భూమిక ఎడిటర్ గార్కి ,
అమ్మ నాకు post women భూమికను తెచ్చి ఇస్తుంది. ఎప్పుడైనా బుద్ది పుట్టి ఇతనికి వచ్చే భూమికలో ఏమి ఉంటుంది అని చూస్తే నేను తల ఎత్తుకునేలా భూమిక తీర్చి దిద్దుతున్న తల్లులందరికి ఏమిచ్చి ఈ ఋణాన్ని తీర్చుకోవాలి అని ఆలోచిస్తుంటే నిజంగా ఏదో ఒక రచన చేయాలి అబ్బా రోజు రోజు వీడి సుత్తి భరించలేకపోతున్నామే అనుకునేలా కాకుండా నిజాయితీతో వ్రాయాలని ప్రయత్నిస్తూ !
ముఖ్యంగా ”నీ కోసం” అంటూ స్త్రీల హృదయావిష్కర్తగా పేర్కొనదగిన చలంను ఎందరో ఆవిష్కరించారు. చరిత్రలో కానీ శాంతి గారి హృదయస్పందన నన్ను స్పందించేలా చేసింది. అయితే చాలా మందిలో స్త్రీ కోణం ఉంటే సామాజిక కోణం ఇంత కరవవుతుంది. సామాజిక కోణం ఉంటే మానవ సంబందాల అగాధం ఉంటుంది. ఇదే చలంలో ఒక మార్క్సిస్టు కోణం కూడా తొడైతే చరిత్రలో చలం చలనం ఇంకొ పెద్ద తుపానే వచ్చేదేమో అని పిస్తొంది. ఇప్పటి వరకు మార్క్సిస్టులుగా చరిత్ర ఉన్న వాళ్ళలో ఈ స్త్రీలు కోణం పూర్తిగా 3600 ఉంటే చరిత్ర ఇంకెన్ని మందడుగులు వేస్తుందో! తప్పక మార్క్సిస్టులుగా అనుకుంటున్న వాళ్ళు ఓ పోరి నీ ముట్టు బట్టలను నువ్వే ఉతుక్కో! అనేంత స్పష్టంగా ఉంటే ఇప్పటికే ఆడ పిల్లల ప్యాడ్ల సమస్యకి పరిష్కారం లభించేది. భూమికలో వస్తున్న కథలను చూస్తే ఈ కథ భూమికలో వేసే అర్హత ఉంది అనేలానే ఉంటున్నాయి. ఇక రచయిత(త్రి)ల గురించి ఆలోచించినా వీరికి భూమికలో వ్రాస్తే అర్హత ఉన్న వాళ్ళనే సెలక్ట్ చేస్తున్నా అనిపిస్తుంది. ‘అంపశయ్య నవీన్” గారి సమయం కోసం… కథలో రచయిత చాలా జాగ్రత్తగా మనుషుల ఆలోచనా ధారను ఒక HM గా పనిచేసిన వ్యక్తే. ఈ కథ వ్రాయగలడు ఉన్నంత సహజంగా వ్రాశారు, అయితే కథలోని పాత్రలన్ని సమాజం ఇప్పుడు ఎలా చలనంలో ఉందో అచ్చు గుద్దినట్టు కథలో వ్యక్తపరచడం నన్ను నేను ఆశ్చర్యం నుండి ఇంకా తేరుకో లేకపోయాను. ఇంతటి సామాజిక అవగాహన ఉన్నవారే కథలను వ్రాయడానికి అర్హులేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ‘వాసంతి”లోని ఓపిక పురుషులతో ప్రవర్తించే విధానం తనను తాను modify చేసుకోవడం. ఎటువంటి ఆకర్షణలకు గురి కాకుండా సహజీవనం పేరుతో స్త్రీలను వంచించేవాడు ప్రజల మనిషి అయినా ఎదిరించి నిగ్గు తేల్చడం కథకు నేటివిటీని తీసుకువచ్చింది. అంటే నా ఉద్దేశం సహజత్వానికి దగ్గర ఉండేలా ఉందని చివరగా ఈ కథలోని నిరంజన్లు సాహితీ నిరంజన్లుగా అన్ని రంగాల్లో ఉంటున్నా అటువంటి వారి పట్ల భూమిక తగు జాగ్రత్తలు తీసుకోగలదని వారి ఉత్తరాలను కూడా భూమికలో ప్రచురించే అర్హత లేనివే అవుతాయి. ఒకవేళ నాలో కూడా ఆ లక్షణాలు అగుపిస్తే నాకు విధించాల్సిన శిక్షకు నేను కూడా అర్హున్నే అని భూమికకు మాట ఇస్తూ ఇంకా నాలో కూడా ఉన్న సహజ సామాజిక దుర్లక్షణాల పట్ల వడపోతను నిరింతరం కొనసాగిస్తూ. మాట నిల బెట్టుకుంటానని నా కలం సాక్షిగా నన్ను నేనే చరిత్ర యందు ఆవిష్కరించుకొడానికి ప్రయత్నిస్తాను. నా ఈ ప్రయత్నంలో నాకు సహకరించిన ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను. ‘గంగ ఎక్కడివెళ్తోంది’ పుస్తక సమీక్ష చేసిన ‘ఉమా నూతక్కి’ గారికి చెప్పదల్చింది ఏంటంటే నేను పైన పేర్కొన్న బ్యాలెన్సింగ్ లక్షణాలు ”జయ కాంతన్లో ఉన్నాయా! అన్నట్లు పుస్తక సమీక్ష ఉంది. నా సమస్యకు కూడా జయకాంతన్ రూపంలో భూమికలోనే జవాబు దొరకడం బాగుంది. పుస్తక సమీక్ష గుండెలోతుల్లోంచి వస్తే ఆ పుస్తక రచయితను కూడా డామినేట్ చేసే విధంగా జయకాంతన్గారు చూస్తే నా పుస్తకానికి నేను సమీక్షించుకున్నా ఇంత బాగా నన్ను నేను ఆవిష్కరించుకోగలనా! అనేలా పుస్తకాన్ని సమీక్షించారు. ఉమాక్కకి ధన్యవాదాలు – సహకలన