తెలంగాణలో మహిళా రైతుల హక్కులకు భద్రత కల్పించటానికి చేపట్టాల్సిన విధాన చర్యలు – ప్రజా అసెంబ్లీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రైతులకు అనేక పథకాలను ప్రకటించింది. ఇటీవల నియంత్రిత పంటల సాగు ప్రణాళికను కూడా అమలులోకి తెచ్చింది. అయితే రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు భూమి యజమానులకు మాత్రమే వర్తింపచేస్తున్నారు. భూమిలేని సాగుదారులను, వ్యవసాయ కూలీలను రైతులుగా గుర్తించకపోవడం చేత మహిళా రైతులు, కౌలు రైతులు, అటవీ పట్టాలు అందని ఆదివాసీ రైతులు ఈ పథకాలకు దూరంగానే ఉండిపోయారు. అసలు వ్యవసాయం చేస్తున్నది ఎవరు అనేది పట్టించుకోకుండా, వ్యవసాయం చేస్తున్నవారితో సంప్రదింపులు జరపకుండా పై నుండి రుద్దుతున్న పథకాలు, ప్రణాళికల వల్ల మహిళా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలోనూ, ఆ తర్వాత కూడా మహిళా రైతులు, వ్యవసాయ కూలీలు పనులు లేక, ఉత్పత్తి చేసిన కూరగాయలు, పాలు అమ్ముకోవడానికి మార్కెట్‌ లేక, సరైన ధర లేక ఆదాయాలు కోల్పోయారు. వారికి ఖరీఫ్‌ సీజన్‌లో పెట్టుబడికి ప్రైవేటు రుణాలు అందక కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మహిళా రైతుల స్థితిగతులు:

భారతదేశ గ్రామీణ ప్రాంతాలలో అత్యధిక శాతం మహిళలు వ్యవసాయ రంగంలో సాగుదారులుగా, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారని అనేక జాతీయస్థాయి అధికారిక సర్వేలు, క్షేత్రస్థాయి అధ్యయనాలు గణాంకాలతో సహా రుజువు చేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 65.1% మహిళా శ్రామికులు వ్యవసాయంపై ఆధారపడి ఉండగా, పురుష శ్రామికులలో 49.8% మాత్రమే ఈ రంగంపై ఆధారపడి పున్నారు. 68వ ఎన్‌.ఎస్‌.ఎస్‌.ఓ. సర్వే నివేదికలు కూడా 63% మహిళా శ్రామికులు, 75% గ్రామీణ మహిళా శ్రామికులు వ్యవసాయ రంగంలో ఉన్నారని సూచిస్తున్నాయి. అంతర్జాతీయ లేబర్‌ ఆర్గనైజేషన్‌ అధ్యయనాలు కూడా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళలలో దళిత. ఆదివాసీ సమూహాలకు చెందినవారు 81% మంది ఉన్నారని చెబుతున్నాయి (ఐ.ఎల్‌.ఓ, 2010). తెలంగాణలో మొత్తం సాగుదారులలో 36%, వ్యవసాయ కూలీలలో 57% మహిళలే. ఇది జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ.

వ్యవసాయ రంగంలో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నప్పటికీ కేవలం 6-11% గ్రామీణ కుటుంబాలలో మాత్రమే మహిళలకు భూమి హక్కులున్నాయని వివిధ గణాంకాలు సూచిస్తున్నాయి (భారత మానవ అభివృద్ధి సర్వే 2010-11). జాతీయ స్థాయిలో మొత్తం భూ కమతాలలో 13.87% కమతాలు మహిళల ఆధీనంలో ఉన్నాయి. ఆ కమతాల కింద మొత్తం సాగు విస్తీర్ణంలో 11.57% భూమి

ఉందని 2015-16 వ్యవసాయ గణాంకాలు సూచిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ఇంకా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు భూమిలేని మహిళలకు ప్రభుత్వ భూముల పంపిణీ కార్యక్రమాలను చేపట్టాయి. అయితే ఎంతమంది భూమిలేని, వివిధ సమూహాలకు చెందిన మహిళలు ఈ పథకాల వల్ల ప్రయోజనం పొందారో తెలిపే స్త్రీ, పురుష విడి గణాంకాలు అందుబాటులో లేవు. 2010లో ఎస్‌.ఇ.ఆర్‌.పి. (267 మండలాలలోని 392 నమూనా గ్రామాలలో) తయారుచేసిన ల్యాండ్‌ ఇన్వెంటరీలో తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఎస్సీ, ఎస్టీ మహిళలలో 24% మందికి (తెలంగాణలోని 428 మండలాలలోని 914 గ్రామాల నమూనాలలో) 25% పట్టాలున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే వ్యవసాయంలో అధిక భాగస్వామ్యం ఉన్నప్పటికీ మహిళలకు పురుషులతో పోల్చినప్పుడు భూమి యాజమాన్యం తక్కువగా ఉందని ఈ గణాంకాలన్నీ వెల్లడిస్తున్నాయి.

అన్ని ప్రాంతాలలోనూ దాదాపు అన్ని పంటల సాగులో 60-75% పనులు మహిళలే చేస్తున్నారని క్షేత్రస్థాయి అనుభవాలు తెలియచేస్తున్నాయి. వ్యవసాయ పనులలో పురుషుల శ్రమ దినాలకంటే మహిళల శ్రమ దినాలే ఎక్కువగా ఉన్నాయి. ఇతర రంగాలలో

ఉపాధి లభించడంతో ఎక్కువ మంది పురుషులు వ్యవసాయం నుండి బయటకు వెళ్తున్న పరిస్థితులలో మహిళలు వ్యవసాయంలోనే కొనసాగుతూ ఆ భారాన్ని మోస్తున్నారు. మగ రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న పరిస్థితిలో ఆ కుటుంబాల మహిళలు పూర్తి వ్యవసాయ బాధ్యతలను చేపట్టి దాంతోపాటు పిల్లలను పోషిస్తూ అప్పులను తీర్చే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. మహిళలకు కుటుంబ పని భారం, చదువు లేకపోవడం, భూమి పశువులు వంటి వనరులపై హక్కులు లేకపోవడంతో ఇతర రంగాలలో ఉపాధి పొందలేకపోతున్నారు. దీంతో వ్యవసాయం స్త్రీయీకరణ జరుగుతోంది. కీలకమైన పాత్ర పోషిస్తున్న మహిళలకు రైతులుగా గుర్తింపు లేక ప్రభుత్వ వ్యవసాయ విధానాలు, పథకాలు, కార్యక్రమాల్లో, బడ్జెట్‌లో, మద్దతు వ్యవస్థలలో అంటే పంట రుణాలు, విస్తరణ, పంటల భీమా, మార్కెటింగ్‌ మొదలైన నాటిలో వారు ఎక్కడా కనిపించకుండా ఉండిపోతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణాలో మహిళా రైతుల హక్కులకు, పథకాల అందుబాటుకు భద్రత కల్పిస్తూ ఈ క్రింది డిమాండ్లతో కూడిన స్పష్టమైన విధాన చర్యలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

1. మహిళా రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వటం: మహిళలను రైతులుగా గుర్తించడంలో మొదటి అడుగుగా మహిళా రైతులందరూ పంచాయతీ నుండి పై స్థాయి వరకు స్వయంగా సాగుదారులుగా, వ్యవసాయ కూలీలుగా, కౌలు రైతులుగా, పశు పెంపకందారులుగా రిజిస్టర్‌ చేసుకునే పద్దతిని చేపట్టాలి. ఈ గణన మరియు రిజిస్ట్రేషన్‌ పద్ధతి ఉపాధి హామీ పథకంలో జాబ్‌ కార్డులు ఇచ్చే పద్ధతిలాగా ఉండవచ్చు.

2. మహిళా సాగుదారులను గుర్తించడం: తమ స్వంత భూములలోనూ, కౌలు భూములలోనూ సాగు చేసుకునే మహిళల పేర్లను విడిగా సాగు/పహానీ రికార్డులలో నమోదు చేయాలి. కిందిస్థాయి రెవిన్యూ అధికారులు తమ పరిధిలో సాగుదారుల రికార్డులను నమోదు చేసే విధంగా ఆదేశించాలి.

3. భూమి అభివృద్ధికి మద్దతుతో సహా మహిళలకు స్పష్టమైన భూమి హక్కులు: గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ప్రాధాన్యతనిచ్చిన భూ పంపిణీ పథకాలు, భూ కొనుగోలు పథకాలు రాష్ట్రలో భూమిలేని మహిళలందరికీ భూమి అందేవరకు కొనసాగాలి. అయితే, ఆ విధంగా మహిళలకు పంపిణీ చేసిన భూమి వ్యవసాయానికే అనుకూలంగా లేదు. అందుకే భూమిని అభివృద్ధి పరచడం అనేది ఒక ముందు షరతుగా ఉండాలి. ఈ విధంగా పంపిణీ చేసిన భూమిని మరొక ప్రజాప్రయోజనం కోసం తిరిగి తీసేసుకోరాదు.

4. అసైన్మెంట్‌ భూమి లబ్దిదారులైన ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక వ్యవసాయ మద్దతు: ప్రభుత్వ భూ పంపిణీ కార్యక్రమాలలో భూమిని పొందిన ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల మహిళలు, మొదటి తరం రైతులు, కొత్త తరం కౌలు రైతులు… అందరికీ కూడా 3-5 సంవత్సరాల వరకూ వ్యవసాయంలో నిలదొక్కుకోవడానికి అవసరమైన ఉత్పాదకాలు, పంట రుణాలు, సాగు నీటి వసతి, మార్కెటింగ్‌ సహకారాలను అందించాలి.

5. ఒంటరి మహిళా రైతులకు, రైతు ఆత్మహత్య కుటుంబాల మహిళలకు ప్రత్యేక మద్దతు: వ్యవసాయం చేస్తున్న ఒంటరి మహిళలను, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలలోని మహిళలను ప్రత్యేక కేటగిరీగా గుర్తించాలి. వారి వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలి. ప్రభుత్వ భూమి పంపిణీ కార్యక్రమాలలో, వ్యవసాయ సేవలలో, జీవనోపాధి పథకాలలో, అన్ని సామాజిక భద్రతా పథకాలలో ఈ కుటుంబాలకు ప్రాథాన్యతనివ్వాలి.

6. ఆదివాసీ ప్రాంతాలలో మహిళల భూమి హక్కులు, అటవీ హక్కుల చట్టంలో భాగంగా స్త్రీల వ్యక్తిగత, ఉమ్మడి, సాముదాయిక హక్కులను గుర్తించాలి. వాటిని నిర్దిష్ట కాలపరిమితిలో మంజూరు చేయాలి. అటవీ హక్కుల చట్టం క్రింద సాముదాయిక హక్కులలో స్త్రీల నిత్యజీవితావసరాలకు, జీవనాధార హక్కులకు భద్రత కల్పించే సాగుచేయని ఆహారం, పండ్లు, నీరు, పశుగ్రాసం, వంటచెరకు, అటవీ

ఉత్పత్తుల సేకరణకు ప్రాధాన్యతనివ్వాలి. గ్రామ సభలు, అటవీ హక్కుల కమిటీలలో మహిళల పాత్ర, నిర్ణయాధికార హక్కులను బలోపేతం చేయాలి. మంజూరు చేసిన అటవీ హక్కు పత్రాలలో స్త్రీ పురుష గణాంకాలను (వ్యక్తిగత, జాయింట్‌ రెండూ) విడిగా నమోదు చేయాలి.

7. ప్రైవేటు యాజమాన్యంలోని భూములపై మహిళల హక్కులను నమోదు చేయటం: మహిళల భూమి హక్కులను పరిశీలించి రికార్డులలో పక్కాగా నమోదు చేయాలి. గ్రామస్థాయి నుంచి పైదాకా భూమి సంబంధిత రికార్డులన్నింటిలోనూ మహిళల పేరును నమోదు చేయాలి. 2005 నాటికి హిందూ వారసత్వ సవరణ చట్టం మహిళలలోనూ, రెవెన్యూ అధికారులలోనూ అవగాహన పెంచడానికి నిరంతర ప్రచార కార్యక్రమం నిర్వహించాలి.

8. వర్షాధారిత వ్యవసాయానికి ప్రభుత్వ విధానం, పెట్టుబడులు: మహిళలు ఎక్కువగా పనిచేస్తున్న ఆహార ఉత్పత్తి వ్యవస్థలు, చిన్న కమతాలు ఎక్కువగా కలిగిన వర్షాధారిత వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించే వ్యవసాయ విధానాన్ని రూపొందించాలి. మహిళా రైతులకు స్థానిక విత్తనాలు, ఉత్పాదకాలను ప్రోత్సహించే సుస్థిర వ్యవసాయ పద్థతుల ద్వారా మద్దతు అందించడానికి పెద్ద మొత్తాలలో పెట్టుబడులు పెట్టాలి.

9. సామాజిక భద్రతా చర్యలుః అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టం, 2008 ప్రకారం మహిళా వ్యవసాయ కూలీలు, మహిళా రైతుల గణాంకాలు సేకరించి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అన్ని జిల్లాలలో అసంఘటిత కార్మికుల బోర్డులను ఏర్పాటు చేసి వాటిలో స్త్రీ, పురుష గణాంకాలను విడిగా రికార్డు చేయాలి. వారికి పెన్షన్లు, ప్రమాద బీమా, ప్రసూతి సెలవులు, ఆహార భద్రతా కార్డులు వంటి సామాజిక భద్రతా హక్కులను కల్పించాలి.

10. మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలు ఏర్పరచి, బలోపేతం చేయాలి. ఈ సహకార సంఘాలు దీర్ఘకాలంపాటు స్వతంత్రంగా పనిచేయడానికి వీలుగా సహకార శాఖ సహకార సంఘాల సభ్యులకు ప్రత్యేక శిక్షణలు ఏర్పాటు చేయాలి.

11. జెండర్‌ బడ్జెట్‌లు, జెండర్‌ బడ్జెట్‌ కేంద్రాల ఏర్పాటు: వార్షిక వ్యవసాయ బడ్జెట్‌లో మహిళా రైతులకు బడ్జెట్లు కేటాయించి వ్యవసాయశాఖలో జెండర్‌ బడ్జెట్‌ కేంద్రాలు నెలకొల్పాలి. వాటిలో ఆ విధంగా కేటాయించిన బడ్జెట్‌ ప్రణాళిక, మూల్యాంకనం, ఆడిటింగ్‌ చేయాలి. జెండర్‌ బడ్జెట్‌ అమలు, పథకాల అందుబాటు మహిళా రైతులపై అర్థం చేసుకోవడానికి నిర్ణీత సమయానికి ఒకసారి అధ్యయనాలు సాగించాలి.

12. వ్యవసాయంలో మహిళా రైతుల శ్రమను తగ్గించే పరికరాలపై పరిశోధన: పరిశోధన చేసిన, రూపొందించిన ఆ పరికరాలను ఆచరణలో పరీక్షించి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి అన్ని ప్రాంతాల మహిళా రైతులకు సులభంగా అందుబాటులోకి తేవాలి.

(ప్రజా అసెంబ్లీ కోసం రాసిన వ్యాసం)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.