేసింది.

గత చరిత్ర:

బ్రిటిష్‌ వారు రాక పూర్వం (1826) ఆరు వందల సంవత్సరాలు అసోంను అహోం అనబడే ఎత్నిక్‌ గ్రూప్‌ పరిపాలించింది. ఆరు వందల సంవత్సరాల పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి (సరైదో రేంజ్‌ నుంచి కామరూప వరకు) వచ్చిన ఆర్యేతర సమూహాలు స్థిరపడి స్థానిక అహోమియా ప్రజా సమూహంతో విలీనమయ్యాయి. అహోం ప్రజలు ఆ ప్రాంత (ఎగువ అస్సాం) భూభాగాన్ని వ్యవసాయానికి అనుకూలంగా మార్చి వరిసాగు ప్రారంభించారు. 1826లో బ్రిటిష్‌ రాకతో అహోం పాలకులు పెద్ద సంఖ్యలో ఇతర ప్రజలను ఆర్యులుగా సమీకరించారు. బ్రిటిష్‌ రాక పూర్వమే బర్మా, ఇప్పటి మయన్మార్‌ దేశం అహోం రాజ్యాన్ని ఆక్రమించింది. బ్రిటిష్‌ పాలకులు బర్మా సైనిక దళాలతో ఒప్పందం చేసుకుని బర్మా ఆక్రమణకు చట్టబద్ధతనిచ్చింది. కాలక్రమేణా బ్రిటిష్‌ వారు తమ ఆధిపత్యాన్ని విస్తరింపచేసి, సిక్కిం మినహా ఈశాన్య ప్రాంతాన్ని అస్సాం రాష్ట్రంగా స్థిరపరచింది. మణిపూర్‌, త్రిపుర, నార్త్‌ ఈస్ట్‌ (NEFA) (ప్రస్తుత అరుణాచల్‌ ప్రదేశ్‌) లను ఈ అస్సాం రాష్ట్రంలో విలీనం చేయలేదు. బ్రిటిష్‌ ప్రభుత్వం సృష్టించిన అస్సాం రాష్ట్రంలో అహోమియాలు ఆధిపత్య స్థానంలో ఉండి విద్యావంతులుగా ఒక మధ్యతరగతిగా ఎదిగారు.

1826 నుండి 1873 వరకు అస్సాం బ్రిటిష్‌ వారి బెంగాల్‌ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. ఆ తర్వాత 1905 వరకు బెంగాల్‌ ప్రెసిడెన్సీలో శాసనసభ లేకుండా ఒక ప్రావిన్సుగా ఉండేది. లార్డ్‌ కర్జన్‌ 1905లో బెంగాల్‌ విభజన చేసినప్పుడు తూర్పు బెంగాల్‌, అస్సాంల రాజధానిగా ఢాకాను ఏర్పరిచి, 1911లో బెంగాల్‌ విభజనను రద్దు చేసి అస్సాంకు తిరిగి ప్రావిన్స్‌గా చీఫ్‌ కమిషనర్‌ పాలనలో స్థిరపరిచారు. అయితే తూర్పు బెంగాల్‌ నుండి వస్తున్న వలసలను అరికట్టలేక పోవడాన్ని అస్సామీ జాతీయ వాదులు ప్రశ్నించడమే కాకుండా ఆ వలసలను ఆపడానికి ప్రయత్నించారు. కానీ చాలా ప్రాంతాల్లో నవగాంగే, బార్‌పేట, ఉత్తర లఖిమ్‌పురలో అప్పటికే పెద్ద సంఖ్యలో బయటనుండి, తూర్పు బెంగాల్‌ నుండి వచ్చిన వలస సమూహాలు స్థిరపడి, స్థానిక ప్రజల్లో ఆందోళన, అసహనాన్ని పెంచింది. 1931లో ఒక రిపోర్టులో అస్సాంలో అతి ముఖ్యమైన విషయం, పెద్ద సంఖ్యలో భూదాహం (Land Grabing) తో వలసలుగా వచ్చి స్థిరపడుతున్న బెంగాలీలను, చాలావరకు వీరు తూర్పు బెంగాల్‌ నుండి ముఖ్యంగా మైమన్‌ సింగ్‌ నుంచి వచ్చిన వారని, దీనివల్ల అస్సాం భవిష్యత్తు, అస్సామీ సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నదని వ్యాఖ్యానించింది. 1931 నాటికి వారి సంఖ్య అయిదు లక్షల వరకు చేరిందని, అస్సామీయులు తమ రాష్ట్రంలోనే తాము పరదేశీయులుగా జీవిస్తున్నారనే భావన బలంగా పాతుకుపోయింది. 1980 నాటికి ఈ భావన బలంగా ఉండడమే కాకుండా విద్యార్థి ఉద్యమాలకు దారితీసింది. బ్రిటిష్‌ ప్రభుత్వ పాలసీలు కూడా ఇందుకు దోహదపడ్డాయి.

1937 నుంచి 1946 వరకు అస్సాం ముఖ్యమంత్రిగా ముస్లిం లీగ్‌కు చెందిన మహమ్మద్‌ సాదుల్లా ఉండడం, అస్సాంను వలసలకు దారినిచ్చే ల్యాండ్‌ సెటిల్మెంట్‌ పాలసీ ద్వారా ప్రభుత్వ భూముల్లో ఎక్కడైనా స్థిరపడి ముప్ఫై బిగాల దాకా భూమిని ఆక్రమించి స్థిరపడి పోవచ్చునని నిర్ణయించి, సాగుచేయని ప్రభుత్వ భూముల్లో ఆహారోత్పత్తిని పెంచడానికి నిర్ణయించింది. దీంతో తూర్పు బెంగాల్‌ నుండి వలస వచ్చిన వారి సంఖ్య పెరగడమే కాకుండా, బ్రతుకు తెరువుకు వచ్చినవారు క్రమంగా భూస్వాములుగా, రైతులుగా తమ ఆదాయాన్ని పెంచి ఒక ముఖ్యమైన సమూహంగా స్థిరపడ్డారు. దేశ విభజన జరిగినప్పుడు అస్సాంను పాకిస్తాన్‌లో చేర్చకుండా భారతదేశంలో విలీనం చేయడానికి గాంధీజీ, అస్సాం రాజకీయ నాయకులు చేసిన ప్రయత్నాలు సఫలమై అస్సాంను భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఆ తర్వాత భాషా రాష్ట్రాలు ఏర్పడడంతో అస్సాంను మేఘాలయ, మిజోరంతో కలుపుకుని అస్సాం రాష్ట్రంగా ఏర్పడింది. ఆ తర్వాత అస్సాం రాష్ట్రంలో భాగమైన నాగా హిల్స్‌ ట్రైబల్స్‌ ఏరియా 1962 చట్టం ప్రకారం నాగాలాండ్‌ రాష్ట్రంగా, 1969లో అస్సాంలో భాగమైన మేఘాలయ ప్రాంతాన్ని =వశీతీస్త్రaఅఱఝ్‌ఱశీఅ చట్టం ప్రకారం స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నార్త్‌ ఈస్టర్న్‌ ఏరియా రీ ఆర్గనైజేషన్‌ యాక్ట్‌ 1971 ప్రకారం మణిపూర్‌, త్రిపుర, మేఘాలయ ప్రాంతాలను రాష్ట్రాలుగాను, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగాను ప్రకటించింది. 1986లో ఈ రెండింటినీ చట్టరీత్యా స్టేట్‌ ఆఫ్‌ మిజోరం యాక్ట్‌, 1986, స్టేట్‌ ఆఫ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ యాక్టు 1986 కింద రాష్ట్రాలుగా ప్రకటించింది.

1960లో అస్సాం రాష్ట్ర భాషా చట్టం తేవడంతో అస్సామీ రాష్ట్ర భాషగా, అధికార భాషగా గుర్తించబడింది. అయితే బెంగాలీ భాష మాట్లాడే వారి సంఖ్య పెరగడంతో, మిగతా ఆదివాసీ సమూహాలతో సహా కలుపుకుంటే బెంగాలీ భాష మాట్లాడేవారి సంఖ్య అస్సామీయుల కంటే పెద్ద సంఖ్యలో ఉన్నందువల్ల, జaషష్ట్రaతీ దీవశ్ర్‌ీ ప్రాంతంలో పరిపాలనా సౌలభ్యానికైనా బెంగాలీ భాషను రెండవ భాషగా గుర్తించడమైంది.

మధ్యతరగతి, ఆధునిక విద్యనభ్యసించిన అస్సామీయులు అస్సామీ జాతీయత, సంస్కృతిని రక్షించాలంటే అస్సాం రాష్ట్రాన్ని భాషాపరంగా ఏర్పాటు చేయాలని, భాషాపరమైన జాతి (Linguistic Nationality) గా అస్సాం జాతిని అసోమీయాగా అభివర్ణించింది. 1946 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దీనికి మద్దతునిచ్చింది. అయితే సుర్మా లోయలో నుండి వలస వచ్చిన ప్రజలు కాంగ్రెస్‌ వైపు ఉండడం, సరైన రాజకీయ దృక్పథం లేకపోవడం వల్ల, రాష్ట్ర రాజకీయాలు అస్సామీ భాష ప్రజల ఆధీనంలో ఉండక తప్పలేదు. కాంగ్రెస్‌ పార్టీ అసోమియా మద్దతుగా స్థిరపడింది. అయితే స్వాతంత్య్రం తర్వాత బారక్‌ లోయలోని బెంగాలీ భాష మాట్లాడే ప్రాంతాన్ని అస్సాంలో విలీనం చేయడం వల్ల, బెంగాలీయులు ఎన్నికల్లో ఓటు వేసే వాళ్ళుగా ముఖ్యులవడం, ఎన్నికల రాజకీయాలు ఈ రెండు భాషా సమూహాల పోటీని ప్రతిబింబింపచేసింది. అంతేకాక, తూర్పు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి వలసలు లేదా శరణార్ధులుగా వస్తున్న వివిధ ఆదివాసీ సమూహాలు ఖాసీ, గారాలు, బోడోలు వారి వారి అస్తిత్వాలను బలపరచడానికి చేస్తున్న ప్రయత్నాలు పరిస్థితిని మరింత విషమింప చేసి ఉద్యమాలకు దారితీసింది.

ఈశాన్య ప్రాంతం భారతదేశానికి ముఖ్యమైన సరిహద్దు, బంగ్లాదేశ్‌లో భూమి కొరత వల్ల పొరుగు దేశాల నుంచి ఎప్పటికప్పుడు వలసలుగా వస్తున్న ప్రజా సమూహాల వల్ల, అస్సాంలోని పూర్వపు నివాసులు, కొత్తగా స్థిరపడ్డ వారి మధ్య అస్సాంలో నిరంతర సామాజిక ఘర్షణలు అనివార్యమయ్యాయి. ప్రక్క దేశాల నుండి వలసలుగా వచ్చి స్థిరపడిన వారు అస్సాం సమాజానికి, సంస్కృతికి ఒక ముఖ్యమైన అడ్డంకుగా భావించడం కొత్త కాదు. అయితే అస్సాంలో అస్సామీ భాష మాట్లాడని వారు లేదా అక్కడి Aborginal Languages) బోడో సంబంధిత మాండలిక భాషలు కానీ, అహోం, తినా, రభా మిషింగ్‌ లాంటి లిపిలేని మాండలిక భాషలు కూడా మాట్లాడని వారిని ”బయటి” వారిగా, చాలా సంవత్సరాలుగా స్థిరపడిన వారిని కూడా బయటివారిగానే చూస్తారు. కానీ అస్సాం భాష మాట్లాడే ముస్లింలు, సిక్కులు ఈ కోవలోకి రారు. అందుచేత బెంగాలీ మాట్లాడే ముస్లింలు, బంగ్లాదేశ్‌ ముస్లింలు భాషరీత్యా, మతం రీత్యా పరదేశీయులే. బ్రహ్మపుత్ర నది లోయలో నివసించే లింగ్విస్టిక్‌ ఎత్నిక్‌ సమూహాలు బెంగాలీయులు. బెంగాలీ ఆఫీసర్లు బ్రిటిష్‌ వారితో మమేకమై బెంగాల్‌ రాష్ట్ర భాషగా అస్సామీయులపై రుద్దారని నిరసించడమనేది ఒక చారిత్రక వాస్తవం. అస్సామీయ భాష, ”బయటివారి భాష” ”భూ ఆక్రమణ” అనే రెండు విషయాలు అస్సాం అస్తిత్వానికి, అంటే భాష, భూమి అంశాలు ముఖ్యమైనవి. పేదరికం నుండి బయటపడడానికి మెరుగైన జీవితానికై ఉద్యోగాలు, పనిని వెతుకుతూ పొరుగు, ఇతర దేశాలకు వలస వెళ్ళడమనేది కొత్త విషయం కాదు. సామ్రాజ్యవాద దేశాలు మూడవ ప్రపంచ దేశాల పేద ప్రజలను శ్రామికులుగా (కాంట్రాక్ట్‌ లేబర్‌)గా తన దేశాలలో పరిశ్రమల్లోను, వ్యవసాయంలో పని చేయించడం ఒక దశ అయితే ఆ తర్వాత పని వెతుకుతూ ఈ దేశం నుంచి అమెరికా, యూరప్‌ ఇటు గల్ఫ్‌ దేశాలకు వలసలుగా పోవడం ఆ తర్వాతి దశ. అంతర్గత వలసలు, చాలా వరకు అసంఘటిత రంగంలో పేద ప్రజలు శ్రమ జీవులుగా వెళ్ళడం వర్తమాన కాలంలో సర్వసాధారణమయింది. తూర్పు పాకిస్తాన్‌ నుంచి ఆ తర్వాత బంగ్లాదేశ్‌ నుంచి వలసలు జరుగుతూనే ఉన్నాయి. గంగానది నీటి పంపకంపై భారతదేశానికి, బంగ్లాదేశ్‌కు మధ్యలో అభిప్రాయ భేదాలే కాకుండా రాజకీయ సంఘర్షణలు తప్పలేదు. హిమాలయ గోముఖి నుంచి ప్రారంభమైన గంగానది ఉత్తర్‌ప్రదేశ్‌, బీహర్‌, పశ్చిమ బెంగాల్‌ నుంచి ప్రవహిస్తూ బంగ్లాదేశ్‌లో చేరుతుంది. ఆ తర్వాత బ్రహ్మపుత్రలో కలిసి పద్మానదిగా ప్రవహిస్తుంది. లక్షలాది ప్రజలు, రైతులు నిత్యావసరాలకై సామాన్య ప్రజలు, పారిశ్రామిక అవసరాలకై గంగా నీటి రవాణాపై ఆధారపడడం వల్ల బంగ్లాదేశ్‌లో ప్రవేశించక ముందే గంగా నీరు అతి విషతుల్యంగా మారింది. గంగానది ఈ ప్రాంత సంస్కృతి, సంగీతంలో మిళితమై అస్సాం అస్తిత్వంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొంది.

వలసలు – అస్తిత్వాలు:

పలు ఆదివాసీ సమూహాలు నివసిస్తున్న ఈశాన్య ప్రాంతం అనేక అస్తిత్వ పోరాటాలకు గురయింది. దీనికి తోడు బంగ్లాదేశ్‌ నుండి భారత సరిహద్దులు దాటి చట్టవిరుద్ధంగా ఎటువంటి కాగితాలు లేకుండా ప్రవేశించడం, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రమయిన అస్సాంలో వలస ప్రజలుగా స్థిరపడడం అనేక సమస్యలకు, నెల్లీలో (1983) అతి దారుణమైన మారణకాండకు దారి తీసింది. 1983లో బంగ్లాదేశీయుల సంఖ్య 40 లక్షల వరకు పెరిగిందని, అస్సాంలో అస్సామీయులే అల్పసంఖ్యాకులయ్యారని, తర్వాత వచ్చిన బంగ్లాదేశీయులను తిరిగి వారి దేశాలకు పంపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం, ఆ తర్వాత 1961, 71ని చివరి తేదీలుగా మార్చడం జరిగింది.

ఈశాన్య రాష్ట్ర సరిహద్దులను దాటుతూ వచ్చీపోయే పాకిస్తాన్‌, బంగ్లాదేశీయులను రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లుగా వాడుకున్నారు. ఎంతోమంది రిక్షా తోలి, రోజు కూలీ చేసి పొట్ట గడుపుకునే పేదవాళ్ళు. వ్యాపారం చేసి, సరుకులు అమ్మి రాత్రికి రాత్రి తిరిగి వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు. బార్డర్‌ సెక్యూరిటీ అధికారులు కూడా ఆపలేదు. బంగ్లాదేశ్‌ ఏర్పడకముందే 1960లో అస్సాంలోని నోవాగాన్‌లో అనేకమంది తూర్పు పాకిస్తాన్‌ నుండి అక్రమ వలసదారులుగా వచ్చి స్థిరపడిపోయిన వాళ్ళను భారత-తూర్పు పాకిస్తాన్‌ సరిహద్దుల్లో స్థిరపరచడం వల్ల క్రమంగా తూర్పు పాకిస్తానీయులు అక్కడి హిందువులను అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌కు తరిమివేయడం వల్ల, 1994లో హిందూ వ్యతిరేక కలహాలు, హింసాకాండకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని అరికట్టడానికి 1964లో ూతీవఙవఅ్‌ఱశీఅ శీట Iఅటఱశ్ర్‌ీతీa్‌ఱశీఅ టతీశీఎ ూaసఱర్‌aఅ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. 1950లో Iఎఎఱస్త్రతీa్‌ఱశీఅ ూష్‌, కింద హిందూ వలసలను కాందిశీకులుగాను (శరణార్థులు), ముస్లిం వలసలను పరదేశీయులుగాను పరిగణించింది. ముస్లిం ఓటర్లను దూరం చేస్తుందనే నెపంతో చట్టాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం (ముఖ్యమంత్రి ఛాలిహా) అమల్లోకి తేలేకపోయింది. 1970ల ప్రాంతంలో ఈ ప్రాంతంలో అతి ముఖ్యమైన మార్పు, బంగ్లాదేశ్‌ అవతరణ కావడంతో ఈశాన్య రాష్ట్రాలు ప్రభావితం కాక తప్పలేదు. అంతేకాక, ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించడం, ఆ తర్వాత జనతా ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడం ఇవన్నీ కూడా అస్సాంలో విద్యార్థి ఉద్యమం ూూూఖ నాయకత్వంలో ఉధృతం చేసి సేవ్‌ అస్సాం-సేవ్‌ ఇండియా అనే పిలుపుతో ముందుకు సాగింది. ణవ్‌వష్‌ఱశీఅ, ణవశ్రీవ్‌ఱశీఅ, ణవజూశీత్‌ీa్‌ఱశీఅ అనే పథకంతో ఉద్యమం గాంధేయ మార్గంలో హింసా రహితంగా సాగినప్పటికీ యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం (ఉల్ఫా)తో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేసింది.

1983లో అస్సాం రాష్ట్ర శాసనసభ ఎన్నికల నాటికి, ఆల్‌ అస్సాం స్టూడెంట్‌ యూనియన్‌ (ూూూఖ) స్వల్పకాలంలోనే ఉద్యమంగా మారి, బ్రహ్మపుత్ర లోయ ప్రజలను ప్రభావితం చేసి, బంగ్లాదేశ్‌ నుంచి వస్తున్న అక్రమ వలసల వల్ల తమ దేశంలోని అస్సామీయులు అల్ప సంఖ్యాకులవుతున్నారని, ఆ బాధ్యత ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీదేనని ఉద్ఘాటించింది. ఈ వలసదారులు చాలావరకు బెంగాలీ మాట్లాడే ముస్లింలవడం వల్ల, అస్సాంలో ఉన్న అల్పసంఖ్యాకుల ఉనికిని దెబ్బతీసి, అస్సామీయుల రాజకీయ, ఆర్థిక అధికారాన్ని చేపట్టి అస్సాం రాష్ట్ర అస్తిత్వాన్నే చెరిపి వేస్తున్నదనే ఆందోళన ఉద్యమ రూపాన్ని సంతరించుకుంది. ఆల్‌ అస్సామీ స్టూడెంట్‌ యూనియన్‌ (ూూూఖ) ఉద్యమానికి నాయకత్వం వహించి, 1951 తర్వాత బెంగాల్‌ నుండి వచ్చిన వారిని వెనక్కి పంపించివేయాలని ప్రతిపాదించింది. బంగ్లాదేశ్‌ స్థాపన తర్వాత, 1971 సంవత్సరం చివరి తేదీగా నిర్ణయిస్తూ ఉద్యమాన్ని నడిపిస్తూ ప్రభుత్వాన్ని స్తంభింపచేసింది. అస్సామీయులు, బయటివారు ఎవరైనా సరే బెంగాలీలు, రాజస్థానీయులు తదితర అనే భావన 1930ల నుండే రగులుతూ అస్సాం ఉద్యమం ఉపజాతీయతా ఉద్యమంగా వర్ణించబడింది. విద్యార్థి నాయకులు ఎప్పటికప్పుడు కొత్త పంథాలతో ఉద్యమాన్ని మలుస్తూ గోలప్‌ బోర్‌ బోరాను ప్రక్కకు తోసి, ప్రధాన మంత్రి ఇందిరాగాంధీతో సంప్రదింపులు కూడా చేపట్టారు. ఏఏఎస్‌యు ప్రెసిడెంట్‌ ప్రఫుల్ల కుమార్‌ మహంతి, భృగు కుమార్‌ ఫూకన్‌ కొన్ని ముఖ్యమైన డిమాండ్లు చేశారు. 1951 నేషనల్‌ రిజిస్ట్రర ఆఫ్‌ సిటిజెన్స్‌ (ఎన్నార్సీ) ఆధారంగా ఓటర్ల జాబితాను సరిదిద్దడం, బంగ్లాదేశీయులను జాబితాలోంచి తొలగించి వారిని తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించడం, భారత-బంగ్లాదేశ్‌ సరిహద్దులను మూసివేయడం. ‘విదేశీయులు’ అస్సాంలో చొరబడి అస్సామీయులను వారి రాష్ట్రంలోనే అల్పసంఖ్యాకులుగా చేస్తున్నారని, ఇది దేశ, జాతీయ సమస్య అనే వాదన ఇప్పటికీ అస్సాంలోనే కాక ఈశాన్య రాష్ట్రాలలో (ముఖ్యంగా త్రిపురలో) కూడా అక్కడి రాజకీయల్లో ఒక కేంద్ర సమస్య. బంగ్లాదేశీయులకు ఆతిథ్యం ఇచ్చి వారి ఓట్లు వేయించుకుని తిరిగి పంపించడం, బ్రహ్మపుత్ర లోయలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఎత్తుగడ అని అస్సామీయులు దుయ్యబట్టారు.

ఆరు సంవత్సరాల పోరాటం – అస్సాం ఒప్పందం :

అస్సాం ఉద్యమం (1979-85)లో ఎనిమిది వందలకు పైగా పోలీసు చర్యల్లో మరణించారు. తర్వాత ఆగస్టు 15, 1985లో అస్సాం ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం మార్చి 25, 1971 రోజు గానీ, ఆ తర్వాత వచ్చిన వారిని గుర్తించి పంపించేయాలని, అస్సామీయుల సామాజిక సంస్కృతిని, భాషా అస్తిత్వాన్ని కాపాడడానికి కావలసిన రాజ్యాంగ, చట్టబద్ద పాలనా చర్యలు చేపట్టాలని ఈ ఒప్పందం పేర్కొంది. అయితే గుర్తించడం సాధ్యమయితే, తిరిగి పంపించడం సమస్యాపూరితమే అయింది. దీనికి ఒక కారణం 1951 =వటబయవవ జశీఅఙవఅ్‌ఱశీఅ, జెనీవా కన్వెన్షన్‌లో ఇండియా సంతకం చేయకపోవడం, బంగ్లాదేశ్‌తో పరస్పర నేరస్థులను పంపించుకునే ఒప్పందం (జుఞ్‌తీaసఱ్‌ఱశీఅ ుతీవa్‌వ) లేకపోవడం దీనికి తోడు 1983లో చేసిన అక్రమ వలసదారుల (Iశ్రీశ్రీవస్త్రaశ్రీ Iఎఎఱస్త్రతీaఅ్‌ర) చట్టం ప్రకారం అక్రమ విదేశీయులను తిరిగి బయటకు పంపించే అవకాశం ఉన్నప్పటికీ అది సుప్రీం కోర్టు కొట్టివేయడం వల్ల, ‘బయటివాళ్ళని’ నిరూపించడం అసాధ్యమయింది. ఆ సమయంలో పౌరసత్వాన్ని నిరూపించేే బాధ్యత ఆరోపించిన వారి మీదే ఉంది. దీన్ని ఆ తర్వాత ఎవరికి వారు తామే పౌరులమని అన్ని రకాల పత్రాల ద్వారా నిరూపించుకోవాలని మార్చారు.

1998లో లోక్‌సభ ఎన్నికల్లోనే బిజెపి మ్యానిఫెస్టోలో అస్సాంలో అతి పెద్ద సమస్య అయిన బంగ్లాదేశీ అక్రమ వలసదారులను అరికట్టడం, తిరుగుబాటు ఉద్యమాలను అణచివేయడంపై చర్యలు తీసుకోవడానికి పూనుకొంది. అక్రమ వలసలపై చర్యలు తీసుకొని అస్సాం ఉద్యమం ఆకాంక్షను తీర్చడానికి జాతీయ పౌర పట్టికను తయారు చేయడానికి అప్పుడే సిద్ధపడింది. 2016లో మొదటిసారిగా లోక్‌సభలో బిజెపి మెజార్టీ సీట్లు పొందింది. ఎన్నికల ముందే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పౌరసత్వ సవరణ బిల్లు బిజెపి ప్రభుత్వ ఎజెండాలో మొదటిదని ఉద్ఘాటించారు. 2019లో బిజెపి అధిక సంఖ్యలో సీట్లు సంపాదించింది. దీనికై 1951 జనాభా లెక్కల ఆధారంగా చేసిన ఎన్నార్సీని బయటకు తీయడంతో అస్సాంలో ఉన్న అక్రమ వలసదారుల సంఖ్య 19 లక్షలకు చేరింది. ఇందులో అత్యధిక సంఖ్యలో హిందువులేనని తేలింది. గూర్ఖాలు, రభాస్‌, తివాస్‌, మార్వాడీలు, బీహారీలు, అస్సామీ భాష మాట్లాడేవారు కూడా ఇందులో ఉన్నారు. బిజెపి ఈ ఎన్నార్సీని పూర్తిగా తిరస్కరించి, కొత్తగా 1955 పౌరసత్వ చట్టానికి మార్పులు తెచ్చి ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ నుంచి డిసెంబరు 31, 2014 పూర్వం వచ్చిన హిందువులకు, సిక్కులకు, బౌద్ధులకు, జైనులకు, క్రైస్తవులకు ఎటువంటి నిబంధనలు లేకుండా పౌరసత్వం ఇవ్వడానికి సిద్ధపడింది. ఈ జాబితాలో ముస్లింలు లేరు. 1985 అస్సాం ఒప్పందం ప్రకారం 25 మార్చి 1971 చివరి తేదీ అయితే సిఏఏ దాన్ని సవరించి 31 డిసెంబరు 2014గా మార్చింది. అంటే 1971 తర్వాత 2014 దాకా వచ్చిన వారికి కూడా ముస్లింలు తప్ప పౌరసత్వ హక్కులు ఇస్తుంది. చట్టం అమలులోకి వస్తే బంగ్లాదేశ్‌ హిందువులతో అస్సాం నిండిపోతుందనే భయం, సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన అస్సాం గణపరిషత్‌, బోడో పీపుల్స్‌ ఫ్రంట్‌ పదే పదే వ్యక్తం చేశాయి. కానీ సంకీర్ణ ప్రభుత్వంలో నుంచి విడిపోలేదు. అయితే ఎన్నార్సీ 2014 ప్రకారంగా అస్సాం పౌరులు, మార్చి 1971 తర్వాత వచ్చి స్థిరపడిన వారికి 71 పూర్వపు ధృవ పత్రాలను, పుట్టిన తేదీ, వివాహ పత్రం లాంటివి ఎన్నార్సీ అధికారులకు చూపించాలనే నిబంధనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ముఖ్యంగా స్త్రీలకు వారి వివాహం తర్వాత వచ్చిన పేరులో మార్పులతో వచ్చిన ఇబ్బందులు, పేద ప్రజలకు యాభై సంవత్సరాల పూర్వపు ధృవ పత్రాలు రాబట్టడంలో వచ్చిన చిక్కులు… ఇవన్నీ గ్రహించిన ప్రజలు ఉద్యమాన్ని చేపట్టారు. దీనికి స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను ఈ చట్టం నుండి మినహాయించింది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలులో ట్రైబల్‌ మెజార్టీ ఉన్న ప్రాంతాలను (అస్సాం, మిజోరం, మేఘాలయ, త్రిపుర) దానితోపాటు ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ (ఐఎల్‌పి) కింద ఉన్న ప్రాంతాలు అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరం, నాగాలాండ్‌ను మినహాయించింది. అస్సాంలో మూడు స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతాలు, బోడోలాండ్‌ టెరిటోరియల్‌ ప్రాంతాలు ఐఎల్‌పి నుండి మినహాయించబడ్డాయి. అదే విధంగా త్రిపురలో డెబ్భై శాతం భూభాగం, షిల్లాంగ్‌ తప్ప మేఘాలయలో పూర్తి ప్రాంతం, మణిపూర్‌, నాగాలాండ్‌, మిజోరంలోని పూర్తి ప్రాంతాలు మినహాయించబడ్డాయి. ఐఎల్‌పి పద్ధతి ప్రకారం ఇతర ప్రాంతాల నుండి వచ్చే పౌరులకు తప్పనిసరిగా అనుమతి పత్రం ఉండడం.

అస్సామీయుల వ్యతిరేకత పౌరసత్వ జాబితాలో ముస్లింలను చేర్చనందుకు కాదు, ఈ వ్యతిరేకత అన్ని మతాలు, ప్రాంతాల నుంచి అస్సాంకు వలస వచ్చేవారిపై. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజల ఆందోళన వారి అస్తిత్వాలనే చెదరగొడుతున్న అక్రమ వలసదారులు వారి ఉద్యోగాలు, వనరులను స్వాధీనం చేసుకుంటున్న ‘బయటివారిపై’ ఈ సరిహద్దు దాటి చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇండియాలో దూరి స్థిరపడిన బెంగాలీలు, హిందువైనా, ముస్లిమైనా, బంగ్లాదేశీయులు (వారి మతంతో సంబంధం లేకుండా). వీరంతా బయటివారు, తిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఈ ‘బయటివారి’పై వ్యతిరేకత మతంతో ముడిపెట్టడానికి వీలులేదు. ‘మా డిమాండ్‌ చాలా సాధారణమైంది. బంగ్లాదేశీయులు ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా మా రాష్ట్రం నుంచి తరిమేయాల్సిందే’. డిసెంబరు 31, 2014 వరకు పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వ హక్కులను కల్పిస్తామని కొత్తగా తెచ్చిన పౌరసత్వ చట్ట సవరణను బిజెపి అమలు చేయడానికి నిర్ణయించింది. అయితే 2003లో పౌరసత్వ చట్టాన్ని (1955) సవరించిన వాజ్‌పేయ్‌ ప్రభుత్వం భారత సంతతి ప్రజలను గుర్తించి హక్కులు కల్పించడమే కాకుండా, అసలైన భారత పౌరులతో జాతీయ పౌరసత్వ జాబితాను తయారు చేయాలని, దానికి కావలసిన జాతీయ జనాభా పట్టికను కూడా తయారు చేయాల్సిన అవసరం ఉందని, దీనికి కావలసిన వివరాలు ఇవ్వకపోతే, నిరాకరిస్తే అది నేరమవుతుందని, వారు శిక్షార్హులవుతారని హెచ్చరించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం 2010లో మొదటిసారి జాతీయ జనాభా పట్టికను తయారు చేసింది. ప్రభుత్వాలు మారి బిజెపి ఈ పట్టికను 2015లో సవరించింది. మళ్ళీ ఐదు సంవత్సరాల్లోపే 2019లో జనాభా పట్టికను సవరిస్తామని అంటే పౌరులు కాని అక్రమ వలసదారులను గుర్తించి, వారి హక్కులను రద్దు చేయడం, దాంతోపాటు జాతీయ పౌరసత్వ జాబితా కూడా తయారు చేస్తామని ప్రధాన మంత్రి, హోం మంత్రి పార్లమెంటులో ప్రకటనలు చేశారు. దీనికోసం రూ.400 కోట్లు కేటాయించారు. 1985 అస్సాం ఒప్పందం నేపథ్యంలో వచ్చిన నిర్ణయాలు (జాతీయ జనాభా పట్టిక, జాతీయ పౌరసత్వ జాబితా) బిజెపి రాజకీయ అవసరాలను, హిందుత్వ భావజాలాన్ని దేశవ్యాప్తంగా బలపరచి, దేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా మలచడానికి అనుగుణంగా ఉన్నవే.

ఇక్కడ అడగాల్సిన ప్రశ్నలు పొరుగు దేశాల నుండి (పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌) ముస్లిం శరణార్థులు లేరా? ఆ దేశాలు ఇస్లామిక్‌ దేశాలయినంత మాత్రాన అక్కడ రాజకీయ, మత వివక్షకు గురైన ముస్లింలు లేరా? పాకిస్తాన్‌లో అహ్మదీయులు, మహజీరులు రాజకీయ అసమ్మతివాదులుగా, ముస్లిం వామపక్ష వాదులు వివక్షకు గురైనవారు లేరా? అయితే బిజెపి ప్రభుత్వం శరణార్థులుగా అర్హులైన వారిలో ముస్లింలు పూర్తిగా మినహాయించబడ్డారు. అంతేకాక, శ్రీలంక, మయన్మార్‌ దేశాల్లో తమిళులు, రోహింగ్యాలు, వివక్షకు గురైన వారు కూడా జాబితాలో లేరు. అంతేకాక అక్రమ వలసదారుల సంఖ్య 1970లో పది లక్షలు ఉండేది. వారి సంఖ్య 2011లో అయిదు లక్షలకు పడిపోయింది. 130 కోట్ల జనాభాలో వారి సంఖ్య ఎంత? వీరితో దేశ భద్రతకు ముప్పు ఎంత ఉంటుంది?

మొత్తం మీద పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా జాబితా, జాతీయ పౌర జాబితాలపై వ్యతిరేకత దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్నది. దీనికి రెండు ముఖ్య కారణాలు. ఇవి పేద ప్రజలను, ఒక మత సమూహాలను ఆందోళనకు గురిచేయడం. ఈశాన్య రాష్ట్రాల్లో వస్తున్న వ్యతిరేకత, ముఖ్యంగా అస్సాంలో వస్తున్న వ్యతిరేకతా ఉద్యమం, ఆయా రాష్ట్రాల ప్రత్యేక భౌగోళిక ఉనికిని, ప్రజల అస్తిత్వాన్ని బిజెపి భావజాలం భంగపరిచేవిగా ఉండడంవల్ల, ఎన్నో ఆదివాసీ సమూహాలతో కూడిన ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు సమస్యలు, ఉద్యమాలు తలెత్తుతూనే ఉన్నాయి. స్థానికంగా ప్రజలు మారకున్నా సరిహద్దులు మారుతూనే ఉన్నాయి. దేశ విభజన క్రమంలో ప్రజలు స్థిరపడ్డ ప్రాంతాల సరిహద్దులు మారడంతో ఈశాన్య రాష్ట్రాలలో బెంగాలీలు, ఇతర సమూహాలు బతుకుదెరువు కోసం స్థిరపడ్డారు. 1951 జనాభా లెక్కల ప్రకారం భారత పౌరసత్వాన్ని నిర్ణయించడంతో, మరో ఇరవై ఏళ్ళపాటు అంటే 1971 దాకా వచ్చిన బంగ్లాదేశీయులను అస్సాంలో స్థిరపరచడం జరిగింది. 2019 డిసెంబరులో ఎన్నార్సీని సరిదిద్దడానికి మరొక చట్టాన్ని, సిఏఏను పార్లమెంటులో పాస్‌ చేసింది. ఇది 1971 ప్రకారంగా కాకుండా, దాన్ని 2014 దాకా పొడిగించింది. ఈ లోపల వలసలు వచ్చిన ముస్లిమేతరులకే (ముస్లింలకు తప్ప) పౌరసత్వ హక్కును ప్రసాదించింది. అంటే ఈ మధ్యకాలంలో వలస వచ్చిన వారిని మళ్ళీ అస్సాంలో స్థిరపరచడం జరిగింది. ఈ విధంగా బ్రహ్మపుత్ర లోయలోకి అధిక సంఖ్యలో బెంగాలీలు రావడం, స్థానిక అస్సామీయులు నిరసించారు. బారక్‌ లోయలో అప్పటికే బెంగాలీలు అధిక సంఖ్యలో ఉన్నారు. అస్సాం రాజకీయాల్లో చాలా ముఖ్యమైన అంశం బెంగాలీ వ్యతిరేకత, ముస్లిం బెంగాలీలు కానీ, హిందూ బెంగాలీలు కానీ, అస్సామీ ముస్లింలు, అస్సామీ హిందువులతో వస్తున్న అనుబంధం చారిత్రాత్మక వాస్తవం. బెంగాల్‌ ముస్లింలు నయా అస్సామీయులు స్థిరపడ్డారు. వీరే మియాలుగా కూడా పిలవబడతారు. 1983లో సెల్లీలో అతి క్రూరమైన ఊచకోతకు గురైనవారు వీరే. 2200 మంది బెంగాలీ ముస్లింలు చంపబడ్డారు.

2019 ఎన్నికలు – బిజెపి గెలుపు :

2009 ఎన్నికల్లో బిజెపి అస్సాం గణపరిషత్‌తో కలిసి ఉన్నప్పటికీ జోర్‌హాట్‌లో తప్ప ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2014లో బిజెపి ఎగువ అస్సాంలో అన్ని సీట్లు గెలుచుకుంది. పుల్వామా దాడి తర్వాత ముస్లిం, హిందూ పోలరైజేషన్‌ సందర్భంలో, ఓట్ల సంఖ్యలో పెద్ద తేడా లేకపోయినా, బిజెపి మూడు సీట్లు ఎక్కువ గెలిచి 2019లో అధికారంలోకి వచ్చింది. కూటమిలో భాగమైన ఎజిపి, బిపిఎఫ్‌లు ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి పెద్ద ఎత్తున గెలుపొందిన తర్వాత, అస్సాంలో పౌర జాబితా, జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు (సిఏఏ) ప్రకటించబడ్డాయి. వీటికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. జాతీయ పౌర చట్ట సవరణ బిల్లుని వ్యతిరేకించి అనేక పౌర, రాజకీయ సంఘాల కూటమి సవరణ బిల్లును వ్యతిరేకించనప్పటికీ, తరువాత జరిగిన అస్సాం రాష్ట్ర ఎన్నికల్లో అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. దీనికి కారణం కూటమిలో ఐక్యత లోపించడం, బిజెపికి ప్రత్యామ్నాయం లేకపోవడం ఒక కారణమయితే, బిజెపి ఎన్నికల పంథా, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుపై ప్రజా సేకరణ మరొక కారణం. ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ (AASU), కృషక్‌ ముక్తి సంగ్రామ్‌ సమితి (కెఎమ్‌ఎస్‌ఎస్‌) రెండు ముఖ్యమైన సంఘాలు, విద్యార్థి సంఘాలను డెబ్భైకి పైగా అనేక సంఘాలను, ఎత్నిక్‌ సంస్థలను, అల్ప సంఖ్యాకులైన మత సంఘాలను కలుపుకున్నప్పటికీ వీటిని ఒక్క తాటికి తేలేకపోయారు. సిఏఏ బిల్లును వ్యతిరేకించిన, ఆయిన్‌ షంషోధన్‌ విరోధి మంచ్‌ (ఫోరం అగైనెస్ట్‌ సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌), మేధావిగా పేరు పొందిన హిరేన్‌ గేహెన్‌ ఆధ్వర్యంలో కలుపుకున్నప్పటికీ, ఒక కామన్‌ ప్లాట్‌ఫాంను ఏర్పరచలేకపోయారు. వీటిలో ఏవీ కూడా కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా చూడలేదు.

తన మద్దతును కూడగట్టడానికి బిజెపి, ప్రజామోద పాలసీలు (Populist Policies), జనాభాలో పదిహేడు శాతమైన టీ తోటల్లోని కార్మికుల కోసం అనేక పథకాలు చేసి 2016 రాష్ట్ర ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినప్పటి నుండే ఈ పథకాలు అందించి ఈ సమూహం వారి మద్దతు పొందింది. ప్రతి బడ్జెట్‌లో సబ్సిడీ పథకాలు, వ్యక్తిగత బ్యాంకు అకౌంటులో నేరుగా డబ్బులు అందించడం, 2017-18 బడ్జెట్‌లో వీటికోసం నిధులు కేటాయించడం చేసింది. పైగా టీ కార్మికుడిని ఎన్నికల్లో నిలబెట్టి కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించి టీ కార్మికుడిని గెలిపించింది. హిందూత్వ ప్రభావితమైన జాతీయవాదం, కార్పొరేట్‌ పెట్టుబడుల మద్దతు పొందడం వల్ల ఎత్నిక్‌ గ్రూపుల బలం పూర్తిగా తగ్గిపోయి ఎన్నికలను ప్రభావితం చేయలేకపోయాయి. అంతేకాక, ఆరెస్సెస్‌ ఆయా సమూహాలతో చాలా దగ్గరగా పనిచేసి, క్రింది స్థాయిలో సమావేశాలను పెట్టి ప్రజలను ప్రభావితం చేసింది. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యాసంస్థలను, టీ తోటల ప్రాంతాల్లో అనేక స్కూళ్ళను స్థాపించి హిందూత్వ భావజాలాన్ని ప్రచారం చేశారు. ఎన్నికల్లో టీ తోటల్లో పనిచేసే సమూహాల పాత్ర చాలా ముఖ్యమైనది. పేదరికాన్నుంచి బయటకు రావడానికి, ఆహార భద్రతకు, సబ్సిడీ పథకాలు, పిల్లల వివాహాలకు డబ్బులు అందించడం వంటి అనేక పథకాలతో ఓటర్ల మద్దతును బిజెపి పొందింది. సిఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని, బిజెపి వ్యతిరేక ఉద్యమంగా మారకుండా అరికట్టడానికి ఆరెస్సెస్‌ తోడ్పడింది. దీంతో ఇప్పుడు హిందుత్వ భావజాలంతో మత ద్వేషాలు కూడా పెరిగే అవకాశముంది.

ముగింపు :

హింస, సరిహద్దులు జాతి రాజ్యాలను ఏర్పరచడంలో అతి ముఖ్యమైన పాత్ర వహించినవి. యూరప్‌లో వందల సంవత్సరాల పోరాటాలు, యుద్దాలు, ఉద్యమాలు జరిగే సరిహద్దులను నిర్ణయించి ఒప్పందాలు చేసుకొని తర్వాతనే ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, హాలండ్‌, స్పెయిన్‌ మొదలగు జాతి రాజ్యాలు ఏర్పడ్డాయి. సామ్రాజ్యవాద దేశాలు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఇంకా కొన్ని ఇతర ప్రాంతాలను ఆక్రమించి చాలా దేశాలను వలస దేశాలుగా పరిపాలించాయి. ఉదాహరణకు అఫ్రికా ఖండాన్ని ఆక్రమించి తమ ఆధిపత్యాన్ని స్థాపించడంలో, అక్కడ ప్రజల ఇష్టాలతో ప్రమేయం లేకుండా సరిహద్దులను గీచి ఖండాన్నే పంచుకున్నాయి ఇంగ్లాండ్‌, యూరప్‌ దేశాలైన బెల్జియం, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌, పోర్చుగల్‌ దేశాలు. అన్నింటికంటే పెద్ద సామ్రాజ్యాన్ని ఆసియాలో, ఆఫ్రికాలో స్థాపించుకున్నది రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం. అందులో అతి పెద్ద దేశమైన భారత దేశాన్ని రెండు వందల సంవత్సరాలకు పైగా పాలించి ఆధిపత్యాన్ని చెలాయించింది. పోరాడి సంపాదించిన స్వాతంత్య్రం దేశ విభజనతో వచ్చింది, అవి ఇండియా, పాకిస్తాన్‌. కొత్త సరిహద్దులు ప్రజలను విడదీసి అనూహ్యమైన హింసాకాండకు దారితీసింది. ప్రజల ఇష్టాలతో ప్రమేయం లేకుండా ఒక గీత గీసి అటు పాకిస్తాన్‌, ఇటు ఇండియా దేశాలను స్థాపించింది. ర్యాడ్‌ క్లిఫ్‌ గీత, కొత్త సరిహద్దులు కుటుంబాలను, ఆస్తులను చీల్చివేసింది. సర్‌ సిరిల్‌ ర్యాడ్‌ క్లిఫ్‌ పర్యవేక్షణలో రెండు సరిహద్దు కమీషన్‌లను ఒకటి, మరొకటి పంజాబ్‌ కోసం ఏర్పరచి సరిహద్దులను నిర్ణయించే అతి క్లిష్టమైన పనిని అప్పచెప్పడం జరిగింది. బెంగాల్‌, పంజాబ్‌ హిందూ రాజకీయ నాయకులు, సిక్కులు దేశ విభజన కోసం మద్దతునిచ్చారు. 20 జూన్‌ 1947లో బెంగాల్‌ శాసనసభ, 23 జూన్‌ పంజాబ్‌ శాసనసభలు విభజనకు మద్దతునివ్వడంతో తూర్పు బెంగాల్‌, పశ్చిమ పంజాబ్‌లను పాకిస్తాన్‌లో చేర్చడానికి, మిగిలిన ప్రదేశాలను భారతదేశంలోనే కొనసాగించడానికి నిర్ణయం జరిగింది. దీంతో ఒక కాగితంపైన గీత గీసి దేశాన్ని విభజించడంతో లక్షల మంది హిందు, ముస్లింలు, ఇతరులు అన్నివైపులా చెల్లా చెదురయ్యారు. ఇళ్ళు, ఆస్తులు, కోల్పోయి పరదేశీయులు, కాందిశీకులుగా మారిపోయారు. ”ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళండి”. అస్తిత్వాలు మళ్ళీ రూపుదిద్దుకున్నాయి. ‘హిందువులు, ముస్లింలు’, ‘శత్రువులు, మనవారు’, ‘ఇక్కడివారు, బయటివారు’ అనే పదాలు వారి వారి భాషల్లో ఇమిడిపోయాయి. దేశ విభజన ప్రభావం ఇప్పటికీ మాసిపోలేదు. ఈశాన్య రాష్ట్రాలలో సరిహద్దు సమస్యలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. దాంతోపాటు స్థానిక సమూహాలకు, బెంగాలీ నాన్‌ ట్రైబల్‌కు మధ్య ఘర్షణలు, సరిహద్దులు దాటిన వారికి, స్థానికులకు మధ్య ఘర్షణలు అనివార్యమవుతున్నాయి. ఉదాహరణకు నిర్వాసితులైన బ్రూ ట్రైబల్‌ సమూహాలు త్రిపురలో స్థిరపడడాన్ని స్థానిక బెంగాలీలు నిరసిస్తున్నారు. అస్సాం సరిహద్దులను తిరిగి పరిశీలించాలని, మిజోరం ప్రభుత్వం కోరుతోంది. 1972లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉండక పూర్వం, 1980లో పూర్తి రాష్ట్ర స్థాయి హోదా రాక పూర్వం, అస్సాంలోని లూషాయి పర్వత ప్రాంతంగా మిజోరం ఉండేది. మిజోరం-అస్సాం సరిహద్దు 123 కిలోమీటర్లు. ఈశాన్య ప్రాంతంలో సరిహద్దులు, అస్తిత్వాలు మారుతూ కొత్తగా వస్తూన్న పౌరసత్వ చట్టాలపై వ్యతిరేకతతో ప్రభావితమవుతూ భారత రాజ్యాంగానికే కొత్త సవాళ్ళను లేవనెత్తుతున్నది. ఈ సమస్యలను రాజకీయ లబ్ది, ప్రయోగాల దృష్టితో చూడకుండా, ప్రజాస్వామికంగా, రాజ్యాంగ నైతికతతో విశ్లేషించి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.