ఓ అమ్మాయీ! -ఉమా నూతక్కి

ఇదే మొదటిసారి కాదు, ఇదే చివరిదన్న భరోసా అస్సలు లేదు. అయినా ప్రతిసారీ దుఃఖం ముంచి లేపుతుంది. అక్షరాలు అల్లుకుపోయేంత దుఃఖం. అయినా మళ్ళీ మళ్ళీ రాస్తాం. ఎంత మంది ఎన్ని రాసినా, మానుపడుతున్న పాత గాయాల మీద కొత్తగా అయిన గాయం మళ్ళీ నిద్రని దూరం చేస్తుంది. జీవితం పట్ల భయాన్ని కలుగ చేస్తుంది. ఇదిగో ఇక్కడితో ఇది ఆగిపోతుంది…ఇదే ఆఖరుది అనుకోవడానికి అవకాశం ఎప్పుడూ ఈ ప్రపంచం స్త్రీకి ఇవ్వడం లేదు. గాయం… గాయం మీద గాయం… గాయం వెనుక గాయం… ఎడతెగని గాయం… గాయం!!! గాయం!!! గాయం!!! మనం గాయం మీద తొడగబడిన శరీరాలం…!

ఒక్కొక్క చోట, ఒక్కో కాలంలో ఒక్కో పేరు. ఇప్పుడామె మనీషా వాల్మీకి!!!

ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో సామూహిక అత్యాచారానికి గురై రెండు వారాలకి పైగా మృత్యువుతో పోరాడి సెప్టెంబరు 29న అసువు లు బాసిన 20 ఏళ్ళ యువతి… పలు మీడియా సంస్థల కథనాల ప్రకారం గడ్డి కోసేందుకు తల్లి, సోదరుడితో పొలం వెళ్ళిన ఆ అమ్మాయి ఆచూకీ లేకుండా పోయింది. తీవ్రగాయాల పాలైన స్థితిలో సెప్టెంబరు 22న ఆమెను గుర్తించారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్ప డిన దుండ గులు, తమ గురించి బయటకు చెప్పకూడ దన్నట్లుగా ఆ అభాగ్యురాలి నాలుక కోసేసి, నడుం విరగ్గొట్టి అత్యంత రాక్షసంగా ప్రవర్తించారు. బాధితురాలు దళిత యువతి. ఆమెపై అత్యాచారం చేసిన యువకులు ఉన్నత వర్గాలకి చెందిన వారని తెలుస్తోంది.

ఇంతవరకూ చదివితే మరొకసారి కన్నూ మిన్నూ గానని కీచకులు తమ కాముకత్వంతో చేసిన అత్యాచారమూ… ఆమె బ్రతక్కూడ దన్నట్లుగా ఆమె వెన్నెముక విరగ్గొట్టిన అఘా యిత్యమూ తెలుస్తుంది.

కానీ నిజమైన అఘాయిత్యం అది కాదు. బాధితురాలు చనిపోయాక అక్కడి ప్రభుత్వ వర్గాలు స్పందించిన తీరు దేశంలో స్త్రీల యొక్క అస్తిత్వానికి వస్తున్న పెనుముప్పుని తెలియ చేస్తోంది. ప్రభుత్వం తీరు అనేక సందేహాలకు ఆస్కారం ఇచ్చింది.

ఫోరెన్సిక్‌ నివేదికల ప్రకారం ఆమె మీద అత్యాచారం జరగలేదని మీడియా ముఖంగా ఒక పోలీస్‌ అధికారి సెలవిచ్చారు. కిరాతకుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ఆమె దేహాన్ని అన్ని సంప్రదాయాలకు విరుద్ధంగా ఆమె కుటుంబ సభ్యులకు కూడా ప్రవేశం లేకుండా అర్థరాత్రి దాటాక అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

హథ్రాస్‌లోనే కాదు, అదే ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో కూడా ఒక దళిత యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం యువతిని దారుణంగా కొట్టి ఆటోలో ఇంటికి పంపారు. అయితే ఇంటికి వచ్చిన కూతురు తనకు చావాలని లేదని బతికించమంటూ తల్లిని వేడుకుంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్ళేలోపే ఆమె మృతి చెందింది. ఇక్కడ కూడా రాత్రి పూట దాటాక అంతిమ సంస్కారాలు నిర్వ హించినట్లు వార్తలు.

అసలు ఎందుకంత హడావిడి? ఆ అంతిమ సంస్కారాన్ని ఉదయం చేస్తే ఏమవుతుంది? ఒక పక్క ఈ కేసుల గురించి దేశమంతా అట్టుడుకుతున్నా ఏ మాత్రం ఆలోచన లేకుండా ఇలా చేస్తారా అనిపిస్తుంది కదూ… ఆలోచన లేకుండా చేసే పని కాదు ఇది. పకడ్బందీ ఆలోచనలతోనే చేసి ఉండాలి.

బహుశా ఏ కోర్టు వాళ్ళో ఆమె దేహాన్ని మరోసారి పోస్ట్‌మార్టం చెయ్యమని అంటారేమో… అలా చేస్తే తమకి కావల్సిన వారికి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని అనిపించి

ఉండాలి అన్న అనుమానం వస్తోంది. అంతే కదా… అది నిజం కాకపోతే అంత హడావిడి ఏముంది. జిల్లా కలెక్టర్‌ ఆమె కుటుంబాన్ని బెదిరించిన తీరు చూస్తుంటేనే ఈ కేసులో మనకి తెలియని రహస్యాలేవో దాగి ఉన్నాయని అనిపిస్తుంది. ప్రతిపక్షాల వాళ్ళేమో ప్రభుత్వం మీద దుమ్మేయమని… పరిహారం 25 లక్షలు కాదు 50 లక్షలు ఇవ్వండని చెప్తూ ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ఇలాంటి భారతావనిలోనా మనం బ్రతుకున్నది అని అనిపిస్తుంది.

ప్రభుత్వానికేమో తన అస్థిత్వం మీద మచ్చపడకుండా తమ వాళ్ళని కాపాడుకోవడం ముఖ్యం. ప్రతిపక్షాలకేమో ఈ సంఘటన నుండి తమకొచ్చే మైలేజి ముఖ్యం.

కానీ సామాన్యురాలికి దారేది. సంచలనం సృష్టించిన అత్యాచార కేసుల్లోని బాధితురాళ్ళకి నిర్భయ… దిశ… అని పేర్లు పెట్టినట్లుగా… ఈమెకీ ఒక పేరు పెట్టి ఆ పేరు మీద ఒక కొత్త చట్టాన్ని ప్రకటిస్తారేమో. చట్టం చేయడం ఎంత సేపు? చట్టసభల్లో చేయి లేపితే కొత్త చట్టం పుడుతుంది. కానీ అమలు చేయాల్సి వచ్చేసరికి అవన్నీ మొక్కుబడి చట్టాలు అయిపో తాయి. లేదా తమవారు కాని ప్రత్యర్థుల మీద దొంగ కేసులు బనాయించ డానికి ఉపయోగ పడతాయి.

చావుకీ, బ్రతుక్కీ తేడా తెలియనంత నిర్లిప్తతతో బ్రతుకుతూ… అయినదానికీ కానిదానికీ అడుగడుగునా యుద్ధం చేస్తూ

ఉంటేనే ఆడది అన్నది అలిఖిత నిర్వచనం.

ఆ విషయంలో ఆ జాతీ… ఈ జాతీ అన్న తేడా ఏమీ లేదు. ఆడవాళ్ళందరికీ ఒకటే జాతి… స్త్రీ జాతి! ప్రకృతికీ… పురుషుడికీ… పిల్లలకీ… అందరికీ… లోబడి వాళ్ళు రాసిన నియమాల్లో బ్రతుకుని ఈడేర్చుకోవాల్సిన జాతి ఇది. ఎవరెన్ని దాష్టీకాలు చేసినా అణిగిమణిగి ఉండాల్సిందే. వాళ్ళ అత్యాచారాలనూ, హత్యలనూ తనువారా భరించి తమని తాము ముక్తి పరుచుకోవాల్సిన జాతి. చైతన్యం లాంటి పదాలు పలికితేనే వీళ్ళు భ్రష్టత్వం పొందినట్లు లెక్క. ఇక నిజంగా అడుగు ముందుకు వేస్తే… పిడికిలి బిగిస్తే… గొంతు పిక్కటిల్లేలా కేక వేస్తే?

ప్రపంచం తల్లకిందులవుతుంది.రాజకీయం సంఘటితమవుతుంది. సానుభూతి పెల్లుబుకు తుంది. న్యాయం పేరిట కొత్త రాజ్యాంగం లిఖితమవుతుంది. అయితే ఏదో సాధించేశా మన్నట్లుగా ఈ జాతి గొంతులు నిశ్శబ్దంలోకి ముడుచుకు పోతాయి. బిగిసిన పిడికిళ్ళు విచ్చుకుంటాయి. ముందుకు పడిన అడుగులన్నీ వెనక్కి తిరుగుతాయి. మర్నాడు… మరో చోట… మరో స్త్రీ కథ మొదలవుతుంది… కథనం పునరావృత మవుతుంది.

Share
This entry was posted in మంకెన పువ్వు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.