కోవిడ్‌ బాధితుల పట్ల మానవీయంగా ఉందాం -సత్యవతి

మార్చి 22, 2020 తర్వాత ప్రపంచం కోవిడ్‌-19కి ముందు కోవిడ్‌కు తర్వాత అంటూ రెండుగా విడిపోయింది. ఇంత భయానక పరిస్థితిని మనం బతికున్న రోజుల్లోనే చూడాల్సి వస్తుందని మనమెవరమూ ఊహించలేదు. అసలు ఈ కరోనా వైరస్‌ అంటే ఏమిటి? ఏం చేస్తుంది? అదెలా ఉంటుంది? ఏమీ తెలియదు. ఎక్కడో చైనాలో ఒక పట్టణంలో వచ్చిందట అనే వార్త తప్ప రెండు మూడు నెలల్లోనే గ్లోబ్‌ మొత్తాన్ని గడగడ వణికిస్తుందని ఎవరైనా ఊహించారా? లాక్‌డౌన్‌ అంటే తాళాలేసుకుని ఇంట్లో దాక్కున్నాం. చెంబులు, తపేళాలు మోగించమంటే మోగించాం. దీపాలు వెలిగించమంటే వెలిగించాం. పువ్వులు చల్లమంటే చల్లాం. ఏం జరిగింది? కరోనా పలాయనం చిత్తగించిందా? తోకముడిచిందా? లేదు మరింత భయంకరంగా విస్తరించింది. పాజిటివ్‌ కేసులు వందల్లోంచి, వేలల్లోకి, లక్షల్లోకి చేరిపోయాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలందరూ భయం గుప్పిట్లో, మానసిక వత్తిళ్ళతో సతమతమైపోతున్నారు. పాజిటివ్‌గా ఉండాలి అనే పదం కోవిడ్‌ పాజిటివ్‌గా మారిపోయి, పాజిటివ్‌ అంటేనే గుండె బేజారైపోయే స్థితిలోకి ప్రజలు వెళ్ళిపోయారు.

కరోనా వైరస్‌ గురించిన సంపూర్ణ సమాచారం ప్రజలకి అందుబాటులో లేకపోవడం వల్ల అవగాహన, చైతన్యం స్థానంలో భయం చోటుచేసుకుంటున్నది. అది ఏ స్థాయికి చేరిందంటే కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చినవారిని అసహ్యించుకునే స్టేజికి వచ్చింది. వైరస్‌ ఒకరి నుంచి ఇంకొకరికి అంటుకోకుండా ఉండాలంటే ఒకరి నుంచి ఇంకొకరికి ఆరు అడుగుల భౌతిక దూరం ఉండాలి అని చెప్పినదాన్ని సామాజిక దూరంగా ప్రచారం చేయడం వల్ల విపరీతంగా సామాజిక వివక్ష పెరిగిపోయింది. మానవ సంబంధాల విధ్వంసం మరింత ఎక్కువైంది. దానికి ఉదాహరణ, ఆస్పత్రిలో చేరిన కోవిడ్‌ పాజిటివ్‌ రోగులు సంపూర్ణంగా కోలుకుని వారి ఆరోగ్య స్థితి మామూలు స్థాయికి వచ్చినప్పటికీ, వారిని ఇంటికి తీసుకెళ్ళకుండా ఆస్పత్రుల్లోనే వదిలేయడం. ముఖ్యంగా వయసులో పెద్దవారిని. అలాగే పాజిటివ్‌ వచ్చిన వారిని ఇల్లు ఖాళీ చేయమనడం, అపార్ట్‌మెంట్లలో వారిని అంటరానివాళ్ళుగా వెలివేయడం, వారిని నేరస్థుల్లాగా చూడడం… ఇది చాలా విషాదకరమైన విషయం. కరోనా వైరస్‌ ఎవరికైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా అంటుకోవచ్చు. వారిని అంటరాని వాళ్ళుగా చూడడం దారుణమైన విషయం.

నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్‌ అనుభవం ఇక్కడ రాయాలనిపిస్తోంది. ఆవిడ జర్నలిజం విభాగంలో పనిచేసి రిటైరయ్యారు. ఒక్కరే ఉంటారు. ఆవిడ కొడుకు పూనాలో ఉంటాడు. అక్కడే కోవిడ్‌ పాజిటివ్‌కి గురయ్యాడు, చక్కగా కోలుకున్నాడు. తల్లి ఒక్కతే ఉంది. తల్లి దగ్గరికి రావాలనుకున్నాడు. అదో గేటెడ్‌ కమ్యూనిటీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ కొడుకు తన తల్లి దగ్గరికి రాకూడదని తీర్మానం చేసి ఆవిడకు పంపారు. తన కొడుకు కరోనా వైరస్‌ నుండి పూర్తిగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని, అతన్ని రావద్దని చెప్పడానికి మీకేమి హక్కుందని ఆమె సమాధానం పంపింది. ఇలా ఉంది మా కాలనీ పరిస్థితి అని ఆమె నాకు ఫోన్‌ చేసి చెప్పింది. మీ కొడుకును రమ్మనండి, ఎవరడ్డు పడతారో చూద్దాం, అడ్డుకుంటే పోలీస్‌ కంప్లయింట్‌ ఇద్దామని చెప్పాను. ఆ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రెసిడెంట్‌తో మాట్లాడాను. రేపు మీకు, మీ కొడుక్కు, మీ కూతురికి పాజిటివ్‌ రాదని మీరనుకుంటున్నారా? అంటే మేము చాలా జాగ్రత్తగా ఉంటాం మాకు రాదు అన్నాడు ధీమాగా. ”మీరు జాగ్రత్తగా ఉండడం మంచిదే కానీ, ఆ కమ్యూనిటీ పెద్దగా నా ఫ్రెండ్‌ విషయంలో మీ పద్ధతి కరెక్టు కాదు, తల్లీ కొడుకులు కలవకూడదని మీరు ఆంక్షలు విధించడం అన్యాయం. ఆ అబ్బాయి సంపూర్ణంగా కోలుకున్నాకే నెగిటివ్‌ రిపోర్టు వచ్చాకే వస్తున్నాడు. అదీ తల్లి దగ్గరికి. మీరెవరు అడ్డు పెట్టడానికి. కమ్యూనిటీకి అవగాహన కల్పించండి. సపోర్ట్‌ ఇవ్వండి కానీ ఇలా ప్రవర్తించకండి. లేదు మేము ఆ మాటమీదే ఉంటాము అంటే పోలీస్‌ కంప్లయింట్‌ ఇవ్వాల్సొస్తుంది” ఇలా చాలాసేపు మాట్లాడాక ఆయన మెత్తబడ్డాడు. నా ఫ్రెండ్‌ కొడుకు తల్లి దగ్గరికి వచ్చేశాడు. ఇలాంటి కథల్ని ప్రతి రోజూ వింటున్నాం, చదువుతున్నాం.

దీనికంతటికీ కారణం భయం, ఆందోళన. ప్రజలందరూ ఒక అసాధారణ, భయానక స్థితిని ఎదుర్కొంటున్నప్పుడు, రకరకాల భయాలు మనసుల్నిండా ముసిరేసినపుడు వీటిని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రజల మనసుల్లో గూడు కట్టిన భయాందోళనలను చెదరగొట్టే అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి. నిజానికి ఈ పనిని మీడియా చేపట్టాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా, ప్రైవేటు మీడియా పెద్ద ఎత్తున అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. కానీ ఈ నాటి మీడియాకి అంత సెన్సిటివిటీ లేదు. సాధారణ పౌరులను భయభ్రాంతుల్ని చేసే కథనాలు, వార్తలు, దృశ్యాలు దృశ్యాలుగా చూపించడం వల్ల మానవ సంబంధాలకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఆరడుగుల దూరం అనేది వైరస్‌ నుండి రక్షించుకోవడానికే కానీ మనుషుల్ని దూరం చేసుకోమని కాదు. పాజిటివ్‌ వచ్చిన వారి పట్ల వివక్ష చూపించమని కాదు.

కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని భరోసా ఇవ్వలేకపోవచ్చు, కానీ వారికి మన అవసరం చాలా ఉంటుంది. ఒక్కసారి పాజిటివ్‌ వచ్చింది అని చెప్పగానే వారి మానసిక స్థితి బతుకుతానా? చనిపోతానా? ఏమవుతుంది. నా కుటుంబం, నా పిల్లలు, నా ఆత్మీయులు ఏమవుతారు? నేనేమవుతాను. ఒంటరితనం, మానసిక వత్తిడి, ఎవరినీ చూడలేరు, కలవలేరు. మరణశిక్ష పడిన ఖైదీలాంటి ఒంటరితనం. వారు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం చెయ్యాల్సింది వారికి సపోర్ట్‌గా నిలవడం. ఫోన్‌ ద్వారా వారికి మానసిక ధైర్యం, స్థైర్యం ఇవ్వడం. వారి కుటుంబానికి అండగా నిలబడడం. అంతే కానీ వారిని సామాజిక వెలివేతకు గురిచేయడం, వివక్షకి బలిచేయడం చాలా దారుణమైన విషయం. కరోనా ఒక ప్రమాదకరమైన వైరస్‌. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అని వైరస్‌ సోకిన వారందరినీ మానసిక క్షోభకి గురిచేయడం అమానుషం. మనం ఇలా చెయ్యకూడదు.

అందరూ ఇలానే చేస్తున్నారని నేను జనరలైజ్‌ చేయడంలేదు కానీ మెజారిటీ మనుషులు భయం వల్ల ఇలానే చేస్తున్నారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల కొన్ని చోట్ల చాలా మూర్ఖంగా కూడా ప్రవర్తిస్తున్నారు. అయితే నగరంలోని ఒకానొక కాలనీలో కాలనీ వాసులందరూ చాలా వినూత్నంగా వ్యవహరించి ఇలా కదా మనందరం ఉండాలి అనే గొప్ప సందేశాన్నిచ్చారు. ఆ కాలనీలో నివసించే ఒక నర్స్‌ నెలరోజుల పాటు ఇంటికి రాకుండా కోవిడ్‌ రోగులతో నిండి ఉండే ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహించి ఇంటికి వచ్చారు. మొదట కాలనీలో కొందరు ఆమె కాలనీలోకి రావడానికి వీల్లేదని రచ్చచేశారు. కానీ మెజారిటీ మంది ఆమె ఇంటికి రావద్దనడానికి మనమెవరం, ఆమె తన జీవితాన్ని, కుటుంబాన్ని ఫణంగా పెట్టి కోవిడ్‌ రోగులకు సేవ చేసింది, ఆమెను మనం గౌరవించాల్సింది పోయి ఇంటికి రావద్దంటూ అవమానిస్తామా అంటూ తిరగబడ్డారు. భయపడిన వాళ్ళు పారిపోగా మిగిలిన చాలామంది ఆ నర్సుకు హారతులు పట్టి, పూలు చల్లుతూ తమ కాలనీలోకి ఆహ్వానించారు. ఆమె ఇంటివరకు ఊరేగింపుగా తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఆమె సలహాతో తమ కాలనీలో ఒక ఇంటిని క్వారంటైన్‌ సెంటర్‌గా మార్చి తేలికపాటి లక్షణాలున్న వారిని అక్కడ ఉండేలా ఏర్పాటు చేశారు. రోగలక్షణాలు తీవ్రమైతే వారిని ఆస్పత్రికి తరలించడం ఆ నర్సు సారధ్యంలో జరిగేలా ఏర్పాటు చేసుకున్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారికి మందులు, ఆహారం, పండ్లు లాంటివి కూడా అందచేయడంలో ఆ కాలనీ ఒక ఆదర్శ కాలనీగా పేరు తెచ్చుకుని, మీడియా దృష్టిని ఆకర్షించింది.

కరోనా కల్లోలం ఫలానా రోజుతో ఫలానా నెలలో సమసిపోతుంది అనే గ్యారంటీ ఏమీ లేదు. ఎంత కాలముంటుందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడే వ్యాక్సిన్‌ వస్తుంది అనే భరోసా లేదు. మందు లేదు. కరోనాకి వైద్యం లేదు. లక్షణాల ఆధారంగా మాత్రమే వైద్యం జరుగుతోంది. మొదట లాక్‌డౌన్‌లంటూ హడావిడి చేసిన ప్రభుత్వాలు తర్వాత తాళాలు తెరిచేసి కరోనాతో సహజీవనం చెయ్యాల్సిందే అని ప్రకటించేశాయి. మనం ఖచ్చితంగా కరోనాతో సహజీవనం చేస్తున్నాం. మనకి కరోనా రాదు అనేది మితిమీరిన నమ్మకం. వచ్చే అవకాశం ఉందనేది వాస్తవం. అందుకే మనం జాగ్రత్తగా ఉంటూనే కరోనా పాజిటివ్‌ల పట్ల మానవీయంగా ఉందాం. ఈ రోజు వాళ్ళు, రేపు మనం. ఈ ఎరుకతో సెన్సిటివిటీతో ప్రవర్తిద్దాం.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.