ఆహార భద్రతే కాదు, ఆహార సార్వభౌమత్వం, ఆహార న్యాయం కావాలి – ప్రజా అసెంబ్లీ

ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పేద, అణగారిన వర్గాలలో ప్రజలందరికీ సామాజిక భద్రతను కల్పించే పథకాలు అందడంలేదు. అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు, పెన్షన్లు, సురక్షితమైన ఆహారం, పోషకాలతో కూడిన ఆహారం అందుబాటులో లేవు. ముఖ్యంగా పేద వర్గాలకు రేషన్‌ దుకాణాలలో బియ్యం ఇవ్వటమే ఆహార భద్రతగా చెప్పబడుతోంది. పోషకాహార లోపం కారణంగా చిన్నపిల్లలు, మహిళలు, వృద్దులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, విధవల పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, బీడీ పెన్షన్లు మొదలైనవి ఇస్తున్నప్పటికీ వాటికోసం దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నవారు చాలామంది

ఉన్నారు. ఒక ఇంటికి ఒకే పెన్షన్‌ అనే నియమం కారణంగా చాలామంది అర్హులకు పెన్షన్‌ అందడంలేదు. ఒకే కుటుంబంలో వృద్ధులు, ఒంటరిమహిళలు ఉన్నప్పుడు ఎవరో ఒకరికి మాత్రమే పెన్షన్‌ వస్తోంది. సరిపడినంత ఆదాయం లేకపోవడం అనేది సరిపడినంత పోషకాహారం తీసుకోవడానికి అడ్డంకిగా మారింది.

రాష్ట్రంలో వ్యవసాయంలో మోతాదుకు మించి రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించి పంటలు పండిస్తున్నారు. ఫలితంగా మార్కెట్‌లో దొరికే కూరగాయలు, పండ్లు, ధాన్యం, పప్పులు మొదలైన వాటిలో రసాయన అవశేషాలు ఎక్కువ మోతాదులో

ఉంటున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో లభించే ఆకుకూరలలో విష రసాయన అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని సుస్థిర వ్యవసాయ కేంద్రం (సి.ఎస్‌.ఎ) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అలాగే పంటలన్నీ మార్కెట్‌ కోసం పండించడం జరుగుతోంది. వ్యవసాయంలో మార్కెట్‌ శక్తులు, కార్పొరేట్‌ శక్తుల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. గ్రామీణ వ్యవసాయ ప్రజలు తమకు అవసరమైన, కావలసిన ఆహారాన్ని సురక్షితంగా పండించుకునే స్వేచ్ఛను కోల్పోయారు. వ్యవసాయ విధానాలపై, విత్తనాలపై వారికి అదుపు లేదు. ఇదంతా కలిసి ప్రజల ఆహార సార్వభౌమత్వానికి తీవ్ర హాని కలుగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నియంత్రిత పంటల సాగు విధానం కూడా పత్తి వంటి వాణిజ్య పంటలకు పెద్ద పీట వేసి, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు వంటి పోషక ఆహార ఉత్పత్తిని నిరుత్సాహపరుస్తోంది.

ఎవరు పేదలు – ఎవరికి ఆహారం అందించాలి?

దేశంలో పేదరిక రేఖ దిగువన ఉన్నవారి ఆకలిని పారద్రోలి పోషకాహారం అందుబాటులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 తీసుకొచ్చింది. ఇందులో ప్రభుత్వ పంపిణీ పథకం (పి.డి.ఎస్‌.), సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్‌), మధ్యాహ్న భోజన పథకం (ఎండిఎం) ఈ మూడు ప్రధాన పథకాలు. అయితే ఈ చట్టం ద్వారా రాష్ట్రాలలో పూర్తిగా అమలులోకి రాలేదు. ఎవరిని పేదలుగా పరిగణించాలి, పేదరిక రేఖ దిగువన ఉన్నది ఎంతమంది అనే అంశాలపై చాలా వివాదం నెలకొని ఉంది. దేశం మొత్తంమీద 30% జనాభా పేదరికంలో ఉన్నారనేది ఒక సాధారణ పరిగణన. అలాగే అందరికీ ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరలకు ఆహార పదార్థాలు అందించాలి (యూనివర్సల్‌ లేక సార్వత్రిక పిడిఎస్‌) అనే డిమాండ్‌ చాలా కాలంగా ముందుకొస్తోంది. అయితే దీనిపైన కూడా కొంత వివాదం ఉన్నప్పటికీ కోవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో యూనివర్సల్‌ పీడీఎస్‌ను అమలు చేయాలనే డిమాండ్‌ అన్నివైపుల నుండి బలంగా ముందుకొస్తోంది.

ఆరు సంవత్సరాల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు ఇదే స్థితి నెలకొని ఉంది. ఇక్కడ కూడా 30 శాతానికి పైగా జనాభా పేదరిక రేఖ దిగువన ఉన్నది. పైన చెప్పిన మూడు పథకాల అమలులో అనేక అవకతవకలు ఉన్నాయని అనేక క్షేత్రస్థాయి అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ఆ కేంద్రాలకు సమయానికి ఆహార ధాన్యాల సరఫరా, బడ్జెట్ల కేటాయింపు జరగటం లేదు. గుడ్లు లాంటివి ప్రతిరోజు కాకుండా నెలకు ఒకసారి, రెండు సార్లు మాత్రమే సరఫరా చేయడం వలన అవి చెడిపోతున్నాయి. ఇక మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఇటువంటి సమస్యలే ఉన్నాయి. అక్షయ పాత్ర వంటి సంస్థల ద్వారా అందించే భోజనం ఉదయం నాలుగింటికి వండి మధ్యాహ్నం 12 గంటలకు వడ్డించడం వలన నాణ్యత దెబ్బతింటున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంస్థలు తమ బ్రాహ్మణీయ భావజాలం కారణంగా పిల్లలకు కోడిగుడ్లు సరఫరా చేయటం లేదు.

పట్టణ ప్రాంతాలలో నెలసరి ఆదాయం రూ.1407 (రోజుకి రూ.47) ఉన్నవారిని, గ్రామీణ ప్రాంతాలలో రూ.972 (రోజుకి రూ.37) ఆదాయం ఉన్న కుటుంబాలను పేదరిక రేఖ కింద ఉన్నవారిగా పరిగణించాలని రంగరాజన్‌ కమిటీ ప్రామాణికంగా సూచించింది. కానీ తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం రూ.60,000, పట్టణ ప్రాంతాలలో రూ.75,000 (రోజుకి రూ.41) ఆదాయం అర్హతగా నిర్ణయించారు. అంటే రంగరాజన్‌ కమిటీ ప్రమాణాల ప్రకారం చూస్తే తెలంగాణలో పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ అంచనాల కంటే ఎక్కువ మంది పేదల లెక్కలోకి వస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో రేషన్‌ కార్డుల విషయంలో కూడా అనేక సమస్యలున్నాయి. తెలంగాణలో మొత్తం 91.95 లక్షలు పేదరిక రేఖ దిగువన ఉన్నవారికి తెల్ల రేషన్‌ కార్డులు (328.44 లక్షల జనాభాకు), 14.87 లక్షల గులాబీ రేషన్‌ కార్డులు (55.64 లక్షల జనాభాకు) ఉన్నట్లు అంచనా. తెల్ల రేషన్‌ కార్డులను వార్షిక కుటుంబ ఆదాయం ఆధారంగా మంజూరు చేస్తారు. రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య కంటే ఎక్కువ రేషన్‌ కార్డులున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ అర్హత లేని 6,612 రేషన్‌ కార్డులను రద్దు చేసింది. కాగా, 7-8 లక్షల కుటుంబాలు కొత్త రేషన్‌ కార్డులకోసం దరఖాస్తు పెట్టుకున్నారని పౌర సరఫరాల శాఖ కార్యాలయం సమాచారం ప్రకారం తెలుస్తోంది. వారిలో ఉమ్మడి కుటుంబాల నుండి విడిపోయిన వారు, కొత్తగా పెళ్ళయిన వారు ఉన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 2019లో 58,529 దరఖాస్తులు రాగా, 7,398 దదరఖాస్తులను ఆమోదించారు. 2,610 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 48,521 పెండింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా వేలాదిమంది రేషన్‌ కార్డులు లేక ప్రభుత్వం చౌకధరలకు ఇచ్చే ఆహార పదార్థాలు అందుకోలేని స్థితిలో ఉండిపోయారు. రైతు ఆత్మహత్య కుటుంబాలకు, పివిటీజీలకు ఇవ్వాల్సిన అంత్యోదయ రేషన్‌ కార్డులను జారీ చేయడంలేదు. అలాగే హోమ్‌లలో ఉండే అనాథ బాలలు, పట్టణాలకు ఉపాధి కోసం నిత్యం వచ్చే నిరాశ్రయులకు కూడా రేషన్‌ కార్డులు లేవు. కోవిడ్‌ సంక్షోభం సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ఉచిత రేషన్‌ ఈ సెక్షన్‌ ప్రజలకు అందడంలేదు. రాష్ట్రంలో అంతర్గతంగా వలస వచ్చిన వారు, ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారు కూడా ఇక్కడ రేషన్‌ కార్డులు లేకపోవడంతో చౌక ధరలకు ఆహార పదార్థాలను పొందడానికి అనర్హులుగా ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఈ సమస్య తీవ్రత మనకు కొట్టొచ్చినట్లు కనిపించింది.

ఆదివాసులలో పోషకాహార లోపం, ఇతర సమస్యలుః

రాష్ట్రంలోని ఆదివాసి ప్రాంతాలలో ముఖ్యంగా మారుమూల గూడేలలో ఆహారం అందరికీ అందుబాటులో లేక తీవ్రమైన పోషకాహార లోపంతో అనారోగ్యం పాలవుతున్నారు. చౌక ధరల దుకాణాలు ఆదివాసీ గూడేలకు 10-15 కిలోమీటర్ల దూరంలో

ఉంటాయి. వాటిలో బియ్యం తదితర సరుకులు వచ్చిన సమాచారం ఈ గూడేల ప్రజలకు తెలియటం ఆలస్యమవుతోంది. ఈ కారణంగా చాలామంది రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం, పప్పులు తీసుకోలేకపోతున్నారు, అర్థాకలితో గడుపుతున్నారు. ఆహారం కోసం వారాంతపు సంతలపై ఆధారపడవలసి వస్తోంది. ఆ సంతలలో సరుకులు అమ్ముకునే వ్యాపారస్తులు కల్తీ చేసినవి, నాసిరకం సరుకులు అమ్ముతున్నారు. వారిపై అధికారుల నుండి ఎటువంటి నిఘా ఉండడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, కిశోర బాలికలు, గర్భిణీ స్త్రీలకు ఇవ్వవలసిన రేషన్‌ నెలకు ఒకసారి ఇవ్వడం వల్ల అవి కుటుంబంలో ఇతర సభ్యులందరూ తినడం వల్ల వారం రోజుల్లోనే అయిపోతున్నాయి. ఆదివాసీ ప్రాంతాలలో ఆహార పంటల స్థానంలో వాణిజ్యపంటల సాగు పెరిగిపోయింది. దీని కారణంగా వారికి పోషకాహారం దొరకడం లేదు. రకరకాల కారణం చేత అడవి నాశనమైపోయి ఫలాలను, ఆహారాన్ని ఇచ్చే చెట్ల పొదలు కనుమరుగైపోయాయి. ఆదివాసులు అడవిలో సేకరించే సహజంగా పెరిగే ఆహారం తగ్గిపోయింది.

డిమాండ్లు:

1. రాష్ట్ర ప్రజలందరికీ సురక్షితమైన, పోషకాహారం అందించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. అందుకోసం సేంద్రీయ పద్ధతిలో ఆహార ఉత్పత్తిని ఎక్కువగా ప్రోత్సహించాలి. రేషన్‌ షాపుల ద్వారా కేవలం బియ్యం మాత్రమే కాకుండా వైవిధ్యం గల చిరుధాన్యాలు, పప్పు దినుసులు సరఫరా చెయ్యాలి.

2. పేదరిక రేఖ యొక్క ప్రమాణాలను సవరించి అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు మంజూరు చేయాలి.

3. ఆధార్‌ కార్డుతో లింక్‌ లేకుండా అందరికీ సార్వత్రిక పీడీఎస్‌ వ్యవస్థ ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చి ఈ వ్యవస్థ నుండి ఎవరూ మినహాయించబడకుండా జాగ్రత్త తీసుకోవాలి.

4. పివిటిజి సమూహాలు, ఒంటరి మహిళలు, వృద్ధులు మొదలైన వారికి అంత్యోదయ రేషన్‌ కార్డులు మంజూరు చేసి మనిషికి 10 కిలోల బియ్యం, 1.5 కిలోల పప్పు, 800 గ్రాముల వంట నూనె చొప్పున అందించాలి.

5. ఐసిడిఎస్‌, మధ్యాహ్న భోజన పథకాలలో అవకతవకలను నివారించి పిల్లలకు, కిశోర బాలికలకు, గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన ధాన్యం, పప్పులు, వంట నూనె, గుడ్లు, పాలు, పండ్లతో కూడిన పోషకాహారాన్ని తాజాగా అందించాలి. లాక్‌డౌన్‌ కారణంగా అంగన్‌వాడి కేంద్రాలు, పాఠశాలలు తెరవని స్థితిలో ఈ ఆహారాన్ని వారి ఇళ్ళకు సరఫరా చేయాలి.

6. ఆదివాసి ప్రాంతాలలో పౌష్ఠిక ఆహారాన్ని అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారాంతపు సంతలలో వ్యాపారులు అమ్మే ఆహార పదార్థాల నాణ్యతపై అధికారుల పర్యవేక్షణ ఉండాలి. ఆదివాసుల సాంప్రదాయ ఆహార ఉత్పత్తి, సేకరణలపై ఆంక్షలు విధించకుండా ప్రభుత్వం ప్రోత్సహించాలి.

– (ప్రజా అసెంబ్లీ కోసం రాసిన వ్యాసం)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.